మంత్రిమండలి

సంవ‌త్స‌రాంత‌పు స‌మీక్ష 2017- మంత్రివర్గ నిర్ణ‌యాలు

Posted On: 27 DEC 2017 12:47PM by PIB Hyderabad

2017 లో మంత్రివర్గ నిర్ణ‌యాలు

04 జనవరి 2017

న్యూ ఢిల్లీ లోని ద్వార‌క‌ లో సెక్టార్ 24 లో ఉన్న 34.87 హెక్టార్ల భూమిని రెండో దౌత్య ఎంక్లేవ్ ఏర్పాటు కోసం ఢిల్లీ డివెల‌ప్ మెంట్ అథారిటీ నుండి భూమి మ‌రియు అభివృద్ధి కార్యాల‌యానికి బ‌దిలీ చేసేందుకు ఆమోదం తెలిపిన మంత్రివర్గం

న్యూ ఢిల్లీ లోని ద్వార‌క‌ లో సెక్టార్ 24 లో ఉన్న 34.87 హెక్టార్ల భూమిని రెండో దౌత్య ఎంక్లేవ్ ఏర్పాటు కోసం ఢిల్లీ డివెల‌ప్ మెంట్ అథారిటీ నుండి భూమి మ‌రియు అభివృద్ధి కార్యాల‌యానికి (ఎల్ అండ్ డిఒ) బ‌దిలీ చేసేందుకు ప్ర‌ధాన‌ మంత్రి శ్రీ న‌రేంద్ర‌ మోదీ అధ్య‌క్ష‌త‌న స‌మావేశ‌మైన కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.  
 
క‌స్ట‌మ్స్ విభాగంలో ప‌ర‌స్ప‌ర  స‌హ‌కారానికి భార‌త‌దేశం, ఉరుగ్వే ల మ‌ధ్య కుదిరిన ఒప్పందానికి ఆమోదం తెలిపిన మంత్రివర్గం

భార‌తదేశం, ఉరుగ్వే ల మ‌ధ్య క‌స్ట‌మ్స్ విభాగంలో  ప‌ర‌స్ప‌రం స‌హ‌కారం అందించుకొనేందుకు కుదిరిన ఒప్పందంపై సంత‌కాలు చేసేందుకు, ధ్రువీక‌రించుకునేందుకు ప్ర‌ధాన‌ మంత్రి శ్రీ న‌రేంద్ర‌ మోదీ అధ్య‌క్ష‌త‌న స‌మావేశ‌మైన కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 

వ్య‌వ‌సాయం, అనుబంధ రంగాలలో భార‌త‌దేశం, కెన్యా ల ద్వైపాక్షిక  స‌హ‌కార ఎంఒయుకు ఆమోదం తెలిపిన మంత్రివర్గం

వ్య‌వ‌సాయం, అనుబంధ రంగాలలో ప‌ర‌స్ప‌ర స‌హ‌కారం కోసం భార‌త‌దేశం, కెన్యా లు ఓ అవ‌గాహ‌నపూర్వక ఒప్పంద ప‌త్రం (ఎంఒయు) పై సంత‌కాలు చేసేందుకు ప్ర‌ధాన‌ మంత్రి శ్రీ న‌రేంద్ర‌ మోదీ అధ్య‌క్ష‌త‌న స‌మావేశ‌మైన కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.  
 
వ్య‌వ‌సాయం, అనుబంధ రంగాల్లో స‌హ‌కారంపై భార‌త‌దేశం, పోర్చుగ‌ల్‌ ల ఎంఒయు కు ఆమోదం తెలిపిన మంత్రివర్గం 

వ్య‌వ‌సాయం, అనుబంధ రంగాల్లో స‌హ‌కారం కోసం భార‌త‌, పోర్చుగ‌ల్ దేశాల మ‌ధ్య కుదిరిన అవ‌గాహ‌న పూర్వక ఒప్పంద ప‌త్రంపై సంత‌కాలు చేయ‌డానికి ప్ర‌ధాన‌ మంత్రి శ్రీ న‌రేంద్ర‌మోదీ అధ్య‌క్ష‌త‌న స‌మావేశ‌మైన కేంద్ర‌ మంత్రివర్గం ఆమోదం తెలిపింది.  
 
18 జనవరి 2017

కాలం చెల్లిన చ‌ట్టాల ఉప‌సంహ‌ర‌ణ‌కు ఆమోదం తెలిపిన మంత్రివర్గం 

 కాలం చెల్లిన 105 చ‌ట్టాల‌ను ఉప‌సంహ‌రించ‌డానికి వీలుగా చ‌ట్టాల ఉప‌సంహ‌ర‌ణ మ‌రియు స‌వ‌ర‌ణ బిల్లు 2017 ప్ర‌వేశ‌పెట్ట‌డానికి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 

 రోడ్డు ర‌వాణా మ‌రియు హైవేల రంగంలో ద్వైపాక్షిక స‌హ‌కారానికి భార‌తదేశం, యునైటెడ్ అర‌బ్ ఎమిరేట్స్ ల మ‌ధ్య ఎంఒయు కు ఆమోదం తెలిపిన మంత్రివర్గం 

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం రోడ్డు ర‌వాణా మ‌రియు హైవేల రంగంలో ద్వైపాక్షిక స‌హ‌కారానికి భార‌త‌దేశం, యునైటెడ్ అర‌బ్ ఎమిరేట్స్ ల మ‌ధ్య కుదిరిన ఎంఒయు కు ఆమోదం తెలిపింది. ఈ ఎంఒయు పై భార‌త రోడ్డు ర‌వాణా మ‌రియు హైవేల మంత్రిత్వ శాఖ‌, ఫెడ‌ర‌ల్ ర‌వాణా సంస్థ- భూమి మ‌రియు స‌ముద్ర‌ మండ‌లం, యుఏఇ లు సంత‌కాలు చేస్తాయి.  

జాతీయ చిన్న త‌ర‌హా పొదుపు నిధిలో 1-4-2016 నుండి రాష్ట్రాల‌కు మిన‌హాయింపు ఇవ్వ‌డానికి ఆమోదం తెలిపిన మంత్రివర్గం

అరుణాచ‌ల్ ప్ర‌దేశ్, కేర‌ళ‌, మ‌ధ్య‌ ప్ర‌దేశ్ లు మిన‌హా మిగ‌తా రాష్ర్ట ప్ర‌భుత్వాలు, కేంద్ర‌పాలిత ప్రాంతాల‌కు చిన్న త‌ర‌హా పొదుపు నిధిలో (ఎన్ఎస్ఎస్ఎఫ్‌) పెట్టుబ‌డుల నుండి మిన‌హాయింపు ఇచ్చేందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.  ఈ అనుమ‌తి 2016 ఏప్రిల్ ఒక‌టో తేదీ నుండి వ‌ర్తిస్తుంది.  అలాగే ఆహార స‌బ్సిడీ అవ‌స‌రాలను తీర్చేందుకు ఎన్ ఎస్ ఎస్ ఎఫ్ నుండి 45 వేల కోట్ల రూపాయ‌ల ఏక‌ కాల రుణం భార‌త ఆహార సంస్థ‌కు (ఎఫ్ సిఐ) అందించ‌డానికి కూడా ఆమోదం తెలిపింది.
  
శిక్ష‌ణ‌, స‌ర్టిఫికేష‌న్‌, వాచ్ కీపింగ్ (ఎస్ టిడిబ్ల్యు,78) ప్ర‌మాణాలు మ‌రియు స‌వ‌ర‌ణ‌ల‌కు అనుగుణంగా ప‌ర‌స్ప‌ర గుర్తింపు స‌ర్టిఫికేష‌న్ జారీపై భార‌త‌దేశం, యునైటెడ్ అర‌బ్ ఎమిరేట్స్ ల ఎంఒయుకు ఆమోదం తెలిపిన మంత్రివర్గం
 
ప‌ర‌స్ప‌ర పోటీ సామ‌ర్థ్య గుర్తింపు స‌ర్టిఫికెట్ల జారీకి యునైటెడ్ అర‌బ్ ఎమిరేట్స్, భార‌త్ మ‌ధ్య కుదిరిన ఎంఒయుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.  

భార‌త‌దేశం, యుఏఇ ల మ‌ధ్య స‌ముద్ర ర‌వాణాలో వ్య‌వ‌స్థాత్మ‌క స‌హ‌కార ఒప్పందానికి ఆమోదం తెలిపిన మంత్రివర్గం

స‌ముద్ర ర‌వాణా విభాగంలో వ్య‌వ‌స్థాత్మ‌క స‌హ‌కారానికి భార‌త‌దేశం, యునైటెడ్ అర‌బ్ ఎమిరేట్స్ (యుఎఇ) ల మ‌ధ్య కుదిరిన అవ‌గాహ‌న ఒప్పందానికి (ఎంఒయు) ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 

న‌వీక‌రించిన స్పెష‌ల్ ఇన్సెంటివ్ ప్యాకేజి స్కీముకు ఆమోదం తెలిపిన మంత్రివర్గం

ఎల‌క్ట్రానిక్ రంగంలో పెట్టుబ‌డి ప్రోత్సాహ‌కాలు క‌ల్పించేందుకు వీలుగా న‌వీక‌రించిన స్పెష‌ల్ ఇన్సెంటివ్ ప్యాకేజి స్కీమ్ (ఎం-సిప్‌) కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.  2020 సంవ‌త్స‌రం నాటికి ఎల‌క్ట్రానిక్స్ దిగుమ‌తులను సున్నా స్థాయికి త‌గ్గించ‌డం ల‌క్ష్యంగా ఈ నిర్ణ‌యం తీసుకున్నారు. 

వ్య‌వ‌సాయ‌, అనుబంధ రంగాలలో స‌హ‌కారానికి భార‌త‌దేశం, యుఎఇ ల మ‌ధ్య ఎంఒయు కు ఆమోదం తెలిపిన మంత్రివర్గం

వ్య‌వ‌సాయం, వ్య‌వ‌సాయ అనుబంధ రంగాలలో స‌హ‌కారానికి భార‌త‌దేశం, యునైటెడ్ అర‌బ్ ఎమిరేట్స్ (యుఎఇ) ల మ‌ధ్య కుదిరిన అవ‌గాహ‌నపూర్వక ఒప్పంద పత్రానికి (ఎంఒయు) ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 

చిన్న‌, మ‌ధ్య‌త‌ర‌హా ప‌రిశ్ర‌మ‌లు, న‌వ‌క‌ల్ప‌న‌ల రంగంలో స‌హ‌కారానికి భార‌త‌దేశం, యుఎఇ ల మ‌ధ్య కుదిరిన ఎంఒయు కు ఆమోదం తెలిపిన మంత్రివర్గం

 చిన్న‌, మ‌ధ్య‌త‌ర‌హా ప‌రిశ్ర‌మ‌లు, న‌వ‌క‌ల్ప‌న‌ల రంగాలలో ప‌ర‌స్ప‌రం స‌హ‌క‌రించుకునేందుకు భార‌తదేశం, యునైటెడ్ అర‌బ్ ఎమిరేట్స్ (యుఎఇ) ల మ‌ధ్య కుదిరిన అవ‌గాహ‌నపూర్వక ఒప్పంద పత్రానికి (ఎంఒయు) ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
 
ఝార్ ఖండ్ లో వ్య‌వ‌సాయ ప‌రిశోధ‌న సంస్థ ఏర్పాటుకు ఆమోదం తెలిపిన మంత్రివర్గం

 భార‌త వ్య‌వ‌సాయ ప‌రిశోధ‌న సంస్థ (ఐసిఎఆర్)- ఝార్ ఖండ్ ఏర్పాటుకు 12వ  డేర్ /ఐసిఏఆర్ ప్ర‌తిపాద‌న‌కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఆమోద‌ం తెలిపింది.  హ‌జారీబాగ్ జిల్లా లోని బ‌ర్హి బ్లాక్ లో ఝార్ ఖండ్ ప్ర‌భుత్వం కేటాయించిన వెయ్యి ఎక‌రాల స్థ‌లంలో 200.78 కోట్ల రూపాయ‌ల అంచ‌నా వ్య‌యంతో (నూరు శాతం ఐసిఎఆర్ వాటా) ఈ సంస్థ‌ను ఏర్పాటు చేస్తారు.

