విద్యుత్తు మంత్రిత్వ శాఖ

‘ఆత్మనిర్భర్ భారత్ అభియాన్’, ‘మేక్ ఇన్ ఇండియా’ చొరవను విజయవంతం చేయ‌డానికి గ‌ల‌ మార్గాలపై చర్చించడానికి ఇండస్ట్రీ అసోసియేషన్స్, పవర్ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ (ఆర్ఈ) తయారీదారులు మరియు డెవలపర్‌లతో కేంద్ర విద్యుత్ మంత్రి శ్రీ ఆర్.కె. సింగ్ చర్చలు


దేశీయంగా తయారైన పరికరాలను ఉపయోగించే వారికి తక్కువ వడ్డీ రేట్లకు పీఎఫ్‌సీ, ఆర్ఈసీ మరియు ఐఆర్ఈ‌డీఏ ఆర్థిక సహాయం

సౌర మాడ్యూల్స్, సౌర ఘటాలు మరియు సౌర ఇన్వర్టర్లపై ఆగస్టు, 2020 నుండి బేసిక్ కస్టమ్ డ్యూటీ (బీసీడీ) విధించే ప్రతిపాదనను తెలియ‌జేసిన‌ విద్యుత్ మంత్రి

Posted On: 23 JUN 2020 8:20PM by PIB Hyderabad

 కేంద్ర విద్యుత్, కొత్త మరియు పునరుత్పాదకపు ఇంధనం, నైపుణ్య అభివృద్ధి మరియు వ్యవస్థాపకత (ఐసీ) శాఖల‌‌ మంత్రి శ్రీ ఆర్‌.కె. సింగ్ మంగ‌ళ‌వారం వీడియో కాన్ఫరెన్సింగ్ మాధ్యమం ద్వారా విద్యుత్ మరియు పునరుత్పాదక ఇంధన రంగంలోని ఉత్పత్తి మరియు ప్రసార ప్రాజెక్టుల డెవలపర్‌లతో సంభాషించారు.

భారతదేశంలో వస్తువులు మరియు సేవల తయారీని ప్రోత్సహించడానికి మ‌రియు ఉద్యోగాలు కల్పించేందుకు గా‌ను కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ‌ ఆత్మనిర్భర్ భారత్ ఉద్యమం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు. డీజీసీఐ (డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ కమర్షియల్ ఇంటలిజెన్స్) మ‌రియు వాణిజ్య శాఖ అందించిన దేశీయ విద్యుత్ రంగంలో వస్తువుల వారీ దిగుమతుల స‌మాచారంను ప‌రిశీలిస్తే ట్రన్స్‌మిష‌న్ లైన్‌ట‌వర్లు, కండక్టర్లు, ఇండస్ట్రియల్ ఎలక్ట్రానిక్స్, కెపాసిటర్లు, ట్రాన్స్‌ఫార్మర్లు, కేబుల్స్ మరియు అవాహకాలు మరియు అమరికలు మొదలైన అనేక ర‌కాల పరికరాల‌లో ఎక్కువ‌గా దిగుమ‌తులే కనిపిస్తుండ‌డాన్ని కేంద్రం ఈ సంద‌ర్భంగా ఎత్తిచూపారు. ఉత్పాదక సామర్థ్యం ఉన్న ఉత్పత్తులూ ఇప్పటికీ దిగుమతి అవుతున్నాయి. మేక్ ఇన్ ఇండియాను ప్రోత్సహించడానికి మరియు దిగుమతుల‌పై ఆధార‌ప‌డ‌టాన్ని తగ్గించడానికి, ట్రన్స్‌మిష‌న్‌, థర్మల్, హైడ్రో, డిస్ట్రిబ్యూషన్, రెన్యూవబుల్స్ వంటి డెవలపర్లు 'ఆత్మనిర్భర్ భారత్' యొక్క జాతీయ ప్రచారంలో చేరాల్సిన అవసరం ఉందని అన్నారు. ఇందుకు గాను భార‌త ప్రభుత్వపు 'మేక్ ఇన్ ఇండియా'ను హృదయపూర్వకంగా స్వీకరించాలని నొక్కి చెప్పారు. విద్యుత్ రంగం సున్నితమైన మరియు వ్యూహాత్మకంగా ముఖ్యమైన రంగం అని శ్రీ సింగ్ అభిప్రాయపడ్డారు.

