హోం మంత్రిత్వ శాఖ

కేంద్ర హోంమంత్రి శ్రీ అమిత్ షా అధ్యక్షతన న్యూఢిల్లీ లో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో కోవిడ్-19 నియంత్రణ వ్యూహంపై డాక్టర్ వి.కే.పాల్ కమిటీ తన నివేదికను సమర్పించింది


కంటైన్మెంట్ జోన్ల యొక్క తాజా సరిహద్దు, ఈ మండలాల్లో కఠినమైన పర్యవేక్షణ మరియు కార్యకలాపాల నియంత్రణ

ఆరోగ్య సేతు యాప్ మరియు ఇతిహాస్ యాప్ ఉపయోగించడం ద్వారా, వైరస్ సోకిన వ్యక్తులందరినీ గుర్తించడం మరియు వారిని క్వారంటైన్ కి తరలించడం

కంటైన్మెంట్ జోన్ల వెలుపల కూడా ప్రతి ఇంటిలో వ్యక్తుల జాబితా మరియు పర్యవేక్షణ, ఇది ఢిల్లీ గురించి సమగ్ర సమాచారాన్ని పొందడంలో సహాయపడుతుంది.


20 వేల మంది వ్యక్తుల నమూనా పరీక్షల తో 27.06.2020 నుండి 10.07.2020 తేదీ వరకు ఢిల్లీ వ్యాప్తంగా సెరోలాజికల్ సర్వే నిర్వహించనున్నారు

Posted On: 21 JUN 2020 11:19PM by PIB Hyderabad

కేంద్ర హోంమంత్రి శ్రీ అమిత్ షా ఆదేశాల మేరకు ఢిల్లీ లో కోవిడ్-19 కంటైన్మెంట్ వ్యూహంపై నివేదిక సమర్పించడం కోసం డాక్టర్ వినోద్ పాల్ అధ్యక్షతన 14.06.2020 తేదీన ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది.  ఈ రోజు ఇక్కడ కేంద్ర హోంమంత్రి శ్రీ అమిత్ షా అధ్యక్షతన జరిగిన సమావేశంలో డాక్టర్ పాల్ కమిటీ  రూపొందించిన నివేదికను సమర్పించడం జరిగింది.  ఈ సమావేశంలో కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్, ఢిల్లీ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి / ఆరోగ్య మంత్రితో పాటు,  డాక్టర్ పాల్, కేంద్ర గృహ, ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖల కార్యదర్శులు, ఢిల్లీ ముఖ్య కార్యదర్శి పాల్గొన్నారు. .

 

డాక్టర్ పాల్ నిర్ణయించిన కంటైన్మెంట్ వ్యూహం లోని ప్రధాన  అంశాలు ఈ విధంగా ఉన్నాయి :

*         కంటైన్మెంట్ జోన్ల సవరించిన సరిహద్దులు మరియు అటువంటి కంటైన్మెంట్ జోన్లలో కఠినమైన పర్యవేక్షణ మరియు కార్యకలాపాల నియంత్రణ.

*         ఆరోగ్య సేతు యాప్ మరియు ఇతిహాస్ యాప్ సహాయంతో, వైరస్ సోకిన వ్యక్తులందరినీ గుర్తించడం మరియు వారిని క్వారంటైన్ కి తరలించడం. 

*          కంటైన్మెంట్ జోన్ల వెలుపల కూడా ప్రతి ఇంటిలో వ్యక్తుల జాబితా మరియు పర్యవేక్షణ, ఇది ఢిల్లీ గురించి సమగ్ర సమాచారాన్ని పొందడంలో సహాయపడుతుంది. 

*          కోవిడ్-19 పాజిటివ్ కేసులను ఆస్పత్రులు, కోవిడ్ కేర్ సెంటర్లు లేదా గృహ ఐసోలేషన్లలో ఉంచాలి.  కోవిడ్ కేర్ సెంటర్ల పనితీరు సరిగా ఉండాలి. ఈ విషయంలో స్వచ్ఛంద సంస్థలు / ఎన్.జి.ఓ. ల సహాయం తీసుకోవాలి. 

