జౌళి మంత్రిత్వ శాఖ
ఐహెచ్‌జీఎఫ్-ఢిల్లీ ఫెయిర్ స్ప్రింగ్-2020 ప్రదర్శనను రద్దు చేసిన ఈపీసీహెచ్
Posted On:
29 MAR 2020 7:37PM by PIB Hyderabad
ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్ వైరస్ ప్రభావం నేపథ్యంలో వచ్చే నెల ఢిల్లీలో నిర్వహించ తలపెట్టిన 49వ ఎడిషన్ ఐ.హెచ్.జీ.ఎఫ్-ఢిల్లీ ఫెయిర్ స్ప్రింగ్-2020ని రద్దు చేశారు. దేశం, ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న కోవిడ్ వైరెస్ వ్యాప్తి నేపథ్యంలో తాము ఈ ప్రదర్శనను రద్దు చేస్తున్నట్టుగా చేతి వృత్తుల ఎగుమతుల ప్రోత్సాహక మండలి(ఈపీసీహెచ్) తెలిపింది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో దేశ వ్యాప్తంగా లాక్డౌన్ అమలులో ఉందని ఇలాంటి ఈ తీవ్ర ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో సమీప భవిష్యత్తులో ప్రదర్శనను ఏర్పాటు చేయడం సాధ్యం కాదని ఈపీసీహెచ్ డైరెక్టర్ జనరల్ రాకేశ్ కుమార్ తెలిపారు. తొలత 49వ ఎడిషన్ ఐ.హెచ్.జీ.ఎఫ్-ఢిల్లీ ఫెయిర్ స్ప్రింగ్-2020ని ఏప్రిల్, 15-19 మధ్య నిర్వహించాలని తలపెట్టారు. ప్రస్తుత ప్రతికూల పరిస్థితుల్లో దీనిని వాయిదా వేశామని అన్నారు. పరిస్థితులు మెరుగుపడితే జూన్, జులై మధ్య కాలంలో ఈ ప్రదర్శనను ఏర్పాటు చేసే అవకాశం ఉందని ఆయన తెలిపారు. దేశ నలు మూలల నుంచి చేతి వృత్తులకు సంబంధించిన దాదాపు 3200 ఎగ్జిబిటర్లు తమ ఉత్పత్తులను ఈ ఫెయిర్‌లో ప్రదర్శనకు ఉంచేలా ఏర్పాట్లు చేశారు. ఈ ప్రదర్శనకు 7000 మంది విదేశీయులతో పాటు మొత్తం 10,000 మంది సందర్శకులు వీక్షించేందుకు వచ్చే అవకాశం ఉందని నిర్వహకులు అంచనా వేస్తున్నారు. దేశంలోని ప్రధాన క్రాఫ్ట్ క్లస్టర్లయిన మొరదాబాద్, సహారన్‌పూర్, జోధ్‌పూర్, జైపూర్, ఆగ్రా, నర్సాపూర్, ఫిరోజాబాద్, ఈశాన్య భారతం వారి నుంచి ఉత్పాదకులు తమ ఉత్పత్తులను ప్రదర్శనకు ఉంచనున్నారు. ఇప్పుడు ప్రదర్శన రద్దు కావడంతో ఇప్పుడు ఈ క్లస్టర్లపై ప్రభావం పడనుంది. ఐ.హెచ్.జీ.ఎఫ్-ఢిల్లీ ఫెయిర్ ఆటమ్న్-2020, 50వ ఎడిషన్ అక్టోబరు 14-18 మధ్య కాలంలో ఎన్‌సీఆర్ పరిధిలోని గ్రేటర్ నోయిడాలో నిర్వహించనున్నారు.
(Release ID: 1609157)
Visitor Counter : 171