నీతి ఆయోగ్
సామాజిక, ఆర్థిక, పారిశ్రామిక, ప్రాంతీయ అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి రష్యన్ ఫెడరేషన్ ఆర్థికాభివృద్ధి మంత్రిత్వశాఖకు(ఎంఇడిఆర్ ఎఫ్), నీతి ఆయోగ్‌కు మధ్య అవగాహనా ఒప్పందానికి కేబినెట్ అనుమతి.
Posted On:
26 SEP 2018 4:12PM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్రకేబినెట్, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ ట్రాన్స్‌ఫార్మింగ్ ఇండియా ( ఎన్.ఐ.టి.ఐ) ఆయోగ్, రష్యన్ ఫెడరేషన్ ఆర్థికాభివృద్ధి మంత్రిత్వశాఖ (ఎం.ఇ.డి.ఆర్.ఎప్)కు మధ్య సామాజిక, ఆర్థిక, పారిశ్రామిక, ప్రాంతీయ అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి అవగాహనా ఒప్పందం కుదుర్చుకునేందుకు అనుమతినిచ్చింది.
సామాజిక, ఆర్థిక, పారిశ్రామిక, ప్రాంతీయ అభివృద్ధికి సంబంధించిన ఫ్రేమ్‌వర్క్ రూపకల్పన, వ్యూహాలు, కార్యక్రమాల అమలు విషయంలో పరస్పర సహకారాన్ని అందిపుచ్చుకోవడం ఈ అవగాహనా ఒప్పందం లక్ష్యం. ఇది ఒకరి సానుకూలతలను, మార్కెట్, సాంకేతికత, విధానాలు తదితరాలను మరొకరు అర్థం చేసుకోవడానికి అనువైన వాతావరణాన్ని, ఫ్రేమ్‌వర్క్‌ను కల్పిస్తుంది.
ఈ అవగాహనా ఒప్పందం కింది అంశాలలో సహకారానికి సంబంధించినదిః
1.పరస్పర ఆసక్తికలిగిన అంశాలకు సంబంధించిన ప్రాజెక్టులలో సంయుక్త పరిశోధనా ప్రాజెక్టుల నిర్వహణ, అమలు
2. అభివృద్ధి కార్యక్రమాలు, దానికి సంబంధించి ప్రభుత్వ వ్యూహాలు వంటి వాటితోసహా ఇరువైపులా పరస్పర ఆసక్తిగల పరిశోధన పనుల సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకోవడం,
3. ఇరుదేశాల వైపు నుంచి సంబంధిత నిపుణులు సంయుక్త కార్యక్రమాలలో పాల్గొనడం.
4. సెమినార్లు, సదస్సులు, అంగీకరించిన అజెండాపై సమావేశాలు నిర్వహించడం
5. ఇరువైపులా పరస్పర అనుమతితో పరస్పర సహకారం
(Release ID: 1547597)
Visitor Counter : 263