సూక్ష్మ‌, చిన్న‌ త‌ర‌హా ప‌రిశ్ర‌మ‌లకు మ‌ద్ద‌తుగా సూక్ష్మ‌, చిన్న త‌ర‌హా ప‌రిశ్ర‌మ‌ల క్రెడిట్ గ్యారంటీ ట్ర‌స్ట్ నిధి కార్ప‌స్ పెంపు ప్యాకేజికి ఆమోదం తెలిపిన మంత్రివర్గం

సూక్ష్మ‌, చిన్న‌త‌ర‌హా ప‌రిశ్ర‌మ‌లకు మ‌ద్ద‌తుగా సూక్ష్మ‌, చిన్న త‌ర‌హా ప‌రిశ్ర‌మ‌ల క్రెడిట్ గ్యారంటీ ట్ర‌స్ట్ నిధి కార్ప‌స్ పెంపు (సిజిటిఎంఎస్ ఇ) ప్యాకేజికి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం అమ‌లు అనంత‌ర ఆమోదం ప్ర‌క‌టించింది.  
 
పెరూతో వ్యాపార ఒప్పందం సంప్రతింపులకు ఆమోదం తెలిపిన మంత్రివర్గం

వ‌స్తువులు, సేవ‌లు మరియు పెట్టుబ‌డులకు సంబంధించి రూతో వ్యాపార ఒప్పందం కోసమని సంప్రతింపులు జరిపేందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 
 
సైబ‌ర్ సెక్యూరిటీలో భార‌త‌దేశం, వియ‌త్నాం ల ఎంఒయు కు ఆమోదం తెలిపిన మంత్రివర్గం

సైబ‌ర్ సెక్యూరిటీ విభాగంలో భార‌త‌దేశం, వియ‌త్నాం ల స‌హ‌కారానికి సంబంధించి ఈ ఉభ‌య దేశాల మ‌ధ్య కుదిరిన అవ‌గాహ‌నపూర్వక ఒప్పందానికి (ఎంఒయు) ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఎక్స్- పోస్ట్ ఫ్యాక్టో ఆమోదాన్నిచ్చింది.  2016 సెప్టెంబ‌రు 3వ తేదీన హ‌నోయ్ లో జ‌రిగిన ఒక కార్య‌క్ర‌మంలో భార‌తదేశానికి చెందిన ఇండియ‌న్ కంప్యూట‌ర్ ఎమ‌ర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (సిఇఆర్ టి-ఇన్‌) కు, వియ‌త్నాం కు చెందిన ప్ర‌జాభ‌ద్ర‌త మంత్రిత్వ శాఖ‌ కు మ‌ధ్య ఈ ఎంఒయు పై సంతకాలు అయ్యాయి. 
 
అంత‌రిక్షంలో ఇస్రో, జాక్సా ల మ‌ధ్య స‌హ‌కార ఎంఒయు కు ఆమోదం తెలిపిన మంత్రివర్గం

అంత‌రిక్ష స‌హ‌కారంపై భార‌తీయ అంత‌రిక్ష ప‌రిశోధ‌న సంస్థ (ఐఎస్ఆర్ఒ..‘ఇస్రో’) కు, జాపనీస్  ఏరోస్పేస్ రిసర్చ్ ఆర్గనైజేశన్ (జెఎఎక్స్ ఎ..‘జాక్సా’) కు మ‌ధ్య 2016 న‌వంబ‌ర్ 11వ తేదీన జ‌పాన్ లోని టోక్యో లో కుదిరిన అవ‌గాహ‌నపూర్వక ఒప్పందం (ఎంఒయు) గురించి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం దృష్టికి తీసుకు వ‌చ్చారు.

యువ‌జ‌న సంబంధిత అంశాలలో సహకారం పై భార‌త‌దేశం, ర‌ష్యా ల మ‌ధ్య  ఎంఒయు కు ఆమోదం తెలిపిన మంత్రివర్గం

యువ‌జ‌న వ్యవహారాల రంగంలో భారతదేశం, ర‌ష్యా ల మ‌ధ్య  చోటు చేసుకొనే ఆదాన ప్రదాన కార్యక్రమాలు ఈ రెండు దేశాల మ‌ధ్య మైత్రీ సంబంధాలను పటిష్టపరచడం మరియు ప్రజల మధ్య సంబంధ బాంధవ్యాలను ఏర్పరచడం ద్వారా యువతలో ఆలోచనలు, విలువలు మరియు సంస్కృతి యొక్క ఆదాన ప్రదానాల ప్రోత్సాహానికి దోహదం చేయనున్నాయి.  

 
ద‌క్షిణ కొరియా కు చెందిన ఇంట‌ర్ నేశన‌ల్ వ్యాక్సిన్ ఇన్ స్టిట్యూట్ (ఐవిఐ) లో భార‌తదేశం స‌భ్య‌త్వానికి ఆమోదం తెలిపిన మంత్రివర్గం

ఇంట‌ర్ నేశన‌ల్ వ్యాక్సిన్ ఇన్ స్టిట్యూట్ (ఐవిఐ) పాల‌క మండ‌లి లో భార‌తదేశం స‌భ్య‌త్వాన్ని స్వీకరించే ప్రతిపాదనకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.  దీనితో ద‌క్షిణ కొరియా లోని సియోల్ కేంద్రంగా ప‌ని చేస్తున్న ఐవిఐ కి ఏటా 5 ల‌క్ష‌ల యుఎస్ డాల‌ర్ల చందా ను భార‌తదేశం చెల్లించవలసివుంటుంది. 
 
ఇన్ఫర్మేశన్ టెక్నాలజీ, ఎల‌క్ట్రానిక్స్ రంగంలో స‌హ‌కారానికిగాను భార‌త‌దేశం, సెర్బియా ల ఎంఒయు కు  ఆమోదం తెలిపిన మంత్రివర్గం

స‌మాచార సాంకేతిక విజ్ఞానం, ఎల‌క్ట్రానిక్స్ రంగంలో స‌హ‌కారానికి గాను భార‌తదేశం, సెర్బియా ల మ‌ధ్య కుదిరిన అవ‌గాహ‌నపూర్వక ఒప్పందానికి (ఎంఒయు ) ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఎక్స్- పోస్ట్ ఫ్యాక్టో ఆమోదాన్నిచ్చింది.  
 
దేశంలో గ్రామీణ గృహ‌ నిర్మాణాన్ని ప్రోత్సహించేందుకు ఉద్దేశించిన ఒక కొత్త ప‌థ‌కానికి ఆమోదం తెలిపిన మంత్రివర్గం

 దేశంలో గ్రామీణప్రాంతాలలో గృహ‌నిర్మాణాన్ని ప్రోత్స‌హించేందుకు ఉద్దేశించిన ఒక కొత్త ప‌థ‌కాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది.  ఈ పథకంలో భాగంగా ప్రభుత్వం వ‌డ్డీ స‌బ్సిడీని సమకూర్చుతుంది.  ప్ర‌ధాన‌ మంత్రి ఆవాస్ యోజ‌న (గ్రామీణ్‌) [ పిఎంఎవై (జి) ] ప‌రిధి లోకి రానటువంటి  ప్ర‌తి ఒక్క గ్రామీణ ప్రాంత కుటుంబానికీ ఈ స‌బ్సిడీ లభిస్తుంది.
 
24 జనవరి 2017

జాతీయ ప్రాధాన్య‌త సంస్థ‌లుగా ఐఐఎం లు

ఇండియ‌న్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్ మెంట్ బిల్లు 2017 కు ఆమోదం తెలిపిన మంత్రివర్గం

ఇండియ‌న్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్ మెంట్ బిల్లు 2017 కు (ఐఐఎమ్) ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.  ఈ బిల్లు కింద ఐఐఎం ల‌ను జాతీయ ప్రాధాన్య‌త సంస్థ‌లుగా ప్ర‌క‌టించ‌వ‌చ్చు.  ఇలా ప్ర‌క‌టించ‌డం వ‌ల్ల ఆ సంస్థ‌లు త‌మ విద్య‌ార్థుల‌కు స్వంతంగా ప‌ట్టాలు ప్ర‌దానం చేయ‌గ‌లుగుతాయి. 
 
2016 న‌వంబ‌ర్‌, డిసెంబ‌ర్ లలో స్వ‌ల్ప‌కాలిక రుణాలు పొందిన వ్య‌వ‌సాయదారుల‌కు వ‌డ్డీ మాఫీ మ‌రియు స‌హ‌కార బ్యాంకుల‌కు నాబార్డ్ అందించిన అద‌న‌పు రీఫైనాన్సింగ్ పై వ‌డ్డీ స‌బ్సిడీకి ఆమోదం తెలిపిన మంత్రివర్గం

స‌హ‌కార బ్యాంకుల ద్వారా స్వ‌ల్ప‌కాలిక పంట రుణాలు తీసుకున్న రైతుల‌కు 2016 న‌వంబ‌ర్‌, డిసెంబ‌ర్ ల‌కు గాను రెండు నెల‌లు వ‌డ్డీ మాఫీ చేయ‌డానికి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అలాగే స‌హ‌కార బ్యాంకుల‌కు జాతీయ వ్య‌వ‌సాయ‌, గ్రామీణాభివృద్ధి బ్యాంకు (నాబార్డ్) అందించిన అద‌న‌పు రీఫైనాన్స్ మొత్తంపై వ‌డ్డీ స‌బ్సిడీకి కూడా అనుమ‌తించింది. 
 
పట్నా లోని జ‌య‌ప్ర‌కాశ్ నారాయ‌ణ్ అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యం విస్త‌ర‌ణ కోసం 11.35 ఎక‌రాల ఎయిర్ పోర్ట్స్ అథారిటీ భూమిని అంతే మొత్తంలో బీహార్ ప్ర‌భుత్వ భూమితో మార్పిడికి ఆమోదం తెలిపిన మంత్రివర్గం

అనిసాబాద్ ప్రాంతంలో ఎయిర్ పోర్ట్స్ అధారిటీ ఆఫ్ ఇండియాకు చెందిన 11.35 ఎక‌రాల భూమిని అంతే విస్తీర్ణం గ‌ల బీహార్ ప్ర‌భుత్వం అందించే భూమితో మార్పిడి చేసుకునేందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం అనుమ‌తించింది. పట్నా విమానాశ్ర‌యం స‌మీపంలోని ఈ ప్ర‌తిపాదిత భూమిని విమానాశ్ర‌యం విస్త‌ర‌ణ‌కు, అద‌న‌పు టెర్మిన‌ల్ నిర్మాణానికి, ఇత‌ర అనుబంధ మౌలిక వ‌స‌తుల ఏర్పాటుకు వినియోగించుకుంటారు.  భూమి బ‌దిలీకి రాష్ట్ర ప్ర‌భుత్వం కూడా సూత్ర‌ప్రాయంగా అంగీకారం తెలిపింది. 
 
వాతావ‌ర‌ణ మార్పుల అంత‌ర్జాతీయ ఒడంబ‌డిక‌కు అనుగుణంగా క్యోటో ప్రొటోకాల్ రెండో క‌ట్టుబాటు కాల‌ప‌రిమితి ధ్రువీక‌ర‌ణ‌కు ఆమోదం తెలిపిన మంత్రివర్గం

హ‌రిత వాయువుల‌కు (జిహెచ్ జి) హానికార‌క‌మైన ఉద్గారాల అదుపున‌కు ఉద్దేశించిన క్యోటో ప్రొటోకాల్‌ రెండో క‌ట్టుబాటు కాల‌ వ్య‌వ‌ధి ధ్రువీక‌ర‌ణ‌కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం అనుమ‌తి మంజూరు చేసింది.  2012 సంవ‌త్సరంలో క్యోటో ప్రొటోకాల్ రెండో క‌ట్టుబాటు కాల‌ వ్య‌వ‌ధిని ప్ర‌క‌టించారు.  దీనికి ఇప్ప‌టివ‌ర‌కు 75 దేశాలు ఆమోదం తెలిపాయి. 
 
వ‌రిష్ట పింఛ‌ను బీమా యోజ‌న - 2017

వ‌రిష్ట పింఛ‌ను బీమా యోజ‌న -2017 ప్రారంభించేందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం పోస్ట్- ఫ్యాక్టో ఆమోదాన్నిచ్చింది.  ఆర్థిక కార్య‌క‌లాపాల్లో అంద‌రినీ భాగ‌స్వాములు చేయ‌డం, సామాజిక భ‌ద్ర‌త‌కు ప్ర‌భుత్వం ప్ర‌క‌టించిన క‌ట్టుబాట్ల‌కు అనుగుణంగా ఈ నిర్ణ‌యం ప్ర‌క‌టించారు. 
 
