మంత్రిమండలి

స్వ‌తంత్ర సైనిక్ స‌మ్మాన్ యోజ‌న‌ (ఎస్ఎస్ఎస్ వై)ని 2017-2020 కాలానికి పొడిగించేందుకు ఆమోదం తెలిపిన మంత్రివర్గం

Posted On: 07 MAR 2018 7:17PM by PIB Hyderabad

ప్ర‌ధాన‌ మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అధ్య‌క్ష‌త‌న సమావేశమైన కేంద్ర మంత్రివర్గం 2017 మార్చి 31 తో ముగిసిన స్వతంత్ర సైనిక్ స‌మ్మాన్ యోజ‌న‌(ఎస్ ఎస్ ఎస్ వై) ని 12వ పంచ‌వ‌ర్ష ప్ర‌ణాళిక అనంత‌రం 2017-2020 వ‌ర‌కు కొన‌సాగించేందుకు ఆమోదం తెలిపింది.

 

ఈ అనుమ‌తి కార‌ణంగా స్వాతంత్ర్య స‌మ‌ర‌ యోధుల‌కు, దేశ స్వాతంత్ర్య స‌మ‌రంలో అందించిన సేవ‌ల‌కు గౌర‌వపూర్వ‌కంగా నెల‌వారీ స‌మ్మాన్ పెన్ష‌న్ అందుతుంది.  వారి మ‌ర‌ణానంత‌రం, వారిపై ఆధార‌ప‌డ్డ భార్య‌ లేదా భ‌ర్త లేదా వివాహం కాని , నిరుద్యోగ కుమార్తెలు, వారిపై ఆధార‌ప‌డ్డ త‌ల్లితండ్రులు, లేదా ప్ర‌భుత్వం పేర్కొన్న నిబంధ‌న‌లు, విధి విధానాల‌కు అనుగుణంగా పెన్ష‌న్ అందిస్తారు.

 

ఆర్థిక భారం:

 

2017-2020 మ‌ధ్య ఎస్ఎస్‌ఎస్‌వై కొన‌సాగించ‌డానికి అయ్యే ఆర్థిక‌ భారం 2552.93 కోట్ల రూపాయ‌లు.  ప్ర‌తి సంవ‌త్స‌రం ఖ‌ర్చు అయ్యే రిక‌రింగ్ మొత్తం కింది విధంగా ఉండ‌నుంది:

                                                                                      (రూపాయలు కోట్ల‌ లో)

వరుస

సంఖ్య‌

సంవత్సర వారీ ఖ‌ర్చు అంచ‌నాలు

2017-18

 

2018-19

 

2019-20

 

మూడు సంవ‌త్సరాలకు కలుపుకొని మొత్తం

1.

 

స్వ‌తంత్ర సైనిక్ స‌మ్మాన్ పెన్ష‌న్‌

750

 

825

 

907

 

2482

 

2.

 

 

స్వాతంత్ర్య‌ స‌మ‌ర‌ యోదుల‌కు

ఉచిత రైల్వే పాసులు

10

 

30

 

30

 

70

 

3.

 

స్వాతంత్ర్య స‌మ‌ర‌ యోధుల‌కు

శాశ్వ‌త ఇళ్లు

 

0.31

 

0.31

 

0.31

 

0.93

 

 

 

మొత్తం

760.31

 

855.31

 

937.31

 

2552.93

 

 

 

పూర్వరంగం:

పోర్ట్ బ్లేయర్ సెల్యులర్‌ జైలులో నిర్బంధంప‌బ‌డిన స్వాతంత్ర్య‌ స‌మ‌ర‌ యోధులను గౌర‌వించుకోవ‌డంలో భాగంగా 1969 లో భార‌త ప్ర‌భుత్వం, పూర్వ‌-అండ‌మాన్ రాజ‌కీయ ఖైదీల పెన్ష‌న్ ప‌థకం 1969 ని ప్ర‌వేశ‌పెట్టింద‌. 1972లో ,  భార‌త స్వాతంత్ర్య ర‌జ‌తోత్స‌వాల సంద‌ర్భంగా స్వాతంత్ర్య స‌మ‌ర‌ యోదుల‌కు రెగ్యుల‌ర్ పెన్ష‌న్ ప‌థ‌కాన్ని ప్ర‌క‌టించారు.  ఆ త‌రువాత‌, 1.8.1980  నుండి స్వ‌తంత్ర సైనిక్ స‌మ్మాన్ పెన్ష‌న్ ప‌థ‌కం పేరుతో ఒక స‌ర‌ళీకృత ప‌థ‌కాన్ని అమ‌లు చేస్తూ వ‌చ్చారు.  2017-2018 వ సంవ‌త్స‌రం అనంత‌రం, ఈ ప‌థ‌కం పేరును స్వతంత్ర సైనిక్ స‌మ్మాన్ యోజ‌న గా మార్చారు.  మొత్తం 1,71,617 మంది స్వాతంత్ర్య స‌మ‌ర‌ యోదులు, అర్హులైన వారి వార‌సులకు ఇప్ప‌టి వ‌ర‌కు కేంద్ర స‌మ్మాన్ పెన్ష‌న్ మంజూరు చేయ‌డం జ‌రిగింది.

