హోం మంత్రిత్వ శాఖ

సిఆర్‌పిఎఫ్ లో నేరుగా నియమితులైన గెజిటెడ్ అధికారుల 51 వ బ్యాచ్ ఇ-పాప్ వేడుక

జాతి నిర్మాణం, అంతర్గత భద్రతలో మీ పాత్ర చాల గొప్పదిగా ఉంటుందన్న విశ్వాసం నాకుంది: శ్రీ అమిత్ షా

దేశ అంతర్గత భద్రతకు సిఆర్‌పిఎఫ్ వెన్నుముక వంటిది : హోం మంత్రి

కోవిడ్-19 మహమ్మారిపై పోరాటంలో సిఆర్‌పిఎఫ్ దేశంలో అత్యున్నత సేవలను అందిస్తోంది: హోంశాఖ సహాయ మంత్రి శ్రీ జి.కిషన్ రెడ్డి

Posted On: 24 APR 2020 3:13PM by PIB Hyderabad

సిఆర్‌పిఎఫ్ లో నేరుగా నియమితులైన 51వ బ్యాచ్  గెజిటెడ్ అధికారుల పాసింగ్ అవుట్ పెరేడ్ (ఈ-పాప్) ఢిల్లీలో ఈ రోజు నిర్వహించారు. ప్రాథమికంగా శిక్షణ పూర్తి చేసుకొన్న 42 మంది ట్రైనీలు పాల్గొన్న ఈ కార్యక్రమం ఆన్ లైన్ ద్వారా వీడియో కాన్ఫరెన్స్ లో నిర్వహించారు. దీనిలో కచ్చితమైన సామజిక దూరాన్ని పాటించారు. హోం మంత్రి శ్రీ అమిత్ షా పంపిన సందేశాన్ని సిఆర్‌పిఎఫ్ డైరెకర్ ఏపి మహేశ్వరి చదివి వినిపించారు. 

  

24.04.2020 HM message at e-PoP CRPF.jpeg

 

శిక్షణ పూర్తి చేసుకున్నాక మీరు ఒక స్థాయిలో పరిపక్వతను సాధించారని  నేను విశ్వసిస్తున్నాను. దీని ద్వారా మీ విధి నిర్వహణఅప్పగించిన కార్యాన్ని సమర్థవంతంగా నిర్వహించడంలో  అనేక సవాళ్ళను ఎదుర్కోన్నా వాటిని పూర్తి చేస్తారు అని హోం మంత్రి తన సందేశంలో తెలిపారు. 

దేశ భద్రతకు సిఆర్‌పిఎఫ్ చేసిన అపారమైన సేవలునిర్వహించిన పాత్రను ప్రశంసించిన శ్రీ షాఈ దళాలు  దేశ అంతర్గత భద్రతకు వెన్నెముక వంటివని అభివర్ణించారు. సిఆర్‌పిఎఫ్‌కు చెందిన 2200 మందికి పైగా ధైర్యసాహసాలతో వీర మరణం  పొందిన అమరవీరులకు ఆయన నివాళులు అర్పించారు. హోంమంత్రి ట్రైనీ అధికారులను ఉద్దేశించి, “ఈ రోజు కొత్తగా నియమించబడిన అధికారులు సిఆర్‌పిఎఫ్‌లోకి కొత్త శక్తిని ఇస్తారని నాకు నమ్మకం ఉంది. ముందు నుండి నడిపించడం ద్వారా మీ నాయకత్వంలోని సైనికులకు మీరు స్ఫూర్తివంతమైనసమర్థవంతమైన నాయకత్వాన్ని అందిస్తారని నేను ఆశిస్తున్నాను ” అని తన సందేశంలో ఆశాభావం వ్యక్తం చేసారు. నిజాయితీతోఅంకితభావంతో మీరందించే సేవలు మీకు మంచి పేరును తెచ్చిపెడతాయని శ్రీ అమిత్ షా అన్నారు. దేశ సమైక్యతసమగ్రతసార్వభౌమత్వం కాపాడుతున్న దళాల సంప్రదాయాన్ని కొనసాగించాలని ఆకాంక్షించారు. జాతి నిర్మాణంఅంతర్గత భద్రత కాపాడడంలో తమ వంతు పాత్ర నిర్వహించాలనే నమ్మకం నాకు ఉందని  హోం మంత్రి ఆశాభావం వ్యక్తం చేస్తూ వారి కుటుంబాలకు అభినందనలు తెలియజేసారు.

వీడియో కాన్ఫెరెన్ ద్వారా హోం శాఖ సహాయ మంత్రి శ్రీ జి.కిషన్ రెడ్డి మాట్లాడుతూ  నేరుగా నియమితులైన గెజిటెడ్ అధికారులను అభినందించారు. దేశం కోసం ప్రాణాలర్పించిన 2,200 మంది  సిఆర్‌పిఎఫ్ జవాన్లకు జాతి నివాళు అర్పిస్తుందని అన్నారు. 

 

ఇక్కడ పొందిన శిక్షణ ద్వారా నైతికతను మరింత పెంచుతుందనిసిఆర్‌పిఎఫ్ దళాలకు అది బలం పెంపొందిస్తుందని హోం శాఖ సహాయ మంత్రి తెలిపారు. కోవిడ్-19 పై చేస్తున్న యుద్ధంలో  సిఆర్‌పిఎఫ్ దేశానికి అందిస్తున్న సేవలు అత్యుత్తమ మైనవని కొనియాడారు. 

 

సిఆర్‌పిఎఫ్ సిబ్బంది ఎక్కడ మోహరించినా ప్రజల నమ్మకంవిశ్వాసాన్ని ఎప్పుడూ గెలుచుకుంటారని శ్రీ రెడ్డి అన్నారు. నక్సలైట్ తిరుగుబాటుఈశాన్యంలో వేర్పాటువాదం,  పంజాబ్జమ్మూ కశ్మీర్ లో ఉగ్రవాదాన్ని విజయవంతంగా ఎదుర్కోవడంలోమన దళాలు ముఖ్యమైన పాత్ర పోషించాయని శ్రీ కిషన్ రెడ్డి అన్నారు.

అయిదుగురు పోస్ట్ గ్రాడ్యుయేట్లు, 21 మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లుఇద్దరు వైద్యులుఇద్దరు లా గ్రాడ్యుయేట్లు సహా 42 మంది ట్రైనీ అధికారులు ఈ రోజు అకాడమీ నుండి ఉత్తీర్ణులయ్యారుఒక సంవత్సరం కఠినమైన శిక్షణ తీసుకున్నారు. ఈ సందర్భంగా ట్రైనీ అధికారులకు అవార్డులుట్రోఫీలు అందజేశారు.

*****


(Release ID: 1617945) Visitor Counter : 200