మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ

కోవిడ్ -19 నేపథ్యంలో దేశవ్యాప్తంగా పలు విశ్వ విద్యాలయాలు, కళాశాలలు మరియు పాఠశాల అధిపతులు, ఉపాధ్యాయులు, విద్యార్థులతో వీడియా కాన్ఫరెన్స్ ద్వారా సంభాషించిన కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి

కోవిడ్ -19కు వ్యతిరేకంగా జరుగుతున్న యుద్ధంలో చురుకైన పాత్ర పోషిస్తున్నందుకు ఉపాధ్యాయులు, విద్యార్థులకు అభినందనలు తెలిపిన కేంద్ర మంత్రి

ఇబ్బందికర పరిస్థితుల్ల విద్యార్థులు మరియు ఉపాధ్యాయులతో మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ దేశానికి అండగా నిలబడుతుందన్న శ్రీ రమేష్ ఫోఖ్రియాల్ నిశాంక్

Posted On: 03 APR 2020 8:40PM by PIB Hyderabad

కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి శ్రీ రమేష్ ఫోఖ్రియాల్ నిశాంక్, ప్రపంచంతో పాటు దేశాన్ని ప్రభావితం చేస్తున్న కరోనా వైరస్ వ్యాప్తి, నివారణ చర్యల గురించి దేశ వ్యాప్తంగా ఉన్న పలు విశ్వవిద్యాలయాలు, కళాశాలలు మరియు పాఠశాలల అధిపతులు, విద్యార్థులు, ఉపాధ్యాయులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సంభాషించారు.

కేంద్ర మంత్రి వీరి సమస్యలు వినడమే కాకుండా, ఈ అంటువ్యాధి పై పోరాడేందుకు ప్రభుత్వం తీసుకున్న చర్యల గురించి ప్రజలకు అవగాన కల్పించడంలో వారి చురుకైన పాత్రకు ధన్యవాదాలు తెలిపారు. దేశవ్యాప్తంగా 800 మందికి పైగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా  ఈ సమావేశంలో పాల్గొన్నారు.

వైరస్ వ్యాప్తికి వ్యతిరేకంగా సాగుతున్న పోరాటంలో విశేషంగా సహకరించిన 1000 విశ్వవిద్యాలయాలు, 45 వేల కళాశాలలు, 1.5. మిలియన్ల మంది విద్యార్థులు, కోటికి పైగా ఉపాధ్యాయులు, అదే విధంగా దేశంగా వ్యాప్తంగా కృషి చేసిన 3.3 కోట్లకు పైగా విద్యార్థులు చేస్తున్న కృషిని శ్రీ నిశాంక్ ప్రశంసించారు.  ఈ సంక్షోభ సమయంలో ప్రజలందరూ అపూర్వమైన సహనాన్ని చూపించడమే కాకుండా, అవసరమైన జాగ్రత్తలు తీసుకోవడానికి మరియు కోవిడ్ -19ను ఎదుర్కోనే దిశగా ఆరోగ్యంగా ఉండేలా ప్రజల్లో అవగాహన కల్పించాలని సూచించారు.

దేశంలో ఇంత తక్కువ సమయంలో ఆన్ లైన్ విద్యా వ్యవస్థ ప్రారంభించబడిందంటే అది కేవలం ఉపాధ్యాయుల నిబద్ధత ఫలితమేనని, దీని ద్వారా లక్షలాది మంది విద్యార్థులు ప్రయోజనం పొందుతున్నారని కేంద్ర మంత్రి తెలిపారు. కరోనా వైరస్ పై పోరాటంలో ఉపయోగించుకునేందుకు వైద్య పరికరాలు తయారు చేయడంలో పరిశోధన చేసినందుకు గాను దేశవ్యాప్తంగా ఉన్న ఐ.ఐ.టి.లతో సహా అన్ని ఉన్నత విద్యా సంస్థలను శ్రీ ఫోక్రియాల్ అభినందించారు.

ఉపాధ్యాయులు మరియు విద్యార్థుల సమస్యల గురించి శ్రీ ఫోఖ్రియాల్ కూడా ఓపికగా విన్నారు. విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి మంత్రిత్వ శాఖ అన్ని చర్యలు తీసుకుంటుందని మంత్రి అందరికీ హామీ ఇచ్చారు. వారు లేదా వారి కుటుంబంలో ఎవరైనా దురదృష్టవశాత్తు అనారోగ్యానికి గురైతే వారు తమ ప్రిన్సిపల్ లేదా వైస్ ఛాన్సలర్ ను సంప్రదించాలని ఉపాధ్యాయులందరికీ ఆయన హామీ ఇచ్చారు. ఇలాంటి వారికి అన్ని రకాల వైద్య సహాయాన్ని మంత్రిత్వ శాఖ అందిస్తుందని కేంద్ర మంత్రి హామీ ఇచ్చారు.

ఉపాధ్యాయులు, విద్యార్థులు అందరూ ఆయుష్ మంత్రిత్వ శాఖ జారీ చేసిన సలహాలను పాటించాలని, ఇతరులు దీనిని అనుసరించేందుకు అవగాన తీసుకురావాలని మంత్రి పిలుపునిచ్చారు. నేటి విద్యార్థులు రేపటి భవిష్యత్తు అని, ఈ సమయంలో విద్యార్థులు తమను తాము ఆరోగ్యంగా ఉంచుకుంటే మన భవిష్యత్తు కూడా ఆరోగ్యంగా, భద్రంగా ఉంటుందని అన్నారు.

అంటు వ్యాధులపై పోరాడేందుకు కొత్త శక్తిని పొందాలన్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పిలుపు మేరకు ఏప్రిల్ 5న రాత్రి 9 గంటలకు కొవ్వొత్తులు, మొబైల్ టార్చ్ లు మొదలైనవి వెలిగించి సంఘీభావం తెలిపాలని శ్రీ ఫోఖ్రియాల్ ప్రతి ఒక్కరినీ కోరారు.



(Release ID: 1610933) Visitor Counter : 308