శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ

కోవిడ్ పై పోరులో స్వచ్ఛంద సేవలకోసం చేతులు కలిపిన ఎస్.సి.టి.ఐ.ఎం.ఎస్.టి.

Posted On: 05 JUN 2020 4:01PM by PIB Hyderabad

 

కోవిడ్19 వైరస్ తో ఏర్పడిన ముప్పు కారణంగా ఆందోళన కొనసాగుతున్న నేపథ్యంలో ఈ వైరస్ పై జరిగే పోరాటంలో భారీ ఎత్తున సామాజిక సేవా కార్యకలాపాలు మొదలయ్యాయి. ఈ సేవలందించడానికి కేంద్ర శాస్త్ర సాంకేతిక పరిజ్ఞాన విభాగం పరిధిలోని శ్రీచిత్ర తిరుణాల్ వైద్యవిజ్ఞాన సాంకేతిక సంస్థ (ఎస్.సి.టి.ఐ.ఎం.ఎస్.టి.)కి చెందిన పలు ఉద్యోగ సంఘాలు కూడా చేతులు కలిపాయి.
కోవిడ్-19 వైరస్ సోకిన సిబ్బందికి, క్వారంటైన్ లో ఉన్న వారికి అవసరమైన సహాయం అందించేందుకు, క్వారంటైన్ లో ఉన్న సిబ్బందికి ఆహారం, మందులు, నిత్యావసరాలు, కిరాణ సరకులు తప్పనిసరిగా అందేలా చూసేందుకు ఈ ఉద్యోగ సంఘాలన్నీ ఒకే గొడుగు కిందకు చేరాయి. ఇందుకోసం ఒక వాట్సప్ గ్రూపును కూడా ప్రారంభించాయి.
  కోవిడ్-19 లేబొరేటరీల సిబ్బందికి రవాణా ఏర్పాట్లు చేయడానికి, క్వారంటైన్ లో ఉన్న సిబ్బందికి హైడ్రాక్సీ క్లోరోక్వీన్ (హెచ్.సి.క్యూ.) మాత్రలు నిరాటంకంగా అందించేందుకు ఈ గ్రూపు ద్వారా తగిన ఏర్పాటు చేశారు. ‘buddies @sctimst’  పేరిట ఈ వాట్సప్ గ్రూపు ఏర్పాటైంది. ఇందుకు సంబంధించి,  అన్ని స్థాయిల్లో జరిగే స్వచ్ఛంద సేవా కార్యకలాపాలను సమన్వయం చేసుకునే బాధ్యతను కూడా ఈ వాట్సప్ గ్రూపు చేపట్టింది.    
సేవలందించే సిబ్బంది ఏ పదవిలో ఉన్నారన్న అంశంతో నిమిత్తంలేకుండా వారికి సంబంధించిన సేవాపరమైన అవసరాలన్నింటినీ  గుర్తించేందుకు ఈ డిజిటల్ వ్యవస్థ దోహదపడింది.
  ఇక సేవలకు సంబంధించిన అన్ని వ్యవహారాలను నియంత్రించే బాధ్యతలను 15మంది సభ్యుల కీలక బృందం చేపట్టింది. సిబ్బందికి అవసరమైన సేవలు తప్పనిసరిగా అందేలా చూడటం, సేవలపై వచ్చే స్పందనను పర్యవేక్షించడం తదితర వ్యవహారాలను కూడా ఈ కీలక బృందం చేపట్టింది.

  మరో వైపు,.. కౌన్సెలింగ్, \యోగా, ధ్యానం, వ్యాధి నిరోధక చర్యలు వంటి అంశాల్లో మార్గదర్శకత్వం అందించడం, మానసిక వైద్యులు, ప్రకృతి వైద్య నిపుణులు, ఆయుర్వేద వైద్యులు, మనస్తత్వవేత్తలనుంచి తగిన మద్దతు అందించడం తదితరసేవలను అందుబాటులో ఉంచేందుకు 61మంది సభ్యులతో కూడిన వ్యవస్థ కూడా పనిచేస్తోంది. ఈ వ్యవస్థలో 15మంది క్రియాశీలక సభ్యులు స్వచ్ఛందసేవకులుగా తమ విధులు నిర్వర్తిస్తున్నారు. అవసరమైన వారికి తగిన ఆహారాన్ని అందించడం, పారిశుద్ధ్య నిర్వహణ వంటి కార్యకలాపాల్లో వివిధ సంస్థలకు ఈ బృందం చేదోడు వాదోడుగా ఉంటోంది.  

