ఆర్థిక మంత్రిత్వ శాఖ
2020 జనవరి నుంచి 1,10,828 కోట్ల రూపాయల జిఎస్‌టి స్థూల రాబడి
జిఎస్‌టి అమలు తర్వాత జిఎస్‌టి రాబడిలో 2020 జనవరి నెల రెండో అతిపెద్ద వసూలు మాసంగా నిలిచింది.
2020 జనవరి నెలలో జిఎస్‌టి రాబడి స్థూల వసూలు 1,10,828 కోట్ల రూపాయలు. ఇందులో సిజిఎస్‌టి 29,944 కోట్ల రూపాయలు కాగా, ఎస్‌జిఎస్‌టి 28,244 కోట్లు, ఐజిఎస్‌టి 53,013 కోట్లు(దిగుమతులపై వసూలైన 23,481 కోట్ల రూపాయలు కలుపుకుని),సెస్ 8,637 కోట్లరూ.లు (దిగుమతులపై వసూలైన 824 కోట్లు కలుపుకుని) ఉన్నాయి.
Posted On:
01 FEB 2020 2:08PM by PIB Hyderabad
డిసెంబర్ నెలకు సంబంధించి జనవరి 2020 31 వ తేదీవరకు దాఖలైన జిఎస్‌టిఆర్ 3బి రిటర్న్‌ల సంఖ్య మొత్తం 83 లక్షలు (ప్రాథమికం)
ప్రభుత్వం సిజిఎస్‌టి కింద 24,730 కోట్లు పరిష్కరించింది. అలాగే రెగ్యులర్ సెటిల్‌మెంట్ కింద ఐజిఎస్‌టినుంచి ఎస్‌జిఎస్‌టికి 18,199 కోట్ల రూపాయలు పరిష్కరించింది.
2020 జనవరిలో రెగ్యులర్ సెటిల్ మెంట్ తర్వాత కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రప్రభుత్వాలు ఆర్జించిన మొత్తం రెవిన్యూ 45,674 కోట్ల రూపాయలు సిజిఎస్‌టి కింద, ఎస్.జి.ఎస్‌టి కింద 46,433 కోట్ల రూపాయలు.
దేశీయ లావాదేవీల కింద 2020 జనవరి నెలలో జిఎస్‌టి రాబడులు 2019 జనవరి నెలతో పోల్చి చూసినపుడు గణనీయంగా 12 శాతం వృద్ధి సాధించాయి.
దిగుమతి అయిన సరకులపై వసూలైన ఐజిఎస్‌టిని కూడా పరిగణనలోకి తీసుకుంటే 2020 జనవరి మొత్తం రాబడి 2019 రాబడితో పోలిస్తే 8 శాతం అధికం. ఈనెలలో దిగుమతి అయిన సరకులపై ఐజిఎస్‌టి 2019 జనవరితో పోలిస్తే -3 శాతం నెగటివ్ వృద్ధి నమోదు చేసింది. జిఎస్‌టి ని ప్రవేశపెట్టిన తర్వాత నెలవారి రాబడులు 1.1 లక్ష కోట్ల రూపాయల మొత్తం దాటడం ఇది రెండోసారి కాగా లక్ష కోట్ల రూపాయలు దాటడం ఏడాదిలో ఆరోసారి.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రాబడికి సంబంధించి చార్టులో సూచించడం జ రిగింది. ఈ కింది పట్టికలో రాష్ట్రాల వారీగా జిఎస్‌టి గణాంకాలను 2020 జనవరిలో ఆయా రాష్ట్రాలనుంచి సేకరించి 2019 జనవరి నెలతో పోల్చడం జరిగింది.
----------------------------------------------------------------------
రాష్ట్రాల వారీగా 2020 జనవరి నెల నాటికి గణాంకాలు
-----------------------------------------------------------------------
రాష్ట్రం పేరు Jan-19 Jan-20 వృద్ధిశాతం
----------------------------------------------------------------------------
1 జమ్ముకాశ్మీర్ 331 371 12%
2 హిమాచల్ ప్రదేశ్ 647 675 4%
3 పంజాబ్ 1,216 1,340 10%
4 ఉత్తరాఖండ్ 1,146 1,257 10%
6 హర్యానా 4,815 5,487 14%
7 ఢిల్లీ 3,525 3,967 13%
8 రాజస్థాన్ 2,776 3,030 9%
9 ఉత్తరప్రదేశ్ 5,485 5,698 4%
10 బీహార్ 1,039 1,122 8%
11 సిక్కిం 176 194 11%
12 అరుణాచల్ ప్రదేశ్ 38 52 36%
13 నాగాలాండ్ 17 32 84%
14 మణిపూర్ 24 35 48%
15 మిజోరం 26 24 -8%
16 త్రిపుర 52 56 8%
17 మేఘాలయ 104 128 24%
18 అస్సాం 787 820 4%
19 పశ్చిమబెంగాల్ 3,495 3,747 7%
20 జార్ఖండ్ 1,965 2,027 3%
21 ఒడిషా 2,338 2,504 7%
22 చత్తీస్‌ఘడ్ 2,064 2,155 4%
23 మధ్యప్రదేశ్ 2,414 2,674 11%
24 గుజరాత్ 6,185 7,330 19%
25 డామన్ డయ్యూ 101 117 16%
26 దాద్రానాగర్ హవేలి 173 165 -5%
27 మహారాష్ట్ర 15,151 18,085 19%
29 కర్ణాటక 7,329 7,605 4%
30 గోవా 394 437 11%
31 లక్షద్వీప్ 1 3 150%
32 కేరళ 1,584 1,859 17%
33 తమిళనాడు 6,201 6,703 8%
34 పుదుచ్చేరి 159 188 18%
35 అండమాన్ నికోబార్ 35 30 -13%
36 తెలంగాణ 3,195 3,787 19%
37 ఆంధ్రప్రదేశ్ 2,159 2,356 9%
38 ఇతర టెరిటరీలు 194 139 -28%
39 కేంద్ర పరిధి 45 119 166%
మొత్తం 77,545 86,513 12%
***
(Release ID: 1601617)
Visitor Counter : 265