ఆర్ధిక వ్యవహారాల మంత్రివర్గ సంఘం

సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థల (ఎంఎస్ఎంఈ) నిర్వచనాన్ని సవరించి విస్తరించిన కేంద్రమంత్రివర్గం ఎంఎస్ఎంఈల కోసం ప్రకటించిన మిగిలిన రెండు ప్యాకేజీలు

ఎ) ఇబ్బందుల్లో ఉన్న ఎంఎస్ఎంఈల కోసం రూ. 20000 కోట్ల ప్యాకేజీ మరియు
బి) నిధుల నిధి ద్వారా రూ. 50,000 కోట్ల ఈక్విటీని నింపే ప్యాకేజీ
అమలుకు మార్గదర్శకాలు / దిశా నిర్దేశం చేసింది

మొత్తం 'ఆత్మ నిర్భర్ భారత్ ప్యాకేజీ' అమలు ద్వారా ఎంఎస్ఎంఈ సంస్థలను శక్తివంతం చేయడానికి మార్గం సుగమం

Posted On: 01 JUN 2020 5:43PM by PIB Hyderabad

దేశంలో ఎంఎస్ఎంఈ సంస్థలను శక్తివంతం చేయడంపై దృష్టిని కేంద్రీకరించిన భారత ప్రభుత్వం ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన  ఆర్ధిక వ్యవహారాల మంత్రివర్గ కమిటీ (సిసిఇఎ) ప్రత్యేక సమావేశంలో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థల (ఎంఎస్ఎంఈ) నిర్వచనాన్ని సవరించి విస్తరించింది.  వాటి  అమలుకు మార్గదర్శకాలు / దిశా నిర్దేశం చేసింది     తద్వారా  'ఆత్మ నిర్భర్ భారత్ ప్యాకేజీ'లో మిగిలిన రెండు ప్రకటనలను సమర్ధవంతంగా అమలు చేయడానికి అవసరమైన యంత్రాంగం కల్పించినట్లయింది.    సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు:  
      *ఉత్పత్తి మరియు సేవలు అందించే సూక్ష్మ సంస్థల పెట్టుబడి పరిమితిని  ప్యాకేజీ ప్రకటనలో కోటి రూపాయలకు పెంచారు. టర్నోవర్ ను రూ. 5 కోట్లకు పెంచారు.   చిన్న యూనిట్ల పెట్టుబడిని రూ. 10 కోట్లకు మరియు టర్నోవరును రూ. 50 కోట్లకు పెంచారు.   అదేవిధంగా  మధ్యతరహా యూనిట్ల పెట్టుబడిని రూ. 20 కోట్లకు మరియు టర్నోవరును రూ.  100 కోట్లకు పెంచారు.     ఎమ్ ఎస్ ఎమ్ ఇ సంస్థల అభివృద్ధి చట్టం, 2006  అమలులోకి వచ్చిన 14 ఏళ్ళ తరువాత పరిమితులను సవరిస్తూ విస్తరించడం జరిగింది.   2020, మే 13వ తేదీన ప్యాకేజీని ప్రకటించిన తరువాత ఈ పరిమితులు మార్కెట్ పరిస్థితులు, ధరల  తీరుకు అనుగుణంగా లేవని వివిధ వర్గాలు ప్రభుత్వానికి నివేదన పత్రాలు అందజేశాయి.  పరిమితులను సవరించి మరింత పెంచాలని కోరారు.    వారి అభ్యర్ధనలను పరిగణనలోకి తీసుకొని మధ్యతరహా యూనిట్ల పెట్టుబడి పరిమితిని రూ. 50 కోట్లకు మరియు టర్నోవరును రూ. 250 కోట్లకు పెంచారు.   అదేవిధంగా ఏ వర్గం  సూక్ష్మ, చిన్న, మధ్యతరహా యూనిట్ కు కూడా ఎగుమతులను  టర్నోవరులో కలుపబోరు.    వ్యాపార సౌలభ్యాన్ని పెంచే దిశలో ఇది మరొక చర్య.   ఈ చర్య వల్ల ఎంఎస్ఎంఈ రంగం ఎక్కువ   పెట్టుబడులను ఆకర్షించడమే కాక మరిన్ని ఉద్యోగాల కల్పనకు దారితీస్తుంది.  సవరించిన పరిమితులను ఈ దిగువ పట్టికలో ఇవ్వడం జరిగింది.  
 
