మంత్రిమండలి

ఆదాయం పై ప‌న్ను ల‌కు సంబంధించి కోశ సంబంధిత ఎగ‌వేత‌ నివారణకు, రెండు సార్లు ప‌న్ను విధించడాన్ని త‌ప్పించేందుకు భారతదేశం, కతర్‌ ల మ‌ధ్య‌ ఒప్పందం యొక్క స‌వ‌రణకు ఆమోదం తెలిపిన మంత్రివర్గం

Posted On: 21 MAR 2018 8:28PM by PIB Hyderabad

ఆదాయం పై ప‌న్ను ల‌కు సంబంధించి కోశ సంబంధిత ఎగ‌వేత‌ ను నివారించడం, రెండు సార్లు ప‌న్ను విధింపు ను త‌ప్పించడం కోసం ప్ర‌ధాన‌ మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అధ్య‌క్ష‌త‌న స‌మావేశ‌మైన కేంద్ర మంత్రివర్గం భారతదేశం, కతర్‌ ల మ‌ధ్య‌ అమలవుతున్న ఒప్పందంలో స‌వ‌రణ కు ఆమోదాన్ని తెలిపింది. 

ప్ర‌స్తుతం అమ‌లవుతున్న రెండు సార్లు పన్ను విధింపు నివారక ఒప్పందం  (డిటిఎఎ) పై కతర్‌ తో 1999 ఏప్రిల్ 7వ తేదీన సంత‌కాలవగా, ఈ ఒప్పందం 2000 సంవ‌త్స‌రం జ‌న‌వ‌రి 15వ తేదీ నుండి అమ‌లు లోకి వ‌చ్చింది.  స‌వ‌రించిన డిటిఎఎ నిబంధ‌న‌లు తాజా ప్ర‌మాణాల‌పై స‌మాచారాన్ని ఇచ్చి పుచ్చుకోవ‌డం, ట్రీటీ శాపింగ్‌ ను నియంత్రించేందుకు ప్ర‌యోజ‌నాల ప్రొవిజ‌న్‌ ను ప‌రిమితం చేయ‌డం, భార‌తదేశ‌పు ఇత‌ర ఒప్పందాల‌కు అనుగుణంగా నిబంధ‌న‌ల స‌వ‌రింపు ల వంటి వాటికి సంబంధించిన‌వి.  స‌వ‌రించిన డిటిఎఎ నిబంధ‌న‌లు.. జి-20 ఒఇసిడి బేస్ ఇరోఝన్ & ప్రాఫిట్ శిఫ్టింగ్ (బిఇపిఎస్) ప్రోజెక్టు లోని యాక్ష‌న్-14 లో పొందుపరచినటువంటి పరస్పర ఒప్పంద ప్రక్రియ తో పాటు యాక్షన్ 6 లో భాగమైన ఒడంబడిక దుర్వినియోగం సంబంధిత కనీస ప్రమాణాలకు.. తుల తూగుతాయి. ఈ ప్రోజెక్టు లో భారతదేశం స‌మాన భాగస్వామిగా ఉన్నది.


***



(Release ID: 1525977) Visitor Counter : 124


Read this release in: English , Assamese , Tamil