భూ శా స్త్ర మంత్రిత్వ శాఖ

భారీ పెను తుఫాను ‘ఆంఫాన్’ (గం.2030 ఐ.ఎస్.టి.) వాయుగుండంగా మారి బంగ్లాదేశ్ పై కేంద్రీకృత‌మైంది

Posted On: 21 MAY 2020 9:00PM by PIB Hyderabad

తీవ్ర వాయుగుండం [సూపర్ సైక్లోనిక్ తుఫాను ‘ఆంఫాన్’] గత 06 గంటలలో 07 కిలోమీటర్ల వేగంతో కొద్దిగా ఉత్తరం వైపుకు కద‌లాడింది. ఇది మరింతగా బలహీనపడి గురువారం (21వ తేదీ) భార‌త ప్రామాణిక కాల‌మానం ప్ర‌కారం 1730 గంట‌లకు ( 25.4° ఉత్త‌ర అక్షాంశం మరియు 89.6° తూర్పు రేఖాంశాల‌కు సమీపంలో కోల్‌క‌తా న‌గ‌రానికి ఉత్తర-ఈశాన్యం దిశ‌గా  350 కిలోమీటర్ల దూరంలో, ధుబ్రీ కి దక్షిణ-నైరుతీ దిశగా 70 కిలోమీటర్ల దూరంలో మరియు బంగ్లాదేశ్ లోని రంగాపూర్ కు తూర్పు-ఆగ్నేయంగా 50 కిలోమీటర్ల దూరంలో)  బంగ్లాదేశ్ పై వాయుగుండంగా కేంద్రీకృతమయ్యింది. వచ్చే 12 గంటల్లో ఉత్తర-ఈశాన్యదిశగా ఇది పయనించి మరింతగా బలహీనపడే అవకాశం ఉంది. 

వచ్చే 12 గంటల్లో ఉత్తర-ఈశాన్యదిశగా పయనించి ఇది మరింత బలహీనపడే అవకాశం ఉంది.  

(1)   భారీ వర్షపాతం హెచ్చరిక :
అస్సాం & మేఘాలయ :
రానున్న 12 గంటల్లో పశ్చిమ అస్సాం లో చాలా చోట్ల తేలికపాటి నుండి ఓ మోస్త‌రు వర్షాలు, అక్కడక్కడ‌ భారీ నుండి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది.  మేఘాలయ లో అక్కడక్కడ‌ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
అరుణాచ‌ల్‌ప్ర‌దేశ్ః
రానున్న 12 గంటల్లో చాలా చోట్ల‌ తేలికపాటి నుంచి ఓ మోస్త‌రు వర్షాలు, అక్కడక్కడా భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఎక్కువ‌గా ఉంది.

(2)   గాలుల హెచ్చరిక :
రానున్న 12 గంటల్లో పశ్చిమ అస్సాం & పశ్చిమ మేఘాలయ లలో గంటకు 30-40 కిలోమీటర్ల నుండి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది.  ఆ తర్వాత ఇది క్రమంగా బ‌లహీన‌ప‌డ‌నుంది.

వాతావరణ పరిస్థితిపై తాజా సమాచారం కోసం దయచేసి ఈ కింది వెబ్ సైట్ లను చూడండి :

 www.rsmcnewdelhi.imd.gov.in      

 www.mausam.imd.gov.in

 గ్రాఫిక్స్ ద్వారా తాజా సమాచారం కోసం దయచేసి ఈ లింక్ ను క్లిక్ చేసి చూడండి.  

 

 

 

****



(Release ID: 1625976) Visitor Counter : 163


Read this release in: English , Urdu , Tamil