వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ

పౌర‌ విమాన‌యాన రంగం లో విదేశీ ప్ర‌త్య‌క్ష పెట్టుబ‌డి విధానాని కి ఆమోదం తెలిపిన మంత్రిమండలి

Posted On: 04 MAR 2020 4:12PM by PIB Hyderabad

భార‌త‌ జాతీయులైన ప్ర‌వాస భార‌తీయులు (ఎన్ ఆర్ఐ లు) మెసర్స్ ఎయర్ ఇండియా లిమిటెడ్‌ లో ఆటోమేటిక్ రూట్‌ లో 100 శాతం వ‌ర‌కు విదేశీ పెట్టుబ‌డి ని పెట్టేందుకు అనుమ‌తి ని ఇవ్వడానికి సంబంధించి ఇప్పటి ఎఫ్‌డిఐ విధానం లో స‌వ‌రణ చేసేందుకు ప్ర‌ధాన‌ మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అధ్య‌క్ష‌త‌ న జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం ఆమోదం తెలిపింది.

ప్ర‌స్తుతం ఉన్న ఎఫ్ డిఐ విధానం  ప్ర‌కారం, షెడ్యూల్డ్ ఎయర్ ట్రాన్స్‌పోర్ట్ స‌ర్వీసు, డమెస్టిక్ షెడ్యూల్డ్ పాసంజ‌ర్ ఎయర్ లైన్ (ఆటోమేటిక్ ద్వారా 49 శాతం, ప్ర‌భుత్వ రూట్ ద్వారా 49 శాతం పైన‌) 100 శాతం ఎఫ్ డిఐ అనుమ‌తింప‌బ‌డుతోంది. అయితే, ఎన్ ఆర్‌ఐ కి 100 శాతం ఎఫ్‌ డిఐ ని షెడ్యూల్డ్ ఎయర్ ట్రాన్స్‌పోర్ట్ స‌ర్వీసు, డమెస్టిక్ షెడ్యూల్డ్ పాసంజ‌ర్ ఎయర్‌ లైన్ ల‌లో ఆటోమేటిక్ రూట్‌ లో అనుమ‌తిని ఇస్తున్నారు.  దీనికి తోడు, 1937 ఎయర్ క్రాఫ్ట్ నిబంధ‌న‌ ల ప్ర‌కారం,  చెప్పుకోద‌గిన స్థాయి లో యాజ‌మాన్యం, నియంత్ర‌ణ (ఎస్ఒఇసి) భార‌త‌ జాతీయుల‌ కు ఉండాల‌న్న ష‌ర‌తు కు లోబ‌డి ఎఫ్‌ డిఐ ఉంటుంది.  అయితే ఎయర్ ఇండియా లిమిటెడ్‌ కు సంబంధించి ప్ర‌స్తుత విధానం ప్రకారం, మెసర్స్ ఎయర్ ఇండియా లిమిటెడ్‌ లో  విదేశీ విమాన‌యాన సంస్థ‌ల‌ తో క‌లుపుకొని విదేశీ పెట్టుబ‌డి ప్ర‌త్య‌క్షం గా గాని, లేదా ప‌రోక్షం గా గాని 49 శాతాని కి మించ‌రాదు.  మెసర్స్ ఎయర్ ఇండియా లిమిటెడ్‌ కు సంబంధించి చెప్పుకోద‌గిన స్థాయి లో యాజ‌మాన్యం, నియంత్ర‌ణ భార‌త‌ జాతీయుల‌ కు ఉండాల‌న్న ష‌ర‌తు కు లోబ‌డి ఉంటుంది. అందువ‌ల్ల షెడ్యూల్డ్ ఎయర్ ట్రాన్స్‌పోర్ట్ స‌ర్వీసు, డమెస్టిక్ షెడ్యూల్డ్ పాసంజ‌ర్ ఎయర్ లైన్స్ స‌ర్వీసు ల విష‌యం లో 100 శాతం ఎఫ్‌ డిఐ ని ఆటోమేటిక్ రూట్‌ లో అనుమతించిన‌ప్ప‌టికీ , మెసర్స్ ఎయర్ ఇండియా విష‌యం లో దీని ని 49 శాతాని కి ప‌రిమితం చేశారు.

