ఆయుష్

హోమియోపతి లో సంస్కరణలు

కేంద్రీయ హోమియోపతి మండలి పదవీకాలం 2018 మే 18వ తేదీ నుండి రెండేళ్ళ పాటు పొడిగింపు

హోమియోపతి సెంట్రల్ కౌన్సిల్ ( సవరణ) బిల్లు, 2019 కి ఆమోదం తెలిపిన మంత్రివర్గం

Posted On: 12 JUN 2019 7:55PM by PIB Hyderabad

హోమియోపతి సెంట్రల్ కౌన్సిల్ (సవరణ) బిల్లు, 2019 కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత న జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం ఆమోదం తెలిపింది. 

ప్రభావం: 

ఈ బిల్లు కేంద్రీయ మండలి పునర్వ్యవస్థీకరణ కాలాన్ని ప్రస్తుతం ఉన్నటువంటి ఒక సంవత్సర కాలం నుండి  రెండు సంవత్సరాల కు పెంచదలుస్తోంది.  తద్వారా గవర్నర్ల బోర్డు పదవీకాలాన్ని మరొక సంవత్సరం పాటు పొడిగించేందుకు వీలవుతుంది.  ఈ పొడిగింపు 2019 మే నెల 17వ తేదీ నుండి వర్తిస్తుంది. 
  
ఇది కేంద్రీయ హోమియోపతి మండలి అధికారాలను వినియోగించుకోవడానికి, విధుల ను నిర్వహించడానికి సహాయకారి కాగలదు. 

అమలు: 

ఈ బిల్లు హొమియోపతి సెంట్రల్ కౌన్సిల్ ( సవరణ) ఆర్డినెన్సు, 2019 స్థానం లోకి రానుంది.  దీనితో గవర్నర్ల బోర్డు పదవీకాలం మరొక సంవత్సరం పాటు పొడిగింపబడుతుంది.
 
పూర్వరంగం:

మండలి ని పునర్ వ్యవస్థీకరించేటంత వరకు కేంద్రీయ హొమియోపతి మండలి వ్యవహారాల బాధ్యత ను హోమియోపతి వైద్య విధానం లో పేరొందిన నిపుణులు, అర్హులైన హోమియోపతి వైద్యులు, ప్రముఖ పరిపాలకుల తో కూడిన గవర్నర్ల బోర్డు కు అప్పగించడం జరిగింది.  హోమియోపతి రాష్ట్ర రిజిస్టర్లు నవీకరించకపోవడం, అదే కాలం లో సాధారణ ఎన్నికల కారణం గా సంవత్సరం లోపు కేంద్రీయ హోమియోపతి మండలి పునర్వ్యవస్థీకరణ జరగకపోవడం తో మండలి పదవీకాలాన్ని పొడిగించడం జరిగింది. 


**


(Release ID: 1574488)