గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ
"దీన్‌దయాళ్ అంత్యోదయ యోజన- జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ (డిఎవై-ఎన్ఆర్ఎల్ఎం)" కింద జాతీయ గ్రామీణ ఆర్థిక పరివర్తన ప్రాజెక్టు కు కేంద్ర కేబినెట్ ఆమోదం
Posted On:
19 FEB 2019 9:01PM by PIB Hyderabad
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర కేబినెట్ , దీన్‌దయాళ్ అంత్యోదయ యోజన- గ్రామీణ జీవనోపాధుల మిషన్ (డిఎవై- ఎన్ ఆర్ఎల్ఎం) కింద జాతీయ గ్రామీణ ఆర్థిక పరివర్తన ప్రాజెక్టు (ఎన్ ఆర్ ఇ టి పి) పేరు తో విదేశీ ఆర్ధిక సహాయం తో ప్రాజెక్టు అమలుకు ఆమోదం తెలిపింది. ప్రపంచబ్యాంకు నుంచి రుణ సహాయంతో(ఐబిఆర్‌డి క్రెడిట్) దీనిని అమలు చేస్తారు.
ప్రయోజనాలు:
ఇందుకు సాంకేతిక సహాయాన్ని ఎన్.ఆర్.ఇ.టి.పి అందజేస్తుంది. ఉన్నత స్థాయిలో అమలు చేసే ఈ పథకం వల్ల జీవనోపాధి ప్రోత్సాహానికి, ఆర్థిక వనరుల అందుబాటుకు, డిజిటల్ ఫైనాన్స్ విషయం లో చొరవను పెంచడానికి, జీవనోపాధి కి సంబంధించిన కార్యక్రమాల కు దోహదపడుతుంది.
పథకం ముఖ్యాంశాలు:
డిఎవై-ఎన్ఆర్ ఎల్ ఎం సమాజంలోని అత్యంత పేద వారి అభ్యున్నతి లక్ష్యంగా ప్రత్యేక దృష్టి పెడుతుంది. వారికి ఆర్ధిక వనరులు అందుబాటు లోకి తెచ్చే విషయమై ఆర్థిక సమ్మిళిత పై దృష్టి పెడుతుంది. ఎన్.ఆర్.ఇ.టి.పి కింద వినూత్న ప్రాజెక్టులు చేపట్టడం జరుగుతుంది. ఆర్థిక సమ్మిళిత కు ప్రత్యామ్నాయ మార్గాలు చూస్తుంది. అలాగే వాల్యూ చెయిన్ మార్గాల ను ఏర్పరచడం, గ్రామీణ ఉత్పత్తులు, జీవనోపాధి కార్యకలాపాల ప్రోత్సాహం లో వినూత్న పోకడల ను ప్రవేశపెట్టడం, ఆర్ధిక వనరుల అందుబాటు కల్పించడం, డిజిటల్ ఫైనాన్స్, జీవనోపాధిని పెంచే కార్యకలాపాల ను మరింత ఉన్నత స్థాయి కి తీసుకు పోవడం వంటివి ఇందులో ఉన్నాయి.
డిఎవై-ఎన్ఆర్ ఎల్ఎం పంచాయతీరాజ్ సంస్థలు, కమ్యూనిటీ ఆధారిత సంస్థలు (సిబిఒ) ల మధ్య పరస్పర ప్రయోజనకరమైన నిర్వహణా సంబంధాన్ని ఏర్పాటు చేస్తుంది. ఎన్.ఆర్.ఎల్.ఎం సంస్థలు, పంచాయతీరాజ్ సంస్థలు కలిసి పని చేయగల వివిధ అంశాల కు సంబంధించి ఎన్‌ఆర్ఎల్ఎం ఒక కార్యకలాపాల పత్రాన్ని రూపొందించింది. దీనిని అన్ని రాష్ట్ర గ్రామీణ జీవనోపాధి మిషన్‌ల కు పంపిణీ చేయడం జరిగింది.
***
(Release ID: 1565534)
Visitor Counter : 185