లాభం:

మెసర్స్ ఎయర్ ఇండియా లిమిటెడ్ లో  భార‌త  ప్ర‌భుత్వ ప్ర‌తిపాదిత‌ 100 శాతం వ్యూహాత్మ‌క పెట్టుబ‌డుల ఉప‌సంహ‌ర‌ణ‌ తో , మెసర్స్ ఎయర్ ఇండియా లిమిటెడ్ లో భార‌త ప్ర‌భుత్వ మిగులు యాజ‌మాన్యం ఉండ‌దు.  ఇది  పూర్తిగా ప్రైవేటు యాజ‌మాన్యం అవుతుంది.  మెసర్స్ ఎయర్ ఇండియా లిమిటెడ్‌ లో విదేశీ పెట్టుబ‌డుల‌ ను ఇత‌ర షెడ్యూల్డ్ ఎయర్ లైన్ ఆప‌రేటర్ లతో స‌మానం గా పోటీప‌డేటట్టు చేయ‌డానికి తీసుకు రావాల‌ని నిర్ణ‌యించారు.
 
ఎఫ్‌ డిఐ విధానం లో మార్పు ల ప్ర‌క‌ట‌న‌, ఇత‌ర షెడ్యూల్డ్ ఎయర్ లైన్ ఆప‌రేట‌ర్ లతో స‌మానం గా మెసర్స్ ఎయర్ ఇండియా లిమిటెడ్ లో భార‌త జాతీయులైన ప్ర‌వాస భార‌తీయులు 100 శాతం వ‌ర‌కు విదేశీ పెట్టుబ‌డి పెట్ట‌డాని కి అనుమ‌తి ని ఇస్తోంది.  ఈ ప్ర‌తిపాదిత ఎఫ్‌ డిఐ విధాన మార్పు లు, మెసర్స్ ఎయర్ ఇండియా లిమిటెడ్‌ లో 100 శాతం వ‌ర‌కు  ఆటోమేటిక్ రూట్‌ లో విదేశీ పెట్టుబ‌డులు పెట్ట‌డానికి వీలు క‌ల్పిస్తాయి.

పై ఎఫ్‌ డిఐ విధాన స‌వ‌ర‌ణ ఎఫ్‌ డిఐ విధానాన్ని స‌ర‌ళ‌త‌రం చేసేందుకు, సుల‌భ‌త‌రం చేసేందుకు, దేశం లో సుల‌భ‌త‌ర వాణిజ్యాని కి ఉద్దేశించింది.  దీనివ‌ల్ల పెద్ద ఎత్తున ఎఫ్ డి ఐ నిధులు రావ‌డానికి, త‌ద్వారా పెట్టుబ‌డులు పెర‌గ‌డానికి, రాబ‌డి, ఉపాధి పెర‌గ‌డానికి మార్గం సుగమం అవుతుంది.

పూర్వరంగం:

ఆర్థిక వృద్ధి కి ఎఫ్‌ డిఐ ప్రధాన చోద‌క శ‌క్తి.  అలాగే దేశ ఆర్థిక అభివృద్ధి కి రుణేతర ఆర్థిక వనరు కూడాను.  దేశం లోకి పెద్ద మొత్తం లో విదేశీ పెట్టుబడుల ప్రవాహాన్ని ఆకర్షించే ఉద్దేశం తో ఎఫ్‌ డిఐ విధానాన్ని ఎప్ప‌టిక‌ప్పుడు సమీక్షించడం జ‌రుగుతుంది. ఎఫ్‌ డిఐ విష‌యం లో పెట్టుబడిదారులకు అనుకూలంగా ఉండే విధానాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టింది.  దీనిలో భాగం గా చాలా రంగాల లో , కార్యకలాపాల లో ఆటోమేటిక్ మార్గం లో 100 శాతం వరకు ఎఫ్‌ డిఐ కి అనుమతి ఇవ్వడం జ‌రుగుతోంది.

దేశాన్ని ఆకర్షణీయమైన పెట్టుబడి గమ్యస్థానం గా మార్చడానికి ఎఫ్‌ డిఐ విధాన నిబంధనల ను ఈ మధ్య కాలం లో వివిధ రంగాల లో  సరళీకరించడమైంది.  ఇలా స‌ర‌ళీకరించిన రంగాల లో ర‌క్ష‌ణ‌ రంగం,  నిర్మాణ అభివృద్ధి రంగం, వాణిజ్య రంగం, ఫార్మాస్యుటికల్స్ రంగం, పవర్ ఎక్స్ చేంజ్ లు, బీమా రంగం, పింఛను, ఇతర ఆర్థిక సేవల రంగం, ఆస్తి పునర్నిర్మాణ సంస్థ లు, ప్రసార రంగం, సింగిల్ బ్రాండ్ రిటైల్ ట్రేడింగ్, బొగ్గు తవ్వకం రంగం, డిజిటల్ మీడియా వంటివి ఉన్నాయి.

