ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రిత్వ శాఖ

కోవిడ్-19 మహమ్మారి విజృంభిస్తున్న, అనిశ్చితి సమయంలో ఏకీకృత శీతల గిడ్డంగుల నెట్ వర్క్ ప్రాముఖ్యతను నొక్కి చెప్పిన శ్రీమతి హర్ సిమ్రత్ కౌర్ బాదల్.

Posted On: 06 MAY 2020 6:59PM by PIB Hyderabad

తొందరగా పాడైపోయే ఉత్పత్తులను  నిల్వచేసుకోడానికి, పండ్లు, కూరగాయాలు ఏడాది పొడవునా అందుబాటులో ఉండడానికీ శీతల గిడ్డంగుల మౌలిక సదుపాయాలు  వెన్నుముకగా నిలుస్తాయని  కేంద్ర ఎఫ్.పి.ఐ. శాఖ మంత్రి శ్రీమతి హర్ సిమ్రత్ కౌర్ బాదల్ పేర్కొన్నారు.  ఎమ్.ఓ.ఎఫ్.ఫై.ఐ.  మద్దతు ఉన్న కోల్డ్ చైన్ ప్రోజెక్టుల ప్రోమోటర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో కేంద్రమంత్రి మాట్లాడుతూ, కోవిడ్-19 మహమ్మారి విజృంభిస్తున్న, ప్రస్తుత అనిశ్చితి సమయంలో ఆహార ప్రాసెసింగ్ సంస్థల ప్రాముఖ్యత గురించి ముఖ్యంగా ఏకీకృత శీతల గిడ్డంగుల నెట్ వర్క్ ప్రాముఖ్యత గురించి నొక్కి చెప్పారుఅనిశ్చితి పరిస్థితుల నుంచి కాపాడడంతో పాటు, మార్కెట్ ధరల స్థిరీకరణకు ఇది దోహదపడుతుంది. ఎక్కువగా ఉన్న వ్యవసాయ ఉత్పత్తులను స్వీకరించడానికి ఆహార ప్రాసెసింగ్ పరిశ్రమకు అవకాశం ఉంటుంది. తద్వారా రైతులకు ప్రయోజనం కలుగుతుంది. అదే సమయంలో, పంటను విలువ ను పెంచి ప్రాసెస్ చేసిన ఉత్పత్తులుగా మారిస్తే దేశీయ డిమాండ్ తో పాటు విదేశీ డిమాండు ను కూడా తీర్చడానికి అవకాశం ఉంటుంది

హర్యానా, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్, జమ్మూ కశ్మీర్ రాష్ట్రాలలోని ఆహార ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రిత్వశాఖ మద్దతుతో ఉన్న ఏకీకృత శీతల గిడ్డంగుల చైన్ ప్రోజెక్టుల ప్రమోటర్లతో పాటు ఎమ్.ఓ.ఎఫ్.పి.ఐ. శాఖ సహాయమంత్రి శ్రీ రామేశ్వర్ తేలి ఈ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు ఎఫ్.పి.ఐ. ల నిర్వహణ ఎటువంటి ఒడిడుకులు లేకుండా సజావుగా సాగడానికి ఎమ్.ఓ.ఎఫ్.పి.ఐ. మద్దతుతో ఉన్న ప్రమోటర్లతో కేంద్ర ఎఫ్.పి.ఐ. కేంద్ర మంత్రి నిర్వహిస్తున్న వీడియో కాన్ఫెరెన్స్ ల పరంపరలో ఇది రెండవ సమావేశం

ఐదు రాష్ట్రాలలోని 38 శీతల గిడ్డంగుల చైన్ ప్రాజెక్ట్స్ ప్రమోటర్లు ఈ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు.  వారు కేంద్రం మంత్రి మాట్లాడుతూ, తమ అనుభవాలను పంచుకున్నారు, తమ ప్రాజెక్టులు పూర్తిచేయడంలో ఎదుర్కొంటున్న సమస్యల గురించి వివరించారు. లాక్ డౌన్ సమయంలో శీతల గిడ్డంగుల చైన్ ప్రాజెక్టులు నిర్వహించడంలో ఎదుర్కొంటున్న కష్టాలుసమస్యల గురించి కూడా వారు, మంత్రికి తెలియజేశారు. 

