ప్రధాన మంత్రి కార్యాలయం

ప్ర‌పంచ రేడియో దినం సంద‌ర్భంగా శుభాకాంక్షలు తెలిపిన ప్ర‌ధాన మంత్రి

Posted On: 13 FEB 2018 1:14PM by PIB Hyderabad

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ప్ర‌పంచ రేడియో దినం సంద‌ర్భంగా, రేడియో తో ముడిపడి ఉన్న వారికి.. అంటే,   శ్రోతలతో పాటు ప‌రిశ్ర‌మ‌లో ప‌ని చేస్తున్న వారికి.. శుభాకాంక్షలు తెలిపారు. 

‘‘ప్ర‌పంచ రేడియో దినం నాడు రేడియో జ‌గ‌త్తుతో అనుబంధాన్ని క‌లిగివున్న వారు అంద‌రికీ.. శ్రోతలతో పాటు ఈ ప‌రిశ్ర‌మ‌లో విధులు నిర్వ‌హించడంలో నిమగ్నమైన వారికి.. శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తున్నాను.  ఈ మాధ్య‌మం నేర్చుకోవడానికి, అన్వేషించేందుకు, మనోల్లాసానికి, ఇంకా క‌ల‌సి ముందంజ వేయడానికి ఎల్లప్పటికీ ఒక కేంద్ర బిందువుగా ఉండుగాక‌.

రేడియో మ‌నందరినీ చేరువగా తీసుకువస్తుంది.  మ‌రి ‘మ‌న్‌ కీ బాత్’ (మ‌న‌సులో మాట‌) ద్వారా ఈ విష‌యాన్ని నేను నిరంతరం అనుభవంలోకి తెచ్చుకొంటున్నాను.

మీరు ఇంతవరకు ప్రసారమైనటువంటి మనసులో మాట యొక్క అన్ని కార్య‌క్ర‌మాలను https://www.narendramodi.in/mann-ki-baat లింకు ద్వారా  విన‌వచ్చు” అని ప్ర‌ధాన మంత్రి త‌న సందేశంలో పేర్కొన్నారు.

 
***



(Release ID: 1520520) Visitor Counter : 102