జల శక్తి మంత్రిత్వ శాఖ

"ఉదయిస్తున్న సూర్యుని భూమి" అరుణాచల్ ప్రదేశ్, 2023 మార్చి నాటికల్లా రాష్ట్రంలోని అన్ని గ్రామీణ కుటుంబాలకు ట్యాప్ కనెక్షన్ అందించాలని యోచిస్తోంది.

Posted On: 02 JUN 2020 1:13PM by PIB Hyderabad

రాష్ట్రంలో వంద శాతం కుటుంబాలకు ట్యాప్ కనెక్షన్లను సాధించడానికి అరుణాచల్ ప్రదేశ్ రూపొందించిన వార్షిక కార్యాచరణ ప్రణాళికను జల శక్తి మంత్రిత్వ శాఖ జాతీయ జల్ జీవన్ మిషన్ ఆమోదించింది.  2023 మార్చి నాటికి అన్ని గృహాలకు వంద శాతం ట్యాప్ కనెక్షన్లు అందించాలని రాష్ట్రం ప్రతిపాదించింది.  2020-21 లో జల్ జీవన్ మిషన్ (జెజెఎం) కింద రాష్ట్రానికి 255 కోట్ల రూపాయలను భారత ప్రభుత్వం ఆమోదించింది.  స్పష్టమైన ఉత్పాదనల పరంగా, ఉదాహరణకు, గృహ ట్యాప్ కనెక్షన్లు మరియు ఆర్థిక పురోగతి వంటి అంశాలలో పని తీరు ఆధారంగా రాష్ట్రాలకు అదనపు నిధులు ఇవ్వబడతాయి.   మొత్తం 2.18 లక్షల గ్రామీణ కుటుంబాలలో, 2020-21లో 77,000 ట్యాప్ కనెక్షన్లను అందించాలని రాష్ట్రం యోచిస్తోంది.  ప్రణాళికను ఖరారు చేసే సమయంలో, ఆశాజనక జిల్లాలోని గృహాలను కవర్ చేయడం, నాణ్యత-ప్రభావిత ఆవాసాలు, సంసద్ ఆదర్శ్ గ్రామీణ్ యోజన పరిధిలోని గ్రామాలు మొదలైన వాటికి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది.

అరుణాచల్ ప్రదేశ్‌లో నీటి లభ్యత ఒక సమస్య కాదు, కానీ అమలులో ఎదురయ్యే సవాళ్లలో, కఠినమైన పర్వత భూభాగం, అరుదుగా ఉన్న ఆవాసాలు, కఠినమైన వాతావరణ పరిస్థితులు వంటివి చాలా ఉన్నాయి.  ఏది ఏమైనా, ప్రతి గ్రామీణ గృహాలకు తాగునీరు చేరే విధంగా అన్ని గ్రామాలు / ఆవాసాలను ఈ పధకంలో చేర్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఒక స్పష్టమైన ప్రణాళికను రూపొందించింది.  జల్ జీవన్ మిషన్ రాష్ట్రంలోని పౌరులకు వారి ఇళ్లలో శుభ్రమైన, త్రాగునీటిని అందించడానికి ఒక సువర్ణావకాశాన్ని కల్పిస్తోంది. తద్వారా మహిళలు మరియు బాలికలకు భారం తగ్గుతుంది.

రాష్ట్రం ‘తక్కువ ఎత్తులో వ్రేలాడుతున్న పండ్లను’ లక్ష్యంగా పెట్టుకుంది. అంటే, ఇప్పటికే పైపుల ద్వారా నీటి సరఫరా పథకాలు అమలులో ఉన్న గ్రామాలు / ఆవాసాలలో, మిగిలిన గృహాలకు కనీసం సాధ్యమైన సమయంలో సులభంగా ట్యాప్ కనెక్షన్లు అందించవచ్చు.  సమాజంలోని బలహీన వర్గాలకు చెందిన మిగిలిన గృహాలకు ప్రధమ ప్రాధాన్యతతో వెంటనే ట్యాప్ కనెక్షన్లు అందించాలని రాష్ట్రం యోచిస్తోంది.  ప్రస్తుత కోవిడ్-19 మహమ్మారి సమయంలో, ప్రజలు ఎక్కువగా త్రాగు నీటి వనరుల దగ్గర గుమిగూడకుండా చూడాలన్నదే ప్రభుత్వ ప్రయత్నం.  గృహ ట్యాప్ కనెక్షన్లను అందించడానికి గ్రామాల్లో నీటి సరఫరా పనులను తక్షణ ప్రాతిపదికన చేపట్టాలని రాష్ట్రానికి సూచించబడింది. ఇది సామాజిక దూరాన్ని పాటించడంలో సహాయపడుతుంది. అదేవిధంగా స్థానిక ప్రజలకు ఉపాధి కల్పించడంలో కూడా సహాయపడుతుంది. తద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పెంపొందించబడుతుంది. 

