మంత్రిమండలి

బిహార్, గుజరాత్‌, హ‌ర్యానా, హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌, జ‌మ్ము & క‌శ్మీర్ (రెండు), ఝార్‌ ఖండ్‌, క‌ర్నాట‌క‌, కేర‌ళ‌, ఒరిస్సా, పంజాబ్, రాజ‌స్థాన్ మ‌రియు త‌మిళ నాడు రాష్ట్రాల లో కేంద్రీయ విశ్వ‌విద్యాల‌యాల చ‌ట్టం, 2009 ప్ర‌కారం కొత్త‌ గా ఏర్పాటు చేసిన 13 కేంద్రీయ విశ్వ‌విద్యాల‌యాల కు స‌వ‌రించిన వ్య‌య అంచ‌నా (ఆర్‌సిఇ)లకు ఆమోదం తెలిపిన మంత్రివ‌ర్గం

Posted On: 16 JAN 2019 4:05PM by PIB Hyderabad

13 నూత‌న కేంద్రీయ విశ్వ‌విద్యాల‌యాల‌ కు పున‌రావృత్త వ్యయం తో పాటు కేంప‌స్ ల‌లో అవ‌స‌ర‌మైన మౌలిక స‌దుపాయాల‌ ను ఏర్పాటు చేయ‌డం కోసం 3,639.32 కోట్ల రూపాయ‌ల ను ఖ‌ర్చు చేసేందుకు ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అధ్య‌క్ష‌త‌ న జ‌రిగిన కేంద్ర మంత్రివ‌ర్గ స‌మావేశం ఆమోదం తెలిపింది.  ఈ ప‌నులు 36 నెల‌ల లోప‌ల పూర్తి కానున్నాయి.

ఈ కేంద్రీయ విశ్విద్యాల‌యాల‌ కు మంత్రివ‌ర్గం ఇంత‌కు ముందు 3,000 కోట్ల రూపాయ‌ల కు ఆమోదం తెలియజేయగా ఆ మొత్తాని కి  అద‌నం గా ఖర్చయిన 1,474.65 కోట్ల రూపాయ‌ల కు కూడా మంత్రివ‌ర్గం ఎక్స్‌-పోస్ట్ ఫ్యాక్టో ఆమోదముద్ర వేసింది. 

కొత్త కేంద్రీయ విశ్వ‌విద్యాల‌యాలను బిహార్, గుజరాత్‌, హ‌ర్యానా, హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌, జ‌మ్ము & క‌శ్మీర్ (రెండు), ఝార్‌ఖండ్‌, క‌ర్నాట‌క‌, కేర‌ళ‌, ఒరిస్సా, పంజాబ్, రాజ‌స్థాన్ మ‌రియు త‌మిళ నాడు రాష్ట్రాల లో కేంద్రీయ విశ్వవిద్యాల‌యాల చ‌ట్టం, 2009 ప్ర‌కారం స్థాపించడమైంది.  వాటిలో-

బిహార్ లోని గ‌య లో  సెంట్ర‌ల్ యూనివ‌ర్సిటీ ఆఫ్ సౌత్ బిహార్‌;
మ‌హేంద‌ర్ గ‌ఢ్ లోని సెంట్ర‌ల్ యూనివ‌ర్సిటీ ఆఫ్ హ‌రియాణా;
జమ్ము లోని సెంట్ర‌ల్ యూనివ‌ర్సిటీ ఆఫ్ జ‌మ్ము;
రాంచీ లోని సెంట్ర‌ల్ యూనివ‌ర్సిటీ ఆఫ్ ఝార్‌ ఖండ్‌;
శ్రీ‌న‌గ‌ర్ లోని సెంట్ర‌ల్ యూనివ‌ర్సిటీ ఆఫ్ క‌శ్మీర్‌;
గుల్బ‌ర్గా లోని సెంట్ర‌ల్ యూనివ‌ర్సిటీ ఆఫ్ క‌ర్నాట‌క‌;
కాస‌ర్‌గోడ్ లోని సెంట్ర‌ల్ యూనివ‌ర్సిటీ ఆఫ్ కేర‌ళ‌;
కోరాపుట్ లోని సెంట్ర‌ల్ యూనివ‌ర్సిటీ ఆఫ్ ఒడిశా;
బఠిండా లోని సెంట్ర‌ల్ యూనివ‌ర్సిటీ ఆఫ్ పంజాబ్‌;
రాజ‌స్థాన్ లోని బంద‌ర్ సింద్ రీ లో గ‌ల సెంట్ర‌ల్ యూనివ‌ర్సిటీ రాజ‌స్థాన్;
తిరువ‌రూర్ లోని సెంట్ర‌ల్ యూనివ‌ర్సిటీ ఆఫ్ త‌మిళ నాడు;
గుజ‌రాత్ లోని సెంట్ర‌ల్ యూనివ‌ర్సిటీ ఆఫ్ గుజ‌రాత్‌ లతో పాటు 
సెంట్ర‌ల్ యూనివ‌ర్సిటీ ఆఫ్ హిమాచ‌ల్ ప్ర‌దేశ్ 
-ఉన్నాయి.

ప్ర‌భావం:

ఇది ఉన్న‌త విద్య అవ‌కాశాల‌ను పెంచుతుంది.  అంతేకాకుండా ఇత‌ర విశ్వ‌విద్యాల‌యాలు అనుక‌రించ‌ద‌గిన మార్గ‌ద‌ర్శ‌క ప్ర‌మాణాల‌ ను కూడా నెల‌కొల్ప‌నుంది.  విద్య సంబంధ స‌దుపాయాల లో ప్రాంతీయ అస‌మాన‌త‌ల‌ ను త‌గ్గించ‌డం లో కూడా ఇది స‌హాయ‌కారి కానుంది.


**



(Release ID: 1560290) Visitor Counter : 206