ప్రధాన మంత్రి కార్యాలయం

మారిశ‌స్ ప్ర‌ధాని తో భేటీ అయిన ప్ర‌ధాన మంత్రి

Posted On: 06 DEC 2019 3:59PM by PIB Hyderabad

మారిశ‌స్ ప్రధాని మాన్య‌ శ్రీ ప్రవీంద్ జగన్నాథ్ తో ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ న్యూ ఢిల్లీ లో ఈ రోజు న స‌మావేశ‌మ‌య్యారు.  ప్ర‌ధాని శ్రీ జ‌గ‌న్నాథ్ త‌న సతీమ‌ణి శ్రీమతి క‌విత‌ జ‌గ‌న్నాథ్ తో పాటు భార‌త‌దేశం లో వ్య‌క్తిగ‌త సందర్శన కు విచ్చేశారు. 

అఖండ‌మైన ప్ర‌జాతీర్పు తో తిరిగి ఎన్నిక‌యినందుకు ప్ర‌ధాని శ్రీ జగన్నాథ్  కు ప్ర‌ధాన మంత్రి శ్రీ మోదీ ఆత్మీయ అభినంద‌న‌ లు తెలిపారు.  ప్ర‌ధాన మంత్రి కి శ్రీ జ‌గ‌న్నాథ్ ధ‌న్య‌వాదాలు ప‌లుకుతూ,   ఉభ‌య దేశాల మ‌ధ్య సోద‌ర‌ భావం తో కూడిన‌టువంటి మ‌రియు మ‌న్నికైన‌టువంటి ద్వైపాక్షిక సంబంధాల ను మ‌రింత గా బలోపేతం చేసుకోవ‌డం కోసం మ‌రియు ఆ సంబంధాల ను గాఢ‌త‌రం గా మలచుకోవ‌డం కోసం త‌న వ‌చ‌న బ‌ద్ధ‌త ను పునరుద్ఘాటించారు.  

మారిశ‌స్ లో మెట్రో ఎక్స్‌ప్రెస్ ప్రాజెక్టు, ఇఎన్‌టి హాస్పిట‌ల్, సామాజిక గృహ నిర్మాణ ప‌థ‌కం ల వంటి ప్రజల కు సిసలైన లాభాల ను అందించిన అనేక అభివృద్ధి ప‌థాకాలు కు  భార‌త‌దేశం అందిస్తున్న మ‌ద్ధ‌తు ను ప్ర‌ధాని శ్రీ జ‌గ‌న్నాథ్ ప్రశంస ను  వ్య‌క్తం చేశారు.   మారిశ‌స్ స‌ర్వ‌తోముఖ అభివృద్ధి తాలూకు వేగాన్ని వర్ధిల్లజేయడం, భార‌త‌దేశం తో స‌హ‌కారం యొక్క ప‌రిధి ని విస్త‌రించుకోవడం నూత‌న ప‌ద‌వీ కాలం లో తనకు ప్రాథమ్యాలు గా ఉంటాయని ప్ర‌ధాని శ్రీ జ‌గ‌న్నాథ్ తెలిపారు.   ఈ కృషి లో భార‌త‌దేశం ఒక ముఖ్యమైన పాత్ర ను పోషిస్తుంద‌న్న ఆశాభావాన్ని ఆయన వ్య‌క్తం చేశారు.
 
 మ‌రింత భ‌ద్ర‌మైన‌టువంటి, స్థిర‌మైన‌టువంటి మ‌రియు స‌మృద్ధ‌మైన‌టువంటి మారిశ‌స్ యొక్క నిర్మాణం లో భార‌త‌దేశం ప‌క్షాన హృద‌య పూర్వ‌క‌ మ‌ద్ధ‌తు ను మ‌రియు సంఘీభావాన్ని మారిశ‌స్ ప్ర‌జ‌లు మ‌రియు మారిశ‌స్ ప్ర‌భుత్వం ఆశించ‌వ‌చ్చని ప్ర‌ధాన మంత్రి శ్రీ మోదీ అన్నారు.

బ‌హుముఖీనమైనటువంటి, సన్నిహితమైనటువంటి ద్వైపాక్షిక సంబంధాల ను నిర్మించుకోవ‌డం కోసం క‌ల‌సి కృషి చేయాల‌ని, అలాగే ప‌ర‌స్ప‌ర ప్ర‌యోజ‌నాలు మ‌రియు ప్రాధాన్యాల ప్రాతిప‌దిక న త‌మ మ‌ధ్య బంధం బలపడే నూత‌న మార్గాల ను అన్వేషించాలని నేత లు ఇరువురు అంగీకరించారు.


**



(Release ID: 1595369) Visitor Counter : 112