అంతరిక్ష విభాగం

స‌ముద్ర సంబంధ అవ‌గాహ‌న ఉద్య‌మ సంబంధిత స‌హ‌కారం అంశం పై భార‌త‌దేశానికి, ఫ్రాన్స్ కు మ‌ధ్య కుదిరిన ఒక ఒప్పందం అమ‌లును గురించి మంత్రివ‌ర్గం దృష్టి తీసుకు రావ‌డ‌మైంది

Posted On: 27 JUN 2018 3:47PM by PIB Hyderabad

భార‌త‌దేశానికి, ఫ్రాన్స్ కు మ‌ధ్య 2018 వ సంవత్సరం మార్చి నెల 10వ తేదీన సంత‌కాలు జ‌రిగిన ఇంప్లిమెంటింగ్ అరేంజ్‌ మెంట్ (ఐఎ) ఫ‌ర్ ప్రి- ఫార్ములేష‌న్ స్ట‌డీస్ ఆఫ్ ఎ మేరిటైమ్ డమేన్ అవేర్‌నెస్ మిశన్ ను గురించి ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అధ్య‌క్ష‌త‌న జ‌రిగిన కేంద్ర మంత్రివ‌ర్గ స‌మావేశం దృష్టి కి తీసుకురావ‌డ‌మైంది.

ఉభ‌య దేశాల‌కు సంబంధిత స‌మాచారాన్ని మ‌రియు సేవ‌ల‌ను అందించే ఉద్దేశంతో ప్ర‌తిపాదిత సంయుక్త ఉద్య‌మాన్ని అమ‌లు చేస్తారు.  స‌ముద్రంలో రాక‌పోక‌ల ప‌ర్య‌వేక్ష‌ణ‌, ఆదేశాల‌ను పాటించ‌ని నౌక‌ల‌ను గుర్తించ‌డం దీని ధ్యేయంగా ఉంది.  భార‌త‌దేశానికి మ‌రియు ఫ్రాన్స్ కు ప్ర‌యోజ‌నాలు ఉన్న‌టువంటి ప్రాంతాల‌లో నౌక‌ల ఆచుకీ తీయడానికి, గుర్తింపున‌కు మరియు ప‌ర్య‌వేక్ష‌ణ‌కు రెండు చివ‌ర‌ల సేవ‌ను ఈ ప‌ర్య‌వేక్ష‌క వ్య‌వ‌స్థ అందిస్తుంది.

ఇప్లిమెంటింగ్ అరేంజ్‌మెంట్ ప్రకారం.. భార‌తీయ అంత‌రిక్ష ప‌రిశోధ‌న సంస్థ (ఐఎస్ఆర్ఒ) మ‌రియు ఫ్రాన్స్ కు చెందిన‌ Centre Nationale Dètudes     Spatiales (సిఎన్ఇఎస్‌) లు ప్రి- ఫార్ములేష‌న్ స్టడీస్ కాలంలో సంయుక్తంగా వివిధ కార్య‌క‌లాపాల‌ను చేప‌ట్టి వాటి అధ్య‌య‌న ఫ‌లితాల‌ను స‌మీక్ష కోసం  ఆయా సీనియ‌ర్ మేనేజ్‌మెంట్ ల‌కు- ఈ విషయమై సంత‌కాలు జరిగిన తేదీ నుండి ఒక సంవ‌త్స‌ర కాలం లోప‌ల- నివేదిస్తాయి.


***


(Release ID: 1536858)
Read this release in: English , Tamil , Kannada