నైపుణ్యాభివృద్ధి మంత్రిత్వ శాఖ
మరింత ఎక్కువ మంది ఉద్యోగార్థులకు చేరడం, వ్యాపార సంస్థల యజమానులకు కొత్త వనరులు అందుబాటులో ఉంచడం లక్ష్యంగా ఎంఎస్ డిఇ-ఐబిఎం భాగస్వామ్యంలో ఉచిత డిజిటల్ లెర్నింగ్ కార్యక్రమం “రగిలించగల నైపుణ్యాల నిర్మాణం” (స్కిల్స్ బిల్డ్ రీ ఇగ్నైట్) ప్రారంభం
దేశంలో నైపుణ్యాల్లో కొరతను తగ్గించేందుకు ఏర్పాటు
విద్యార్థులకు ప్రాజెక్టుల నిర్వహణపై అనుభవం కల్పించడం, మరింత మెరుగైన అధ్యయనం, ఉద్యోగార్హత కోసం 10 వారాల వ్యవధి గల నైపుణ్యాల నిర్మాణ ఇన్నోవేషన్ శిబిరం
Posted On:
24 JUN 2020 5:57PM by PIB Hyderabad
విభిన్న శిక్షణ, మౌలిక వసతుల సంస్థల నెట్ వర్క్ ఏర్పాటు చేయడం ద్వారా దేశ యువతకు దీర్ఘకాలిక వ్యవస్థాత్మక శిక్షణ ఇవ్వడం కోసం నైపుణ్యాభివృద్ధి, ఎంటర్ ప్రెన్యూర్ షిప్ మంత్రిత్వ శాఖ (ఎంఎస్‌డిఇ) నిర్వహణలోని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ట్రెయినింగ్ (డిజిటి) కృషి చస్తుంది. వృత్తిపరమైన శిక్షణ పథకాలు చేపట్టడం, “డిజిటల్ ఇండియా” కల సాకారం చేయడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది.
డిజిటల్ ఆమోదనీయత రేటు దేశంలో డిజిటల్ పరివర్తన రేటును మించిపోయినట్టు తాజా విశ్లేషణలు తెలుపుతున్నాయి. ఆధునిక టెక్నాలజీలతో కలిసి పని చేయడానికి, కొత్త తరం ఉద్యోగాల్లో గల విభిన్న అవకాశాలు పూర్తిగా వినియోగించుకోవడానికి యువతకు ప్రత్యేక నైపుణ్యాలు అవసరం. నాలుగో తరం పరిశ్రమలకు అవసరం అయిన సరి కొత్త నైపుణ్యాలైన కృత్రిమ మేథ (ఎఐ), బిగ్ డేటా, 3డి, క్లౌడ్ కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీ వంటి కొత్త తరానికి చెందిన విభిన్నరంగాలపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తూ కొత్తతరం నైపుణ్యాలపై యువతకు అవకాశాలు కల్పించడం డిజిటి ప్రధాన లక్ష్యంగా మారింది.
ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకుని విద్యార్థులను పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా తీర్చి దిద్దేందుకు డిజిటి గత ఏడాది కాలంగా ఐబిఎం ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్ (ఇండియా) లిమిటెడ్, ఎస్ఏపి ఇండియా, సిస్కో సిస్టమ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, యాక్సెంచర్ సొల్యూషన్స్, క్వెస్ట్ అలయన్స్, అడోబ్ ఇండియా వంటి కంపెనీలతో భాగస్వామ్యాలు ఏర్పాటు చేసుకుంది. ప్రస్తుతం కోవిడ్-19 ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న వాతావరణంలో విద్యార్థులు, ట్రెయినీలు, ట్రెయినర్లు, అడ్మినిస్ర్టేటర్లకు భారత నైపుణ్యాల లెర్నింగ్ వేదిక (https://bharatskills.gov.in) కింద ఎక్కడ నుంచైనా ఏ క్షణంలో అయినా ఆన్ లైన్ లో డిజిటల్ కంటెంట్ అందించడానికి డిజిటి విభిన్న పారిశ్రామిక భాగస్వాములను రంగంలోకి దింపుతోంది.
అలాంటి పటిష్ఠమైన భాగస్వామ్యాల్లో డిజిటి, ఐబిఎం భాగస్వామ్యం ఒకటి. ఇది అత్యంత ప్రత్యేకత గల కార్యక్రమం మాత్రమే కాక దేశంలోనే ఈ తరహా కార్యక్రమాల్లో మొదటిది. దేశవ్యాప్తంగా పని చేస్తున్న జాతీయ నైపుణ్య శిక్షణ సంస్థలు (ఎన్ఎస్ టిఐ), పారిశ్రామిక శిక్షణ సంస్థలు (ఐటిఐ) విద్యార్థులు, ట్రెయినర్లకు క్లౌడ్ కంప్యూటింగ్, కృత్రిమ మేథ (ఎఐ) వంటి బహుముఖీన డిజిటల్ నైపుణ్యాల్లో శిక్షణ ఇవ్వడానికి ఐబిఎం సంసిద్ధత ప్రకటించింది.
