గృహ నిర్మాణం మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ
హౌసింగ్ ఎండ్ హ్యూమన్ సెటిల్ మెంట్ రంగం లో సాంకేతిక సహకారం తో పాటు సంబంధిత సమాచారం యొక్క ఆదాన ప్రదానాన్ని ప్రోత్సహించడం కోసం భారతదేశం మరియు మొరాకో మధ్య ఎంఒయు వివరాలను మంత్రివర్గం దృష్టి కి తీసుకురావడమైంది
Posted On:
27 MAR 2019 1:56PM by PIB Hyderabad
హౌసింగ్ ఎండ్ హ్యూమన్ సెటిల్ మెంట్ రంగం లో సాంకేతిక సహకారం తో పాటు సంబంధిత సమాచారం యొక్క ఆదాన ప్రదానాన్ని ప్రోత్సహించడం కోసం భారతదేశం మరియు మొరాకో మధ్య అవగాహనపూర్వక ఒప్పంద పత్రం (ఎంఒయు)పై 2019వ సంవత్సరం ఫిబ్రవరి లో సంతకాలైన సంగతి ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత న జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం దృష్టి కి తీసుకురావడమైంది.
ఈ ఎంఒయు యొక్క అమలు హౌసింగ్ ఎండ్ హ్యూమన్ సెటిల్ మెంట్ రంగాల లో ఉభయ దేశాల మధ్య ద్వైపాక్షిక సహకారాన్ని బలోపేతం చేయగలదు. నగరాల కు ఎదురయ్యే సవాళ్ళ ను పరిష్కరించడం లో ఇరు దేశాలు సహకరించుకొంటాయి. ఈ క్రమం లో రెండు దేశాల మధ్య వ్యాపార సంబంధాల ను మరియు వాణిజ్య సంబంధాల ను మెరుగుపరచడమే కాకుండా స్థిర ప్రాతిపదిక న సమ్మిళిత పట్టణ ప్రాంతాల వృద్ధి ని ప్రోత్సహించడం ధ్యేయం గా ఉండబోతోంది. ఇందులో భాగం గా ప్రధానం గా తక్కువ ఖర్చు అయ్యే గృహాల నిర్మాణాన్ని పెద్ద ఎత్తున చేపట్టడం తో పాటు నీటి సరఫరా, పారిశుధ్యం, పట్టణ ప్రాంత రవాణా, స్మార్ట్ నగరాల అభివృద్ధి ల వంటి వాటిని కూడా చేపట్టనున్నారు.
**
(Release ID: 1569657)