మంత్రిమండలి

గృహ రంగం లో స‌హ‌కారం కోసం భార‌త‌దేశం మ‌రియు సౌదీ అరేబియా ల మ‌ధ్య కుదిరిన ఎంఒయు వివరాల ను మంత్రివర్గం దృష్టి కి తీసుకురావడమైంది

Posted On: 27 MAR 2019 1:53PM by PIB Hyderabad

గృహ రంగం లో స‌హ‌కారం కోసం భార‌త‌దేశం మ‌రియు సౌదీ అరేబియా మ‌ధ్య 2019వ సంవ‌త్స‌రం ఫిబ్ర‌వ‌రిలో సంత‌కాలైన ఒక అవ‌గాహ‌నపూర్వ‌క ఒప్పంద పత్రం (ఎంఒయు) వివరాల ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత న జ‌రిగిన కేంద్ర మంత్రివర్గ స‌మావేశాని కి తెలియజేయడమైంది.  

ఈ ఎంఒయు త‌క్కువ ఖ‌ర్చు తో కూడిన/అల్పాదాయ వర్గాల ఇళ్ళ నిర్మాణం సహా గృహ రంగం లో సాంకేతిక స‌హ‌కారాన్ని ప్రోత్స‌హించడం తో పాటు  రెండు దేశాల గృహ నిర్మాణ ప‌థ‌కాలు, మౌలిక స‌దుపాయాల క‌ల్ప‌న ప‌థ‌కాల లో కంపెనీ లు మ‌రియు అధికారులు అధికం గా పాలుపంచుకొనేట‌ట్లు కూడా చూస్తుంది.  గృహ నిర్మాణ రంగం లో ఆధునిక నిర్మాణ ప‌ద్ధ‌తులను అభివృద్ధిపరచడానికి మ‌రియు బ‌దిలీ కి సంబంధించిన జ్ఞానాన్ని ప‌ర‌స్ప‌రం పంచుకోవ‌డాన్ని కూడా ఇది ప్రోత్స‌హిస్తుంది.  అలాగే, ఈ రంగం లో ప‌రిశోధ‌న ను మ‌రియు అభివృద్ధి (ఆర్ & డి)ని సైతంఈ ఎంఒయు ప్రోత్స‌హిస్తుంది.  


** 



(Release ID: 1569655) Visitor Counter : 139