మంత్రిమండలి

భారత్ మరియు ఫ్రాన్స్ దేశాల మధ్య వలసలు మరియు రాకపోకల భాగస్వామ్య ఒప్పందంపై సంతకాలకు మంత్రి మండలి ఆమోదం తెలియజేసింది.

Posted On: 07 MAR 2018 7:25PM by PIB Hyderabad

భారత్ మరియు ఫ్రాన్స్ దేశాల మధ్య వలసలు మరియు రాకపోకల భాగస్వామ్య ఒప్పందంపై సంతకాలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రి మండలి ఆమోదం తెలియజేసింది.    ఫ్రాన్స్ అధ్యక్షులు త్వరలో చేపట్టే భారత పర్యటన సమయంలో ఈ ఒప్పందంపై సంతకాలు జరిగే అవకాశముంది.

ప్రజల మధ్య వ్యక్తిగత సంబంధాలను పెంపొందించడంలో, విద్యార్థులు, విద్యావేత్తలు, పరిశోధకులు, నైపుణ్యం కలిగిన వ్యక్తుల్లో చైతన్యాన్ని పెంపొందించడంలో,

రెండు దేశాల మధ్య అక్రమ వలసలు, మానవుల అక్రమ రవాణాలకు సంబంధించిన సమస్యల పరిష్కారంలో సహకారాన్ని పటిష్టపరచుకోవడంలో - ఈ ఒప్పందాన్ని  ఒక మైలు రాయిగా అభివర్ణించవచ్చు.   ప్రాన్స్ తో  బహుముఖంగా విస్తరిస్తున్న  భారత్ సంబంధాలకు ఈ ఒప్పందం ఒక సాక్ష్యంగా నిలుస్తుంది.  అదేవిధంగా రెండు పక్షాల మధ్య వృద్ధిచెందుతున్న  నమ్మకాన్నీ, విశ్వాసాన్నీ ఇది సూచిస్తుంది.   

ప్రాధమికంగా ఈ ఒప్పందం ఏడు సంవత్సరాలు అమలులో ఉంటుంది, అయితే, ఒక సంయుక్త కార్యాచరణ బృందం ద్వారా దానంతట అదే కొనసాగించడానికీ, పర్యవేక్షణ యంత్రాOగాన్ని ఏర్పాటు చేసుకోడానికీ అవకాశం ఉంది. 

 

****



(Release ID: 1523258) Visitor Counter : 85


Read this release in: English , Assamese , Tamil