ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కోవిడ్-19 చర్యలు, వాటి నిర్వహణకు ఢిల్లీ-ఎన్సిఆర్ లో ఉన్న ప్రైవేట్ ఆస్పత్రుల భాగస్వామ్యంపై డాక్టర్ హర్షవర్ధన్ నేతృత్వంలో ఉన్నత స్థాయి సమావేశం

కోవిడ్-19 ని ఎదుర్కొనే చర్యల నిర్వహణలో ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల ఉమ్మడి భాగస్వామ్యులు అవ్వాల్సిన సమయం ఇది: డాక్టర్ హర్షవర్ధన్

Posted On: 05 MAR 2020 9:25PM by PIB Hyderabad

కోవిడ్-19 ని సమర్థవంతంగా ఎదుర్కోడానికి చేపట్టే నిర్వహణ చర్యల్లో ప్రభుత్వప్రైవేట్ రంగాల ఉమ్మడి వ్యూహంపై కేంద్ర ఆరోగ్య శాఖ ఎంట్రీ డాక్టర్ హర్షవర్ధన్ కీలక సమావేశం నిర్వహించారు. దేనిలో ఢిల్లీ-ఎన్సిఆర్ పరిథిలో ఉన్న ప్రైవేట్ ఆస్పత్రుల యాజమాన్యాలునిర్వాహకులు పాల్గొన్నారు. నీతి ఆయోగ్ (ఆరోగ్యం) సభ్యుడు డాక్టర్ వి.కె.పాల్శాఖ కార్యదర్శి శ్రీమతి ప్రీతి సుడన్ కూడా పాల్గొన్నారు. 

నిర్వహణ పరంగా దేశ వ్యాప్తంగా తీసుకుంటున్న చర్యలపై ఈ సందర్బంగా ఒక ప్రెజెంటేషన్ ఇచ్చారు. కలిసికట్టుగా జరిగిన ఉమ్మడి ప్రయత్నాల వల్ల ఇప్పటి వరకు మంచి ఫలితాలు సాధిస్తున్నామనిఇంకా గట్టి చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని డాక్టర్ హర్షవర్ధన్ చెప్పారు. 

ఆస్పత్రుల్లో పడకల సామర్థ్యం అందుకు తగ్గ సంసిద్ధతఐసోలేషన్ వార్డులుశాంపిల్ కలెక్షన్వైద్య పరీక్ష ఇందుకు అనుసరిస్తున్న విధివిధానాలు మొదలైన చర్యలన్నిటిని క్షుణ్ణంగా కేంద్ర మంత్రి అడిగి తెలుసుకున్నారు. ఇప్పటికే 35 ల్యాబ్ లను గుర్తించామనివాటి సంఖ్యను మరో 100వరకు పెంచుతున్నామని ఆరోగ్య శాఖా కార్యదర్శి వివరించారు. ఉమ్మడి విధానాలువ్యూహాలు అమలు చేయాలని డాక్టర్ హర్షవర్ధన్ పిలుపునిచ్చారు. వాస్తవమైనఖచితమైనఅధికారికమైన సమాచారం ప్రజలకు చేరాలనిఇందుకు సామజిక మాధ్యమాలను సమర్థవంతంగా వినియోగించాలని డాక్టర్ హర్షవర్ధన్ సూచించారు. 

వ్యాధి నిరోధక చర్యల నిర్వహణలో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలనుసకాలంలో స్పందించిన తీరును ప్రైవేట్ ఆస్పత్రులు ప్రశంసించాయి. ప్రభుత్వంతో కలిసి ఈ మహమ్మారి ని పారద్రోలడానికి పనిచేస్తామని ఆస్పత్రులు హామీ ఇచ్చాయి. 

ఈ సమావేశంలో ఆరోగ్య మంత్రిత్వ శాఖా అధికారులతో పాటు ప్రైవేట్ ఆస్పత్రులు మెడేంటఅపోలోమాక్స్ఫోర్టిస్సిగ్నస్ఆర్టెమిస్ఆసియన్ (ఫరీదాబాద్)మెట్రోపరస్సర్వోదయవిపిఎస్నయతి యాజమాన్యాలు పాల్గొన్నారు. ఫిక్కీఐఎంఏ ప్రతినిధులు పాల్గొన్నారు. 

****


(Release ID: 1607057) Visitor Counter : 145


Read this release in: English , Urdu , Hindi