ఈ సంస్కరణ ల ఫ‌లితం గా ఇటీవలి కాలం లో భారతదేశం రికార్డు స్థాయి లో  ఎఫ్‌ డిఐల‌ ను ఆకట్టుకొన్నది.  దేశంలో కి ఎఫ్ డిఐ ల ప్ర‌వాహం 2014-15లో 45.15 బిలియన్ యుఎస్ డాలర్ గా ఉండగా,  అప్పటి నుండి క్ర‌మం గా పెరుగుతూ వ‌స్తోంది.  2015-16లో ఎఫ్‌ డిఐ ల ప్రవాహం 55.56 బిలియన్ యుఎస్ డాలర్ గా, 2016-17లో ఇది 60.22 బిలియన్ యుఎస్ డాలర్ కు చేరింది.  2017-18లో ఇది 60.97 బిలియన్ యుఎస్ డాలర్ కు పెరిగింది. గ‌త ఆర్థిక సంవ‌త్స‌రం అంటే 2018-19లో ఇది 62 బిలియ‌న్ యుఎస్ డాల‌ర్ (ప్రాథ‌మిక అంచ‌నా) గా నమోదు అయింది.  గ‌త పంతొమ్మిదిన్న‌ర‌ సంవత్సరాల లో (ఏప్రిల్ 2000- సెప్టెంబర్ 2019 మ‌ధ్య‌ కాలం లో) మొత్తం ఎఫ్‌ డిఐ ల ప్రవాహం 642 బిలియన్ యుఎస్ డాల‌ర్ కాగా, గత ఐదున్న‌ర  సంవత్సరాల లో (ఏప్రిల్ 2014- సెప్టెంబర్ 2019 మధ్య) వ‌చ్చిన‌ మొత్తం ఎఫ్‌ డిఐ లు 319 బిలియన్ యుఎస్ డాలర్.  గత పందొమ్మిదిన్న‌ర  సంవత్సరాల లో వ‌చ్చిన  మొత్తం ఎఫ్‌ డిఐ ల  ప్రవాహం లో ఇది దాదాపు 50 శాతం గా ఉంది.

గ్లోబల్ ఎఫ్ డిఐ ల ప్రవాహం గత కొన్ని సంవత్సరాలు గా ఒడుదుడుకుల ను ఎదుర్కొంటున్నది. యుఎన్ సిటిఎడి ప్రపంచ పెట్టుబడి నివేదిక 2019 ప్రకారం, గ్లోబల్ ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్ మెంట్ (ఎఫ్ డి ఐ) ప్రవాహాలు 2018 లో 13 శాతానికి పడిపోయి 1.3 ట్రిలియన్ డాలర్ వద్ద ఉండిపోయాయి.  ఇది వరుస గా మూడో సంవ‌త్స‌రం క్షీణ‌త‌ కు గురి కావ‌డం గా చెప్పుకోవ‌చ్చు. అంత‌ర్జాతీయం గా ప‌రిస్థితులు సానుకూలం గా లేక‌పోయినప్ప‌టికీ, ప్ర‌పంచ‌ వ్యాప్తం గా విదేశీ పెట్టుబ‌డుల రాక‌ కు భార‌త‌దేశం ఆకర్షణీయమైన గమ్యస్థానం గా కొనసాగుతోంది.  ఏదేమైనా, మ‌రిన్ని విదేశీ ప్ర‌త్య‌క్ష‌పెట్టుబ‌డుల ను ఆక‌ర్షించ‌గ‌ల శ‌క్తి భార‌త‌దేశాని కి ఉంది. అయితే ఎఫ్‌ డిఐ విధానాల‌ ను మ‌రింత స‌ర‌ళీకృతం చేయ‌డం ద్వారాను, సుల‌భ‌త‌రం చేయ‌డం ద్వారాను దేశాని కి అధిక స్థాయి లో విదేశీ పెట్టుబడుల ను ఆకర్షించే అవకాశం ఉందన్న అభిప్రాయం వ్య‌క్త‌ం అవుతోంది.


**


(Release ID: 1605331) Visitor Counter : 148


Read this release in: English , Hindi , Tamil , Kannada