వ్యవసాయ మంత్రిత్వ శాఖ

దిగ్బంధం వేళ వ్యవసాయం-అనుబంధ కార్యకలాపాలను

ప్రోత్సహించేందుకు వ్యవసాయ-సహకార-రైతుసంక్షేమ శాఖ చర్యలు
అఖిల భారత వ్యవసాయ రవాణా సహాయ కేంద్రం ప్రారంభం;
పీఎంబీఎఫ్‌వై కింద 12 రాష్ట్రాల్లో రైతులకు రూ.2,424 కోట్లు పంపిణీ;
కేసీసీ కింద 18.26 లక్షల దరఖాస్తులపై రూ.17,800 కోట్ల రుణాలు మంజూరు

Posted On: 15 APR 2020 7:23PM by PIB Hyderabad

జాతీయ దిగ్బంధం నేపథ్యంలో దేశవ్యాప్తంగా వ్యవసాయం, అనుబంధ రంగ కార్యకలాపాలను ప్రోత్సహించేందుకు కేంద్ర వ్యవసాయ-సహకార-రైతు సంక్షేమ శాఖ అనేక చర్యలు చేపట్టింది. దీనికి సంబంధించి తాజా వివరాలివే:

  1. పంట కోతలు, విత్తనాల సీజన్‌ దృష్ట్యా కేంద్రం ప్రభుత్వం మినహాయింపు ఇచ్చిన వ్యవసాయ కార్యకలాపాలు కిందివిధంగా ఉన్నాయి:
  1. కనీస మద్దతుధర కార్యకలాపాలుసహా వ్యవసాయోత్పత్తుల సేకరణలోగల సంస్థలు;
  2. పొలాల్లో రైతులు, రైతు కూలీలు చేసుకునే వ్యవసాయ పనులు;
  3. వ్యవసాయ మార్కెట్‌ కమిటీలు లేదా రాష్ట్ర ప్రభుత్వ అనుమతిగల ‘మండీలు’,
  4. రాష్ట్ర/కేంద్రపాలిత ప్రభుత్వాల అనుమతితో రైతులు/సహకారసంఘాల నుంచి నేరుగా వ్యవసాయోత్పత్తులు కొనుగోలుచేసే ‘టోకు మండీలు’;
  5. విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల తయారీ, ప్యాకేజింగ్‌ సంస్థలు; చిల్లర దుకాణాలు;
  6. వ్యవసాయ యంత్రాలు, పరికరాలు అద్దెకు ఇచ్చే సంప్రదాయ కిరాయి కేంద్రాలు;
  7. రాష్ట్రంలో, రాష్ట్రాలమధ్య పంటకోతలుసహా ఇతర కార్యకలాపాలకు వాడే యంత్రాల సంచారం;
  • viii. శీతల-సాధారణ గిడ్డంగుల సేవలు;
  1. ఆహార ఉత్పత్తుల ప్యాకింగ్‌ సామగ్రి తయారీ సంస్థలు;
  2. నిత్యావసర వస్తు రవాణా;
  3. వ్యవసాయ యంత్రాలు, విడిభాగాలు (టోకు సరఫరా సంస్థలుసహా), మరమ్మతు దుకాణాలు;
  4. కార్మికుల గరిష్ఠ సంఖ్య 50 శాతం మించకుండా తేయాకు (తోటలుసహా) పరిశ్రమ.
  1. పండ్లు-పూలు, కూరగాయలుసహా నశ్వర ఉత్పత్తుల సత్వర రవాణా నిమిత్తం 1800-180-4200; 14488 నంబర్లతో “అఖిలభారత వ్యవసాయ-రవాణా సహాయ కేంద్రాన్ని ఇవాళ కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి ప్రారంభించారు. జాబితాలోని ఉత్పత్తుల రవాణాలో సమస్యలు ఎదురైనపుడు ఈ సహాయ కేంద్రానికి ఫోన్‌చేస్తే పరిష్కారం లభిస్తుంది.
  2. దేశంలో ఏప్రిల్‌ 24న దిగ్బంధం మొదలయ్యాక ప్రధానమంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి పథకం కింద 8.46 కోట్ల మంది రైతులకు రూ.16,927 కోట్లు విడుదల.
  3. ప్రధానమంత్రి గరీబ్‌ కల్యాణ్‌ యోజన కింద రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు 5,516 టన్నుల పప్పు దినుసుల సరఫరా.