స‌హ‌కార బ్యాంకుల‌కు రుణ‌స‌హాయం అందించేందుకు వీలుగా నాబార్డ్ స్వ‌ల్ప‌కాలిక మార్కెట్ రుణ సేక‌ర‌ణ‌కు ఆమోదం తెలిపిన మంత్రివర్గం

ఈ దిగువ నిర్ణ‌యాల‌కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం పోస్ట్- ఫ్యాక్టో ఆమోదాన్నిచ్చింది.

01 ఫిబ్రవరి 2017 

ప్ర‌ధాన మంత్రి ఆవాస్ యోజ‌న (పిఎంఎవై) కింద రుణ అనుసంధానిత స‌బ్సిడీ ప‌థ‌కాన్ని (సిఎల్ఎస్ఎస్‌) 15 సంవ‌త్స‌రాల కాల‌ప‌రిమితి నుండి 20 సంవ‌త్స‌రాల‌కు పొడిగించ‌డానికి కేంద్ర మంత్రివర్గం అనుమ‌తి ఇచ్చింది. 
 

‘ఇండియ‌న్ ఇన్ స్టిట్యూట్స్ ఆఫ్ ఇన్ఫ‌ర్మేశన్ టెక్నాల‌జీ (స‌వ‌ర‌ణ‌) బిల్లు 2017’ ను పార్ల‌మెంటులో ప్ర‌వేశ‌పెట్ట‌డానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 
 
రాజ్యాంగ ఆదేశాలు  (i) ఒడిశా కు చెందిన షెడ్యూల్డు కులాల‌ను చేర్చ‌డానికి వీలుగా రాజ్యాంగ (షెడ్యూల్డు కులాలు) ఆర్డ‌ర్ 1950 ను స‌వ‌రించ‌డానికి, (ii) ఆర్డ‌ర్‌లో పాండిచేరి పేరును పుదుచ్చేరిగా మార్చ‌డానికి వీలుగా రాజ్యాంగ (పాండిచేరి) షెడ్యూల్డు కులాల ఆర్డ‌ర్ 1964ని స‌వ‌రించ‌డానికి.. మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 
 
08  ఫిబ్రవరి 2017
 
సైన్స్, టెక్నాల‌జీ, న‌వ‌క‌ల్ప‌న‌ రంగాలలో భార‌తదేశం, ఫ్రాన్స్ ల స‌హ‌కారంపై కుదిరిన ఎంఒయు ను మంత్రివర్గం పరిశీలన కు నివేదించారు.
 
ఆరు కోట్ల గ్రామీణ గృహాల‌కు విస్త‌రించేందుకు వీలుగా “ప్ర‌ధాన‌ మంత్రి గ్రామీణ డిజిట‌ల్ సాక్ష‌ర‌తా అభియాన్” కు మంత్రివర్గం ఆమోదం

గ్రామీణ ప్రాంతాల్లోని 6 కోట్ల గృహాల్లో నివ‌సిస్తున్న వారిని డిజిట‌ల్ అక్ష‌రాస్యులుగా తీర్చి దిద్దేందుకు ఉద్దేశించిన “ప్రధాన మంత్రి గ్రామీణ డిజిటల్ సాక్షరతా అభియాన్” కు (PMGDISHA) ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.  2019 మార్చి నాటికి గ్రామీణ ప్రాంతాల‌న్నింటినీ డిజిట‌ల్ అక్ష‌రాస్య‌తా ప్రాంతాలుగా తీర్చి దిద్ద‌డం ల‌క్ష్యంగా చేప‌డుతున్న ఈ ప‌థ‌కంపై 2351.38 కోట్ల  రూపాయ‌లు పెట్టుబ‌డి పెడ‌తారు.  2016-17 కేంద్ర బ‌డ్జెట్ లో ఆర్థిక‌ మంత్రి ప్ర‌క‌ట‌న‌కు అనుగుణంగా ఈ ప‌థ‌కాన్ని చేప‌డుతున్నారు. 
 
15  ఫిబ్రవరి 2017

గ‌ణాంకాల సేక‌ర‌ణ చ‌ట్టం, 2008 లోని (7 of 2009) స‌వ‌ర‌ణ‌ కు ఆమోదం తెలిపిన మంత్రివర్గం
 
మ‌ధ్య‌ ప్ర‌దేశ్ లోని సీహోర్ కు చెందిన అమ్లాహా లో ఫూడ్ లెగ్యూమ్స్ రిసర్చ్ ప్లాట్ ఫార్మ్ (ఎఫ్ ఎల్ ఆర్ పి) ను ఇంటర్ నేశనల్ సెంటర్ ఫర్ అగ్రికల్చరల్ రిసర్చ్ ఇన్ డ్రై ఏరియాస్ (ఐసిఎఆర్ డిఎ) ఏర్పాటు చేసేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.  దీనికి శాటిలైట్ హబ్స్ ప‌శ్చిమ బెంగాల్ లోను, రాజ‌స్థాన్ లోను ఏర్పాటవుతాయి.
 
22 ఫిబ్రవరి 2017
 
పౌర విమాన‌యాన భ‌ద్ర‌త రంగంలో స‌హ‌కారాన్ని అభివృద్ధిపరచుకోవడం మరియు ప్రోత్సాహానికి సంబంధించి భార‌త‌దేశం, ఆస్ట్రేలియా ల మ‌ధ్య ఎంఒయు కు ఆమోదం తెలిపిన మంత్రివర్గం

భార‌త‌దేశం, గ్రీస్ ల మ‌ధ్య వైమానిక సేవల ఒప్పందంపై సంత‌కాల‌కు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 
 
05 మార్చి 2017
 
టిఐఆర్ కార్నెట్స్ (టిఐఆర్ ఒడంబ‌డిక‌) కింద అంత‌ర్జాతీయ వ‌స్తు ర‌వాణాపై క‌స్ట‌మ్స్ ఒప్పందంలో భార‌తదేశం చేర‌డానికి ఆమోదం తెలిపిన మంత్రివర్గం ఆమోదం

టిఐఆర్ కార్నెట్స్ (టిఐఆర్ ఒడంబ‌డిక‌) కింద అంత‌ర్జాతీయ వ‌స్తు ర‌వాణాపై క‌స్ట‌మ్స్ ఒప్పందంలో భార‌తదేశం చేర‌డానికి, అందులో ప్ర‌వేశించేందుకు వీలుగా  సంబంధిత‌ విధివిధానాలను ధ్రువీక‌రించేందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 
 
పంజాబ్ లో ఆహార ధాన్యాల సేక‌ర‌ణ కార్య‌క‌లాపాలు- లెగ‌సీ ఖాతాల సెటిల్ మెంట్ కు (2014-15 పంట సంవ‌త్స‌రం వ‌ర‌కు) ఆమోదం తెలిపిన మంత్రివర్గం

పంజాబ్ లో ఆహార ధాన్యాల సేక‌ర‌ణ కార్య‌క‌లాపాలు- లెగ‌సీ ఖాతాల సెటిల్ మెంట్ కు (2014-15 పంట సంవ‌త్స‌రం వ‌ర‌కు) ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఎక్స్- పోస్ట్ ఫ్యాక్టో ఆమోదాన్ని మంజూరు చేసింది.  వ్య‌య విభాగం చేసిన ఈ ప్ర‌తిపాద‌న‌కు 1961 సంవ‌త్స‌ర‌పు 12వ నిబంధ‌నకు (వ్యాపార లావాదేవీలు) అనుగుణంగా 2017 జ‌న‌వ‌రి రెండో తేదీన ప్ర‌ధాన మంత్రి ఆమోద‌ ముద్ర వేశారు.
 
భార‌త వ్యూహాత్మ‌క పెట్రోలియం నిల్వ‌ల సంస్థ (ఐఎస్ ఆర్ పిఎల్‌), యుఎఇ లోని అబూ ధాబీ జాతీయ ఆయిల్ కంపెనీ (ఎడిఎన్ ఒసి) మ‌ధ్య చమురు నిల్వ‌ మరియు నిర్వ‌హ‌ణ‌ లకు సంబంధించిన నిర్ణాయక ఒప్పందంపై సంత‌కాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 
 
రోడ్డు ర‌వాణా మ‌రియు హైవేల మంత్రిత్వ శాఖ ప‌రిధిలోని సెంట్ర‌ల్ ఇంజినీయరింగ్ స‌ర్వీస్ (రోడ్లు) గ్రూప్- ఎ లో కేడ‌ర్ రివ్యూ కు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 

15 మార్చి 2017
 
2017 జ‌న‌వ‌రి నుండి అందించవలసిన 2 శాతం అద‌న‌పు డిఎ/డియ‌ర్ నెస్ రిలీఫ్ కు ఆమోదం తెలిపిన మంత్రివర్గం

 2017 జ‌న‌వ‌రి ఒక‌టో తేదీ నుండి అమ‌లు లోకి వ‌చ్చేలా కేంద్ర‌ ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు అద‌న‌పు డిఎ వాయిదా చెల్లింపున‌కు, పెన్షన్ దారులకు డియ‌ర్ నెస్ రిలీఫ్ చెల్లింపున‌కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన  కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.  ధ‌ర‌ల పెరుగుద‌ల‌కు ప‌రిహారం అందించేందుకు వీలుగా ప్ర‌స్తుత బేసిక్ పే/ పింఛ‌నుపై చెల్లిస్తున్న‌రెండు శాతానికి పైబ‌డి రెండు శాతం చెల్లించేందుకు ఆమోదించింది. 
 
ఇండియ‌న్ ఇన్ స్టిట్యూట్స్ ఆఫ్ టెక్నాల‌జీ ల‌ను జాతీయ ప్రాధాన్య‌త సంస్థ‌లుగా ప్ర‌క‌టించడమైంది. 
 
‘ఇండియ‌న్ ఇన్ స్టిట్యూట్స్ ఆఫ్ ఇన్ఫ‌ర్మేశన్ టెక్నాల‌జీ (ప్ర‌భుత్వ‌-ప్ర‌యివేటు భాగ‌స్వామ్యం) బిల్లు 2017’కు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 
 
విదేశీ స‌హాయంతో న‌డుస్తున్న ప్రాజెక్టులకు ప్ర‌త్యేక నిధుల క‌ల్ప‌న కింద ఆంధ్ర‌ ప్ర‌దేశ్ కు ప్ర‌త్యేక స‌హాయ చ‌ర్య మ‌రియు పోల‌వ‌రం ప్రాజెక్టు లో నీటిపారుద‌ల విభాగానికి నిధుల క‌ల్ప‌న‌కు ఆమోదం 
  
సామ‌ర్థ్యాల నిర్మాణంపై మసూరీ లోని లాల్ బ‌హ‌దూర్ శాస్త్రి నేష‌న‌ల్ అకాడ‌మీ ఆఫ్ అడ్మినిస్ట్రేష‌న్ (ఎల్‌బిఎన్ ఎఎ) కు, న‌మీబియాకు చెందిన న‌మీబియా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ప‌బ్లిక్ అడ్మినిస్ట్రేశన్ కు మ‌ధ్య ఎంఒయు కు ఆమోదం
 
భార‌తదేశం, బాంగ్లాదేశ్ ల మ‌ధ్య ఎయిడ్స్ టు నావిగేష‌న్ ఎంఒయు కు ఆమోదం తెలిపిన మంత్రివర్గం
 
కేంద్ర నౌకా శాఖ ప‌రిధిలోని లైట్ హౌస్ లు మ‌రియు లైట్ షిప్ ల డైరెక్ట‌రేట్ జ‌న‌ర‌ల్, బాంగ్లాదేశ్ ప్ర‌భుత్వ నౌకా మంత్రిత్వ శాఖ  మ‌ధ్య ఎయిడ్స్ టు నావిగేష‌న్ పై ఎంఒయు పై సంత‌కాల‌కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 

20 మార్చి 2017
 
ఈ దిగువన పేర్కొన్న జిఎస్ టి సంబంధిత బిల్లుల‌కు:

వ‌స్తువులు మరియు సేవ‌ల ప‌న్ను బిల్లు 2017 (సిజిఎస్ టి బిల్లు);
స‌మీకృత‌ వ‌స్తుసేవ‌ల ప‌న్నుబిల్లు 2017 (ఐజిఎస్ టి బిల్లు);
కేంద్ర‌ పాలిత ప్రాంతాల వ‌స్తుసేవ‌ల‌ ప‌న్ను బిల్లు 2017 (యుటి జిఎస్ టి బిల్లు); మరియు 
వ‌స్తువులు మరియు సేవ‌ల ప‌న్ను (రాష్ట్రాల‌కు ప‌రిహారం) బిల్లు 2017 (కాంపన్ సేశన్ బిల్లు)..  ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
 
22 మార్చి 2017
 
‘బాల‌ల ఉచిత మ‌రియు నిర్బంధ విద్య హ‌క్కు చ‌ట్టం 2009’ కు ఆమోదం తెలిపిన మంత్రివర్గం

‘బాల‌ల ఉచిత మ‌రియు నిర్బంధ విద్య హ‌క్కు చ‌ట్టం 2009’ కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గంఆమోదం తెలిపింది.  ఈ చ‌ట్టం లో భాగంగా 2015 మార్చి 31వ తేదీకి ఉద్యోగాల్లో ఉన్న ఉపాధ్యాయులంద‌రూ విద్యా ప్రాధికార సంస్థ నిర్దేశ‌క‌త్వం మేర‌కు క‌నీస అర్హ‌త‌లు సాధించ‌డానికి శిక్ష‌ణ పూర్తి చేసుకోవలసిన గ‌డువు నాలుగు సంవ‌త్స‌రాల పాటు, అంటే 2019 మార్చి 31 వ‌ర‌కు పొడిగించారు. 

