వ్యవసాయ మంత్రిత్వ శాఖ
రాజస్థాన్, మధ్యప్రదేశ్ లో 15 చోట్ల నేడు మిడుతుల నియంత్రణ చర్యలు
ఏప్రిల్ 11 నుండి ఆరు రాష్ట్రాల్లో 377 ప్రదేశాల్లో 53,997 హెక్టార్లలో చర్యలు
Posted On:
29 MAY 2020 8:22PM by PIB Hyderabad
లోకస్ట్ కంట్రోల్ కార్యాలయాలు (ఎల్‌సిఓలు) ఈ రోజు జైపూర్, దౌసా, బికానెర్, జోధ్‌పూర్, బార్మర్, చిత్తోర్‌గర్, శ్రీ గంగానగర్ (రాజస్థాన్), నివారి, శివపురి (మధ్యప్రదేశ్) జిల్లాల్లో 10 చోట్ల నియంత్రణ కార్యకలాపాలు నిర్వహించాయి. మధ్యప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ శాఖ సత్నా, బాలాఘాట్, నివారి, రైసన్, శివపురి జిల్లాల్లో ఒక్కొక్కటి చొప్పున 5 ప్రదేశాలలో నియంత్రణ కార్యకలాపాలను చేపట్టింది. పంట నష్టం జరగలేదు.
2020 మే 11 వ తేదీన మిడుత నియంత్రణ కార్యకలాపాలు ప్రారంభమైనప్పటి నుండి 2020 మే 28 వరకు 53,997 హెక్టార్లలో 377 ప్రదేశాలలో చర్యలు చేపట్టారు. మిడుత నియంత్రణ పరిధిలో ఉన్న జిల్లాలు - రాజస్థాన్ - 22, ఎంపి - 24, గుజరాత్ - 2, పంజాబ్ - 1 , యుపి - 2, మహారాష్ట్ర -3.
అన్ని రాష్ట్రాలు మరియు యుటిల ముఖ్యకార్యదర్శులు (వ్యవసాయం) పాల్గొన్న వీడియో కాన్ఫరెన్స్ కి కార్యదర్శి (వ్యవసాయం, సహకారం మరియు రైతు సంక్షేమం) శ్రీ సంజయ్ అగర్వాల్ అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో, మిడుత దాడి తాజా స్థితి, నియంత్రణ గురించి అన్ని రాష్ట్రాలు, యుటిలకు సమాచారం ఇచ్చారు.
మిడుత నియంత్రణ పనులలో నిమగ్నమైన సిబ్బందికి రాష్ట్రాల మధ్య తిరిగే సౌకర్యాన్ని క్రమబద్ధీకరించడానికి అవసరమైన సూచనలు చేస్తూ 27.05.2020 న అన్ని రాష్ట్రాల / యుటిల ప్రధాన కార్యదర్శులకు కేంద్ర హోం కార్యదర్శి ఒక లేఖ రాశారు. ఎస్డిఆర్ఎఫ్, ఎన్డిఆర్ఎఫ్ కింద సహాయం అందించేందుకు హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ కొన్ని నిబంధనలు జారీ చేసింది.
*****
(Release ID: 1627846)