 

ప్ర‌స్తుతం 37,356 మంది స్వాతంత్ర్య స‌మ‌ర‌యోధులు , వారి వార‌సులైన పెన్ష‌న‌ర్లు ఈ ప‌థ‌కం కిందికి వ‌స్తున్నారు.  ఇందులో 12,657 మంది స్వాతంత్ర్య‌ స‌మ‌ర యోధులు , 23, 127 మంది స్వాతంత్ర్య స‌మ‌ర‌ యోదుల వార‌సులైన భార్య లేదా భ‌ర్త‌, 1572 మంది పెన్ష‌న్‌కు అర్హులైన కుమార్తెలు ఉన్నారు.  తొలుత ఈ ప‌థ‌కం కింద పెన్ష‌న్ నెల‌కు 200 రూపాయ‌లుగా ఉండేది, దానిని ఆ త‌రువాత ఎప్ప‌టిక‌ప్పుడు స‌వ‌రిస్తూ వ‌చ్చారు.  15.8.2016 నుండి అన్ని కేట‌గిరీల వారికి ఈ పెన్ష‌న్ మొత్తాన్ని పెంచారు.  అలాగే అప్ప‌టి నుండి పారిశ్రామిక కార్మికుల‌కు వ‌ర్తింపచేసే అఖిల భారత వినియోగ‌దారుల ధ‌ర‌ల‌ సూచీ ఆధారిత క‌ర‌వు భ‌త్యాన్ని స్వాతంత్ర్య స‌మ‌ర‌ యోధుల పెన్ష‌న‌ర్ల‌కు వ‌ర్తింప చేస్తుండ‌గా, దాని స్థానంలో కేంద్ర ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు వ‌ర్తించే విధంగా సంవ‌త్స‌రానికి రెండు సార్ల డిఎ విధానాన్ని తీసుకువ‌చ్చారు.  పెన్ష‌న‌ర్ల‌కు ఇచ్చే అల‌వెన్సును డియ‌ర్‌నెస్ రిలీఫ్ గా భావిస్తున్నారు.  వివిధ విభాగాల కేంద్ర స్వాతంత్ర్య స‌మ‌ర‌యోధుల‌కు పెన్ష‌న్ కింది విధంగా ఉంది.

 

 

క్ర‌మ

సంఖ్య‌

స్వాతంత్ర్య స‌మ‌ర‌యోదుల కేటగిరీ

15.08.2016

నుండి బేసిక్‌ పెన్ష‌న్ అమలు (నెల‌కు)

3 శాతం డిఆర్‌ తో క‌లిపి మొత్తం పెన్ష‌న్ రూపాయ‌ల‌లో (నెల‌కు)

1.

పూర్వ‌పు అండ‌మాన్ పెన్ష‌న‌ర్లు, భార్య లేదా భ‌ర్త రాజ‌కీయ ప‌ర‌మైన‌

30,000/-

30,900/-

2

బ్రిటిషు ఇండియా కు వెలుపల శిక్షను పొందిన స్వాధీనతాసేనాని/ /జీవన భాగస్వామి

28,000/-

28,840/-

3

ఇతర స్వాధీనతా సేనాని/ఎన్ఎ సహిత జీవన భాగస్వామి

26,000/-

26,780/-

4

ఆశ్రితులైన తల్లి-తండ్రి/ పుత్రులు, పుత్రికలు (ఏ సమయంలోనైనా ఎక్కువలో ఎక్కువగా ముగ్గురు పుత్రికలు)

రాశిలో 50% ఏదయితే స్వాతంత్ర్య సమర యోధుల కోసం అందుకొంటారో, అంటే.. 13,000/- నుండి మొదలుకొని 15,000/- వరకు

రాశిలో 50% ఏదయితే స్వాతంత్ర్య సమర యోధుల కోసం అందుకొంటారో, అంటే.. 13,390/- నుండి మొదలుకొని 15,450/- వరకు

 

 

 

 

73 శాతం స్వాతంత్ర్య స‌మ‌ర‌ యోధులైన పెన్షనరుల యొక్క బ్యాంకు ఖాతాల‌ను ఆధార్‌ తో ముడివేయడం జ‌రిగింది.  మరియు ఈ ఆర్థిక సంవ‌త్స‌రం లో 100 శాతం ఆధార్ సీడింగు ల‌క్ష్యాన్ని సాధించ‌గలమని భావిస్తున్నారు.

 

 

 

***

 

 (Release ID: 1523265) Visitor Counter : 718


Read this release in: English , Tamil