ఆర్థిక మంత్రిత్వ శాఖ

భార‌త‌దేశం లో తాయిపే ఎక‌నామిక్ అండ్ క‌ల్చ‌ర‌ల్ సెంట‌ర్ కు మ‌రియు తాయిపే లోని ఇండియా తాయిపే అసోసియేశన్ కు మధ్య ద్వైపాక్షిక పెట్టుబ‌డి ఒప్పందం పై సంత‌కాల‌కు ఆమోదం తెలిపిన మంత్రివ‌ర్గం

Posted On: 24 OCT 2018 1:09PM by PIB Hyderabad

భార‌త‌దేశం లో తాయిపే ఎక‌నామిక్ అండ్ క‌ల్చ‌ర‌ల్ సెంట‌ర్ (టిఇసిసి) కు మ‌రియు తాయిపే లోని ఇండియా తాయిపే అసోసియేష‌న్ (ఐటిఎ) కు మధ్య ద్వైపాక్షిక పెట్టుబ‌డి ఒప్పందం (బిఐఎ)పై సంత‌కాల‌కు ప్రధాన మంత్రి శ్రీ‌ నరేంద్ర మోదీ అధ్య‌క్ష‌త‌న జ‌రిగిన కేంద్ర మంత్రివ‌ర్గ స‌మావేశం ఆమోదం తెలిపింది.

బిఐఎ ఉభ‌య ప‌క్షాల మ‌ధ్య పెట్టుబ‌డి ప్ర‌వాహాల ను పెంచే అవ‌కాశం ఉంది.  అలాగే ఇది టిఇసిసి కి మ‌రియు ఐటిఎ కు మ‌ధ్య పెట్టుబ‌డుల కు తగిన ర‌క్ష‌ణ ను అందించ‌ గ‌లుగుతుంది.  పెట్టుబ‌డుల‌ కు సంబంధించిన అంశాల లో వివ‌క్ష కు తావు ఉండన‌టువంటి స‌మాన అవ‌కాశాలు గ‌ల క్షేత్రాన్ని ఏర్పరచడానికి పూచీ పడడం ద్వారా పెట్టుబ‌డిదారుల లో విశ్వాసాన్ని ఇది పెంపొందించ‌డం తో పాటు వారికి సౌకర్యాల స్థాయి ని పెంచనూగలదు.  విదేశీ ప్ర‌త్య‌క్ష పెట్టుబ‌డి (ఎఫ్‌డిఐ)కి భార‌త‌దేశాన్ని ఓ ప్ర‌ముఖ గ‌మ్య స్థానంగా చూపడం లో బిఐఎ స‌హాయ‌కారి కాగ‌ల‌దు.


**



(Release ID: 1550636) Visitor Counter : 93


Read this release in: English , Urdu , Tamil , Kannada