ఇండియ‌న్ ట్రేడ్ స‌ర్వీస్ (ఐటిఎస్‌) అధికారుల‌ను యథా స్థానంలో సీనియ‌ర్ అడ్మినిస్ట్రేటివ్ గ్రేడ్ (ఎస్ ఎజి) హోదాకు ప‌దోన్న‌తి ని కల్పించేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 

స్టార్ట్- అప్‌ ల ఫండ్ ఆఫ్ ఫండ్ (ఎఫ్ ఎఫ్ ఎస్) ఏర్పాటు ప్ర‌తిపాద‌న‌కు ఆమోదం తెలిపిన మంత్రివర్గం

 గ‌త ఏడాది జూన్ లో వెయ్యి కోట్ల రూపాయ‌ల మూల‌ధ‌నంతో ఏర్పాటు చేసిన స్టార్ట్- అప్‌ ల ఫండ్ ఆఫ్ ఫండ్ కు సంబంధించిన ప‌లు ప్ర‌తిపాద‌న‌ల‌కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 
 
జిఎస్ టి అమ‌లుకు మార్గం సుగ‌మం చేస్తూ వివిధ ర‌కాలైన సెస్ లు, స‌ర్ చార్జిల‌ను ర‌ద్దు చేసేందుకు వీలుగా  క‌స్ట‌మ్స్ సెంట్ర‌ల్ ఎక్సైజు చ‌ట్టంలో స‌వ‌ర‌ణ‌ల‌కు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 
 
31 మార్చి 2017 

“బాల‌ల ఉచిత మ‌రియు నిర్బంధ విద్య చ‌ట్టం 2009’’ కు ప్ర‌తిపాదించిన స‌వ‌ర‌ణ‌ల‌కు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

అంత‌ర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్ఒ) క‌నీస వ‌య‌స్సు ఒడంబ‌డిక 1973 (నంబ‌ర్ 138) మ‌రియు నికృష్టతర బాల‌ కార్మిక వ్య‌వ‌స్థ ఒడంబ‌డిక 1999 (నంబ‌ర్ 182) ధ్రువీక‌ర‌ణ‌కు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 

కంపెనీల (స‌వ‌ర‌ణ‌) బిల్లు 2016లో ఆధికారిక స‌వ‌ర‌ణ‌ల‌కు ఆమోదం తెలిపిన మంత్రివర్గం

 కంపెనీల (స‌వ‌ర‌ణ‌) బిల్లు 2016కు అధికారిక స‌వ‌ర‌ణ‌ల కోసం వ‌చ్చిన ప్ర‌తిపాద‌ల‌ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. ఈ బిల్లును పార్ల‌మెంటులో ప్ర‌వేశ‌పెడ‌తారు.

 05 ఏప్రిల్ 2017

బెల్ మాంట్ ఫోరమ్ సచివాలయానికి సహాయం చేయాలన్న సంయుక్త ఒప్పందానికి ఆమోదం తెలిపిన మంత్రివర్గం    

బెల్ మాంట్ ఫోరమ్ సచివాలయానికి సహాయం చేయడానికి, ఫ్రాన్స్ జాతీయ పరిశోధనా సంస్థ (ఎఎన్ఆర్) తో సంయుక్త ఒప్పందం పై సంతకం చేయడానికి ప్రధాన మంత్రి శ్రీ నరేద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం తన ఆమోదం తెలిపింది.  ఈ ఒప్పందంలో భాగంగా 2015 జనవరి నుండి 2017 డిసెంబర్ మధ్య 40,000 యూరోల ఖర్చు అవుతాయని అంచనా.  బెల్ మాంట్ ఫోరమ్ సచివాలయానికి 2017 తరువాత కూడా ఆర్ధిక సహాయం కొనసాగించాలని మంత్రివర్గం ఆమోదం తెలిపింది.  

మహాత్మ గాంధీ ప్రవాసీ సురక్షా యోజన సమాప్తి కి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 

మహాత్మ గాంధీ ప్రవాసీ సురక్షా యోజన (ఎమ్ జిపిఎస్ వై)ను సమాప్తి చేసేందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇమిగ్రేశన్ చెక్ అవసరమైన (ఇసిఆర్) దేశాలకు ఉపాధి కోసం వెళ్లే ఇసిఆర్ కేటగిరీ కార్మికుల సామాజిక భద్రతకు సంబంధించిన సమస్యల  పరిష్కారం కోసం 2012 లో ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు.  

భారతదేశం, బాంగ్లాదేశ్ ల మధ్య ప్రోట్ కోల్ మార్గంలో కుషియారా నది తీరంలో అషుగంజ్, జాకీగంజ్ ల మధ్య, అలాగే జమునా నది తీరంలో సిరాజ్ గంజ్, దైఖావా ల మధ్య మార్గాలను అభివృద్ధి చేయడానికి భారతదేశం, బాంగ్లాదేశ్ ల మధ్య అవగాహనపూర్వక ఒప్పందానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది.  

ప్రభుత్వ ఇ-మార్కెట్ ప్లేస్ (GeM SPV) పేరుతొ పిలువబడే స్పెషల్ పర్పస్ వెహికల్ ను ఏర్పాటు చేయడానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది.  
 
12 ఏప్రిల్ 2017 

ఆంధ్ర ప్రదేశ్ లోని విశాఖపట్నం వద్ద ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ (ఐఐపిఇ) ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

కాన్ పుర్ వైమానిక దళ కేంద్రంలోని కేంద్రీయ విద్యాలయ సంఘటన్ పాఠశాల భవన నిర్మాణం కోసం రక్షణ శాఖకు చెందిన 6.5628 ఎకరాల భూమిని లీజు పై బదలాయించడానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

కాన్ పుర్ వైమానిక దళ కేంద్రం (ఎఎఫ్ఎస్ కాన్ పుర్)లోని కేంద్రీయ విద్యాలయ సంఘటన్ (కెవిఎస్) కు రక్షణ శాఖకు చెందిన 6.5628 ఎకరాల భూమిని లీజు పై బదలాయించడానికి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.  పాఠశాల భవనం, ఇతర సంబంధిత మౌలిక సదుపాయాల నిర్మాణానికి ఈ భూమిని వినియోగిస్తారు. కాన్ పుర్ లోని  ఐఎఫ్ఎస్ లో రక్షణ శాఖకు చెందిన 8.90 ఎకరాల భూమిని బదలాయిస్తూ గతంలో 16.06.2011 తేదీ నాటి నిర్ణయంలో పాక్షికంగా పరివర్తనను చేశారు.  

భారతదేశం, ట్యూనీశియా ల మధ్య న్యాయశాస్త్ర  రంగంలో  పరస్పర సహకారం కోసం అవగాహనపూర్వక ఒప్పందానికి మంత్రివర్గం ఆమోదిందం తెలిపింది. 

19 ఏప్రిల్ 2017 

భారతదేశం, పోర్చుగల్ ల మధ్య ద్వంద్వ పన్ను విధానాన్ని నివారించేందుకు ప్రోట్ కోల్ సవరణపై సంతకం చేయడానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 


15 సంవత్సరాల కంటే తక్కువ సర్వీస్  కలిగి ఉండి, 1991 డిసెంబరు 30వ తేదీ నుండి 1999 నవంబర్ 29వ తేదీ మధ్య కాలంలో మృతి చెందిన రక్షణ శాఖకు చెందిన కొంత మంది ఉద్యోగుల సెలవులను లేదా ఆ సమయంలో ఉపయోగించక పోవడం వలన పేరుకు పోయిన సెలవులను నగదుగా మార్చుకొనేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 

  

15 సంవత్సరాల కంటే తక్కువ సర్వీస్  కలిగి ఉండి, 1991 డిసెంబరు 30వ తేదీ నుండి 1999 నవంబర్ 29వ తేదీ మధ్య కాలంలో మృతి చెందిన రక్షణ శాఖకు చెందిన కొంతమంది ఉద్యోగుల శలవులను లేదా ఆ సమయంలో ఉపయోగించుకోలేక పోయిన సిబ్బంది శలవులను 180 రోజుల వరకు  నగదుగా మార్చుకొనేందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.


2019 సార్వత్రిక ఎన్నికల్లో  "వోటర్ వెరిఫయబుల్ పేపర్ ఆడిట్ ట్రయిల్ (వివిపిఎటి) యూనిట్లను" కొనుగోలు చేసేందుకు ఆమోదం తెలిపిన మంత్రివర్గం 

2019 సార్వత్రిక ఎన్నికల్లో వినియోగించేందుకు "ఓటర్ వెరిఫియబుల్ పేపర్ ఆడిట్ ట్రయిల్ (వివిపిఏటి) యూనిట్లను" కొనుగోలు చేసేందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన మంత్రివర్గం ఆమోదం తెలిపింది.


కీలక మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల  అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు ద్వైపాక్షిక సంస్థల నుండి బాహ్య సహాయం పొందడానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 

03 మే, 2017 


రైల్వే భద్రత పై భారతదేశం, జపాన్ ల మధ్య సహకారానికి  ఆమోదం తెలిపిన మంత్రివర్గం

రైల్వే భద్రత విషయంలో జపాన్ తో సహకార ఒప్పందం (ఎమ్ఒసి) పై సంతకం చేయడానికి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం లాంఛనప్రాయంగా అనుమతి నిచ్చింది. అయితే, ఈ  ఎమ్ఒసి పై 2017 ఫిబ్రవరి లోనే సంతకం చేయడం జరిగింది 

 
వేతనాలు మరియు పింఛన్ ప్రయోజనాల పై ఏడవ సిపిసి సిఫార్సులలో సవరణలకు ఆమోదం తెలిపిన మంత్రివర్గం

వేతనాలు మరియు పింఛన్ ప్రయోజనాల అమలుపై ఏడో కేంద్ర వేతన సంఘం ( సిపిసి ) సిఫార్సులలో సవరణలకు సంబంధించి ముఖ్యమైన ప్రతిపాదనలకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.   అంతకు ముందు 2015-16 కు చెందిన రెండు నెలల బకాయిలతో సహా 2016-17 ఆర్ధిక సంవత్సరానికి 84,933 కోట్ల రూపాయల అదనపు ఆర్ధిక వ్యయంతో సిఫార్సుల అమలును మంత్రివర్గం 2016 జూన్ నెలలో ఆమోదించింది.


మలేశియా లో యూరియా తయారీ కర్మాగారం కోసం ఎంఒయు కు  ఆమోదం తెలిపిన మంత్రివర్గం

మలేశియాలో యూరియా మరియు అమోనియా తయారీ కర్మాగారం అభివృద్ధి చేయడానికి మలేషియాతో అవగాహనపూర్వక ఒప్పందం (ఎంఒయు) పై సంతకం చేయడానికి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఎక్స్- పోస్ట్ ఫ్యాక్టో ఆమోదం తెలిపింది.   ఈ ఒప్పందం ద్వారా మిగులు యూరియాను మలేశియా నుండి భారతదేశానికీ, భారతదేశం నుండి మలేశియా కు సరఫరా చేయడానికి అవకాశం ఉంటుంది. 

