మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ
కోవిడ్-19 అనుమానిత కేసులకు తాత్కాలిక ఆశ్రయం కల్పించేందుకు స్థానిక పాలనా యంత్రాంగానికి భవనాలు ఇవ్వాలని కేంద్రీయ విద్యాలయ సంఘటన్ కు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి శ్రీ రమేశ్ పోఖ్రియాల్ “నిశాంక్” ఉత్తర్వులు
Posted On:
27 MAR 2020 9:08PM by PIB Hyderabad
ప్రస్తుతం దేశంలో కోవిడ్-19 విజృంభిస్తున్న నేపథ్యంలో అనుమానిత కేసులకు ఆశ్రయం కల్పించేందుకు కేంద్రీయ విద్యాలయ సంఘటన్ కు చెందిన భవనాలను స్థానిక యంత్రాంగానికి అప్పగించాలని కేంద్ర మానవ వనరుల మంత్రి శ్రీ రమేశ్ పోఖ్రియాల్ “నిశాంక్” ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ ఉత్తర్వులకు అనుగుణంగా రక్షణ సంస్థలు, జిల్లా యంత్రాంగం, డిప్యూటీ కమిషనర్లు, ఇన్ చార్జి డిప్యూటీ కమిషనర్లు, ఇతర సీనియర్ అధికారులు లేఖలు లేదా ఇమెయిల్ ద్వారా పంపే అభ్యర్థనలకు అనుగుణంగా ఆయా కేంద్రీయ విద్యాలయాలు తమ పాఠశాల భవనాల్లోని తరగతి గదులను అనుమానిత కేసుల తాత్కాలిక ఆశ్రయం కోసం కేటాయించేందుకు అనుమతించారు.
(Release ID: 1608794)
Visitor Counter : 133