ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ ఫర్మేశన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ
దేశం డిజిటల్ కార్యకలాపాల దిశగా సాగించిన ప్రయాణం, సాధికారత మీద , అన్నివర్గాలను కలుపుకుపోవడం పైన, డిజిటల్ పరివర్తన మీద దృష్టి కేంద్రీకరించింది. భారత పౌరులు తమ జీవితాలకు సంబంధించి అన్ని కోణాలపై దీని సానుకూల ప్రభావాన్ని గుర్తిస్తున్నారు : కేంద్రమంత్రి శ్రీ రవిశంకర్ ప్రసాద్
డిజిటల్ ఇండియా కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేసినందుకు కేంద్ర మంత్రి కి అభినందనలు తెలిపిన నందన్ నీలేకని
ఈ -సేవలు 2014లో 2,463 ఉండగా 2020 మే నాటికి అవి 3,858కి చేరాయి
రోజువారీ ఎలక్ట్రానిక్ బదలాయింపులు 2014లో 66 లక్షలు ఉండగా 2020 నాటికి అవి 16.3 కోట్లకు చేరుకున్నాయి
కొత్త తరం పాలనకు సంబంధించి (యుఎంఎఎన్‌జి) యూనిఫైడ్ మొబైల్ యాప్ పై 860కిపైగా సేవలు అందుబాటులోకి రాగా 3 కోట్లకు పైగా డౌన్‌లోడ్‌లు జరిగాయి
ఎలక్ట్రానిక్స్, ఐటి మంత్రిత్వశాఖ(ఎంఇఐటివై) డిజిటల్ ఇండియా కార్యక్రమం చేపట్టి ఐదు సంవత్సరాలు పూర్తయిన సందర్బంగా ఉత్సవం జరుపుకుంటోంది
Posted On:
01 JUL 2020 5:36PM by PIB Hyderabad
దేశం డిజిటల్ కార్యకలాపాల దిశగా సాగిస్తున్న ప్రయాణం, సాధికారత మీద , అన్నివర్గాలను కలుపుకుపోవడం పైన, డిజిటల్ పరివర్తన మీద దృష్టి కేంద్రీకరించిందని , భారత పౌరులు తమ జీవితాలకు సంబంధించి అన్ని కోణాలపై దీని సానుకూల ప్రభావాన్ని గుర్తిస్తున్నారని, కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటి కమ్యూనికేషన్లు,లా, జస్టిస్ శాఖ మంత్రి శ్రీ రవిశంకర్ ప్రసాద్ అన్నారు. భారతదేశపు డిజిటల్ ఇండియా కార్యక్రమం ఐదు సంవత్సరాల ప్రయాణాన్ని పూర్తిచేసుకున్న సందర్భంగా జరిగిన ఉత్సవాలకు సంబంధించి ఈరోజు ఢిల్లీలో జరిగిన ఒక వీడియో కాన్ఫరెన్స్ నుద్దేశించి ప్రసంగిస్తూ రవిశంకర్ ప్రసాద్ ఈ మాటలన్నారు. ప్రస్తుత కోవిడ్ మహమ్మారి దశలో , జన్‌ధన్, ఆధార్, మొబైల్ (జె.ఎ.ఎం) మూడింటి కలయికకు కృతజ్ఞతలు తెలిపారు. వీటి కారణంగా ప్రజలు ఇళ్లనుంచే పనిచేయగలుగుతున్నారని, డిజిటల్ చెల్లింపులను ఇళ్లనుంచే చేయగలుగు తున్నారని అన్నారు. విద్యార్థులు టివి, మొబైల్ ల్యాప్‌టాప్ ద్వారా చదువు నేర్చుకుంటున్నారని ,పేషెంట్లు టెలిమెడిసిన్ ద్వారా వైద్యం చేయించుకుంటున్నారని , దేశ మారుమూల ప్రాంతాలలోని రైతులు పిఎం-కిసాన్ ప్రయోజనాలు నేరుగా తమ బ్యాంకు ఖాతాలో పడడం ద్వారా ప్రయోజనం పొందగలుగుతున్నారని రవిశంకర్ ప్రసాద్ అన్నారు.
ఈ సదస్సును ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వశాఖ, ఐదేళ్ళ డిజిటల్ ఇండియా ఉత్సవాలలో భాగంగా నిర్వహించింది. డిజిటల్ భారత్-ఆత్మనిర్భర్ భారత్ దిశగా డిజిటల్ ఇండియా ప్రగతి పథంలో ముందుకు సాగుతోంది. ఈ సదస్సులో కేంద్ర ఐటి శాఖ మంత్రి శ్రీ రవిశంకర్ ప్రసాద్, ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ సహాయమంత్రి శ్రీ సంజయ్ ధోత్రే, కొన్ని రాష్ట్రాల అదనపు ప్రధాన కార్యదర్శులు, ఇన్‌ఫోసిస్ నాన్ ఎక్జిక్యుటివ్ ఛైర్మన్ శ్రీ నందన్ నీలేకని, అన్ని రాష్ట్రాల ఐటి శాఖ కార్యదర్శులు, వివిధ మంత్రిత్వశాఖలు, పరిశ్రమలు, విద్యాసంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. ప్రపంచ వ్యాప్తంగా సుమారు 1500 మంది ప్రతినిదులు ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు.
