ఆర్థిక మంత్రిత్వ శాఖ
2020 నాటికి ‘అందరికీ గృహాలు’ లక్ష్యాన్ని సాధించనున్న ప్రధాన మంత్రి ఆవాస్ యోజన - గ్రామీణ్ (పిఎంఎజి-జి)
Posted On:
05 JUL 2019 1:40PM by PIB Hyderabad
కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్, లోక్ సభ లో 2019-20 బడ్జెట్ ప్రవేశపెడుతూ, గత ఐదేళ్ళ లో గ్రామీణ ప్రాంతాలలో 1.54 కోట్ల గృహాల నిర్మాణం పూర్తయిందని తెలిపారు. రెండవ దశలో2019-22 మధ్య 1.95 కోట్ల గృహాల నిర్మాణం జరగనుందని, ఆమె తెలిపారు. అర్హులైన లబ్ధిదారులకు వీటిని అప్పగిస్తారని ఆమె అన్నారు. ఈ గృహాలలో మరుగుదొడ్లు, విద్యుత్తు, ఎల్పిజి కనెక్షన్ వంటి సౌకర్యాలు ఉంటాయి.
ప్రధాన మంత్రి గ్రామ సడక్ యోజన (పిఎంజిఎంస్‌వై) కింద రానున్న ఐదేళ్ళలో రూ. 80,250 కోట్ల వ్యయంతో 1,25,000 కిలో మీటర్ల రహదారుల నిర్మాణం జరగనుందని మంత్రి అన్నారు. గత వెయ్యి రోజులలో రోజుకు 130-135 కిలో మీటర్ల మేర రోడ్డు నిర్మాణం జరిగినందువల్ల ఇది సాధ్యమైందని, మంత్రి పేర్కొన్నారు. 20,000 కి.మీ మేరకు, ఈ రోడ్లను ప్లాస్టిక్ వ్యర్థాలతో నిర్మాంచారు.
ఉజ్జ్వల, సౌభాగ్య యోజన: కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్, ఉజ్జ్వల, సౌభాగ్య యోజన.. గ్రామాలలో అనేక కుటుంబాల జీవన శైలిని మెరుగు పరచిందనీ, 2020 నాటికి, స్వాతంత్యం వచ్చిన 75సంవత్సరాలకు, ప్రతి కుటుంబానికీ వంట గ్యాస్, విద్యుత్తు లభ్యమవుతుందని తెలిపారు.
***
(Release ID: 1577585)