కేటగరీ                         పాత  పెట్టుబడి          పాత టర్నోవర్       కొత్త పెట్టుబడి          కొత్త టర్నోవర్
 
సూక్ష్మ                           25 లక్షలు                   10 లక్షలు                 1 కోటి                    5 కోట్లు

చిన్న                              5 కోట్లు                         2 కోట్లు                     10 కోట్లు                50 కోట్లు

మధ్యతరహా                  10 కోట్లు                         5 కోట్లు                     50 కోట్లు               250 కోట్లు

* రూ.  20,000 కోట్లను సహాయక రుణాలు ఇవ్వడానికి  ఏర్పాటు చేయడం ద్వారా ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్న ఎంఎస్ఎంఈ యూనిట్లకు తోడ్పాటు లభిస్తుంది.   దీని ద్వారా  ఇబ్బందుల్లో ఉన్న 2 లక్షల ఎంఎస్ఎంఈ  యూనిట్లకు ప్రయోజనం చేకూరుతుంది.  

* నిధుల నిధి ద్వారా ఎంఎస్ఎంఈలలో ఈక్విటీని నింపడానికి రూ. 50,000 కోట్లను ఆమోదించడం వల్ల  ఈ రంగంలోని యూనిట్ల సామర్ధ్యాన్ని పెంచడానికి తోడ్పడుతుంది.  అంతేకాక ఆయా యూనిట్లకు  స్టాక్ ఎక్స్ చేంజీలలో  లిస్టయ్యే అవకాశం లభిస్తుంది.  

కేంద్ర ప్రభుత్వం సోమవారం చేసిన నిర్ణయాలతో  ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ ప్యాకేజీ  అమలు మరియు దిశానిర్దేశానికి సంబంధించిన అన్ని అంశాలు సమకూరాయి.   ఇది  ఎంఎస్ఎంఈ రంగం ఎక్కువ పెట్టుబడులను ఆకర్షించడమే
కాక మరిన్ని ఉద్యోగాలను సృష్టించడానికి తోడ్పడగలదు.  

కోవిడ్ -19 మహమ్మారి వ్యాప్తి అనంతర పరిస్థితులలో  జాతి నిర్మాణంలో ఎంఎస్ఎంఈల పాత్రను  ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సత్వరం గుర్తించారు.   అందువల్లనే ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ కింద చేసిన ప్రకటనల్లో ఎంఎస్ఎంఈలకు ప్రాధాన్యం ఇచ్చారు. ఈ ప్యాకేజీ కింద ఎంఎస్ఎంఈ రంగానికి పెద్దమొత్తంలో కేటాయింపులు చేయడమే కాక ఆర్ధిక వ్యవస్థ పునరుద్ధరణకు తీసుకునే చర్యల్లో ఈ రంగానికి ప్రాధాన్యం  ఇచ్చారు.  ఎంఎస్ఎంఈ  రంగానికి తక్షణ ఉపశమనం కలిగించేందుకు ప్యాకేజీ కింద వివిధ ప్రకటనలు చేశారు.  
వాటిలో ముఖ్యమైనవి:    
నిర్వహణ సంబంధమైన అప్ప్పులు తీర్చేందుకు, ముడి పదార్ధాలను కొనేందుకు, వ్యాపారం తిరిగి ప్రారంభించేందుకు  ఎంఎస్ఎంఈలకు అదనపు గ్యారంటీ లేకుండా మూడు లక్షల కోట్ల రుణాలు ఇవ్వడం;
ఈ రంగానికి గరిష్ఠ ప్రయోజనాలు చేకూర్చేందుకు ఎంఎస్ఎంఈ నిర్వచనాన్ని సవరించడం;  
దేశీయ సంస్థలకు ఎక్కువ అవకాశాలు కల్పించి వ్యాపారం పెంచేందుకు రూ. 200 కోట్లు లేక అంతకన్నా తక్కువ కాంట్రాక్టుల(సేకరణ)  కోసం గ్లోబల్ టెండర్లను పిలవరు.
ఎంఎస్ఎంఈలకు  ప్రభుత్వం,  పి ఎస్ యులు చెల్లించవలసిన   బకాయిల  చెల్లింపులు వచ్చే 45 రోజుల్లో నిశ్చయంగా జరిగేట్లు చూస్తారు.