దేశీయంగా తయారైన ఇనుము, ఉక్కు ఉత్పత్తులకు ప్రభుత్వ కొనుగోళ్లలో ప్రాధాన్యం ఇవ్వాలనే విధానానికి  ఆమోదం తెలిపిన మంత్రివర్గం

దేశీయంగా తయారైన ఇనుము, ఉక్కు ఉత్పత్తులకు ప్రభుత్వ కొనుగోళ్లలో ప్రాధాన్యం ఇవ్వాలనే విధానానికి  ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఎక్స్- పోస్ట్ ఫ్యాక్టో ఆమోదం తెలిపింది.

భారతదేశానికి చెందిన చార్టర్డ్ అకౌంటెంట్స్ సంస్థ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కు చెందిన హయ్యర్ కాలేజెస్ ఆఫ్ టెక్నాలజీ ల మధ్య 2011 లో కుదిరిన అవగాహనపూర్వక ఒప్పందం కొనసాగింపునకు ఆమోదం తెలిపిన మంత్రివర్గం
 
భారతదేశానికి చెందిన చార్టర్డ్ అకౌంటెంట్స్ సంస్థ (ఐసిఎఐ)  - యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కు చెందిన హయ్యర్ కాలేజెస్ ఆఫ్ టెక్నాలజీ (హెచ్ సిటి) ల మధ్య 2011 లో కుదిరిన అవగాహనపూర్వక ఒప్పందం (ఎంఒయు) కొనసాగింపుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఎక్స్- పోస్ట్ ఫ్యాక్టో ఆమోదం తెలిపింది. 


కేరళలో పట్టాలం రహదారి వెడల్పు చేయడం కోసం త్రిశూర్ లో తపాలా శాఖకు చెందిన స్థలం మరియు  భవనాన్ని త్రిశూర్ పురపాలక సంఘానికి బదలాయించడానికి ఆమోదం తెలిపిన మంత్రివర్గం

కేరళలో పట్టాలం రహదారి వెడల్పు చేయడం కోసం - త్రిశూర్ లో తపాలా శాఖకు చెందిన 16.5 స్థలాన్నీ మరియు  భవనాన్ని ప్రజా ప్రయోజనం దృష్ట్యా స్ధలానికి బదులుగా స్థలం ఇచ్చే ప్రాతిపదికన త్రిశూర్ పురపాలక సంఘానికి బదలాయించడానికి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఎక్స్- పోస్ట్ ఫ్యాక్టో ఆమోదం తెలిపింది.  


పౌర విమానయాన రంగంలో భారతదేశం, స్పెయిన్ దేశాల మధ్య సహకారం కోసం అవగాహన పత్రం పై సంతకం చేయడానికి ఆమోదం తెలిపిన మంత్రివర్గం

పౌర విమానయాన రంగంలో భారతదేశం, స్పెయిన్ ల మధ్య సహకారం కోసం అవగాహన పత్రం పై సంతకం చేయడానికి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

విజయవాడ విమానాశ్రయానికి అంతర్జాతీయ విమానాశ్రయంగా ఆమోదం తెలిపిన మంత్రివర్గం

ఆంధ్ర ప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టం, 2014 లో పొందుపరచిన నిబంధన ప్రకారం, విజయవాడ విమానాశ్రయాన్ని అంతర్జాతీయ విమానాశ్రయంగా ప్రకటించడానికి  ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.


సైనిక విద్యలో సహకారం కోసం వెల్లింగ్టన్ లోని రక్షణ సేవల సిబ్బంది కళాశాలకు మరియు ఢాకా లోని మీర్ పుర్ లో ఉన్న డిఫెన్స్ కమాండ్ అండ్ స్టాఫ్ కళాశాల కు మధ్య అవగాహనపూర్వక ఒప్పందానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 

  

సైనిక విద్యకు సంబంధించి సహకారం కోసం వెల్లింగ్టన్ లోని రక్షణ సేవల సిబ్బంది కళాశాల మరియు ఢాకా, మీర్ పుర్ లోని డిఫెన్స్ కమాండ్ అండ్ స్టాఫ్ కళాశాల మధ్య  వ్యూహాత్మక, కార్యాచరణ అధ్యయన రంగంలో అవగాహనపూర్వక ఒప్పందం (ఎంఒయు) కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన  మంత్రివర్గం ఎక్స్- పోస్ట్ ఫ్యాక్టో ఆమోదం తెలిపింది. 
  

కొత్త విధానం - ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ఆశయానికి ప్రతిబింబం : ‘జాతీయ ఉక్కు విధానం 2017’ కు ఆమోదం తెలిపిన మంత్రివర్గం

‘జాతీయ ఉక్కు విధానం (ఎన్ ఎస్ పి) 2017’ కు  ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన  మంత్రివర్గం తన ఆమోదం తెలిపింది.


అభివృద్ధి ప్రాజెక్టుల అమలు కోసం బాంగ్లాదేశ్ కు మూడో విడత రుణంగా  4.5 బిలియన్ యుఎస్ డాలర్ల సహాయంపై అవగాహన ఒప్పందానికి ఆమోదం తెలిపిన మంత్రివర్గం

 

అభివృద్ధి ప్రాజెక్టుల అమలు కోసం బాంగ్లాదేశ్ కు మూడవ విడత రుణం (ఎల్ఒసి) గా  4.5 బిలియన్ యుఎస్ డాలర్ల సహాయంపై అవగాహనా ఒప్పందం (ఎంఒయు) కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన మంత్రివర్గం ఎక్స్- పోస్ట్ ఫ్యాక్టోఆమోదం తెలిపింది. 


17 మే 2017

 భారతదేశంలో పన్ను ఎగవేత మరియు లాభం బదలాయింపు ను నిరోధించేందుకు  పన్ను ఒప్పందం సంబంధిత చర్యల అమలు కోసం బహుళ పాక్షిక సమావేశం పై సంతకం చేయడానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

పన్ను ఎగవేత మరియు లాభం బదలాయింపు ను నిరోధించేందుకు  పన్ను ఒప్పందం సంబంధిత చర్యల అమలు కోసం బహుళ పాక్షిక సమావేశంపై సంతకం చేయడానికి  ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన  మంత్రివర్గం తన ఆమోదం తెలిపింది.


భారతదేశానికి చెందిన పది స్వదేశీ ప్రెశరైజ్ డ్ హెవీ వాటర్ రియాక్టర్లు (పి హెచ్ డబ్ల్యూ ఆర్) ను నిర్మించడానికి ఆమోదం తెలిపిన మంత్రివర్గం

 
భారతదేశ స్వదేశీ అణు విద్యుత్తు కార్యక్రమాన్ని వేగవంతం చేయడానికి, స్వదేశీ అణు పరిశ్రమను ప్రోత్సహించడానికి  భారతదేశానికి చెందిన పది స్వదేశీ ప్రెశరైజ్ డ్ హెవీ వాటర్ రియాక్టర్లు (పి హెచ్ డబ్ల్యూ ఆర్) ను నిర్మించడానికి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 

 
భారతదేశం, ఆస్ట్రేలియా ల మధ్య అంతర్జాతీయ తీవ్రవాదం మరియు బహుళజాతి వ్యవస్థీకృత నేరాలను అరికట్టడంలో సహకారానికి సంబంధించిన అవగాహనపూర్వక ఒప్పందానికి ఆమోదం తెలిపిన మంత్రివర్గం 

 

భారతదేశం, ఆస్ట్రేలియా ల మధ్య అంతర్జాతీయ తీవ్రవాదం మరియు బహుళజాతి వ్యవస్థీకృత నేరాలను అరికట్టడంలో సహకారంపై అవగాహనపూర్వక ఒప్పందానికి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన మంత్రివర్గం ఎక్స్- పోస్ట్ ఫ్యాక్టో ఆమోదం తెలిపింది.


న్యూ ఢిల్లీ లోని జాతీయ రక్షణ కళాశాల మరియు బాంగ్లాదేశ్ లోని ఢాకా లో జాతీయ రక్షణ కళాశాల మధ్య ఫేకల్టీ పరస్పరం మార్పిడి కి ఆమోదం తెలిపిన మంత్రివర్గం 

 

న్యూ ఢిల్లీ లోని జాతీయ రక్షణ కళాశాల మరియు బాంగ్లాదేశ్ లోని ఢాకా లో ఉన్న జాతీయ రక్షణ కళాశాల మధ్య ఫేకల్టీ ని పరస్పరం మార్పిడి చేసుకోవడం కోసం  సంతకాలు అయినటువంటి ఒక ఒప్పందానికి  ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన మంత్రివర్గం ఎక్స్- పోస్ట్ ఫ్యాక్టో ఆమోదం తెలిపింది.

 

ప్రసూతి ప్రయోజన కార్యక్రమాన్ని దేశమంతటా అమలు చేసేందుకు ఆమోదం తెలిపిన మంత్రివర్గం 

 

ప్రస్తుతం 2017 జనవరి 1వ తేదీ నుండి దేశంలోని అన్ని జిల్లాలకు విస్తరించిన ప్రసూతి ప్రయోజన కార్యక్రమాన్నిదేశం అంతటా అమలుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఎక్స్- పోస్ట్ ఫ్యాక్టో ఆమోదం తెలిపింది.

 

 

 

భారతదేశం- తాజికిస్తాన్ ల మధ్య  కస్టమ్స్ విషయాలలో సహకారం, పరస్పర సాయం కోసం  ఒప్పందానికి ఆమోదం తెలిపిన మంత్రివర్గం 

  

భారతదేశం, తాజికిస్తాన్ ల మధ్య  కస్టమ్స్ విషయాలలో సహకారం, పరస్పర సాయం కోసం ఒప్పందంపై సంతకం చేయడానికి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన మంత్రివర్గం తన ఆమోదం తెలిపింది.

 

 

అనధికారికంగా నివాసముంటున్నవారిని తొలగించడానికి తగిన చర్యలు తీసుకోవడానికి వీలుగా ప్రభుత్వ ప్రాంగణాలు (అనధికార ఆక్రమణల తొలగింపు) చట్టం, 1971 లో సవరణకు ఆమోదం తెలిపిన మంత్రివర్గం 

 

అనధికారికంగా నివాసముంటున్నవారిని తొలగించడానికి తగిన చర్యలు తీసుకోవడానికి వీలుగా ప్రభుత్వ ప్రాంగణాలు (అనధికార ఆక్రమణల తొలగింపు) చట్టం, 1971 (పిపిఈ చట్టం, 1971) లోని సెక్షన్ 2 మరియు సెక్షన్ 3 లో సవరణకు ప్రధాన  మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.  చట్టం లోని 2వ సెక్షన్ లో కొత్త నిబంధనలో "నివాస వసతి ఆక్రమణ" కు నిర్వచనాన్ని చేర్చడం ద్వారాను, చట్టం లోని 3వ సెక్షన్ లో సబ్ సెక్షన్ 3ఏ  కింద కొత్త సబ్ సెక్షన్ 3బి లో " నివాస వసతి ఆక్రమణ" నుండి తొలగింపునకు సంబంధించిన నియమాన్ని చేర్చడం ద్వారాను సవరణకు ఆమోదం లభించింది. 


 

  

పురాతన కట్టడాలు మరియు పురాతన స్ధలాలు, అవశేషాలు  చట్టం, 1958 ని సవరించడానికి ఆమోదం తెలిపిన మంత్రివర్గం

 

పురాతన కట్టడాలు మరియు పురాతన స్ధలాలు, అవశేషాలు  (సవరణ) చట్టం, 2017 ను పార్లమెంటులో  ప్రవేశపెట్టడానికి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం  ఆమోదం  తెలిపింది.

 

24 మే 2017

 

కేంద్ర రహదారి నిధి చట్టం-2000 లో సవరణ ద్వారా జాతీయ జలమార్గాలు (ఎన్ డబ్ల్యూ ల) అభివృద్ధి, నిర్వహణ కోసం - కేంద్ర రహదారి నిధి నుండి 2.5 శాతం నిధులను కేటాయించడానికి ఆమోదం తెలిపిన మంత్రివర్గం

 

కేంద్ర రహదారి నిధి చట్టం-2000 లో సవరణ ద్వారా జాతీయ జలమార్గాలు (ఎన్ డబ్ల్యూ ల) అభివృద్ధి, నిర్వహణ కోసం - కేంద్ర రహదారి నిధి ఆదాయం నుండి 2.5 శాతం నిధులను కేటాయించడానికి, జాతీయ రహదారుల అభివృద్ధికి అందజేస్తున్న వాటాను తగ్గించడానికి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఈ రోజు తన  ఆమోదం  తెలిపింది. ఈ ప్రతిపాదనను జల రవాణా మంత్రిత్వ శాఖ మరియు రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ (ఎమ్ఒఆర్ టిహెచ్) సంయుక్తంగా ప్రతిపాదించాయి. 

