మంత్రిమండలి

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు రెండు శాతం కరవు భత్యం ఆమోదించిన మంత్రి మండలి

Posted On: 07 MAR 2018 7:21PM by PIB Hyderabad

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అదనపు విడత కరువు భత్యం మరియు  పింఛనుదారులకు కరవు సహాయం విడుదలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రి మండలి ఆమోదం తెలియజేసింది.  ధరల పెరుగుదలకు అనుగుణంగా మూల వేతనం / పింఛను మీద ప్రస్తుతం 5 శాతంగా ఉన్న డి.ఏ. కు అదనంగా మరో 2 శాతం చెల్లించాలని నిర్ణయించారు. ఈ పెంపుదల 2018 జనవరి ఒకటవ తేదీ నుంచి అమలులోకి వస్తుంది. 

ఈ నిర్ణయం ద్వారా 48.41 లక్షల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో పాటు 61.17 లక్షల పింఛనుదారులకు ప్రయోజనం చేకూరుతుంది. 

ఈ రెండు - కరువు భత్యం, కరవు సహాయం పెంపుదల వాళ్ళ దీనివల్ల ప్రభుత్వ ఖజానాపై ఏడాదికి రూ|| 6077.72 కోట్లు - అదేవిధంగా ఈ ఆర్ధిక సంవత్సరం 2018-19 (2018 జనవరి నుండి 2019 ఫిబ్రవరి వరకు 14 నెలలకు) రూ|| 7090.68 కోట్ల భారం పడుతుంది. 

 7వ కేంద్ర వేతన సంఘం సిఫార్సుల ఆధారంగా ఆమోదం పొందిన ఫార్ములా కు అనుగుణంగా ఈ పెరుగుదల నిర్ణయించడం జరిగింది. 

***



(Release ID: 1523218) Visitor Counter : 108


Read this release in: Urdu , English , Assamese , Tamil