మంత్రిమండలి

పౌర మరియు వాణిజ్య విషయాల్లో భారత్, మొరాకో మధ్య చట్టపరమైన పరస్పర సహకార ఒప్పందాన్ని ఆమోదించిన మంత్రిమండలి

Posted On: 08 NOV 2018 8:46PM by PIB Hyderabad

పౌర మరియు వాణిజ్య విషయాల్లో భారత్, మొరాకో మధ్య చట్టపరమైన పరస్పర సహకార ఒప్పందాన్ని - ప్రధానమంత్రి  నరేంద్రమోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రిమండలి  ఆమోదించింది. 

విశిష్ట లక్షణాలు :

i.      సమన్లు మరియు ఇతర న్యాయపరమైన పత్రాలు లేదా ప్రక్రియల సేవలు; 

ii.     పౌర విషయాల్లో సాక్ష్యాల సేకరణ; 

iii.      డాక్యుమెంట్లు, రికార్డింగుల సమర్పణ, గుర్తింపు లేదా పరిశీలన;

iv.      పౌర విషయాల్లో సాంఖ్యాలు సేకరించడానికి "లెటర్ అఫ్ రిక్వెస్ట్" అమలు;   మరియు 

v.      మధ్యవర్తిత్వ ఆదేశాల గుర్తింపు మరియు అమలు. 

ప్రయోజనాలు : 

 

         ఈ ఒప్పందం రెండు దేశాల పౌరులకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ ఒప్పందానికి స్ఫూర్తి, సారాంశం, భాష గా ఉన్న రెండు దేశాల మధ్య పౌర, వాణిజ్య విషయాల్లో స్నేహ బంధం మరియు ఫలవంతమైన సహకారాన్ని పెంపొందించుకోవాలనే ఆకాంక్షను కూడా ఇది నెరవేరుస్తుంది.  సమన్లు, న్యాయ పత్రాలు, లెటర్స్ అఫ్ రిక్వెస్ట్, తీర్పులను అమలు చేయడం, మధ్యవర్తిత్వ తీర్పులు వంటి సేవల్లో పరస్పర సహకారాన్ని - భారత, మొరాకో దేశాల మధ్య ఈ ఒప్పందం - మరింతగా విస్తరిస్తుంది. 


 

నేపధ్యం :

         

భారత, ఆఫ్రికా దేశాల మధ్య సంబంధాలు స్వాతంత్య్రం ముందు నుంచి నెలకొని ఉన్నాయి.   భారత్, మొరాకో దేశాలు సుహృద్భావ, స్నేహపూర్వకమైన సంబంధాలను ఆనందించాయి. అనేక సంవత్సరాలుగా ద్వైపాక్షిక సంబంధాలు గణనీయమైన ప్రగతిని సాధించాయి.   రెండు దేశాలు అలీన ఉద్యమంలో పాల్గొన్నాయి.   ఐక్యరాజ్యసమితి లో మొరాకో వలస రాజ్యాల ఉపసంహరణకు, మొరాకో స్వాతంత్య్ర ఉద్యమానికీ - భారతదేశం మద్దతు పలికింది.   భారతదేశం 1956 జూన్ 20వ తేదీన మొరాకో ను గుర్తించింది, 1957 లో సంబంధాలను ఏర్పరచుకుంది.   మొరాకో తో ద్వైపాక్షిక సహాకారాన్ని పెంపొందించుకోవలసిన అవసరం ఉందని భారతదేశం విశ్వసిస్తోంది.   పౌర మరియు వాణిజ్య విషయాల్లో రెండు దేశాల మధ్య సహకారాన్ని విస్తరించుకోవలసిన ఆవశ్యకతను భారతదేశం గుర్తించింది. 

*****



(Release ID: 1552213) Visitor Counter : 226