వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
పేటెంట్ ప్రాసిక్యూశన్ హైవే ప్రోగ్రాము కు ఆమోదం తెలిపిన మంత్రిమండలి
Posted On:
20 NOV 2019 10:47PM by PIB Hyderabad
కంట్రోలర్ జనరల్ ఆఫ్ పేటెంట్స్, డిజైన్స్ & ట్రేడ్ మార్క్ స్, ఇండియా (సిజిపిడిటిఎమ్) ఆధీనం లోని ఇండియన్ పేటెంట్ ఆఫీస్ (ఐపిఒ) ద్వారా విభిన్న దేశాలు లేదా ప్రాంతాల కు చెందిన పేటెంట్ అను సంపాదించడం లో వేగాన్ని తీసుకు రావడం మరియు దానిని ప్రభావశీలి సంస్థ గా తీర్చిదిద్దేటటువంటి పేటెంట్ ప్రాసిక్యూశన్ హైవే (పిపిహెచ్) ప్రోగ్రాము ను స్వీకరించే ప్రతిపాదన కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత న సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
పైన ప్రస్తావించినటువంటి కార్యక్రమం ప్రయోగాత్మక ప్రాతిపదిక న కేవలం మూడు సంవత్సరాల కై మొదట జపాన్ పేటెంట్ కార్యాలయాని కి (జెపిఒ కు) మరియు భారతీయ పేటెంట్ కార్యాలయాని కి (ఐపిఒ కు) ల మధ్య ఆరంభమవుతుంది. ఈ ప్రయోగాత్మక కార్యక్రమం లో భాగం గా భారతీయ పేటెంట్ కార్యాలయం విద్యుత్తు, ఇలెక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్, ఇన్ ఫర్ మేశన్ టెక్నాలజీ, భౌతిక శాస్త్రం, సివిల్, యాంత్రిక, వస్త్రాలు, మోటార్ వాహనాలు మరియు లోహశోధన విజ్ఞానం వంటి సాంకేతిక రంగాల లో పేటెంట్ దరఖాస్తుల ను స్వీకరించే సూచన లు ఉన్నాయి. కాగా, జెపిఒ సాంకేతిక విజ్ఞానాని కి సంబంధించిన అన్ని రంగాల లోను దరఖాస్తుల ను స్వీకరించే అవకాశం ఉంది.
పిపిహెచ్ కార్యక్రమం లో భారతీయ పేటెంట్ కార్యాలయాని కి ఈ క్రింద ప్రస్తావించిన లాభాలు దక్కుతాయి:
i. పేటెంట్ దరఖాస్తు ల ను పరిష్కరించడాని కి పట్టే కాలం తగ్గడం;
ii. పేటెంట్ సంబంధిత దరఖాస్తు లు పెండింగు లో పడటం అనేది తగ్గిపోవడం;
iii. పేటెంట్ దరఖాస్తుల గుర్తింపు మరియు పరీక్ష ప్రక్రియల లో నాణ్యత మెరుగుదల;
iv. భారతదేశం లోని స్టార్ట్-అప్ లు ఎమ్ఎస్ఎమ్ఇ లు సహా భారతీయ ఆవిష్కర్తల కు వారి యొక్క పేటెంట్ సంబంధిత దరఖాస్తు లు జపాన్ లో శీఘ్ర గతి న గుర్తింపు నకు మరియు పరీక్ష కు నోచుకొనేందుకు అవకాశం దక్కుతుంది.
వాణిజ్యం మరియు పరిశ్రమ శాఖ మంత్రి నిర్ణయించే మేరకు భవిష్యత్తు లో ఈ కార్యక్రమం యొక్క పరిధి ని విస్తరించేందుకు అవకాశం ఉంది. ఈ కార్యక్రమాన్ని అమలు పరచేందుకు పేటెంట్ కార్యాలయాలు స్వయంగా వాటి దిశానిర్దేశాల రూపురేఖల ను తయారు చేసుకొంటాయి.
**
(Release ID: 1592931)
Visitor Counter : 115