మంత్రిమండలి

" పరస్పర విద్యార్హతల గుర్తింపు" పొందడానికి భారత్, ఫ్రాన్స్ దేశాల మధ్య ఒప్పందంపై సంతకాలు చేయడానికి మంత్రిమండలి ఆమోదం తెలియజేసింది.

Posted On: 07 MAR 2018 7:24PM by PIB Hyderabad

భారత్, ఫ్రాన్స్ దేశాల మధ్య మధ్య ఆమోదం, గుర్తింపు మరియు / లేదా అనుబంధ విద్యాసంస్థల లోని విద్యార్థులు పూర్తిచేసిన అధ్యయనానికీ, విద్యార్ధతలకు పరస్పర గుర్తింపు పొందడానికి వీలుకల్పించే ఒక  ఒప్పందంపై సంతకాలు చేయడానికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రిమండలి ఆమోదం తెలియజేసింది.   ఫ్రాన్స్ అధ్యక్షులు త్వరలో చేపట్టే భారత పర్యటన సమయంలో ఈ ఒప్పందంపై సంతకాలు జరిగే అవకాశముంది. 

భారత్, ఫ్రాన్స్ దేశాల మధ్య విద్యా సంబంధాలు మరింత మెరుగుపడేందుకు అదేవిధంగా ఇరుదేశాల మధ్య విద్యా సంబంధాలు దీర్ఘకాలం కొనసాగేందుకూ ఈ ఒప్పందం దోహదం చేస్తుంది.  ఒక దేశం నుండి విద్యార్థులు మరొక దేశానికి వెళ్లి అందుబాటులో ఉన్న సౌకర్యాలను వినియోగించుకుంటూ - తమ విద్యను వేరొక దేశంలో కొనసాగించడానికీ,  అలాగే భారతదేశంలో విద్యా ప్రమాణాలు పెంపొందించడానికి అనువుగా వినూత్న భాగస్వామ్యం / తోడ్పాటు మరియు పరిశోధన కార్యకలాపాలతో  తమ ఉన్నత విద్యార్హతలను పెంపొందించుకోడానికీ, ఈ ఒప్పందం దోహదకారి అవుతుంది.  

***


(Release ID: 1523225)
Read this release in: English , Assamese , Tamil