డిజిటల్ ఇండియా ప్రయాణం, గత ఐదు సంవత్సరాలలో సాధికారత, అన్ని వర్గాలకు ప్రయోజనం, డిజిటల్ పరివర్తన కేంద్రంగా ముందుకు సాగింది. ఇది భారత ప్రజల జీవితంలోని అన్ని కోణాలపై సానుకూల ప్రభావాన్ని చూపింది.ఆధార్ ద్వారా గుర్తింపు, ప్రత్యక్షణ నగదు బదిలీ, ఉమ్మడి సేవా కేంద్రాలు, డిజి లాకర్లు, మొబైల్ ఆధారిత యుఎంఎఎన్‌జి(ఉమాంగ్)సేవలు, మై గవ్ ద్వారా పాలనలో పాలుపంచుకునే అవకాశం, జీవన్ ప్రమాణ్, యుపిఐ, ఆయుష్మాన్ భారత్, ఈ హాస్పిటల్, పిఎం-కిసాన్, ఈ-నామ్, భూసార పరీక్షా కార్డులు, స్వయం, స్వయం ప్రభ, జాతీయ స్కాలర్‌షిప్ పోర్టల్, ఈ-పాఠశాల,ఇలా ఎన్నింటినో చెప్పుకోవచ్చు. జాతీయ స్థాయి కృత్రిమ మేధ పోర్టల్, యువత కోసం బాధ్యతాయుత కృత్రిమ మేధ వంటి వాటిని, కృత్రిమ మేధ ఆధారిత భవిష్యత్ కోసం ఇటీవలే ప్రారంభించడం జరిగింది. కొవిడ్ -19 మహమ్మారి వ్యాపిస్తున్న పరిస్థితులలో డిజిటల్ ఇండియా ద్వారా చేపట్టిన పలు చర్యలు కీలక పాత్ర వహించాయి. ఆరోగ్య సేతు, ఈ -సంజీవని, మై గవ్ ద్వారా ప్రజలకు అవగాహన కల్పించడం, సామాజిక మాధ్యమాలకు సంబంధించిన వివిధ వేదికల వంటివి ఇందులో ఉన్నాయి.
2014లో ఈ -సేవలు 2,463 ఉండగా 2020 మే నాటికి ఇవి 3,858 కి చేరుకున్నాయని, రోజువారీ ఎలక్ట్రానిక్ లావాదేవీలు సగటున 2014లో 66 లక్షలు ఉండగా 2020 లో అవి 16.3 కోట్లకు చేరుకున్నాయని కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ అన్నారు . 125.7 కోట్ల మంది నివాసులకు ఆధార్ జారీ చేయడం జరిగిందని, 4,216 కోట్ల గుర్తింపు పరిశీలనలు జరిగాయని మంత్రి చెప్పారు. ప్రత్యక్ష నగదు బదిలీ లో భాగంగా 56 మంత్రిత్వ శాఖలకు చెందిన 426 పథకాల కింద 11.1 లక్ష కోట్ల రూపాయలు పంపిణీ చేయడం జరిగిందని, దీనివల్ల 1.7 లక్షల కోట్ల రూపాయల ఆదా జరిగినట్టు మంత్రి చెప్పారు. 38.73 కోట్ల లబ్ధిదారులకు జన్‌ధన్ ఖాతాలు చేరుకున్నాయని, లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలలో 1.33 లక్షల కోట్ల రూపాయలు ఉ న్నాయని ఆయన చెప్పారు. మెబైల్ కనక్షన్లను 117 కోట్ల మంది, ఇంటర్నెట్ కనక్షన్లను 68.8 కోట్ల మంది వినియోగిస్తున్నారని తెలిపారు. డిజిలాకర్ పథకాన్ని 2015 జూలై 1న ప్రారంభించారు . దీనిలో 378 కోట్ల జారీ అయిన డాక్యుమెంట్లు ఉన్నాయి. నవతరం పాలనకు సంబంధించిన యూనిఫైడ్ మొబైల్ యాప్ (ఉమాంగ్) పై 860కి పైగా సేవలు అందుబాటులో ఉన్నాయి. దీనికి సంబంధించి 3 కోట్ల కు పైగా డౌన్‌లోడ్‌లు జరిగాయని మంత్రి తెలిపారు. ప్రజల భాగస్వామ్యంతో పాలన సాగించేందుకు మైగవ్ ను ప్రభుత్వం ప్రారంభించింది. ఇందులో 1.17 కోట్ల మంది తమ పేర్లను నమోదు చేసుకుని ఇందులో పాల్గొంటున్నారు. ప్రధానమంత్రి మన్‌కీ బాత్ కార్యక్రమానికి ఇది వీలు కల్పిస్తోంది.