ఇంతటి మహత్తర నిర్ణయాల నుంచి ఎంఎస్ఎంఈ సంస్థలకు నిశ్చయంగా సత్వర  ప్రయోజనం చేకూరేందుకు అవసరమైన అన్ని చర్యలను భారత ప్రభుత్వం చేపట్టింది.  ఇందుకోసం అవసరమైన ఈ దిగువ పేర్కొన్న నిర్ణయాలు తీసుకోవడమే కాక వాటి అమలుకు అవసరమైన ఏర్పాట్ల అమరిక జరిగింది.  

అదనపు గ్యారంటీ లేకుండా మూడు లక్షల కోట్ల రుణాలు ఇచ్చే స్కీమును  సిసిఇఎ ఇదివరకే ఆమోదించింది. మరియు  లాంఛనంగా ప్రారంభించడం జరిగింది.  
ఎంఎస్ఎంఈ సంస్థలు తమ పూర్తి సామర్ధ్యం మేరకు పనిచేయడానికి వీలుగా పరిమితులను సవరించి విస్తరించడానికి పద్ధతులను రూపొందించారు.  
అదేవిధంగా కాంట్రాక్టుల విషయంలో రూ. 200 కోట్ల వరకు గ్లోబల్ టెండర్లు పిలవాల్సిన అవసరం లేకుండా సాధారణ ఆర్ధిక నియమాలను సవరించారు.  కొత్త నియమాల జారీ మరియు అమలు మొదలైంది.   దానివల్ల ఎంఎస్ఎంఈలకు అవకాశాలు, వ్యాపారం పెరుగుతుంది.    
ఎంఎస్ఎంఈలకు చెల్లించవలసిన బకాయిలను నిర్ణీత  45 రోజుల గడువు లోగా విధంగా  క్యాబినెట్ సెక్రెటరీతో పాటు అన్ని స్థాయిల్లో ఆదేశాలు  జారీ అయ్యాయి.  
ఎంఎస్ఎంఈలకు ఆర్ధికంగా మరింత ఉపశమనం కలిగించడానికి  రుణాల చెల్లింపులపై మారటోరియంను రిజర్వు బ్యాంకు మరో మూడు నెలలు పొడిగించింది.  

వీటన్నింటిని పర్యవేక్షించేందుకు  సమాచార ప్రసార సాంకేతిక విజ్ఞానం (ఐ సి టి)  ఆధారంగా ఎంఎస్ఎంఈ మంత్రిత్వ శాఖలో శక్తివంతమైన 'ఛాంపియన్స్'  అనే వ్యవస్థను ఏర్పాటు చేశారు.   ఈ పోర్టుల్ ఎంఎస్ఎంఈ సంస్థలకు చేదోడు వాదోడుగా ఉంటుంది.  కొత్త వ్యాపార అవకాశాలు పొందడానికి మార్గదర్శిగా ఉంటూ,  దీర్ఘకాలంలో జాతీయ , అంతర్జాతీయ ఛాంపియన్లుగా ఎదగడానికి తోడై ఉంటుంది.  

ఎంఎస్ఎంఈలకు,వాటిపై ఆధారపడిన వారికి తోడ్పడేందుకు ఎంఎస్ఎంఈ మంత్రిత్వ శాఖ  కట్టుబడి ఉంది.  'ఆత్మ నిర్భర్ భారత్ ప్యాకేజీ'  కింద ఇతర   స్కీముల కింద ప్రయోజనం పొందే విధంగా ఎంఎస్ఎంఈలను ప్రోత్సహించడం జరుగుతుంది.    

నేపధ్యం
సూక్ష్మ, చిన్న మరియు మధ్యతరహా సంస్థలు ఎంఎస్ఎంఈలుగా ప్రచారం పొందాయి.  అవి భారత ఆర్ధిక వ్యవస్థకు వెన్నెముక వంటివి.  దేశంలోని వివిధ ప్రాంతాలలో 6 కోతల యూనిట్లు నిశ్శబ్దంగా పనిచేస్తూ బలమైన, స్వావలంబన భారత నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి.   స్థూలదేశీయోత్పత్తిలో వాటి ప్రభావం చాలా ఎక్కువ.   అవి జిడిపిలో 29 శాతం సమకూరుస్తున్నాయి.  దేశం నుంచి జరిగే ఎగుమతుల్లో దాదాపు సగం ఎంఎస్ఎంఈల ద్వారా జరుగుతోంది.   అంతేకాకుండా ఎంఎస్ఎంఈ రంగం ద్వారా  11 కోట్ల మందికి ఉపాధి లభిస్తోంది.  

 

***



(Release ID: 1628570) Visitor Counter : 401