గణాంకాలు- కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ

2020 మార్చి నెలలలో పారిశ్రామిక ఉత్పత్తి మరియు వినియోగ ఆధారిత సూచిక యొక్క శీఘ్ర అంచనాలు (బేస్ 2011-12 = 100 )

Posted On: 12 MAY 2020 5:32PM by PIB Hyderabad

పారిశ్రామిక ఉత్పత్తి సూచిక (ఐ.ఐ.పి) యొక్క శీఘ్ర అంచనాలు ప్రతి నెల 12వ తేదీన (లేదా మునుపటి పనిదినం) ఆరు వారాల లాగ్ తో విడుదల చేయబడతాయి. సోర్స్ ఏజెన్సీల నుంచి అందుకున్న సమాచారంతో వీటిని సంకలనం చేస్తారు. వారు ఉత్పత్తి చేసే  కర్మాగారాలు / సంస్థల నుంచి డేటాను స్వీకరిస్తారు. మార్చి 2020 నుంచి కోవిడ్ -19 మహమ్మారి నేపథ్యంలో దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలు చేసిన పర్యవసానంగా, ఉత్పత్తి యూనిట్ల నుంచి ఈ సమాచార ప్రవాహం ప్రభావితమైంది. ఇంకా కొన్ని కార్యకలాపాలు తిరిగి ప్రారంభించకపోవడం వల్ల, ఈ యూనిట్లలో ప్రతిస్పందన రేటు సాధారణం కంటే తక్కువగా ఉంది. ఫలితంగా త్వరిత అంచనాలు తిరిగి సరిచూసే అవకాశం ఉంది. అంతే గాకుండా ఐ.ఐ.పి. యొక్క తిరిగి సరిచూసే విధానం ప్రకారం తదుపరి విడుదలలో చేర్చబడుతుంది.

2. 2020 మార్చి నెలలో, 2011-12 బేస్ కలిగిన పారిశ్రామిక ఉత్పత్తి సూచిక (ఐ.ఐ.పి) యొక్క శీఘ్ర అంచనాలు 120.1 వద్ద ఉన్నాయి. మైనింగ్, తయారీ మరియు విద్యుత్ రంగాలకు పారిశ్రామిక ఉత్పత్తి సూచికలు 2020 మార్చి నెలలో వరుసగా 132.7, 114.8 మరియు 149.2 ఉన్నాయి. (స్టేట్ మెంట్ - I).

3. వినియోగ-ఆధారిత వర్గీకరణ ప్రకారం, సూచికలు ప్రాథమిక వస్తువులకు 135.6, మూలధన వస్తువులకు 76.4, ఇంటర్మీడియట్ వస్తువులకు 125.8 మరియు మార్చి 2020 నెలలో మౌలిక సదుపాయాలు / నిర్మాణ వస్తువులు 118.4 (స్టేట్ మెంట్ III) వద్ద ఉన్నాయి. ఇంకా, సూచికలు కన్జ్యూమర్స్ డ్యూరబుల్స్ మరియు కన్జ్యూమర్ నాన్-డ్యూరబుల్స్ 2020 మార్చి నెలలో వరుసగా 88.1 మరియు 131.2 వద్ద ఉన్నాయి.

4. వివిధ రంగాల వద్ద పారిశ్రామిక ఉత్పత్తి సూచిక యొక్క శీఘ్ర అంచనాలను ఇచ్చే ప్రకటనలు, జాతీయ పారిశ్రామిక వర్గీకరణ (ఎన్‌.ఐ.సి -2008) యొక్క 2-అంకెల స్థాయి మరియు మార్చి 2020 నెలలో వినియోగ-ఆధారిత వర్గీకరణ ద్వారా, సంబంధిత నెలలో వృద్ధి రేటుతో పాటు సంచిత సూచికలతో సహా మునుపటి సంవత్సరంలోని అంశం సమూహ స్థాయి సమాచారం ప్రచారం చేయబడదు.

5. మార్చి 2020 నాటి ఐ.ఐ.పి. శీఘ్ర అంచనాలతో పాటు, ఫిబ్రవరి 2020 నాటి సూచికలు మొదటి పునర్విమర్శకు గురయ్యాయి మరియు 2019 డిసెంబర్ కోసం సూచించినవి సోర్స్ ఏజెన్సీల నుండి స్వీకరించబడిన నవీకరించబడిన డేటా వెలుగులో చివరగా తిరిగి సరిచూడబడ్డాయి. మార్చి, 2020 నాటి శీఘ్ర అంచనాలు 73 శాతం బరువు గల ప్రతిస్పందన రేటుతో సంకలనం చేయబడ్డాయి, 2020 ఫిబ్రవరిలో మొదట తిరిగి సరిచూడడంలో బరువు స్పందన రేటు 88 శాతం మరియు డిసెంబర్, 2019 చివరగా తిరిగి సరిచూసిన రేటు 94 శాతం ఉంది. .

 

6. 2020 జూన్ 12 శుక్రవారం నాడు ఏప్రిల్ 2020 కోసం ఇండెక్స్ విడుదల చేశారు.

 

గమనిక: -

1. ఈ పత్రికా ప్రకటన సమాచారం మంత్రిత్వ శాఖ యొక్క వెబ్‌సైట్‌లో కూడా అందుబాటులో ఉంది - http://www.mospi.nic.in

2. హిందీలో పత్రికా ప్రకటన ఇక్కడ అందుబాటులో ఉంటుంది: http://mospi.nic.in/hi    

 

--


(Release ID: 1623363) Visitor Counter : 310