కోవిడ్ -19 మహమ్మారి పరిస్థితులలో డిజిటల్ ఇండియా చేపట్టిన చర్యల ప్రాధాన్యతను వివరిస్తూ మంత్రి , ఆరోగ్య సేతు వంటి వాటిని మూడు వారాలలో అభివృద్ధి చేయడం జరిగిందని చెప్పారు. దీనిని 12 స్తానిక భాషలలో అందుబాటులోకి తేవడం జరిగిందని 13 కోట్లమంది డౌన్ లోడ్ చేసుకున్నారని చెప్పారు.అదనంగా 3 కోట్లు కెఎఐ ఓఎస్ ఉన్నాయన్నారు. ఇది350 కిపైగా కోవిడ్ -19 హాట్‌స్పాట్లను గుర్తించడానికి ఉపయోపడినట్టు మంత్రి చెప్పారు. ప్రజలలో అవగాహనకల్పించడానికి మైగవ్, సామాజిక మాధ్యమాల వేదికలు కీలక పాత్ర వహించాయని ఆయన అన్నారు. వాడకం దారులకు అనువైన విధంగా గ్రాఫిక్‌లు, వీడియోలు, కొటేషన్లు,మైగవ్ వెబ్‌సైట్ ద్వారా, సామాజిక మాధ్యమాలు, ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్, లింక్‌డ్ఇన్, టెలిగ్రామ్,యూ ట్యూబ్ ద్వారా తెలియజేయడం జరిగిందన్నారు. ఈ-సంజీవని, సంహార్-కోవిడ్ -19, ఆయుష్ సంజీవని మోబైల్ యాప్, విసి, ఈ ఆఫీస్ ల గురించి కూడా రవిశంకర్ ప్రసాద్ ప్రస్తావించారు.
కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు, పరిశ్రమ వర్గాలు, విద్యాసంస్థలు తదితర టీమ్ ఇండియా విభాగాల సమష్టి కృషి వల్,ల డిజిటల్ ఇండియా విజయాలు సాధ్యమయ్యాయని కేంద్ర మంత్రి అన్నారు. భారతదేశంలోని నైపుణ్యం, ప్రతిభ గల వ్యక్తులు, సాంకేతిక పరిజ్ఞానం, భౌగోళిక రాజకీయ సానుకూలతలు వంటివి, భారతీయుల సంక్షేమం, ప్రపంచ సంక్షేమానికి సంబంధించి ఇండియాను 21 వ శతాబ్దంలొ ఒక ప్రేరణాత్మక దేశంగా నిలబెట్టనున్నాయని ఆయన అన్నారు.
ఈ సదస్సులో పబ్లిక్ డిజిటల్ ప్లాట్‌ఫాంలపై బృంద చర్చ జరిగింది.కేంద్ర ఎలక్ట్రానిక్స్ ఐటి మంత్రిత్వశాఖ కార్యదర్శి శ్రీ అజయ్ సాహ్ని , భవిష్యత్ డిజిటల్ ఆర్థిక వ్యవస్థ కోసం డిజిటల్ ప్రభుత్వ ప్లాట్‌పారమ్‌ల నిర్మాణం అనే అంశంపై మాట్లాడారు. ఇన్‌ఫోసిస్ నాన్ ఎక్జిక్యుటివ్ ఛైర్మన్ శ్రీ నందన్ నీలేకని , ఈ గవర్నమెంట్ అభివృద్ధిలో పబ్లిక్, ప్రైవేట్ భాగస్వామ్యం విజయం, దాని ఔచిత్యం గురించి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన .ప్రభుత్వానికి గల నాలుగు కోణాలు- సాంకేతిక పరిజ్ఞానాన్ని సమకూర్చే వ్యవస్థగా, టెక్నాలజీ ని వినియోగించే కస్టమర్‌గా,ప్లాట్‌ఫాం కల్పించేదిగా , పరిష్కారాలు అందించడానికి సహకారిగా గల ప్రాధాన్యత గురించి ప్రస్తావించారు. దేశంలో డిజిటల్ ఇండియా కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేస్తున్నందుకు గౌరవ కేంద్ర మంత్రిని ఆయన ఈ సందర్భంగా అభినందించారు. ఆత్మనిర్భర్ డిజిటల్ వ్యవస్థకు సంబందించి కూడా విస్తృతంగా చర్చించారు. ఆత్మనిర్భరత లేదా స్వావలంబన అంటే ఆర్థిక, సామాజిక అభివృద్ధి దిశగా, దేశీయంగా సామర్ధ్యాలను, సమర్థతను అభివృద్ధి చేసుకోవడం.
*******
(Release ID: 1635752)
Visitor Counter : 261