 మండేలా దగ్గర భారీ రద్దీని తగ్గించడం కోసం పని చేసే గంట్లను స్థానిక ప్రభుత్వాలు తగ్గిస్తూ తీసుకున్న నిర్ణయం పట్ల ప్రమోటర్లు తమ ఆందోళన వ్యక్తం చేశారు. పరిమితమైన గంటలు మాత్రమే పనిచేయడం వలన సేకరణ ప్రక్రియ మందగిస్తోందనీ, తద్వారా రైతులు ఎక్కువసేపు మండీల వద్ద క్యూలలో వేచి ఉండవలసి వస్తోందని వారు తెలియజేశారు. మండీల వద్ద జాప్యం పాడై పోయే వస్తువుల నాణ్యత పై ప్రభావం చూపుతోందనీ, ఫలితంగా ధర పడిపోవడంతో పాటు, కొన్ని సందర్భాల్లో ఉత్పత్తులు పూర్తిగా పాడైపోతున్నాయనీ కూడా వారు పేర్కొన్నారు. ఇటీవల పండించిన పండ్లు, కూరగాయల సరఫరాలో అంతరాయం లేకుండా చూసేందుకు మండీలు 24 గంటలూ పనిచేసేలా చూడాలని వారు విజ్ఞప్తి చేశారు.

ప్రాసెస్ చేసిన ఆహార పదార్ధాలను ఎగుమతి చేసే ప్రమోటర్లు మాటాడుతూ, విదేశీ (నౌక / విమాన) రవాణా చార్జీలు పెంచడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. ఫలితంగా అంతర్జాతీయ మార్కెట్లో తమ ఉత్పత్తుల డిమాండ్ తాగుతోందని పేర్కొన్నారు.  రవాణా చార్జీలు 30 శాతం మేర పెరిగాయని వారు చెప్పారు. దేశ, విదేశాలలో తమ ఉత్పత్తుల రవాణాకు సబ్సిడీ కల్పించాలని వారు అధికారులను అభ్యర్ధించారు. అప్పుడు స్వదేశీ పరిశ్రమలు అంతర్జాతీయ పోటీలో నిలబడగలుగుతాయని వారు పేర్కొన్నారు 

కోవిడ్ వ్యాధి వ్యాప్తి కారణంగా దేశీయంగా డిమాండ్ తగ్గినందువల్ల, తమకు విద్యుత్ చార్జీల్లో సబ్సిడీ ఇవ్వాలని, శీతల గిడ్డంగుల చైన్ రంగానికి చెందిన ప్రతినిధులు ఏకగ్రీవంగా విజ్ఞప్తి చేశారు.  శీతల గిడ్డంగులకు చెందిన ప్లాంట్ కంప్రెసర్లు 24 గంటలూ పనిచేయాలని, ఏ సమయంలోనూ వాటిని ఆపడానికి కుదరదనీ వారు వివరించారు.  గత కొన్ని రోజులుగా శీతల గిడ్డంగుల నుండి బయటకు, లోపలకు పాడైపోయే వస్తువుల కదలికలు బాగా తగ్గాయని వారు చెప్పారు.  ద్రవ్య లిక్విడిటీ అందుబాటులో లేకపోవడంతో ఉద్యోగులకు, కార్మికులకు జీతాలు, వేతనాలు చెల్లించడానికి ఇబ్బంది కలిగిందనీ, అందువల్ల విద్యుత్ చార్జీల్లో సబ్సిడీ ఇవ్వలనీ, రుణాలపై వడ్డీ ఉపసంహరించాలనీ ప్రమోటర్లు కోరారు. 

ఇంతవరకు పైన పేర్కొన్న విషయాలతో పాటు, ఈ వీడియో కాన్ఫరెన్స్ లో కేంద్రమంత్రి చర్చించిన మరికొన్ని విషయాలు : 

     1.      ముడి సరకుల లభ్యత వాటి అధిక ధరలు

     2.     కార్యకలాపాలపై లాక్ డౌన్ ప్రభావం. 

     3.     కార్మికులు మరియు రవాణా సమస్యలు

     4.     అధిక ఇన్వెంటరీ వ్యయం. 

     5.     రైతులకు చెల్లించవలసి ఉన్నందున ద్రవ్య సంక్షోభం. 

****


(Release ID: 1621632) Visitor Counter : 248