 శ్రీచిత్ర తిరుణాల్ వైద్యవిజ్ఞాన సాంకేతిక సంస్థ (ఎస్.సి.టి.ఐ.ఎం.ఎస్.టి.)కు పరిధిలోని వైద్య కళాశాల, ప్రాంతీయ కేన్సర్ సెంటర్ (ఆర్.సి.సి.), శ్రీ అవిట్టం తిరుణాల్ చిన్నపిల్లల ఆసుపత్రి (ఎస్.ఎ.టి.)లో ఉంటున్న కోవిడ్ రోగులకు, వారి బంధువులకు అవసరమైన ప్రయాణ సదుపాయాలు, వైద్య సదుపాయాలు, ఆహారం వంటివి ఈ బృందం అందిస్తోంది.
   తిరువనంతపురం వైద్య కళాశాలలో చికిత్సపొందే పేద రోగులకు, వారి సహాయకులకు అవసరమైన ఆహారం పొట్లాలను భారత్ మజ్దూర్ సంఘ్ (బి.ఎం.ఎస్.) ఆధ్వర్యంలోని శ్రీచిత్ర ఉద్యోగ సంఘ్ పంపిణీ చేసింది. ప్రాంతీయ కేన్సర్ సెంటర్ ఆసుపత్రి, శ్రీ అవిట్టం తిరుణాల్ చిన్న పిల్లల ఆసుపత్రి (ఎస్.ఎ.టి), ఎస్.సి.టి.ఐ.ఎం.ఎస్.టి. మెడికల్ కాలేజీ ఆసుపత్రిలోని వారికి కూడా ఆహార పొట్లాలను అందించారు. ఎస్.సి.టి.ఐ.ఎం.ఎస్.టి. రక్తనిధి (బ్లడ్ బ్యాంక్)కి రక్తదానం కోసం ఎంప్లాయీస్ సంఘ్ సభ్యులు ఒక రక్తదాన కార్యక్రమాన్ని కూడా గత ఏప్రిల్ నెల 16న ప్రారంభించారు. ఏప్రిల్ 23వరకూ ఎలాంటి లోటుపాట్లు లేకుండా రక్తం అందుబాటులో ఉండేలా వారు ఈ కార్యక్రమం నిర్వహించారు. అవసరమైన వారికి కిరాణా సరుకుల పాకెట్లను కూడా పంపిణీ చేశారు. ఇతర సంస్థలనుంచి అవుట్ సోర్సింగ్ ద్వారా నియమించుకున్న పారిశుద్ధ్య సిబ్బందికి కూడా వీటిని అందించారు. ఇక  ప్రతిరోజూ మధ్యాహ్న భోజన పాకెట్లను కూడా ఉచితంగా అందిస్తున్నారు. లాక్ డౌన్ సమయంలో రోగులకు, వారి సహాయకులకు దాదాపు వెయ్యి మాస్కులు, శానిటైజర్లు పంపిణీచేశారు. భయానకమైన కోవిడ్ వైరస్ వ్యాప్తిని నిరోధించే పోరాటంలో ఎస్.సి.టి.ఐ.ఎం.ఎస్.టి.లోని బోధనేతర ఉద్యోగులు, సిబ్బంది సఘం సభ్యులు కూడా తమ వంతుగా సబ్బులు, శానిటైజర్లు అందజేశారు.

organisations.jpg

***



(Release ID: 1629727) Visitor Counter : 197


Read this release in: English , Hindi , Tamil