  4. నిత్యావసరాలుసహా నశ్వర ఉత్పత్తుల రవాణాకు 67 మార్గాల్లో 236 ప్రత్యేక పార్శిల్‌ రైళ్లను నడుపుతున్న రైల్వేశాఖ.
  5. అత్యున్నత గుర్తింపుగల నర్సరీల ధ్రువీకరణను 2020 సెప్టెంబర్‌ 30దాకా పొడిగించిన ఎన్‌హెచ్‌బి.
  6. రాష్ట్రంలో లేదా రాష్ట్రాల మధ్య వలసకు వీలున్న తేనెటీగల పెంపకానికి అనుమతి
  7. ప్రధానమంత్రి పంటల బీమా పథకంకింద 12రాష్ట్రాల్లో రైతులకు రూ.2,424కోట్ల పంపిణీ.
  8. బంగారం తాకట్టు రుణాలు, వ్యవసాయ రుణాలను కిసాన్‌ క్రెడిట్‌ కార్డు ఖాతాలుగా మార్చుకునే గడువు 31.03.2020 నుంచి 31.05.2020కి పొడిగింపు.
  9. పొడిగించిన రుణాల చెల్లింపు గడువు 31.05.2020లోగా లేదా వాస్తవ గడువు... ఏది ముందైతే ఆ తేదీనాటికి చెల్లింపు పూర్తయితే బ్యాంకులకు 2 శాతం, సకాలంలో చెల్లింపులకు రైతులకు ప్రోత్సాహకం కింద 3 శాతం వంతున వడ్డీ రాయితీ.
  10. కిసాన్‌ క్రెడిట్‌ కార్డుల సంతృప్తత సాధనలో భాగంగా పీఎం-కిసాన్‌ లబ్ధిదారుల నుంచి 83లక్షల దరఖాస్తులు రాగా, 18.26లక్షల దరఖాస్తులపై రూ.17,800కోట్లు మంజూరు.
  11. రబీ-2020లో రూ.606.52 కోట్ల కనీస మద్దతు ధరతో 1,24,125 టన్నుల పప్పులు-నూనెగింజల కొనుగోలుద్వారా 91,710 మంది రైతులకు లబ్ధి.
  12. ఈ-నామ్‌ వేదిక ఆధారంగా జాతీయ స్థాయిలో 7.76 లక్షల ట్రక్కులు, 1.92 లక్షల రవాణాదారులతో సాముదాయక రవాణా సౌకర్యం కల్పన
  13. వ్యవసాయ, ఆహార ఉత్పత్తుల రవాణా సంబంధిత సమస్యల పరిష్కారానికి అపెడా (APEDA) చొరవ; ప్రధాన ఉత్పత్తుల ఎగుమతి ప్రారంభం.
  14.  గోధుమ మిగులు ఉత్పత్తి నేపథ్యంలో నాఫెడ్‌ ద్వారా ఆఫ్ఘనిస్థాన్‌కు 50వేల టన్నులు, లెబనాన్‌కు 40వేల టన్నుల వంతున ఎగుమతి.
  15. ఎగుమతి-దిగుమతి సంబంధ ధ్రువీకరణపత్రాల డిజిటల్‌ నకళ్ల సమర్పణకు అనుమతి.
  16. ఎగుమతులకు 9,759 ధ్రువీకరణ పత్రాల జారీ, దిగుమతులపై 2,728 నకళ్ల స్వీకరణ  ద్వారా సరకుల విడుదల
  17. కోవిడ్‌-19 నేపథ్యంలో అనుమతుల చెల్లుబాటు ముగిసిన వివిధ సంస్థలకు గడువు పొడిగింపు
  18. పురుగుమందుల దిగుమతులకు 33, ఎగుమతులకు 309, దేశీయంగా తయారీకి 1,324 వంతున అనుమతులు మంజూరు.
  19. ఖరీఫ్‌-2020 సీజన్‌ కోసం అఖిలభారత స్థాయిలో విత్తన అవసరాల అంచనాలను వివిధ భాగస్వాములకు అందజేసిన ప్రభుత్వం. దిగ్బంధం సమయంలో ఉత్తర భారత రాష్ట్రాల్లో 2.70 లక్షల క్వింటాళ్ల తృణధాన్యాలు, చిరుధాన్యాలు, పప్పుదినుసుల విత్తనాలతోపాటు 42.50 లక్షల ప్యాకెట్ల పత్తివిత్తనాల రవాణా.

*****



(Release ID: 1614959) Visitor Counter : 245