ప్రతిజ్ఞ చేయించిన మంత్రి మ‌న దేశంలో కమ్యూనికేషన్‌లు, తయారీ, డేటా మేనేజ్‌మెంట్ మరియు అన్ని అవసరమైన ఇత‌ర‌త్రా సేవలు విద్యుత్ సరఫరాపై ఆధారపడి ఉంటాయి. కాబ‌ట్టి ఇందులో ఏదైనా మాల్వేర్ ఉంటే అది వ్యవస్థను దిగజార్చే ప్రమాదం ఉంద‌ని మంత్రి అభిప్రాయ‌ప‌డ్డారు. అందువల్లనే ఆత్మనిర్భర్ భారత్లో విద్యుత్ రంగం చాలా ఎక్కువ ప్రాముఖ్యతను కలిగి ఉంద‌ని అన్నారు. దీని ప్రకారం, డెవ‌ల‌ప‌ర్లు ఈ క్రింది ప్రతిజ్ఞను తీసుకోవాలని ఆయన కోరారు:

- దేశీయంగా త‌గినంత‌ సామర్థ్యం ఉన్న ఏ పరికరాలు / పదార్థాలు / వస్తువులను దిగుమతి చేసుకోకూడదు.
- దేశీయంగా సామర్థ్యం అందుబాటులో లేని మరియు దిగుమతి అనివార్యమైన వస్తువులు మరియు సేవలకు సంబంధించి 2-3 సంవత్సరాల నిర్ణీత కాల పరిమితికి మాత్రమే అనుమతించబడాలి. ఈ సమయంలో ఆయా వస్తువులను స్వదేశీయంగానే తయారు చేసే విధానం / పన్ను ప్రోత్సాహకాలు / స్టార్ట్-అప్స్ / వెండర్ డెవలప్మెంట్ / ఆర్ & డీ ద‌న్నును క‌ల్పించాలి. తద్వారా వచ్చే 2-3 సంవత్సరాలలో ఈ వస్తువులన్నీ దేశీయంగా తయారవుతాయి.
- అటువంటి సమయం వరకు దిగుమతి చేసుకున్న వస్తువులు భారతీయ ప్రయోగశాలలలో మ‌న దేశీయ ప్రమాణాలకు కట్టుబడి ఉండటానికి మరియు మాల్వేర్ ఉనికిని తనిఖీ చేసేందుకు గాను త‌గు విధంగా పరీక్షించాలి.
- దిగుమతి చేసుకోవలసిన పరికరాలు / వస్తువుల విష‌యంలో ముందస్తు సూచించిన‌ దేశాల నుండి అటువంటి పరికరాలు / వస్తువుల దిగుమతికి గాను విద్యుత్ మంత్రిత్వ శాఖ / ఎంఎన్ఆర్ఈ మంత్రిత్వ శాఖ యొక్క ముందస్తు అనుమతి పొందాలి. ఇలా అనుమ‌తులు పొందిన తరువాత మాత్రమే వాటి దిగుమ‌తి చేప‌ట్టాలి.

