రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌

ఆప‌రేష‌న్ స‌ముద్ర సేతు- శ్రీ‌లంక నుంచి భార‌తీయ పౌరుల‌ను తీసుకొని ట్యూటికోరిన్ చేరిన ఐఎన్ఎస్ జలాశ్వ

Posted On: 02 JUN 2020 7:11PM by PIB Hyderabad

ఆప‌రేష‌న్ స‌ముద్ర‌సేతులో భాగంగా భార‌త నౌకాద‌ళం పంపిన ఐ.ఎన్‌.ఎస్ జ‌లాశ్వ‌నౌక‌, శ్రీ‌లంక లోని కొలంబో నుంచి 685 మంది భార‌తీయ పౌరుల‌ను ఎక్కించుకుని 02 జూన్ 2020 న ట్యూటికోరిన్ హార్బ‌ర్‌కు చేరుకుంది. శ్రీ‌లంక‌లోని భార‌తీయ మిష‌న్‌, కోవిడ్ కార‌ణంగా శ్రీ‌లంక‌లో చిక్కుకుపోయిన భార‌త జాతీయుల‌ను స్వ‌దేశానికి తిప్పి పంపే ఏర్పాట్లు చేసింది. వీరంద‌రికీ త‌గిన వైద్య  ప‌రీక్ష‌లు చేసిన అనంత‌రం  ఈ నౌక‌లో ఎక్కించి పంపారు. స‌ముద్ర ప్ర‌యాణంలో పాటించ‌వ‌ల‌సిన కోవిడ్ సంబంధిత అన్నిర‌క్షిత  ప్రొటోకాల్స్‌ను పాటించి వీరిని తీసుకువ‌చ్చారు.
శ్రీ‌లంక నుంచి వ‌చ్చిన వారికి ట్యూటికోరిన్ హార్బ‌ర్‌లో స్థానిక అధికారులు  స్వాగ‌తం పలికారు. వీరంద‌రికీ స‌త్వ‌ర‌ వైద్య ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ‌, ఇమ్మిగ్రేష‌న్‌, ర‌వాణా స‌దుపాయాలకు అదికారులు ఏర్పాట్లు చేశారు. వీరి త‌ర‌లింపుతో భార‌త నౌకాద‌ళం ఇప్ప‌టివ‌ర‌కు 2,173 మందిని స్వ‌దేశానికి తీసుకువ‌చ్చింది. మాల్దీవుల నుంచి 1488 మందిని, శ్రీ‌లంక నుంచి 685 మందిని ప్ర‌స్త‌తు కోవిడ్ మ‌హ‌మ్మారి ప‌రిస్థితుల నేప‌ధ్యంలో స్వ‌దేశానికి తీసుకువ‌చ్చారు.  మ‌రో 700 మంది భార‌తీయుల‌ను స్వ‌దేశానికి 2020జూన్ 5 వ తేదీనాటికి తీసుకువ‌చ్చేందుకు ఐఎన్ ఎస్ జలాశ్వ‌ ప్ర‌స్తుతం మాల్దీవులుకు వెళుతోంది.

 

***



(Release ID: 1628896) Visitor Counter : 255