ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
కోవిడ్ 19పై కేంద్ర కేబినెట్ సెక్రటరీ ఆధ్వర్యంలో సమీక్షా సమావేశం
Posted On:
03 MAR 2020 7:57PM by PIB Hyderabad
కోవిడ్ 19 నిర్మూలన, విస్తరణ కోసం తీసుకున్న జాగ్రత్తలపై సంబంధిత అధికారులతో కేంద్ర కేబినెట్ సెక్రటరీ సమావేశం నిర్వహించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన ఈ సమావేశంలో సంబంధిత మంత్రిత్వ శాఖల కార్యదర్శలు, ప్రధాన కార్యదర్శులు, ఆయా రాష్ట్రాల ఆరోగ్యశాఖ కార్యదర్శులు పాల్గొని తమ తమ పరిధుల్లో ఈ వైరస్ విస్తరణ జరగకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారో వివరించారు.
అంతే కాదు ప్రయాణాలకు సంబంధించి తాజాగా విధించిన పరిమితుల గురించి సమీక్ష చేసి వాటిని ఆయా రాష్ట్రాలతో పంచుకోవడం జరిగింది. ఆయా రాష్ట్రాల్లోని విమానాశ్రయాల్లో తీసుకుంటున్న జాగ్రత్తల గురించి సమీక్ష చేశారు. ఆయా విమానాశ్రయాల్లోని ప్రజారోగ్య అధికారులతోను ఆయా రాష్ట్రాల విమానాశ్రయ నిర్వహణ యాజమాన్యాలతో, ఎయిర్ పోర్ట్ మేనేజర్లతో సమన్వయంతో వ్యవహరించడంద్వారా అక్కడ స్క్రీనింగ్ పరీక్షలు సమర్థవంతంగా జరిగేలా చూడాలని రాష్ట్రాలకు విజ్ఞప్తి చేశారు.
కోవిడ్ -19 విస్తరణ జరగకుండా చూడడానికిగాను చేపట్టాల్సిన క్లస్టర్ నిర్వహణపై మార్గదర్శకాలను ఆయా రాష్ట్రాలకు రెండుదేశాల క్రితమే పంపిణీ చేశారు. ఈ మార్గదర్శకాలను తప్పకుండా అమలు చేయాలని గట్టిగా చెప్పడం జరిగింది. అంతే కాదు దీనికి సంబంధించి ప్రధాన కార్యదర్శులు ఎప్పటికప్పుడు సమీక్ష చేయాలని కోరారు. ఆయా రాష్ట్రాలు సంబంధిత మంత్రిత్వ శాఖలకు సంబంధించిన సమన్వయసమావేశాలను ఏర్పాటు చేసుకొని ఎప్పటికప్పుడు తగిన జాగ్రత్తలను తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ఆయా రాష్ట్రాల్లోని క్వారంటైన్ సౌకర్యాల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలిపారు. అంతే కాదు కార్మిక మంత్రిత్వశాఖ, భద్రతా దళాలు, పారా మిలిటరీ దళాలు, వైద్య కళాశాలలు, ప్రభుత్వ రంగ సంస్థలు తమ తమపరిధుల్లోని ప్రత్యేక వార్డులను, ఇతర సౌకర్యాలను బలోపేతం చేయాలి.
ఆయా జిల్లాల్లో నిర్వహిస్తున్న క్లస్టర్ నిర్వహణకు సంబంధించి ఆయా జిల్లాల కలెక్టర్లు బాధ్యత తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే తెలియజేసిన ప్రమాణాలతో కూడిన నియమ నిబంధనల ప్రకారం క్లస్టర్ మేనేజ్ మెంట్ కోసం ఆయా జిల్లా, బ్లాక్, గ్రామ స్థాయిల్లో ఏర్పాటు చేసిన బృందాలతో సమన్వయ సమావేశాలు నిర్వహంచాలని కలెక్టర్లకు సూచించడం జరిగింది.
కోవిడ్- 19 రోగులను, అనుమానితులను వుంచడానికిగాను ప్రత్యేక వార్డుల ఏర్పాటు కోసం ఆయా ఆసుపత్రుల సంఘాలతో సమావేశాలు నిర్వహించాలని కోరారు.
కోవిడ్- 19ను అరికట్టడానికిగాను ప్రైవేటు ఆసుపత్రుల్లో చేపట్టాల్సిన ప్రమాణలతో కూడిన విధానాలపై ఫిక్కీతో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ సమావేశాలు నిర్వహిస్తోంది.
కేరళలో కోవిడ్- 19కు సంబంధించి పాజిటివ్‌గా తేలిన మూడు కేసులు ఇప్పటికే నయమయ్యాయనే విషయం ఈ సమావేశంలో తెలియజేశారు. అయితే మరో మూడు పాజిటివ్ కేసుల గురించి కూడా చర్చించారు. వీటితో పాటు ఆరు అనుమానిత కేసులకు సంబంధించి నిర్దారణ పరీక్షల ఫలితాల కోసం ఎదురు చూస్తున్నామని సంబంధిత అధికారులు తెలిపారు. వీరందరినీ ఆయా ప్రత్యేక వార్డుల్లో వుంచి చికిత్స అందిస్తున్నట్టు వారి పరిస్థితి నిలకడగా వున్నట్టు అధికారులు వివరించారు.
కోవిడ్ 19కు సంబంధించి పాజిటివ్ అని తేలిన 24 మందిని జైపూర్‌లోని ఐటీబీపీ కేంద్రానికి తరలించారు. వీరిలో 21 మంది ఇటాలియన్లయితే మరో ముగ్గురు భారతీయులు. ఈ ముగ్గురు భారతీయులు ఇటాలియన్లకు సేవలందించిన బస్ డ్రైవర్, కండక్టర్, టూరిస్టు గైడుగా గుర్తించారు. వీరందరికీ మరిన్ని పరీక్షలు జరుగుతున్నాయి. వాటి ఫలితాలనుబట్టి భవిష్యత్ కార్యాచరణను రూపొందిస్తారు.
****
(Release ID: 1607092)
Visitor Counter : 219