 

ఆగస్టు నుండి బేసిక్ కస్టమ్ డ్యూటీ మన దేశ అభివృద్ధికి విద్యుత్ కీలకమైన మౌలిక సదుపాయం అని కేంద్ర మంత్రి ఉద్ఘాటించారు. కమ్యూనికేషన్, డేటా సర్వీసెస్, హెల్త్ సర్వీసెస్, లాజిస్టిక్స్, డిఫెన్స్ మాన్యుఫ్యాక్చరింగ్ మొదలైనవన్నీ విద్యుత్ రంగంపై ఆధారపడి ఉంటాయ‌న్నారు. అందువల్ల, మన దేశం యొక్క భద్రతను కాపాడటానికి విద్యుత్ రంగం దిగుమతిపై ఆధారపడటాన్ని బాగా తగ్గించాల్సిన అవసరం ఉంది. సౌర మాడ్యూల్స్, సౌర ఘటాలు మరియు సౌర ఇన్వర్టర్లపై ఆగస్టు నుండి బేసిక్ కస్టమ్ డ్యూటీని (బీసీడీ) విధించాలన్న త‌మ మంత్రిత్వ శాఖ ప్రతిపాదనను కేంద్ర మంత్రి ఈ సమావేశంలో తెలియజేశారు.

త‌మ ప్రభుత్వ విధానం గురించి అనిశ్చితి ఉండకుండా బీసీడీకి సంబంధించి తాము స్పష్టమైన పథాన్ని ప్రకటిస్తామని చెప్పారు. దీనికి తోడు పునరుత్పాదక శక్తికి సంబంధించి ఆమోదించబడిన నమూనాలు మరియు తయారీదారుల జాబితా అక్టోబర్ 1, 2020 నుండి ముందుగా ప్రకటించిన విధంగా అమలులోకి వస్తుంది. 

ప్రామాణిక బిడ్డింగ్ మార్గదర్శకాల ప్రకారం వేలం వేయబడిన అన్ని సౌర విద్యుత్ ప్రాజెక్టులు ఆమోదించబడిన జాబితాలో ఉన్న తయారీదారుల నుండి సౌర ఘటాలు మరియు సౌర మాడ్యూల్స్ మరియు ఇతర పరికరాలను సేకరించడం అవసరమని ఇది నిర్ధారిస్తుంది ప్రత్యేక సెల్‌ల ఏర్పాటు.

పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ (పీఎఫ్‌సీ), రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ (ఆర్ఈసీ) మరియు ఇండియన్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్‌మెంట్ ఏజెన్సీ (ఇరెడా) నుండి ఫైనాన్సింగ్ నిర్మాణాత్మకంగా ఉంటుంద‌న్నారు. దేశీయంగా తయారు చేసిన ప‌రిక‌రాలను వాడే డెవలపర్‌లపై తక్కువ వడ్డీ రేట్లు వసూలు చేయబడ‌తాయ‌ని తెలిపారు. ఇటీ‌వల విద్యుత్‌ మ‌రియు ఎన్ఆర్‌ఈ మంత్రిత్వ శాఖలలో ఎఫ్‌డీఐ సెల్ మరియు ప్రాజెక్ట్ డెవలప్మెంట్ సెల్ ఏర్పాటును కూడా కూడా ఆయన ఈ సంద‌ర్భంగా ప్రస్తావించారు. భారత్‌తో సరిహద్దులు పంచుకునే దేశాల నుంచి పెట్టుబడులు పెట్టాలని ఎఫ్‌డిఐ సెల్ ప్రతిపాదనలు చేస్తుంది. ప్రాజెక్ట్ డెవలప్మెంట్‌ సెల్ ఇన్వెస్టిబుల్ ప్రాజెక్టులను క‌లిగి ఉంటుంది, తద్వారా ఇక్కడ పెట్టుబడి ప్రక్రియ వేగవంతం అవుతుంది. ఆర్‌ఇ సెక్టార్‌లోని కొన్ని దిగుమతి వస్తువులకు రాయితీ కస్టమ్ సర్టిఫికెట్లను జారీచేసే పద్ధతి త్వర‌లో నిలిపివేయబడుతుందని మంత్రి సమావేశానికి వ‌చ్చిన వారికి తెలియజేశారు. భ‌విష్యత్తులో ఏ తేదీ నుంచి ఈ విధానం నిలిపివేయ‌బ‌డుతుందో తాము విడిగా పేర్కొంటామ‌ని తెలిపారు.

