ప్రధాన మంత్రి కార్యాలయం
డాక్టర్ ఆంబేడ్ కర్ జాతీయ స్మారకాన్ని ఢిల్లీ లోని అలీపుర్ రోడ్డు లో రేపు ప్రారంభించనున్న ప్రధాన మంత్రి
Posted On:
12 APR 2018 6:25PM by PIB Hyderabad
బాబాసాహెబ్ ఆంబేడ్ కర్ జయంతి కి ముందు రోజైన ఏప్రిల్ 13 వ తేదీ నాడు డాక్టర్ ఆంబేడ్ కర్ జాతీయ స్మారకాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఢిల్లీ లోని 26, అలీపుర్ రోడ్డు లో ప్రారంభించనున్నారు.
ఈ ప్రాంతంలోనే డాక్టర్ ఆంబేడ్ కర్ 1956 వ సంవత్సరం డిసెంబర్ 6వ తేదీ నాడు మహాపరినిర్వాణాన్ని పొందారు.
26, అలీపుర్ రోడ్డు లోని డాక్టర్ ఆంబేడ్ కర్ మహాపరినిర్వాణ స్థలాన్ని 2003వ సంవత్సరం డిసెంబర్ లో అప్పటి ప్రధాని శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయి దేశ ప్రజలకు అంకితం చేశారు.
స్మారక భవన నిర్మాణానికి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2016వ సంవత్సరం మార్చి నెల 21వ తేదీ నాడు పునాది రాయిని వేశారు.
భారతదేశ రాజ్యాంగ నిర్మాత అయిన బాబాసాహెబ్ ఆంబేడ్ కర్ స్మారక భవనాన్ని ఒక పుస్తకం ఆకారంలో తీర్చిదిద్దడమైంది.
ఈ స్మారకం లోని గ్రంథాలయం స్టాటిక్ మీడియా, డైనమిక్ మీడియా, ఆడియో-విజువల్ కంటెంట్ తో పాటు మల్టి మీడియా టెక్నాలజీలను విరివిగా వినియోగించుకొంటూ డాక్టర్ ఆంబేడ్ కర్ యొక్క జీవన ఘట్టాలను మరియు భారతదేశానికి ఆయన అందించినటువంటి తోడ్పాటు ను కళ్లకు కడుతుంది.
ఒక ధ్యాన మందిరాన్ని కూడా ఇందులో భాగంగా ఏర్పాటు చేయడమైంది. భవనం ముందు భాగంలో విద్యుత్తు దీప కాంతులు, తోరణ ద్వారాలు, ఒక బోధి వృక్షం, ఒక మ్యూజికల్ ఫౌంటెన్.. ఇవి ఈ స్మారకంలోని ఇతర ముఖ్య ఆకర్షణలుగా ఉంటాయి.
***
(Release ID: 1528917)
Visitor Counter : 135