గ్రామీణ సమాజం చురుకుగా పాల్గొనడంతో గ్రామ కార్యాచరణ ప్రణాళిక (వీఐపీ) సమర్థవంతంగా అమలు చేయడానికి స్పష్టమైన విధానాన్ని తయారు చేయడం జరిగింది.   దీర్ఘకాలిక సుస్థిరతను నిర్ధారించడం కోసం గ్రామాల్లో నీటి సరఫరా వ్యవస్థ ప్రణాళిక, అమలు, నిర్వహణలో స్థానిక సమాజం కీలక పాత్ర పోషిస్తుంది.  గ్రామాలలో నీటి సరఫరా వ్యవస్థ యొక్క నిర్వహణ బాధ్యతలను స్వీకరించడానికి స్థానిక సంఘాలను ప్రోత్సహించడం జరుగుతుంది.  నిరుద్యోగ యువతకు ప్లంబింగ్, తాపీపని, అమరిక, విద్యుత్ మొదలైన వాటిలో శిక్షణ ఇవ్వడానికి నైపుణ్య కార్యకలాపాలతో ప్రణాళికను రూపొందించడం జరిగింది. తద్వారా శిక్షణ పొందిన మానవ వనరుల బృందం గ్రామ స్థాయిలో స్థానికంగా అందుబాటులో ఉంటుంది. 

ఎం.జి.ఎన్.‌ఆర్.ఈ.జి.ఎస్., ఎస్.‌బి.ఎం.(జి), పి.ఆర్.‌ఐ. లకు 15వ ఆర్ధిక సంఘం నిధులు, జిల్లా ఖనిజ అభివృద్ధి నిధి, సి.ఏ.ఎం.పి.ఏ., స్థానిక ప్రాంత అభివృద్ధి నిధి, మొదలైన వివిధ కార్యక్రమాల కలయిక ద్వారా తాగునీటి సరఫరా వ్యవస్థల దీర్ఘకాలిక స్థిరత్వం కోసం ప్రస్తుత తాగునీటి వనరులను బలోపేతం చేయడం జరుగుతోంది. అందుబాటులో ఉన్న అన్ని నిధులను న్యాయంగా ఉపయోగించటానికి గ్రామ స్థాయి ప్రణాళికను రూపొందించడం జరిగింది.   2020-21 మధ్యకాలంలో పి.ఆర్.‌ఐ. లకు 15వ ఆర్థిక సంఘం నిధులు కింద రాష్ట్రానికి 231 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. ఈ మొత్తంలో 50 శాతం నిధులను నీరు మరియు పారిశుద్ధ్యం కోసం తప్పనిసరిగా ఖర్చు చేయాల్సి ఉంది. 

జల్ జీవన్ మిషన్ కింద, జిల్లా, రాష్ట్ర స్థాయిలో నీటి నాణ్యత పరీక్ష ప్రయోగశాలలకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది.  నీటి నాణ్యతను పర్యవేక్షించడానికి స్థానిక సమాజానికి కూడా ఇందులో భాగస్వామ్యం కల్పించనున్నారు.  సమాజాన్ని శక్తివంతం చేయడానికి, ఈ పనిలో నిమగ్నమవ్వడానికి సదుపాయం కల్పించబడింది, దీని కోసం సకాలంలో కిట్ల సేకరణ, సమాజానికి కిట్ల సరఫరా, ప్రతి గ్రామంలో కనీసం ఐదుగురు మహిళలను గుర్తించడం, క్షేత్ర స్థాయిలో పరీక్షా పరికరాల  వినియోగంలో మహిళలకు శిక్షణ ఇవ్వడం వంటి వివిధ ప్రణాళికాబద్ధమైన కార్యకలాపాలను చేర్చడానికి కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయడాం జరిగింది. 

2024 నాటికి దేశంలోని ప్రతి గ్రామీణ కుటుంబానికీ ట్యాప్ కనెక్షన్లను అందించే లక్ష్యంతో ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ 2019 ఆగస్టు 15వ తేదీన జల్ జీవన్ మిషన్ పధకాన్ని ప్రకటించారు.  రాష్ట్రాల భాగస్వామ్యంతో అమలు చేయబడుతున్న ఈ పధకం ద్వారా,  ప్రతి గ్రామీణ కుటుంబానికి రోజుకు 55 లీటర్ల చొప్పున తలసరి పరిమాణంలో (ఎల్.‌పి.సి.డి) త్రాగునీటిని క్రమం తప్పకుండా, దీర్ఘకాలిక ప్రాతిపదికన సరఫరా చేయడం జరుగుతుంది. తద్వారా గ్రామీణ ప్రజల జీవితాల్లో మెరుగుదల కనబడుతుంది.  

*****(Release ID: 1628670) Visitor Counter : 324