ప‌లు సూచ‌న‌లు చేసిన ప‌రిశ్రమ వ‌ర్గాలు ఈ స‌మావేశంలో కేంద్ర మంత్రితో సంభాషణ సమయంలో డెవలపర్లు భారతదేశంలో విద్యుత్ రంగ పరికరాల దేశీయ తయారీని బలోపేతం చేయడానికి గాను ముఖ్యమైన సూచనలు చేశారు. వీటిలో విద్యుత్ పరికరాల తయారీకి గాను విధానప‌ర‌మైన నిశ్చయత, మూలధన వస్తువుల దిగుమతిని మ‌రింత‌గా సులభతరం చేయడం, పోటీ రేట్ల వద్ద ప‌రిక‌రాల‌ను అందుబాటులో ఉంచేందుకు గాను త‌యారీదారుల‌కు త‌గిన ఆర్ధిక తోడ్పాటును అందించాల‌ని కోరారు. కొత్త మరియు పాత పెట్టుబడులపై స్పష్టత అవసరం, ఆర్ అండ్ ‌డీ ప్రయత్నాలను ప్రోత్సహించడం, ఒప్పందాల సాంక్టిటీని కొనసాగించడం వంటివి కూడా వారు నొక్కి చెప్పారు. కొంతమంది డెవలపర్లు ప్రస్తుత ప్రాజెక్టుల నిర్వహణ మరియు ఓరాలింగ్‌న‌‌కు అవసరమైన క్లిష్టమైన పరికరాల దిగుమతుల్ని అనుమతించాల్సిన అవసరం ఉందన్నారు. వీటి దేశీయ ఉత్పాదక సామర్థ్యం అమల్లోకి వ‌చ్చే వ‌ర‌కు వీటి దిగుమ‌తుల్ని అనుమ‌తించాల‌ని కోరారు. పునరుత్పాదక ఇంధన రంగంలో ఉన్న డెవలపర్లు మరియు సీఐఐ, ఫిక్కీ, పీహెచ్‌డీ చాంబర్‌తో పాటుగా సోలార్ మరియు విండ్ విద్యుత్ తయారీదారులు వంటి పరిశ్రమల సంఘాలు, విద్యతు ఉత్పత్తి మరియు ట్రాన్స్‌మిషన్ ఉత్పత్తుల‌ డెవలపర్లు దేశీయ తయారీకి దోహదం చేస్తామని చేసిన ప్రతిజ్ఞను ఉత్సాహంతో ప్రతిధ్వనించారు. దేశం దిగుమతులపై ఆధారపడటాన్ని గ‌రిష్టంగా తగ్గించడానికి 'మేక్ ఇన్ ఇండియా' మరియు 'ఆత్మనిర్భర్ భారత్' కార్యక్రమానికి మరియు కేంద్ర మంత్రి సూచించిన ప్రతిజ్ఞకు కట్టుబడి ఉండటానికి కూడా వారు అంగీకరించారు. ప్రస్తుతం ఉన్న ప్రాజెక్టులకు సంబంధించి వివిధ‌ అంశాల‌తో స‌హా సుల‌భంగా రుణ ల‌భ్యత మొదలైన అంశాల‌ను తాము జాగ్రత్తగా పరిశీలిస్తామని మంత్రి స‌మావేశంలో పాల్గొన్న ప‌రిశ్రమ‌ల వారికి హామీ ఇచ్చారు. స‌మావేశంలో పాల్గొనేవారి సమస్యలను పరిశీలించాలని ఆయన విద్యుత్‌ శాఖ, ఎంఎన్‌ఆర్‌ఇ శాఖ‌ల కార్యద‌ర్శుల‌ను ఆదేశించారు.

 

******



(Release ID: 1633813) Visitor Counter : 193