ప్రధాన మంత్రి కార్యాలయం

ఐఎన్ఎస్ వి తారిణి నావిక సిబ్బంది తో ప్ర‌ధాన మంత్రి భేటీ

Posted On: 23 MAY 2018 2:19PM by PIB Hyderabad

తెర చాప ఓడ ఐఎన్ఎస్ వి తారిణి లో ప్రపంచాన్ని విజయవంతంగా చుట్టివచ్చిన ఇండియన్ నేవీ కి చెందిన ఆరుగురు మహిళా నావికాధికారులు ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ తో ఈ రోజు భేటీ అయ్యారు.

‘నావికా సాగర్ పరిక్రమ’ గా ప్రసిద్ధమైన ఈ అన్వేష యాత్రలో సభ్యులంతా మహిళలే.  భారతీయ నావికా సిబ్బంది భూమండలాన్ని చుట్టి వచ్చినటువంటి ఒకటో అన్వేష యాత్ర ఇది. 

ముఖాముఖిలో భాగంగా, నావికా సిబ్బంది వారి యొక్క మిశన్ తాలూకు విభిన్న అంశాలను, వారి సన్నాహాలను, శిక్షణను, యాత్ర లోని అనుభవాలను గురించి ప్రధాన మంత్రి దృష్టి కి తీసుకు వచ్చారు.

వారి మిశన్ సఫలం అయినందుకు నావికా సిబ్బంది కి ప్రధాన మంత్రి అభినందనలు తెలిపారు.   యాత్ర లో ఎదురైనటువంటి విశిష్ట అనుభవాలను పంచుకోవలసిందిగాను, వాటిని అక్షరబద్ధం చేయవలసిందిగాను వారిని ఆయన ప్రోత్సహించారు.  నావికా దళం ప్రధాన అధికారి అడ్మిరల్ సునీల్ లాంబా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఓడ కు లెఫ్టెనంట్ కమాండర్ వర్తిక జోశి సారథ్యం వహించగా, లెఫ్టెనంట్ కమాండర్ లు ప్రతిభ జామ్ వాల్, పి. స్వాతి మరియు లెఫ్టెనంట్ లు ఎస్. విజయ దేవి, బి. ఐశ్వర్య, ఇంకా పాయల్ గుప్త లు ఈ యాత్రాబృందంలో సభ్యురాళ్లుగా పాలుపంచుకొన్నారు. 


***

 



(Release ID: 1533201) Visitor Counter : 108