హోం మంత్రిత్వ శాఖ

జమ్ము & కశ్మీర్ లో అంతర్జాతీయ సరిహద్దు ను ఆనుకొనివున్న ప్రాంతాల నివాసుల కు ఊరట

వారు ఉద్యోగాల భర్తీ లో, పదోన్నతి లో, ఇంకా వృత్తి విద్య కోర్సుల ప్రవేశాల లో రిజర్వేశన్ ప్రయోజనాన్ని పొందవచ్చు

జమ్ము & కశ్మీర్ రిజర్వేశన్ (సవరణ) బిల్లు , 2019 కి ఆమోదం తెలిపిన మంత్రివర్గం

బిల్లు ను పార్లమెంట్ ఉభయ సభల లో ప్రవేశపెట్టనున్నారు.

Posted On: 12 JUN 2019 7:52PM by PIB Hyderabad

కేంద్ర ప్రభుత్వ ప్రజాహిత చర్యల లో భాగంగా ప్రత్యేకం గా అభివృద్ధి బాట లో చివరన ఉన్న వారి కి కూడా ప్రయోజనం చేకూరే విధం గా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత న జరిగిన కేంద్ర మంత్రివర్గ  సమావేశం జమ్ము &  కశ్మీర్ రిజర్వేశన్ (సవరణ) బిల్లు , 2019 కు ఆమోదాన్ని తెలిపింది.  పార్లమెంట్ తదుపరి సమావేశాల లో   ఉభయ సభల లో ఈ మేరకు బిల్లు ను ప్రవేశపెట్టడం జరుగుతుంది.  

మంత్రివర్గం తీసుకొన్న ఈ నిర్ణయం ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ దార్శనికత కు అనుగుణం గా “సబ్ కా సాథ్, సబ్ కా వికాస్,  సబ్ కా విశ్వాస్”కు కట్టుబడిన ప్రభుత్వ ప్రజానుకూల వైఖరి ని ప్రతిబింబిస్తోంది.  

లాభాలు: 

జమ్ము &  కశ్మీర్ లో అంతర్జాతీయ సరిహద్దు కు సమీపం లోని ప్రాంతాలలో నివసించే వారి కి ఊరట కలుగుతుంది.  దీని వల్ల వారికి దీర్ఘకాలిక ప్రయోజనాలు లభిస్తాయి.  

వారు ఇప్పుడు నేరు నియామకం, పదోన్నతి మరియు  వేరు వేరు వృత్తి విద్య కోర్సుల ప్రవేశాల లో రిజర్వేశన్ ప్రయోజనాల ను పొందవచ్చును. 

ఆశయాలు:  

ఈ బిల్లు  జమ్ము &  కశ్మీర్ రిజర్వేశన్ చట్టం, 2004 కు సవరణ ల ద్వారా  “జమ్ము &  కశ్మీర్ రిజర్వేశన్ (సవరణ) ఆర్డినెన్సు, 2019”కు దారి తీస్తుంది.  ఇంతకు ముందు జమ్ము &  కశ్మీర్ లో వాస్తవిక నియంత్రణ రేఖ (ఎఎల్ఒసి)ని ఆనుకొని వున్న ప్రాంతాల లో నివసించే వారు రిజర్వేశన్ పరిధి లో ఉండగా వారితో సమానం గా అంతర్జాతీయ సరిహద్దు కు సమీపం లోని ప్రాంతాల వారి ని కూడా ఈ బిల్లు చేర్చుతుంది.

పూర్వరంగం:  

జమ్ము &  కశ్మీర్ రిజర్వేశన్ చట్టం, 2004 మరియు వాస్తవిక నియంత్రణ రేఖ కు సమీపం లో నివసించే వారు సహా విభిన్న శ్రేణుల కోసం నేరు నియామకంలో రిజర్వేశన్, ప్రభుత్వ సర్వీసులలో పదోన్నతులు,  వివిధ కేటగిరీల కు చెందిన వృత్తి విద్య కోర్సులలో ప్రవేశాలకై రిజర్వేశన్ ఏర్పాటు ను ప్రసాదించే రూల్స్, 2005 లో లో చేర్చడం జరుగ లేదు.  అందువల్ల వీరికి  చాలా కాలం గా దీని తాలూకు ప్రయోజనాలు లభించకుండా ఉన్నాయి.    

సరిహద్దు ఆవల నుండి నిరంతరం జరుగుతున్న దాడుల తీవ్రత ను ఎదుర్కొంటూ తీవ్ర ఉద్రిక్తతల కు లోనవుతున్నందువల్ల అంతర్జాతీయ సరిహద్దు సమీప ప్రాంతాల లో నివసించే వారు సామాజిక, ఆర్ధిక, విద్య రంగాల లో వెనుకబడిపోయారు.  సరిహద్దు ఆవల నుండి తరచు గా జరిగే కాల్పుల వల్ల సరిహద్దు లో నివసించే ప్రజలు సురక్షిత ప్రాంతాల కు తరలిపోవలసి వచ్చేది.  దాని వల్ల వారి చదువు దెబ్బ తినేది.  విద్యాసంస్థలు చాలా రోజులు పాటు మూతబడి ఉండేవి. 

అందువల్ల వాస్తవిక నియంత్రణ రేఖ కు సమీపం లో నివసించే వారి తో సమానం గా అంతర్జాతీయ సరిహద్దు లో నివసించే వారి కి కూడా రిజర్వేశన్ ప్రయోజనాలు కల్పించడం న్యాయం అని భావించడం జరిగింది. 

రాష్ట్రపతి పాలన అమలు లో ఉన్నప్పుడు రాష్ట్ర అసెంబ్లీ అధికారాలు పార్లమెంటు కు దఖలు పడుతాయి.  ఈ కారణం గా జమ్ము &  కశ్మీర్ రిజర్వేశన్ (సవరణ) ఆర్డినెన్సు, 2019 స్థానం లో బిల్లు ను తీసుకురావాలని నిర్ణయించడం జరిగింది. ఈ బిల్లు ను పార్లమెంటు యొక్క ఉభయ సభల లో ప్రవేశపెడతారు.  


**



(Release ID: 1574486) Visitor Counter : 42


Read this release in: English , Tamil , Kannada