దేశంలోని నైపుణ్యాల లోటును సరిదిద్దే ప్రయత్నంలో భాగంగా ఐబిఎం, దాని భాగస్వాములు స్కిల్ బిల్డ్ రీ ఇగ్నైట్, స్కిల్ బిల్డ్ ఇన్నోవేషన్ శిబిరాలు ప్రారంభించాయి.
యువ పారిశ్రామికులు, ఉద్యోగార్థులు తమలోని కెరీర్, వ్యాపార నైపుణ్యాలను సరికొత్తగా తీర్చి దిద్దుకునేందుకు అవసరం అయిన ఆన్ లైన్ కోర్సులతో పాటుగా మెంటారింగ్ మద్దతు కూడా స్కిల్ బిల్డ్ రీ ఇగ్నైట్ అందిస్తుంది. వ్యక్తిగత వ్యాపార సంస్థల యజమానులతో పాటు పారిశ్రామికులు, ఉద్యోగార్ధులు, ఆసక్తి గత ఇంకెవరైనా కృత్రిమ మేథ, క్లౌడ్, డేటా అనలిటిక్స్, సెక్యూరిటీ విభాగాల్లో నైపుణ్యాలు పొందాలన్నా, తమలోని నైపుణ్యాలకు పదును పెట్టుకోవాలన్నా ఉచితంగా ఈ అవకాశం ఉపయోగించుకోవచ్చు. కోవిడ్-19 మహమ్మారి కారణంగా స్తంభించిపోయిన తమ వ్యాపారాలను పునః ప్రారంభించాలనుకునే వారు, కొత్తగా వ్యాపారాలు ప్రారంభించాలనుకునే వారు ప్రత్యేక కోచింగ్ పొందే విధంగా ప్రత్యేక ఫీచర్ కూడా జోడించారు. చిన్న వ్యాపారులకు అందుబాటులో ఉన్న కోర్సుల్లో ఫైనాన్షియల్ మేనేజ్ మెంట్, బిజినెస్ స్ర్టాటజీ, డిజిటల్ స్ర్టాలజీ, చట్టపరమైన మద్దతు వంటివి ఉన్నాయి. దీనికి తోడు ఐబిఎం వలంటీర్లు ప్రపంచవ్యాప్తంగా ఐదు ప్రధాన ప్రాంతాల్లోని 100 కమ్యూనిటీలకు చెందిన 30 వేల మంది స్కిల్ బిల్డ్ యూజర్లకు మెంటార్లుగా వ్యవహరిస్తారు.
నెట్ వర్క్ విస్తరించుకోవడంతో పాటు ఉద్యోగార్హత పెంచుకోవాలనుకునే వారికి, వివిధ ప్రాజెక్టుల్లో ప్రత్యక్ష అనుభవం పొందాలనుకునే వారికి స్కిల్ బిల్డ్ ఇన్నోవేషన్ శిబిరం 10 వారాల వ్యవధి గల 100 గంటల నిర్మిత బోధన అందిస్తుంది. ఐబిఎం వలంటీర్లు, కోచ్ లు నిపుణులైన వారి మార్గదర్శకంలో విద్యార్థులు తమ డిజైన్ ఆలోచనా నైపుణ్యాలు, సమస్యల పరిష్కారానికి వ్యూహాత్మక విధానాలు, సంక్లిష్టమైన సమస్యల పరిష్కారానికి నైపుణ్యాలు వంటివి అలవరచుకోగలుగుతారు. వారికి సరికొత్త యూజర్ అనుభవంతో పాటు అలాంటి సంక్లిష్టమైన కథనాలను కూడా వివరంగా చెబుతారు. ఫెసిలిటేటర్లు, ఇతర బృందాలు, విభిన్న భాగస్వాములు, ఉపాధి అవకాశాలు కల్పించగల సామర్థ్యం ఉన్న వారు, ఇన్వెస్టర్లను ఒక వేదిక పైకి తీసుకురావడం ద్వారా ఈ స్కిల్ బిల్డ్ ఇన్నోవేషన్ శిబిరం ముగుస్తుంది.
