గృహ నిర్మాణం మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ

ఢిల్లీ లో అన‌ధికార కాల‌నీ ల నివాసుల కు యాజ‌మాన్యం లేదా బ‌దిలీ/త‌న‌ఖా హ‌క్కు ను క‌ట్ట‌బెట్టే/ గుర్తించే ప్ర‌క్రియ‌ ను సిఫార‌సు చేసేందుకుగాను ఒక సంఘాన్ని నియమించే ప్ర‌తిపాద‌న కు ఆమోదం తెలిపిన మంత్రివ‌ర్గం

Posted On: 07 MAR 2019 2:39PM by PIB Hyderabad

ఢిల్లీ లో అన‌ధికార కాల‌నీ ల (యుసిసి) నివాసుల కు యాజ‌మాన్యం లేదా బ‌దిలీ/త‌న‌ఖా హ‌క్కు ను క‌ట్ట‌బెట్టే/  గుర్తించే ప్ర‌క్రియ‌ ను సిఫార‌సు చేసేందుకు ఒక సంఘాన్ని వేసే ప్ర‌తిపాద‌న కు ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అధ్యక్ష‌త న‌ జ‌రిగిన కేంద్ర మంత్రివ‌ర్గ స‌మావేశం ఆమోదం తెలిపింది.   దిగువన పేర్కొన్న స‌భ్యుల తో ఏర్పాట‌య్యే ఈ సంఘాని కి ఢిల్లీ లెఫ్టెనంట్ గ‌వ‌ర్న‌ర్ అధ్య‌క్ష‌త వ‌హిస్తారు:


i.  వైస్ చైర్ మన్, ఢిల్లీ డివెలప్ మెంట్ అథారిటీ (డిడిఎ);
 
ii. అడిశనల్ సెక్రటరీ, మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ & అర్బన్ అఫైర్స్ (ఎంఒహెచ్ యుఎ), భారత ప్రభుత్వం;

iii.  చీఫ్ సెక్రటరీ, ఢిల్లీ ఎన్ సిటి యొక్క ప్రభుత్వం ;

iv. ఢిల్లీ తూర్పు, ఉత్తర మరియు దక్షిణ మున్సిపల్ కార్పొరేశన్ ల  కమిశనర్ లు;
 
v.  చైర్ మన్, ఢిల్లీ అర్బన్ ఆర్ట్స్ కమిశన్;

vi.  ప్రొఫెసర్, అర్బన్ ట్రాన్స్ పోర్ట్, స్కూల్ ఆఫ్ ప్లానింగ్ & ఆర్కిటెక్చర్ (ఎస్ పిఎ), ఢిల్లీ

vii.  అర్బన్ ప్లానర్ & డైరెక్టర్, నేశనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ అర్బన్ అఫైర్స్  

viii.  పూర్వ డైరెక్టర్,  ఢిల్లీ ఫైర్ సర్వీసెస్; మరియు 
 
ix.  ప్రిన్సిపల్ కమిశనర్, డిడిఎ,  కార్యదర్శి.


ఏర్పాటు చేసిన సంఘం త‌న నివేదిక ను 90 రోజుల లోప‌ల ఎంఒహెచ్‌యుఎ కు స‌మ‌ర్పిస్తుంది.  సంఘం ఈ నివేదిక ను స‌మ‌ర్పించిన త‌రువాత ఈ విష‌యాన్ని మంత్రివ‌ర్గ స‌చివాలయం దృష్టి కి తీసుకొని వ‌స్తారు.  సంఘం సిఫార్సుల‌ ను ప‌రిశీలించిన అనంత‌రం తదుప‌రి చ‌ర్య తీసుకోవ‌డం జ‌రుగుతుంది.

ప్ర‌యోజ‌నాలు:

సంఘం యొక్క సిఫారసు లు ఢిల్లీ లో అన‌ధికారిక కాల‌నీ ల‌లో నివ‌సిస్తున్న ప్ర‌జ‌ల కు యాజ‌మాన్యం లేదా బ‌దిలీ/ త‌న‌ఖా హ‌క్కు ల‌ను ద‌ఖ‌లు ప‌ర‌చ‌డం కోసం ఒక దారిని ప‌రుస్తాయి.  ఢిల్లీ లో అన‌ధికారిక కాల‌నీల నివాసుల కు పైన ప్ర‌స్తావించిన‌టువంటి హ‌క్కుల ను ద‌ఖ‌లు ప‌ర‌చ‌డం అనే అంశాన్ని ప‌రిశీల‌న కు స్వీక‌రించ‌డం ఇదే తొలిసారి.


** 


(Release ID: 1568185)