రైల్వే మంత్రిత్వ శాఖ

రైల్వే ఉద్యోగుల కు 2018-19 ఆర్థిక సంవ‌త్స‌రాని కి పిఎల్‌బి ని చెల్లించ‌డానికి ఆమోదం తెలిపిన మంత్రిమండ‌లి

Posted On: 18 SEP 2019 4:18PM by PIB Hyderabad

రైల్వే సిబ్బంది లో ప్రేర‌ణ ను క‌ల్పించేందుకు మరియు పారిశ్రామిక శాంతి ని ప‌రిర‌క్షిస్తున్నందుకు 2018-19 ఆర్థిక సంవ‌త్స‌రాని (ఎఫ్ వై)కి 11.52 ల‌క్ష‌ల మందికి పైగా అర్హత కలిగినటువంటి నాన్-గజెటెడ్ రైల్వే ఉద్యోగుల‌కు (ఆర్‌పిఎఫ్‌/ఆర్‌పిఎస్ఎఫ్ సిబ్బంది మిన‌హా) 78 రోజుల వేత‌నాని కి స‌మాన‌మైన ఉత్పాద‌క‌త తో ముడిపెట్టిన బోన‌స్ (పిఎల్‌బి)ని చెల్లించేందుకు ప్ర‌ధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్య‌క్ష‌త‌ న జ‌రిగిన కేంద్ర మంత్రివ‌ర్గ స‌మావేశం ఆమోదం తెలిపింది.  దీని మూలం గా ఖ‌జానా పై 2,024.40 కోట్ల రూపాయ‌ల మేర‌కు వ్య‌య భారం ప‌డుతుంది.

 

శ్రీ‌ న‌రేంద్ర మోదీ నాయ‌క‌త్వం లోని ప్ర‌భుత్వం 78 రోజుల వేత‌నం తో కూడిన బోన‌స్ ను కొనసాగించడం ఇది వ‌రుస‌గా ఆరో సంవ‌త్స‌రం.  ఈ ప్ర‌భుత్వం దీని ని ఎన్న‌డూ త‌గ్గించ‌ లేదు.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/productivitylinked4W0O.jpg

 

ప్ర‌యోజ‌నాలు:

అర్హ‌త క‌లిగిన రైల్వే ఉద్యోగుల‌కు (ఆర్‌పిఎఫ్‌/ఆర్‌పిఎస్ఎఫ్ సిబ్బంది మిన‌హా) 2018-19 ఆర్థిక సంవ‌త్స‌రానికి గాను 78 రోజుల వేత‌నాని కి స‌మాన‌మైన‌టువంటి పిఎల్‌బి ని చెల్లించ‌డం వ‌ల్ల పెద్ద సంఖ్య లోని రైల్వే ఉద్యోగుల కు రైల్వే ల ప‌నితీరు ను మెరుగు ప‌ర‌చ‌డం లో ప్రేర‌ణ ల‌భించ‌డం తో పాటు ఉత్పాద‌క‌త స్థాయి లు కూడా మ‌రింతగా ఇనుమ‌డిస్తాయి.  దీనికి తోడు, పారిశ్రామిక శాంతి ని ప‌రిర‌క్షించిన‌ట్లు కూడా అవుతుంది.

 

నాన్-గజెటెడ్ రైల్వే ఉద్యోగుల‌ కు అందరి కి పిఎల్‌బి ని చెల్లించడం అంటే రైల్వేల ను స‌మ‌ర్ధ‌వంతం గా న‌డ‌పడం కోసం వారు అందిస్తున్న‌టువంటి తోడ్పాటు ను గుర్తించ‌డ‌మే అవుతుంది.

 

రైల్వే సిబ్బంది మ‌రియు వారి కుటుంబాలు పెద్ద సంఖ్య లో ఉన్నందువ‌ల్ల ఈ గుర్తింపు వారంద‌రి లోను స‌మాన‌త్వాన్ని, ఇంకా స‌మ్మిళిత్వ భావ‌న ను పెంపొందించగలుగుతుంది.

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/JAVEDKAR%20ON%20RAILWAY%20BONUS%20.mp4

 

**



(Release ID: 1585489) Visitor Counter : 164