 
అసమ్ లోని కామరూప్ లో కొత్త ఎయిమ్స్ నెలకొల్పడానికి ఆమోదం తెలిపిన మంత్రివర్గం

 

ఉత్తర గువాహాటీ రెవిన్యూ సర్కిల్ లోని కామరూప్ లో కొత్త ఎయిమ్స్ నెలకొల్పడానికి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం తన  ఆమోదం  తెలిపింది.ప్రధానమంత్రి స్వాస్థ్య సురక్ష యోజన (పి ఎం ఎస్ ఎస్ వై) కింద ఈ ప్రాజెక్టును 1,123 కోట్ల రూపాయల ఖర్చుతో నెలకొల్పుతున్నారు. 


 

భారతదేశం, స్పెయిన్ ల మధ్య  అవయవ మార్పిడి సేవల రంగంలో సహకారం కోసం అవగాహనపూర్వక ఒప్పందానికి ఆమోదం తెలిపిన మంత్రివర్గం
 

స్పెయిన్ కు చెందిన ఆరోగ్యం, సామాజిక సేవలు, సమానత్వం మంత్రిత్వ శాఖకు చెందిన జాతీయ అవయవ మార్పిడి సంస్థకు, భారతదేశానికి చెందిన ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం మంత్రిత్వ శాఖ కు చెందిన ఆరోగ్య సేవల డైరెక్టరేట్ జనరల్ కు మధ్య  అవయవ మార్పిడి సేవల రంగంలో సహకారం కోసం అవగాహనపూర్వక ఒప్పందంపై సంతకం చేయడానికి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన మంత్రివర్గం ఆమోదం తెలిపింది.


 

విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక మండలిని దశల వారీగా రద్దు చేయడానికి ఆమోదం తెలిపిన మంత్రివర్గం
 

విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (ఎఫ్ ఐ పి బి) ని దశలవారీగా రద్దు చేయడానికి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన మంత్రివర్గం ఆమోదం తెలిపింది.  ఎఫ్ ఐ పి బి ని రద్దు చేసే ప్రతిపాదనను అమలుచేస్తూ ప్రభుత్వపరంగా  ఆమోదం అవసరమైన దరఖాస్తులను పరిశీలించడానికి సంబంధిత పరిపాలనా మంత్రిత్వ శాఖలు / విభాగాలకు ఈ ప్రతిపాదన అవకాశం కల్పిస్తుంది.  

 

 

ప్రత్యామ్నాయ వైద్య రంగంలో భారతదేశం, జర్మనీ ల మధ్య సహకారం పెంపొందించుకోవాలనే ఆశయంతో సంయుక్త ప్రకటనకు ఆమోదం తెలిపిన మంత్రివర్గం

 

ప్రత్యామ్నాయ వైద్య రంగంలో భారతదేశం, జర్మనీ ల మధ్య సహకారం పెంపొందించుకోవాలనే ఆశయంతో సంయుక్త ప్రకటనను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 

నవీకరణ యోగ్య శక్తి కోసం 2,360 కోట్ల రూపాయల మేర బాండ్లు జారీ చేయడానికి ఆమోదం తెలిపిన మంత్రివర్గం

 

నవీకరణ యోగ్య శక్తి కోసం 2,360 కోట్ల రూపాయల మేర బాండ్లు జారీ చేయడానికి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన మంత్రివర్గం తన ఆమోదం తెలిపింది 


 
 మెట్రో రైల్ అనుసంధానానికి ప్రోత్సాహం : నోయిడా, గ్రేటర్ నోయిడా ల మధ్య మెట్రో రైల్ ప్రాజెక్టు కు ఆమోదం తెలిపిన మంత్రివర్గం


నోయిడా, గ్రేటర్ నోయిడా ల మధ్య 29.707 కిలోమీటర్ల పొడవైన మెట్రో రైల్ ప్రాజెక్టు కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.  ఈ ప్రాజెక్ట్ పూర్తి కావడానికి మొత్తం 5,503 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. 


 

అంతరిక్షాన్ని శాంతియుత ప్రయోజనాలకు వినియోగించుకునే అంశంపై భారతదేశం, బాంగ్లాదేశ్ ల మధ్య సహకారం కోసం అవగాహన ఒప్పందం గురించి మంత్రివర్గానికి వివరించడం జరిగింది. 


7 జూన్ 2017

గుజ‌రాత్‌ లోని వాస‌ద్‌ లో గ‌ల ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సాయిల్ వాటర్ కన్సర్వేశన్ (ఐఐఎస్ డబ్ల్యు సి) చెందిన 4.47 హెక్టార్ల భూమిని నేశనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్ హెచ్ఎఐ) కు బదిలీ చేసే ప్రతిపాదనకు ఆమోదం తెలిపిన మంత్రివర్గం

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం... గుజ‌రాత్‌ లోని ఆనంద్ జిల్లా వాస‌ద్‌ లో గ‌ల ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సాయిల్ వాటర్ కన్సర్వేశన్ (ఐఐఎస్ డబ్ల్యు సి) చెందిన 4.47 హెక్టార్ల భూమిని జాతీయ రహదారుల ప్రాధికార సంస్థకు బదిలీ చేసే ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది.  ఈ భూమి ప్రస్తుతం ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రిసర్చ్ (ఐసిఎఆర్) అధీనంలో ఉండగా, దీనికి రూ.12.67 కోట్ల మేర పరిహారాన్ని నేశనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్ హెచ్ఎఐ)  చెల్లించవలసివుంటుంది. ఈ భూమిని ఎన్ హెచ్ఎఐ జాతీయ రహదారి-8 లోని అహమదాబాద్- వడోదరా మార్గాన్ని విస్తరించి 6 దోవల రహదారిగా తీర్చిదిద్దడానికి వినియోగిస్తుంది.

సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (ఎస్ఇబిఐ), యూరోపియన్ సెక్యూరిటీస్ అండ్ మార్కెట్స్ అథారిటీ ల మధ్య అవగాహన ఒప్పందంపై సంతకాలు చేసే ప్రతిపాదనకు ఆమోదం తెలిపిన మంత్రివర్గం 

యూరోపియన్ సెక్యూరిటీస్ అండ్ మార్కెట్స్ అథారిటీ (ఇఎస్ఎమ్ఎ) తో పరస్పర సహకారానికి సంబంధించి సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా అవగాహన ఒప్పందం కుదుర్చుకొనే ప్రతిపాదనకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

న్యాయస్థానాల్లో శిక్షపడిన వ్యక్తుల బదిలీపై భారతదేశం, సోమాలియా ల మధ్య ఒప్పందానికి ఆమోదం తెలిపిన మంత్రివర్గం

న్యాయస్థానాలలో శిక్ష పడిన వ్యక్తుల బదిలీపై భారతదేశం, సోమాలియా ల మధ్య ఒప్పందంపై సంతకాలు, తదనంతర అంగీకారానికి సంబంధించిన ప్రతిపాదనకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

ప్రమాణీకరణం-అనురూపత అంచనాలకు సంబంధించి భారతదేశం, మాలి ల మధ్య ఎంఒయు కు ఆమోదం తెలిపిన మంత్రివర్గం

ప్రమాణీకరణం-అనురూపత అంచనాలకు సంబంధించి బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్ స్ (బిఐఎస్), మాలి రిప‌బ్లిక్‌ లోని డైరెక్షన్ నేశనల్ డి ఇండస్ట్రీస్ (MLINDI) ల మధ్య కుదిరిన అవగాహనపూర్వక ఒప్పందానికి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఎక్స్- పోస్ట్ ఫ్యాక్టో ఆమోదం తెలిపింది.

భారతదేశం, ఇరాన్ ల మధ్య  ద్వైపాక్షిక ఒప్పందానికి ఆమోదం తెలిపిన మంత్రివర్గం

సెక్యూరిటీల మార్కెట్లకు సంబంధించిన అంశాలపై పరస్పర సహకారానికి సంబంధించిన అంశాలపై  సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (ఎస్ ఇబిఐ), సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ (ఎస్ఇఒ), ఇరాన్ ల మధ్య ద్వైపాక్షిక అవగాహన ఒప్పందానికి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

వాణిజ్య నౌకాయానంపై భారతదేశం, సైప్రస్ ల మధ్య ఒప్పందానికి ఆమోదం తెలిపిన మంత్రివర్గం

వాణిజ్య నౌకాయానంపై  భారతదేశం, సైప్రస్ ల మధ్య 2017 ఏప్రిల్ లో కుదిరిన ఒప్పందానికి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఎక్స్- పోస్ట్ ఫ్యాక్టో ఆమోదం తెలిపింది.

భారతదేశం, కొరియా ల మధ్య 9 బిలియన్ యుఎస్ డాలర్ల ఎగుమతి రుణాల ఒప్పందానికి ఆమోదం తెలిపిన మంత్రివర్గం

 భారతదేశంలో మౌలిక సదుపాయాల అభివృద్ధి, వివిధ ప్రాజెక్టులలో భాగంగా మూడో ప్రపంచ దేశాలకు వస్తుసేవల సరఫరా కోసం ఎక్స్ పోర్ట్ - ఇంపోర్ట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (EXIM Bank), ఎక్స్ పోర్ట్ - ఇంపోర్ట్ బ్యాంక్ ఆఫ్ కొరియా (KEXIM)ల మధ్య 9 బిలియన్ యుఎస్ డాలర్ల మేర ఎగుమతి రుణాలపై అవగాహన ఒప్పందం ప్రతిపాదనకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 
 
గువాహాటీ లోని డాక్టర్ బి. బోరూవాహ్ కేన్సర్ ఇన్‌స్టిట్యూట్‌ ను అణుశ‌క్తి విభాగం స్వాధీనం చేసుకొనే ప్రతిపాదనకు ఆమోదం తెలిపిన మంత్రివర్గం

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఈ కింద పేర్కొన్న అంశాలకు ఆమోదం తెలిపింది:

(i)    గువాహాటీ లోని డాక్టర్ బి. బోరూవాహ్ కేన్సర్ ఇన్‌స్టిట్యూట్‌ను కేంద్ర అణుశ‌క్తి విభాగం (డిఎఇ) పరిధి లోకి తీసుకువచ్చి, డిఎఇ తోడ్పాటుతో నడుస్తున్న టాటా మెమోరియల్ సెంటర్ నియంత్రణ కిందకు బదిలీ;

(ii)    మెడికల్, పారామెడికల్, సహాయ కేటగిరీ లలో 166 ఉద్యోగాల భర్తీ ద్వారా అదనపు మానవ వనరులను సమకూర్చే ప్రక్రియను వేగిరపరచడం.

14 జూన్ 2017 

రైతులకు ఇచ్చిన స్వల్పకాలిక పంట రుణాలపై బ్యాంకులకు వడ్డీ రాయితీ విడుదలకు ఆమోదం తెలిపిన మంత్రివర్గం

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం.. రైతుల కోసం 2017-18 సంవత్సరానికిగాను వడ్డీ రాయితీ పథకానికి (ఐఎస్ఎస్) ఆమోదం తెలిపింది.  దీనివల్ల రైతులు ఏడాది వ్యవధిలో తిరిగి చెల్లించే రూ.3 లక్షల వరకూ పంట రుణాలను కేవలం 4 శాతం వడ్డీ తోనే పొందే వీలు ఉంది.  ఈ  పథకం కోసం ప్రభుత్వం రూ.20,339 కోట్లు కేటాయించింది.
 
వ్యవసాయ రంగంలో సహకారంపై భారతదేశం, పాలస్తీనా ల మధ్య ఒప్పందానికి ఆమోదం తెలిపిన మంత్రివర్గం

వ్యవసాయ రంగంలో సహకారంపై భారత వ్యవసాయ-రైతు సంక్షేమ మంత్రిత్వశాఖ (MA&FW), పాలస్తీనా కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖల మధ్య కుదిరిన అవగాహన ఒప్పందానికి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఎక్స్- పోస్ట్ ఫ్యాక్టో ఆమోదం తెలిపింది.

