వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
ప్రగతి మైదాన్ లో భూమి నుండి ఆర్థిక ప్రయోజనం పొందడాని కి ఆమోద ముద్ర; అక్కడ ఒక ఫైవ్ స్టార్ హోటల్ ను నిర్మించడం జరుగుతుంది
ప్రగతి మైదాన్ ను ఒక ప్రపంచ శ్రేణి అంతర్జాతీయ ప్రదర్శనశాల మరియు సమావేశ కేంద్రం (ఐఇసిసి)గా తీర్చిదిద్దే బృహత్ పథకాన్ని చేపట్టనున్న ఐటిపిఒ
ప్రగతి మైదాన్ లో 3.7 ఎకరాల భూమి ని 99 సంవత్సరాల నిర్ణీత కాలపు కౌలు ప్రాతిపదిక న బదలాయించే అధికారాన్ని ఐటిపిఒ కు ఇవ్వడమైంది; ప్రగతి మైదాన్ ను ఆధునిక సదుపాయాల తో కూడిన ఫైవ్ స్టార్ హోటల్ గా అభివృద్ధి చేసేందుకు ఐటిడిసి మరియు ఐఆర్‌సిటిసి లు ఒక స్పెశల్ పర్పస్ వీయికల్ ను స్థాపిస్తాయి
హోటల్ సదుపాయం తో ఐఇసిసి ప్రాజెక్టు విలువ లో పెరుగుదల సాధ్యపడనుంది; ఈ హోటల్ తో భారతదేశం లో ఉపాధి అవకాశాలు మెరుగుపడటం తో పాటు వ్యాపారం లోను, వాణిజ్యం లోను ఒక గ్లోబల్ డెస్టినేశన్ గా భారతదేశాని కి ప్రోత్సాహం కూడా లభించగలదు
మైలురాయి వంటి ఇంటర్ నేశనల్ ట్రేడ్ ఫెయర్ కు ఈ ప్రాజెక్టు తో అండ లభిస్తుంది; ‘మేక్ ఇన్ ఇండియా’, ‘స్కిల్ ఇండియా’ మరియు ‘ఇన్ వెస్ట్ ఇండియా’ల వంటి ప్రముఖ కార్యక్రమాల కు ఈ ప్రాజెక్టు తో మద్దతు లభిస్తుంది
Posted On:
04 DEC 2019 1:33PM by PIB Hyderabad
ఐఇసిసి ప్రాజెక్టు యొక్క అమలు శరవేగం గా సాగుతోంది; ఈ ప్రాజెక్టు 2020-21 కల్లా పూర్తి అయ్యే అవకాశం ఉంది
ప్రగతి మైదాన్ లో 3.7 ఎకరాల భూమి ని 99 సంవత్సరాల కాలానికి గాను కౌలు ద్వారా హక్కు ప్రాతిపదిక న ఒక స్పెశల్ పర్పస్ వీయికల్ (ఎస్ పివి)కి బదలాయించే అధికారాన్ని ఇండియా ట్రేడ్ ప్రమోశన్ ఆర్గనైజేశన్ (ఐటిపిఒ) కు ఇచ్చేందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత న సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఫైవ్ స్టార్ హోటల్ ను అభివృద్ధి పరచి, ఆ హోటల్ యొక్క కార్యకలాపాల ను నిర్వహించడానికి ఉద్దేశించిన ఈ ఎస్ పివి ని ఇండియా టూరిజమ్ డివెలప్‌మెంట్ కార్పొరేశన్ (ఐటిడిసి) మరియు ఇండియన్ రైల్వే కేటరింగ్ ఎండ్ టూరిజమ్ కార్పొరేశన్ (ఐఆర్‌సిటిసి) ఏర్పాటు చేస్తాయి. ఈ ఎస్ పివి కి 3.7 ఎకరాల భూమి ని 611 కోట్ల రూపాయల ధర కు బదలాయించడం జరుగుతుంది.
ఇంటర్‌నేశనల్ ఎగ్జిబిశన్ ఎండ్ కన్ వెన్శన్ సెంటర్ (ఐఇసిసి) ప్రాజెక్టు పనులు పూర్తి స్థాయి లో జరుగుతున్నాయి. ఈ ప్రాజెక్టు 2020-21కల్లా పూర్తి అయ్యే అవకాశం ఉంది.