 20 వేల మంది వ్యక్తుల నమూనా పరీక్షల తో 27.06.2020 నుండి 10.07.2020 తేదీ వరకు ఢిల్లీ వ్యాప్తంగా సెరోలాజికల్ సర్వే నిర్వహించనున్నారు.  ఇది ఢిల్లీలో వైరస్ వ్యాప్తిని సమగ్రంగా అంచనా వేయడానికి సహాయపడుతుంది మరియు సమగ్రమైన వ్యూహాన్ని రూపొందించడానికి సహాయపడుతుంది.

డాక్టర్ వి.కె. పాల్ ప్రతిపాదించిన ప్రణాళిక ప్రకారం, ఢిల్లీ లోని  ప్రతి జిల్లా ను ఒక్కో ప్రధాన ఆసుపత్రితో అనుసంధానిస్తారు, ఆ ఆసుపత్రులు తగిన సహాయం అందిస్తాయి.  

ప్రతిపాదిత నివేదికలో పైన పేర్కొన్న అన్ని కార్యకలాపాలకు నిర్ణీత కాల పరిమితిని కూడా నిర్దేశించారు. 

22.06.2020 తేదీ నాటికి దీని ఆధారంగా ఢిల్లీ ప్రభుత్వం ఒక ప్రణాళికను ఖరారు చేస్తుంది. 

23.06.2020 తేదీ నాటికి జిల్లా స్థాయి బృందాలను ఏర్పాటు చేస్తుంది,

26.06.2020 తేదీ నాటికి అన్ని కంటైన్మెంట్ జోన్లకు సవరించిన సరిహద్దులను జారీ చేస్తుంది,

30.06.2020 తేదీ నాటికి కంటైన్మెంట్ జోన్లలో వంద శాతం సర్వే చేస్తుంది మరియు

06.07.2020 తేదీ నాటికి ఢిల్లీ మినహా మిగిలిన ప్రాంతాల్లో సమగ్ర సర్వే జరుగుతుంది.

మరణానికి ఎన్ని రోజుల ముందు ఆ వ్యక్తిని ఆసుపత్రికి తీసుకువచ్చారు, ఎక్కడి నుంచి తీసుకువచ్చారు, అనే విషయాలను ప్రతి చనిపోయిన వ్యక్తికి సంబంధించి వివరాలను అంచనా వేయాలని, కేంద్ర హోంమంత్రి, ఢిల్లీ ప్రభుత్వాన్ని ఆదేశించారు.  ఆ వ్యక్తి ఇంటి వద్ద ఐసోలేషన్ లో ఉన్నారా, లేదా,  సరైన సమయంలో ఆ వ్యక్తి ని ఆసుపత్రి కి తీసుకువచ్చారా, లేదా,  అనే విషయాలపై, ప్రత్యేక దృష్టి పెట్టాలి.  ప్రతి మరణాన్ని భారత ప్రభుత్వానికి నివేదించాలి.  అన్ని కోవిడ్-19 పాజిటివ్ కేసులను ముందుగా  కోవిడ్ కేంద్రాలకు సూచించాలనీ, ఇంట్లో తగిన సౌకర్యాలు ఉన్నవారు మరియు ఇతర అనారోగ్య లక్షణాలతో బాధపడని వారిని గృహ ఐసోలేషన్ లో ఉండటానికి అనుమతించవచ్చునని హోంమంత్రి తెలియజేశారు.  గృహ ఐసోలేషన్ లో ఉండడానికి ఎంతమందిని అనుమతించినదీ వివరాలను భారత ప్రభుత్వానికి కూడా తెలియజేయాలి.  కంటైన్మెంట్ జోన్ల యొక్క సవరించిన సరిహద్దుల విషయంలో ఢిల్లీ ప్రభుత్వ అధికారులు సాంకేతిక సహాయం తీసుకోవాలని హోంమంత్రి సలహా ఇచ్చారు.  డాక్టర్ ‌పాల్ నేతృత్వంలోని కమిటీ కి హోంమంత్రి కృతజ్ఞతలు తెలియజేశారు. అదేవిధంగా, ప్రతిపాదిత వ్యూహాన్ని అమలు చేయాలని ఢిల్లీ ముఖ్యమంత్రి కి సూచించారు.

 

*****(Release ID: 1633369) Visitor Counter : 291


Read this release in: English , Marathi , Manipuri , Tamil