‘ఫైనాన్శియల్ రెజల్యూశన్ అండ్ డిపాజిట్ ఇన్ శ్యురన్స్ బిల్లు- 2017’ ను ప్రవేశపెట్టేందుకు ఆమోదం తెలిపిన మంత్రివర్గం

ఫైనాన్శియల్ రెజల్యూశన్ అండ్ డిపాజిట్ ఇన్ శ్యురన్స్ బిల్లు, 2017 (FRDI) ను ప్రవేశపెట్టేందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.  ఈ బిల్లు బ్యాంకులు, బీమా కంపెనీలు, నిర్దిష్ట ఆర్థిక రంగ సంస్థలకు సంబంధించి దివాలా పరిస్థితుల పరిష్కారానికి తగిన చట్రాన్ని రూపొందించేందుకు తోడ్పడుతుంది.
 
యువజన వ్యవహారాలలో సహకారంపై భారతదేశం, ఆర్మేనియా ల మధ్య అవగాహన ఒప్పందానికి ఆమోదం తెలిపిన మంత్రివర్గం

యువజన వ్యవహారాలలో సహకారానికి సంబంధించి భారతదేశం, ఆర్మేనియా ల మధ్య కుదిరిన ఒప్పందంపై సంతకాలు పూర్తయిన అంశాన్ని సంబంధిత మంత్రిత్వశాఖ వివరించగా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
 
ఇన్ఫర్మేశన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ రంగంలో సహకారంపై ప్రోత్సాహానికి  సంబంధించి భారతదేశం, బాంగ్లాదేశ్ ల మధ్య అవగాహన ఒప్పందానికి ఆమోదం తెలిపిన మంత్రివర్గం

ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ రంగం (IT&E) లో ద్వైపాక్షిక సహకారంపై ప్రోత్సాహానికి సంబంధించి భారతదేశం, బాంగ్లాదేశ్ మధ్య ఇప్పటికే కుదిరిన అవగాహన ఒప్పందాన్ని గురించి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం దృష్టికి తీసుకువ‌చ్చారు.
 
22 జూన్ 2017
 
భార‌తదేశం, నెద‌ర్లాండ్స్ ల మ‌ధ్య సామాజిక భ‌ద్ర‌త ఒప్పందం స‌వ‌ర‌ణ‌కు ఆమోదం తెలిపిన మంత్రివర్గం

భారతదేశం, నెదర్లాండ్స్ మధ్య గ‌ల‌ ద్వైపాక్షిక సామాజిక భద్రత‌ ఒప్పందం (ఎస్ఎస్ఎ)లో “నివాస దేశం” సూత్రాన్ని చేరుస్తూ చేసిన స‌వ‌ర‌ణ‌కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన స‌మావేశ‌మైన కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
 
జ‌ల‌ వ‌న‌రుల నిర్వ‌హ‌ణ రంగంలో ద్వైపాక్షిక స‌హ‌కారంపై భార‌త్‌-నెద‌ర్లాండ్స్ మ‌ధ్య అవ‌గాహ‌న ఒప్పందానికి ఆమోదం తెలిపిన మంత్రివర్గం


జ‌ల‌ వ‌న‌రుల నిర్వ‌హ‌ణలో ద్వైపాక్షిక స‌హ‌కారంపై భార‌తదేశం, నెద‌ర్లాండ్స్ ల మ‌ధ్య ఎంఒయు కు ప్ర‌ధాన‌ మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అధ్య‌క్ష‌త‌న స‌మావేశ‌మైన కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.  ఈ ద్వైపాక్షిక స‌హ‌కార ఒప్పందంపై భార‌త ప్ర‌భుత్వ జ‌ల‌ వ‌న‌రులు- న‌దుల అభివృద్ధి- గంగా నది శుద్ధి మంత్రిత్వ శాఖ‌, నెద‌ర్లాండ్స్ రాజ్య మౌలిక స‌దుపాయాలు- ప‌ర్యావ‌ర‌ణ మంత్రిత్వ‌ శాఖ లు  సంత‌కాలు చేశాయి. 
 
ప్ర‌భుత్వ పాల‌న‌, ప‌రిపాల‌న సంస్క‌ర‌ణ‌ల రంగంలో భార‌తదేశం, పోర్చుగ‌ల్‌ ల మ‌ధ్య అవ‌గాహ‌న ఒప్పందానికి ఆమోదం తెలిపిన మంత్రివర్గం

భార‌తదేశం, పోర్చుగ‌ల్ ల‌కు చెందిన వివిధ మంత్రిత్వ శాఖ‌ల మ‌ధ్య ‘ప్ర‌భుత్వ పాల‌న‌, ప‌రిపాల‌న సంస్క‌ర‌ణ‌ల రంగం’లో స‌హ‌కారం’ పై కుదిరిన అవ‌గాహ‌న ఒప్పందానికి ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అధ్య‌క్ష‌త‌న స‌మావేశ‌మైన కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.  భార‌తదేశం త‌ర‌ఫున ప‌రిపాల‌న సంస్క‌ర‌ణ‌లు- ప్ర‌జా ఫిర్యాదుల విభాగం (DARPG); సిబ్బంది వ్య‌వ‌హారాలు-ప్ర‌జా ఫిర్యాదులు-పెన్ష‌న్ ల మంత్రిత్వ శాఖ ఈ ఒప్పందంపై సంత‌కాలు చేశాయి.  అలాగే పోర్చుగల్ రిపబ్లిక్ ప్రభుత్వం తరఫున పరిపాలన ఆధునికీకరణ మంత్రిత్వశాఖ సంతకం చేసింది.

ఇండియన్ నేవల్ మెటీరియల్ మేనేజ్ మెంట్ సర్వీస్ (INMMS) ను ఒక ఆర్గనైజ్ డ్ గ్రూప్ ‘ఎ’ ఇంజినీయరింగ్ సర్వీస్ గా ఏర్పాటు చేసేందుకు ఆమోదం తెలిపిన మంత్రివర్గం


ఇండియన్ నేవల్ మెటీరియల్ మేనేజ్ మెంట్ సర్వీస్ (INMMS) పేరిట ఓ ఆర్గనైజ్ డ్ గ్రూప్ ‘ఎ’ ఇంజినీయరింగ్ సర్వీసును ఏర్పాటు చేయడానికి, తదనుగుణంగా అందులోని భారత నావికాదళం లోని ప్రస్తుత నేవల్ స్టోర్ ఆఫీసర్స్ గ్రూప్ ఎ కేడర్ స్వరూపం లో మార్పుచేర్పులు చేపట్టడానికి ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అధ్య‌క్ష‌త‌న స‌మావేశ‌మైన కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

జౌళి, వస్త్రాలు మరియు ఫ్యాశన్ రంగాలలో సహకారంపై భారతదేశం, ఆస్ట్రేలియా ల మధ్య ఎంఒయు కు ఆమోదం తెలిపిన మంత్రివర్గం
 
జౌళి, వస్త్రాలు మరియు ఫ్యాశన్ రంగాలలో సహకారంపై భారత జౌళి మంత్రిత్వ శాఖ, ఆస్ట్రేలియా విదేశీ వ్యవహారాలు- వాణిజ్య శాఖల మధ్య కుదిరిన అవగాహన పూర్వక ఒప్పందానికి (ఎంఒయు) ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అధ్య‌క్ష‌త‌న స‌మావేశ‌మైన కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 

శాంతియుత ప్రయోజనాల కోసం అంతరిక్ష వినియోగంపై సహకారానికి భారతదేశం, ఆర్మేనియా ల మధ్య అవగాహన ఒప్పందానికి ఆమోదం తెలిపిన మంత్రివర్గం
 
అంతరిక్షాన్ని శాంతియుత ప్రయోజనాల కోసం వినియోగించుకోవడంపై సహకారానికి సంబంధించి భారతదేశం, ఆర్మేనియా ల మధ్య కుదిరినటువంటి ఒక అవగాహన పూర్వక ఒప్పందం (ఎంఒయు) ను గురించి ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అధ్య‌క్ష‌త‌న స‌మావేశ‌మైన కేంద్ర మంత్రివర్గం దృష్టికి తీసుకువ‌చ్చారు.
 
సాంప్రదాయక వైద్య విధానాలు, ఇంకా హోమియోపతి రంగంలో భారతదేశం, శ్రీ లంక ల మధ్య సహకారానికిగాను కుదిరిన అవగాహనపూర్వక ఒప్పందానికి ఆమోదం తెలిపిన మంత్రివర్గం

సాంప్రదాయక వైద్య విధానాలు, ఇంకా హోమియోపతి రంగంలో భారతదేశం, శ్రీ లంక ల మధ్య సహకారానికి గాను కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ, శ్రీ లంక కేంద్ర ఆరోగ్య- పౌష్టికాహార, దేశీయ వైద్య మంత్రిత్వ శాఖల మధ్య కుదిరిన అవగాహన ఒప్పందానికి (ఎంఒయు) ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అధ్య‌క్ష‌త‌న స‌మావేశ‌మైన కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 

వస్తువులు మరియు సేవల పన్ను (జిఎస్ టి)ని ప్రవేశపెట్టడంలో సహకరించినందుకుగాను అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు కృతజ్ఞతలు తెలిపిన మంత్రివర్గం

దేశంలో వస్తువులు మరియు సేవల పన్ను (జిఎస్ టి) వ్యవస్థను  ప్రవేశపెట్టేందుకు సహకరించిన అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు, ఇతరులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అధ్య‌క్ష‌త‌న స‌మావేశ‌మైన కేంద్ర మంత్రివర్గం ఒక తీర్మానాన్ని ఆమోదించింది.

28 జూన్ 2017
 
భార‌త దేశంలో జల సంరక్షణ కోసం జాతీయ ప్రచార కార్యక్రమం అంశంపై భారతదేశం, ఇజ్రాయెల్ ల మధ్య ఎంఒయు కు ఆమోదం తెలిపిన మంత్రివర్గం

భార‌తదేశంలో జల సంరక్షణ కోసం జాతీయ ప్రచార కార్యక్రమం అంశంపై భారత్‌, ఇజ్రాయెల్ ల మధ్య ఓ అవగాహనపూర్వక ఒప్పంద పత్రం (ఎంఒయు) పై సంతకాలు చేసేందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్య‌క్ష‌త‌న ఈ రోజు స‌మావేశ‌మైన కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 
 
అంతర్గత భద్రతపై భారతదేశం, అమెరికా ల మధ్య సహకార పూర్వక ఒప్పందానికి ఆమోదం తెలిపిన మంత్రివర్గం
 
అంతర్గత భద్రతపై సహకారంలో భారత్-అమెరికాల మధ్య సహకార పూర్వక  ఒప్పందానికి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్య‌క్ష‌త‌న స‌మావేశ‌మైన కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

12 జులై 2017
 
వారాణసీ లోని జాతీయ విత్తన పరిశోధన మరియు శిక్షణ కేంద్రం (ఎన్ఎస్ఆర్ టిసి) ప్రాంగణంలో అంతర్జాతీయ వరి పరిశోధన సంస్థ (ఐఆర్ఆర్ఐ) వారు దక్షిణాసియా ప్రాంతీయ కేంద్రం (ఐఎస్ఎఆర్ సి) ని ఏర్పాటు చేసేందుకు ఆమోదం తెలిపిన మంత్రివర్గం

 వారాణసీ లోని జాతీయ విత్తన పరిశోధన మరియు శిక్షణ కేంద్రం (NSRTC) ప్రాంగణంలో అంతర్జాతీయ వరి పరిశోధన సంస్థ (IRRI) వారు దక్షిణాసియా ప్రాంతీయ కేంద్రం (ISARC) ఏర్పాటు చేసేందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్య‌క్ష‌త‌న స‌మావేశ‌మైన కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
 
వైద్య- ఆరోగ్య రంగంలో సహకారం పై భారతదేశం, పాలస్తీనా ల మధ్య ఎంఒయు కు ఆమోదం తెలిపిన మంత్రివర్గం 

వైద్య- ఆరోగ్య రంగంలో సహకారం కోసం భారతదేశం, పాలస్తీనా ల మధ్య అవగాహనపూర్వక ఒప్పందం (ఎంఒయు)పై సంతకాలకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్య‌క్ష‌త‌న స‌మావేశ‌మైన కేంద్ర మంత్రివర్గం ఎక్స్- పోస్ట్ ఫ్యాక్టో ఆమోదం తెలిపింది. ఈ ఎంఒయు పై 2017 మే 16 వ తేదీన సంతకాలు అయ్యాయి.  
 
