కార్మిక, ఉపాధికల్పన మంత్రిత్వ శాఖ

భారత్, ఇటలీ దేశాల మధ్య కార్మిక, ఉపాధి రంగాల్లో నిరంతర శిక్షణ మరియు విద్య కోసం అవగాహనా ఒప్పందాన్ని ఆమోదించిన కేంద్ర మంత్రి మండలి.

Posted On: 08 NOV 2018 8:44PM by PIB Hyderabad

భారత్, ఇటలీ దేశాల మధ్య కార్మిక, ఉపాధి రంగాల్లో నిరంతర శిక్షణ మరియు విద్య కోసం అవగాహనా ఒప్పందాన్ని - ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రి మండలి ఆమోదం తెలియజేసింది. 


ప్రయోజనాలు :

పని ప్రపంచంలో  మంచి పనిని ప్రోత్సహించడానికి అవసరమైన శిక్షణ, విద్యా కార్యక్రమాల విస్తరణకు ఈ అవగాహనా ఒప్పందం దోహదపడుతుంది. 

శిక్షణా విధానాలు, పద్ధతులపై సంయుక్త శిక్షణా కార్యక్రమాల నిర్వహణ ;
వివిధ  భాగస్వాములకు అవసరమైన నూతన శిక్షణను అభివృద్ధి చేయడం  ;
కార్మిక మరియు ఉపాధి పై వివిధ ఇతివృత్తలలో ప్రత్యేక శిక్షణా కార్యక్రమాల నిర్వహణ  ;
శిక్షణా పద్దతుల అంచనా వేయడం ;
శిక్షణా కార్యక్రమాలను - ముఖ్యంగా కార్మిక పరిపాలన, శిక్షణా పద్ధతుల పంపిణీ, సులభతరం చేయడంలో ఒకరికొకరు సహకరించుకోవడం, విద్యా పర్యటనలను నిర్వహించడం వంటి కార్యక్రమాలలో - మేలైన పద్ధతులను పరస్పరం ఇచ్చిపుచ్చుకోవడం ;
పరిజ్ఞానాన్ని, సమాచారాన్ని పంచుకోవడం కోసం శిక్షకులను ఒకరికొకరు మార్పిడి చేసుకోవడం. 


ప్రధాన ప్రభావం :

పని ప్రపంచంలో పరివర్తనల నుండి ఎదురయ్యే సవాళ్ల విషయంలో రెండు సంస్థల సాంకేతిక సామర్ధ్యాల పెంపు పై ఈ అవగాహనా ఒప్పందం ప్రభావం ప్రధానంగా ఉంటుంది.   ఇది అంతర్జాతీయ శిక్షణా కార్యక్రామాల సాంకేతిక సామర్ధ్యాలను అభివృద్ధి చేయడం, నిర్వహించడంతో పాటు ఆసియా పసిఫిక్ ప్రాంతంలో ప్రముఖ శిక్షణా సంస్థ గా వి.వి.గిరి జాతీయ శ్రామిక సంస్థ (వివిజిఎన్ ఎల్ ఐ) అంచనా వేస్తుంది.   ఆసియా పసిఫిక్ ప్రాంతం నుండి విస్తారంగా సామాజిక భాగస్వాములకు ఈ అవగాహనా ఒప్పందం విస్తరిస్తుంది. 

నేపధ్యం :

i.      భారత ప్రభుత్వ కార్మిక మరియు ఉపాధి మంత్రిత్వ శాఖ కింద స్వతంత్ర సంస్థ - నోయిడాలోని వి.వి.గిరి జాతీయ కార్మిక సంస్థ (వి.వి.జి.ఎన్.ఎల్.ఐ) మరియు టురిన్ లోని అంతర్జాతీయ కార్మిక సంస్థ కు చెందిన అంతర్జాతీయ శిక్షణా కేంద్రం (ఐటిసి-ఐఎల్ఓ) 2012 లో ఒక అవగాహనా ఒప్పందంపై సంతకాలు చేసి - పరిజ్ఞానం మరియు అనుభవాలను పరస్పరం ఇచ్చిపుచ్చుకుంటూ అనేక కార్యకలాపాలపై సహకరించుకుంటున్నాయి.   వృత్తిపరమైన సహకారాన్ని కొనసాహించుకోడానికి సంస్థల మధ్య భాగస్వామ్యాన్ని సరిదిద్దడానికి ఈ అవగాహన ఒప్పందాన్ని ఉద్దేశించారు. 


ii.      అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్ఓ) కు చెందిన అంతర్జాతీయ శిక్షణా కేంద్రం (ఐటిసి) టురిన్ లో 1964 లో నెలకొల్పబడింది.  అంతర్జాతీయ స్థాయి లో కార్మిక సమస్యలపై వివిధ కోణాల్లో శిక్షణ ఇవ్వడానికి ఇది ఒక అతి ముఖ్యమైన కేంద్ర బిందువుగా అంచనా వేయబడింది.   ఉపాధి, కార్మిక, మానవ వనరుల అభివృద్ధి, సామర్ధ్య నిర్మాణం వంటి అంశాలపై అంతర్జాతీయ నైపుణ్యానికి ఐటిసి ఒక పెద్ద కేంద్రంగా ఉంది.   కార్మిక, ఉపాధి రంగంలో శిక్షణా కార్యక్రమాలలో నిమగ్నమైన ప్రముఖ సంస్థలతో భాగస్వామ్యం కుదుర్చుకోవాలన్నది ఐటిసి ప్రధాన ఉద్దేశ్యాలలో ఒకటి. 
***** 



(Release ID: 1552212) Visitor Counter : 104


Read this release in: English , Tamil , Kannada