పూర్వాపరాలు డిజిటికి చెందిన భారత్ స్కిల్స్ వేదికగా (https://bharatskills.gov.in) భారతీయ విద్యార్థులకు ఆన్ లైన్ లెర్నింగ్ వేదిక అందుబాటులోకి తేవడం కోసం నైపుణ్యాభివృద్ధి, ఎంటర్ ప్రెన్యూర్ షిప్ మంత్రిత్వ శాఖకు చెందిన డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ట్రెయినింగ్ తో (డిజిటి) ఐబిఎం ఇండియా 2019 నవంబర్ లో భాగస్వామ్యం కుదుర్చుకుంది. దేశంలోని ఐటిఐలు, టెక్నికల్ విద్యా విభాగంలోని ఇతర సంస్థల విద్యార్థులు, ఇన్ స్ర్టక్టర్లకు డిజిటల్ క్లాస్ రూమ్ లు కూడా ఈ వేదిక కల్పిస్తుంది. 15 రాష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన 4700 మంది లెర్నర్లు లాక్ డౌన్ సమయంలో కూడా ఈ వేదిక ద్వారా లబ్ధి పొందుతూ నిరంతర అధ్యయన అనుభవం పొందగలుగుతున్నారు. 14,135 మంది లెర్నర్లు 77 వేల గంటల ఇ-లెర్నింగ్ అనుభవంతో 40 వేలకు పైగా కోర్సులు పొందగలుగుతున్నారు. ప్రస్తుతం విద్యాసంస్థల్లో విద్యాభ్యాసం పూర్తి చేసుకుని వెలుపలికి వస్తున్న వారిలో 45.6% శాతం మంది మాత్రమే ఉద్యోగార్హత కలిగి ఉంటున్నారని ఇండియా స్కిల్ నివేదిక (2019) తెలిపింది. దీని వల్ల నైపుణ్యాలు గల పనివారి కొరత అధికంగా ఉంది.
“కోవిడ్ ప్రభావం నుంచి భారత ఆర్థిక వ్యవస్థను పునరుజ్జీవింపచేసేందుకు కేంద్రప్రభుత్వం చేస్తున్న కృషికి ఐబిఎం భాగస్వామ్యంలో స్కిల్స్ బిల్డ్ రీ ఇగ్నైట్, ఇన్నోవేషన్ కాంప్ ఒక కీలకమైన మైలురాయి. గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ స్కిల్ ఇండియా కార్యక్రమానికి ఇస్తున్న ప్రాధాన్యతకు అనుగుణంగా దేశంలో నైపుణ్యాల వాతావరణాన్ని పటిష్ఠం చేసేందుకు, కొత్త తరం నైపుణ్యాలకు పెరుగుతున్న డిమాండును పూర్తిగా వినియోగంలోకి తెచ్చేందుకు విభిన్న కంపెనీలతో సహకార భాగస్వామ్యాలు, డిజిటల్ బోధన భాగస్వామ్యాలు కుదుర్చుకుంటూ మంత్రిత్వ శాఖ శ్రమిస్తోంది. క్లౌడ్ కంప్యూటింగ్, కృత్రిమ మేథ వంటి విభాగాల్లో బహుముఖీన డిజిటల్ శిక్షణ సామర్థ్యాలున్న ఐబిఎం నైపుణ్యాలు స్థానిక ఉద్యోగులు,కమ్యూనిటీల, ఉద్యోగార్థులు, పారిశ్రామికవేత్లు, వ్యాపారవేత్తలు పునరుజ్జీవం కోసం చేస్తున్న కృషిని పటిష్ఠం చేస్తాయి” అని కేంద్ర నైపుణ్యాభివృద్ధి, ఎంటర్ ప్రెన్యూర్ షిప్ శాఖ మంత్రి డాక్టర్ మహేంద్రనాథ్ పాండే అన్నారు.
“కొత్త తరం యువతను కొత్త తరం సామర్థ్యాలతో రాబోయే భవిష్యత్తుకు సిద్ధం చేయడం, సాధికారం చేయడం మా లక్ష్యం. ఐబిఎంతో మా భాగస్వామ్యం దేశంలో నైపుణ్యాల విభాగంలో గల పెద్ద లోటును పూడ్చి ఎప్పటికప్పుడు నైపుణ్యాలు పెంచుకోవాలన్న సంస్కృతిని పెంచుతుంది. ఇందుకు అవసరం అయిన పరికరాలు, సరికొత్త విధానం స్కిల్ బిల్డ్ రీ ఇగ్నైట్ కల్పించడంతో పాటు వారికి అవసరం అయిన మెంటార్లను కూడా అందిస్తుంది” అని ఎంఎస్ డిఇ కార్యదర్శి శ్రీ ప్రవీణ్ కుమార్ అన్నారు.
“నైపుణ్యాల లోటును పూడ్చేందుకు కొత్త టెక్నాలజీలపై అధికంగా దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. మారుతున్న పరిశ్రమ అవసరాలు, టెక్నాలజీలో మార్పులకు అనుగుణంగా ఉద్యోగులను సిద్ధం చేయడం చాలా కీలకం. స్కిల్ బిల్డ్ రీఇగ్నైట్ ఇందుకు తగిన వేదిక కల్పించడంతో పాటు ఉద్యోగులకు శిక్షణావకాశాలు తిరిగి అందుబాటులోకి తెస్తుంది. ఈ వేదిక అందుకు అవకాశాలు కల్పించడంతో పాటు సరికొత్త విధానాల్లో పని చేసే వీలు కల్పిస్తుంది. వ్యాపార వ్యూహాలు తిరిగి రచించుకునేందుకు వ్యక్తిగత మద్దతు ఇస్తుంది” అని ఐబిఎం భారత్/దక్షిణాసియా విభాగం జనరల్ మేనేజర్ శ్రీ సందీప్ పటేల్ అన్నారు.
******
(Release ID: 1634361)
Visitor Counter : 292