మంత్రిమండలి
భారత్, ఫ్రాన్స్ దేశాల మధ్య పర్యావరణం రంగంలో సహకార ఒప్పందానికి మంత్రిమండలి ఆమోదం
प्रविष्टि तिथि:
07 MAR 2018 7:17PM by PIB Hyderabad
భారత్, ఫ్రాన్స్ దేశాల మధ్య పర్యావరణం రంగంలో సహకార ఒప్పందం పై సంతకాలు చేయడానికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ అధ్యక్షతన సమావేశమైన మంత్రిమండలి ఆమోదం తెలియజేసింది.
ఆయా దేశాలలో అమలులో ఉన్న చట్టాలు, న్యాయపరమైన నిబంధనలను పరిగణలోకి తీసుకుని, సమాన భాగం, అన్యోన్యత, పరస్పర ప్రయోజనాలు ఆధారంగా
వాతావరణ పరిరక్షణ, ప్రకృతి వనరుల యాజమాన్యం రంగంలో ఇరుదేశాల మధ్య ఈ సహకార ఒప్పందం - సన్నిహిత, దీర్ఘకాలిక సహకారాన్ని నెలకొల్పి, ప్రోత్సహిస్తుంది.
ఉత్తమమైన పర్యావరణ రక్షణ, ఉత్తమమైన పరిరక్షణ, వాతావరణ మార్పుకు అనుగుణంగా ఉత్తమ యాజమాన్యం, వన్యప్రాణి రక్షణ / పరిరక్షణ లకు అధునాతన పద్ధతులను ఈ సహకార ఒప్పందం రూపొందిస్తుందని భావిస్తున్నారు.
****
(रिलीज़ आईडी: 1523215)
आगंतुक पटल : 108