రైల్వే మంత్రిత్వ శాఖ

2020 మార్చి 22-ఏప్రిల్ 14 తేదీల మధ్య కాలాన్ని ఫోర్స్ మెజర్ గా పరిగణించాలని రైల్వే శౄఖ నిర్ణయం

ఈ సమయంలో సరకు తరలింపులో జాప్యం (డెమరేజ్); వస్తువుల లోడింగ్, అన్ లోడింగ్ (వార్ఫేజ్);వస్తువులు సర్దడం (stacking); నిల్వ ఉంచడం (detention), నిల్వ వసతుల వినియోగం వంటి సదుపాయాలకు చార్జీలు రద్దు

Posted On: 27 MAR 2020 6:38PM by PIB Hyderabad

కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా ప్రస్తుతం నెలకొన్న పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ఆర్థిక మంత్రిత్వ శాఖ జారీ చేసిన ఉత్తర్వు నం.18/4/2020-పిపిడి తేదీ 19.02.2020ను పరిగణనలోకి తీసుకుని మార్చి 22,2020-ఏప్రిల్ 14,2020 మధ్యకాలానికి ఫోర్స్ మెజర్ (మనిషి అదుపులో లేని అసాధారణ పరిస్థితి లేదా భగవత్ సంకల్పిత చర్య (ప్రకృతి వైపరీత్యం వంటివి) ఏర్పడిన సమయంలో నెలకొన్న పరిస్థితి) అమలుపరచాలని రైల్వే శాఖ నిర్ణయించింది. దేశంలో కరోనా వైరస్ విస్తరణ కారణంగా ఏర్పడిన అసాధారణ పరిస్థితిని పరిగణనలోకి తీసుకుని పైన సూచించిన సమయంలో ఫోర్స్ మెజర్ వర్తింపచేస్తున్నట్టు వివరణ ఇచ్చింది. ఈ సమయంలో రైల్వే శాఖ అందించే ఈ దిగువ సదుపాయాలకు చార్జీలేవీ విధించరు.
1. డెమరేజి (కస్టమర్లు సరకు తరలించుకుపోవడంలో జాప్యం)
2. వార్ఫేజ్ (వస్తువుల లోడింగ్, అన్ లోడింగ్ కార్యకలాపాలు)
3. స్టాకింగ్ (గోదాముల్లో వస్తువులు సర్ది పెట్టడం)
4. స్టాబ్లింగ్, ప్రయివేట్ లేదా జాయింట్ యాజమాన్యం గల వస్తువులపై డెమరేజి
5. పార్సిల్ ట్రాఫిక్ పై డెమరేజి
6. పార్సిల్ ట్రాఫిక్ పై వార్ఫేజ్
7. కంటైనర్ ట్రాఫిక్ డిటెన్షన్ చార్జీలు (కంటైనర్ల ద్వారా వచ్చిన వస్తువుల నిల్వ చార్జీలు)
8. కంటైనర్ ట్రాఫిక్ గ్రౌండ్ యూసేజ్ చార్జీలు (కంటైనర్ల ద్వారా వచ్చి వస్తువులకు గ్రౌండ్ వినియోగం చార్జీలు)
నిత్యావసర వస్తువుల రవాణాకు అవసరమైన లాజిస్టిక్స్ మద్దతు పొందడానికి రాష్ట్రప్రభుత్వాల అధికారులతో సమన్వయంగా కృషి చేయాలని జోనల్ రైల్వేలకు సూచించిది.
మార్చి 24, 2020 నుంచి ఏప్రిల్ 30, 2020 మధ్య కాలంలో ఖాళీ కంటైనర్లు/  ఖాళీ ఫ్లాట్ వ్యాగన్ల తరలింపుపై హాలేజ్ చార్జీలు (వాణిజ్య అవసరాలకు వస్తురవాణా) విధించరాదని రైల్వే బోర్డు 2020 మార్చి 23వ తేదీన ఉత్తర్వులు జారీ చేసింది.

 



(Release ID: 1609496) Visitor Counter : 153