మంత్రిమండలి
స్థిరత్వంతో కూడిన పట్టణాభివృద్ధి రంగంలో సాంకేతిక సంబంధ సహకారం అంశం పై భారతదేశం మరియు యునైటెడ్ కింగ్ డమ్ లకు మధ్య కుదిరిన అవగాహన పూర్వక ఒప్పందానికి (ఎమ్ఒయు) ఆమోదం తెలిపిన మంత్రివర్గం
Posted On:
06 JUN 2018 3:25PM by PIB Hyderabad
స్థిరత్వంతో కూడిన పట్టణాభివృద్ధి రంగంలో సాంకేతిక సంబంధ సహకారం అంశం పై 2018 ఏప్రిల్ నెల లో భారతదేశం మరియు యునైటెడ్ కింగ్ డమ్ లకు మధ్య సంతకాలైన అవగాహన పూర్వక ఒప్పందం (ఎమ్ఒయు) యొక్క వివరాలను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం దృష్టికి తీసుకు వచ్చారు.
వివరాలు
స్థిరత్వంతో కూడిన పట్టణాభివృద్ధి రంగంలో భారతదేశం మరియు యుకె ల మధ్య సంస్థాగత సహకారానికి మార్గాన్ని సుగమం చేయడమే కాకుండా ఆ సహకారాన్ని పట్టిష్టపరచడం ఈ ఎమ్ఒయు యొక్క ఉద్దేశం. ఇందులో భాగంగా ఘన వ్యర్థాల నిర్వహణ, స్మార్ట్ సిటీస్ డివెలప్‌మెంట్, తక్కువ ఖర్చుతో పూర్తి అయ్యే హరిత గృహాల నిర్మాణం, వ్యర్థ జలాల నిర్వహణ, పట్టణ సంస్థలలో సామర్థ్య నిర్మాణం, పట్టణ ప్రాంతాలలో నైపుణ్యాల అభివృద్ధి, అర్బన్ మొబిలిటీ, ఇంటెలిజెంట్ ట్రాన్స్‌పోర్ట్ సిస్టమ్, యాత్రాప్రధానమైన ప్రగతి, ఆర్థిక సహాయానికి ఉద్దేశించిన కొత్త కొత్త మార్గాలతో పాటు సంతకాలు చేసిన సంస్థల మధ్య పరస్పర అంగీకారం కుదిరే మేరకు ఇతర రంగాలలోనూ సహకరించుకోవడం జరుగుతుంది.
అమలు సంబంధిత వ్యూహం
ఈ ఎమ్ఒయు లో భాగంగా కార్యక్రమాల అమలుకు ఒక సంయుక్త కార్యాచరణ బృందాన్ని (జెడబ్ల్యుజి) ఏర్పాటు చేయనున్నారు. ఈ సంయుక్త కార్యాచరణ బృందం ఒక ఏడాది భారతదేశం లోను, ఆ తదుపరి ఏడాది యుకె లోను సమావేశమవుతుంది.
ప్రధాన ప్రభావం
ఉభయ దేశాల మధ్య స్థిరత్వంతో కూడిన పట్టణాభివృద్ధి రంగంలో బలవత్తరమైన, గాఢమైన మరియు దీర్ఘకాలికమైన సహకారాన్ని ఈ ఎంఓయూ ప్రోత్సహిస్తుంది.
లబ్ధి ని పొందే వర్గాలు
ఈ ఎంఓయూ స్మార్ట్ సిటీస్ డివెలప్ మెంట్, ఘన వ్యర్థాల నిర్వహణ, పట్టణ ప్రాంతాలలో నైపుణ్యాల అభివృద్ధి, అర్బన్ మొబిలిటీ, ఇంటెలిజెంట్ ట్రాన్స్‌పోర్ట్ సిస్టమ్ లతో పాటు యాత్రాప్రధానమైన ప్రగతి వంటి రంగాలలో
ఉపాధిని కల్పించగలదని ఆశిస్తున్నారు.
***
(Release ID: 1534694)