ప్రగతి మైదాన్ లో హోటల్ ప్రాజెక్టు ను శీఘ్ర గతి న పూర్తి చేయడం కోసం అవసరమైన చర్యల ను ఎస్ పివి తీసుకొంటుంది. ఆ చర్యల లో- దీర్ఘ కాల స్థిర కౌలు ప్రాతిపదిక న హోటల్ యొక్క నిర్మాణం, నిర్వహణ మరియు పరిపాలన కోసం పారదర్శకమైన స్పర్ధాత్మక బిడ్డింగ్ ప్రక్రియ ద్వారా భవన నిర్మాత ను మరియు థర్డ్ పార్టీ ఆపరేటర్ ఒక ఎంపిక చేయడం వంటివి- భాగం గా ఉంటాయి.
భారతదేశం లో మౌలిక సదుపాయాల కల్పన ను మరియు పర్యటన రంగాన్ని సర్వోత్తమ ప్రమాణాల తో మరియు సర్వ శ్రేష్ఠమైనటువంటి సేవ లతో కూడుకున్నవి గా తీర్చిదిద్దాలన్న ప్రభుత్వ దార్శనికత కు అనుగుణం గా ప్రగతి మైదాన్ ను ప్రపంచ శ్రేణి ఇంటర్‌నేశనల్ ఎగ్జిబిశన్ ఎండ్ కన్ వెన్శన్ సెంటర్ గా రూపొందించేందుకు ఒక బృహత్ పథకాని కి ఐటిపిఒ ఆచరణ రూపాన్ని ఇస్తున్నది. ప్రపంచవ్యాప్తం గా పరిశీలించినప్పుడు ఒక హోటల్ సదుపాయం అనేది ఏ సమావేశాలు, కార్యక్రమాలు, సమ్మేళనాలు మరియు ప్రదర్శన లు (ఎంఐసిఇ)కైనా ఒక విడదీయలేనటువంటి భాగం గా ఉంటోంది.
- లో ఒక అవిభాజ్య భాగం గా ఉండే హోటల్ సౌకర్యం భారతదేశాన్ని ప్రపంచ స్థాయి సమావేశాల కేంద్రం గా ప్రచారం లోకి తీసుకు రావడం తో పాటు వ్యాపారాన్ని, వాణిజ్యాన్ని, అలాగే ఉపాధి కల్పన ను కూడా ప్రోత్సహించగలదు. ఈ హోటల్ ప్రాజెక్టు ఇంటర్‌నేశనల్ ఎగ్జిబిశన్ ఎండ్ కన్ వెన్శన్ సెంటర్ () విలువ ను వర్ధిల్లజేస్తుంది; అంతే కాక భారతదేశ వ్యాపార రంగాని కి మరియు పరిశ్రమ రంగాని కి లబ్ధి ని చేకూర్చగలదు.
దీనికి తోడు, ప్రతి ఏటా లక్షల సంఖ్య లో చిన్న వ్యాపారులు మరియు సందర్శకులు తరలివచ్చేటటువంటి ఇంటర్ నేశనల్ ట్రేడ్ ఫెయర్ సైతం ఈ ప్రగతి మైదాన్ యొక్క రూపాంతరీకరణ నుండి ప్రయోజనాన్ని పొందనున్నది. ఇక్కడ ఆధునిక సౌకర్యాలు పోగు పడి, దీని లో పాలు పంచుకొనే వ్యాపారుల కు, నవ పారిశ్రామికవేత్తల కు మరియు సందర్శకుల కు ఘనమైన లబ్ధి ని చేకూర్చగలుగుతుంది. ఇది ట్రేడ్ ఫెయర్ కు సందర్శకులు అధిక సంఖ్యల లో విచ్చేసేందుకు కారణమవుతుంది. తద్వారా వారు వారి యొక్క వ్యాపార పరిధుల ను విస్తరించుకొనేందుకు మరియు భారతదేశ వస్తువుల, భారతదేశ సేవ ల ప్రచారాని కి కూడా ఒక హుషారైనటువంటి వేదిక అందుబాటు లోకి వస్తుంది.
**
(Release ID: 1594995)
Visitor Counter : 148