ఆరోగ్య రంగంలో సహకారంపై భారతదేశం, జర్మనీ ల మధ్య సంయుక్త ఆసక్తి వ్యక్తీకరణ ప్రకటన (జెడిఐ) కు ఆమోదం తెలిపిన మంత్రివర్గం

ఆరోగ్య రంగంలో సహకారంపై భారతదేశం, జర్మనీ ల మధ్య సంయుక్త ఆసక్తి వ్యక్తీకరణ ప్రకటన (జెడిఐ) పై సంతకాలకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్య‌క్ష‌త‌న స‌మావేశ‌మైన కేంద్ర మంత్రివర్గం ఎక్స్- పోస్ట్ ఫ్యాక్టో ఆమోదం తెలిపింది.  జెడిఐ పై 2017 జూన్ 1వ తేదీన సంతకాలు అయ్యాయి.  
 
పెట్టుబడులకు రక్షణ మరియు ప్రోత్సాహం అంశాలపై భారతదేశం, బాంగ్లాదేశ్ ల మధ్య జాయింట్ ఇంటర్ ప్రిటేటివ్ నోట్స్ (జెఐఎన్) కు ఆమోదం తెలిపిన మంత్రివర్గం

పెట్టుబడులకు రక్షణ మరియు ప్రోత్సాహం అంశాలపై భారతదేశం, బాంగ్లాదేశ్ ల మధ్య సంయుక్త అర్థ వివరణ సారాంశ ప్రకటన (జెఐఎన్)కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్య‌క్ష‌త‌న స‌మావేశ‌మైన కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

అసమ్ రైఫిల్స్, కేంద్ర సాయుధ పోలీసు బలగాలలోని వైద్యాధికారుల పదవీవిరమణ వయస్సు పరిమితిని పెంచే ప్రతిపాదనకు ఆమోదం తెలిపిన మంత్రివర్గం

రిటైర్మెంట్ వయస్సు పరిమితి పెంపునకు సంబంధించి దిగువ పేర్కొన్న అంశాలకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్య‌క్ష‌త‌న స‌మావేశ‌మైన కేంద్ర మంత్రివర్గం ఎక్స్- పోస్ట్ ఫ్యాక్టో ఆమోదం తెలిపింది:

(i)    అసమ్ రైఫిల్స్, కేంద్ర సాయుధ పోలీసు బలగాలలో సాధారణ విధులు నిర్వర్తించే వైద్యాధికారులకు 60 నుండి 65 ఏళ్లకు; మరియు

(ii)    కేంద్ర హోం మంత్రిత్వశాఖ పరిధి లోని అసమ్ రైఫిల్స్, కేంద్ర సాయుధ పోలీసు బలగాల్లో ప్రత్యేక విధులను నిర్వర్తించే వైద్యాధికారులకు 60 నుండి 65 ఏళ్లకు.
 
సైబర్ సెక్యూరిటీ కోఆపరేశన్ పై భారతదేశం, బాంగ్లాదేశ్ ల మధ్య ఎంఒయు  మంత్రివర్గం దృష్టికి

సైబర్ సెక్యూరిటీ కోఆపరేశన్ పై భారతదేశం, బాంగ్లాదేశ్ ల మధ్య అవగాహనపూర్వక ఒప్పందాన్ని (ఎంఒయు) గురించి సంబంధిత శాఖ వివరించిన తరువాత ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్య‌క్ష‌త‌న స‌మావేశ‌మైన కేంద్ర మంత్రివర్గం దృష్టికి తీసుకువ‌చ్చారు.  కేంద్ర ఎలక్ట్రానిక్స్- ఇన్ఫర్మేశన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ పరిధిలోని భారత కంప్యూటర్ అత్యవసర ప్రతిస్పందన బృందం (CERT-In), బాంగ్లాదేశ్ తపాలా-ఐటీ-టెలి కమ్యూనికేశన్ ల మంత్రిత్వ శాఖ పరిధిలోని బాంగ్లాదేశ్ కంప్యూటర్ కౌన్సిల్ ఆఫ్ ఇన్ఫర్మేశన్ విభాగం కింద గల బాంగ్లాదేశ్ గవర్నమెంట్ కంప్యూటర్ ఇన్సిడెంట్ రెస్పాన్స్ టీమ్ (BGD e-Gov CIRT) మధ్య ఈ ఒప్పందం కుదిరింది. 2017 ఏప్రిల్ 8వ తేదీన ఎంఒయు పై సంతకాలు అయ్యాయి.
 
ఆంధ్ర ప్రదేశ్, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్ లలో కొత్తగా ఏర్పాటు చేసే అఖిల భారత వైద్య విజ్ఞాన శాస్త్రాల సంస్థ (ఎఐఐఎమ్ ఎస్) ల కోసం మూడు డైరెక్టర్ పోస్టులు సృష్టించేందుకు ఆమోదం తెలిపిన మంత్రివర్గం

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లోని గుంటూరు సమీపానగల మంగళగిరి; మహారాష్ట్ర లోని నాగ్ పుర్; పశ్చిమ బెంగాల్ రాష్ట్రం లోని కల్యాణి లో 3 కొత్త అఖిల భారత వైద్య విజ్ఞాన శాస్త్రాల సంస్థ (AIIMS)ల కోసం 80 వేల రూపాయల ప్రి- రివైజ్ డ్ స్కేల్ (ఫిక్స్ డ్) { ప్లస్ ఎన్ పిఎ సీలింగ్ లిమిట్ 85000) తో మూడు డైరెక్టర్ పోస్టులను ఏర్పాటు చేసేందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 
 
ఇన్ఫర్మేశన్ టెక్నాలజీ- ఎలక్ట్రానిక్స్ రంగంలో సహకారంపై భారతదేశం, పాలస్తీనా ల మధ్య అవగాహన ఒప్పందాన్ని గురించి దృష్టికి తీసుకురావడమైంది

ఇన్ఫర్మేశన్ టెక్నాలజీ-ఎలక్ట్రానిక్స్ రంగంలో భారతదేశం, పాలస్తీనా ల మధ్య సహకారం కోసం కుదిరిన అవగాహనపూర్వక ఒప్పందం (ఎంఒయు)ను గురించి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం దృష్టికి తీసుకువ‌చ్చారు.

19 జులై 2017
 
పన్ను వ్యవహారాలకు సంబంధించిన అంశాలపై బ్రిక్స్ దేశాలు- బ్రెజిల్, రష్యా, చైనా, దక్షిణాఫ్రికా లతో భారతదేశం సహకార ఒప్పందానికి ఆమోదం తెలిపిన మంత్రివర్గం

పన్ను వ్యవహారాలకు సంబంధించిన అంశాలపై బ్రిక్స్ సభ్యత్వ దేశాలైన బ్రెజిల్, రష్యా, చైనా, దక్షిణాఫ్రికా ల రెవెన్యూ పాలన విభాగాలతో భారతదేశం సహకారపూర్వక ఒప్పంద పత్రం (ఎమ్ఒసి)పై సంతకాలకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
 
ఇండియన్ డిఫెన్స్ అకౌంట్స్ సర్వీస్ (ఐడిఎఎస్)లో సిబ్బంది స్థాయి సమీక్షకు ఆమోదం తెలిపిన మంత్రివర్గం

ఇండియన్ డిఫెన్స్ అకౌంట్స్ సర్వీస్ (IDAS) లో సిబ్బంది స్థాయి సమీక్షకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.  ఈ నిర్ణయంవల్ల పోస్టుల సంఖ్య 23 కు పెరుగుతుంది.  ఇందులో అత్యున్నత స్కేలులో ఒకటి సహా హెచ్ఎజి స్థాయిలో 6, ఎస్ఎజి స్థాయిలో 6, జెఎజి స్థాయిలో 10 వంతున పోస్టులు పెరుగుతాయి.  అదే సమయంలో హెచ్ఎజి+ స్థాయిలో 1, ఎస్ టిఎస్ స్థాయిలో 12, జెటిఎస్ స్థాయిలో 10 వంతున పోస్టులు తగ్గుతాయి. 
 
అంతరిక్ష సాంకేతిక పరిజ్ఞానంలో భారతదేశం, నెదర్లాండ్స్ ల మధ్య ఎంఒయును కేంద్ర మంత్రివర్గం దృష్టికి తీసుకురావడమైంది

ఖగోళ అన్వేషణ, శాంతియుత ప్రయోజనాల దిశగా అంతరిక్ష వినియోగం కోసం సాంకేతిక పరిజ్ఞానంలో భారతదేశం, నెదర్లాండ్స్ ల మధ్య అవగాహనపూర్వక ఒప్పందాన్ని (ఎంఒయు) గురించి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం దృష్టికి తీసుకురావడమైంది.  ఈ ఒప్పందంపై బెంగళూరు, ది హేగ్ (నెదర్లాండ్స్ రాజధాని) నగరాలలో 2017 మే 11వ, 22వ తేదీలలో సంతకాలు అయ్యాయి.
 
ఇంటర్ నేశనల్ అసోసియేశన్ ఆఫ్ ఇన్ శ్యురన్స్ సూపర్ వైజర్స్ (ఐఎఐఎస్) లో సభ్యత్వం దిశగా కుదుర్చుకున్న బహుళపక్ష అవగాహనపూర్వక ఒప్పందం (ఎంఎంఒయు) మేరకు అందులో ఐఆర్ డిఎఐ భాగస్వామ్యానికి ఆమోదం తెలిపిన మంత్రివర్గం
 
అంతర్జాతీయ బీమా పర్యవేక్షక సంస్థ (IAIS) లో సభ్యత్వం దిశగా కుదిరిన బహుళపక్ష అవగాహన ఒప్పందం (MMoU)లో భారత బీమా నియంత్రణ-అభివృద్ధి సంస్థ (IRDAI) కూడా భాగస్వామి కావడంపై ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఎక్స్- పోస్ట్ ఫ్యాక్టో ఆమోదం తెలిపింది.

ఇన్ ల్యాండ్ వాటర్ వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఐడబ్ల్యుఎఐ) కి 2017-18 కుగాను భారత ప్రభుత్వ బాండ్ల రూపంలో రూ.660 కోట్ల మేర అదనపు బడ్జెట్ వనరులు (ఇబిఆర్) సమకూర్చుకొనేందుకు ఇచ్చిన అనుమతి చెల్లుబాటు గడువు పొడిగింపునకు ఆమోదం తెలిపిన మంత్రివర్గం

భారత అంతర్గత జలమార్గాల ప్రాధికార సంస్థ (IWAI)కు 2017-18 కిగాను భారత ప్రభుత్వ బాండ్ల రూపంలో రూ.660 కోట్ల మేర అదనపు బడ్జెట్ వనరులు (EBR) సమకూర్చుకొనేందుకు ఇచ్చిన అనుమతి చెల్లుబాటు గడువు పొడిగింపునకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
 
సెంట్రల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ (అమెండ్ మెంట్) బిల్లు- 2017 కు ఆమోదం తెలిపిన మంత్రివర్గం

కేంద్రీయ వస్తు వులు మరియు సేవల పన్ను (జమ్ము & కశ్మీర్ కు విస్తరణ) ఆర్డినెన్స్- 2017 తో పాటు ఆ తరువాత దాని స్థానంలో కేంద్రీయ వస్తువులు మరియు సేవల పన్ను (సవరణ) బిల్లు- 2017 ను ప్రవేశపెట్టేందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన మంత్రివర్గం ఎక్స్- పోస్ట్ ఫ్యాక్టో ఆమోదం తెలిపింది.

ఇంటిగ్రేటెడ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ (అమెండ్ మెంట్) బిల్లు-2017కు ఆమోదం తెలిపిన మంత్రివర్గం

సమీకృత వస్తువులు మరియు సేవల పన్ను (జమ్ము & కశ్మీర్ కు విస్తరణ) ఆర్డినెన్స్-2017 తో పాటు ఆ తరువాత దాని స్థానంలో సమీకృత వస్తువులు మరియు సేవల పన్ను (సవరణ) బిల్లు-2017 ను ప్రవేశపెట్టేందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఎక్స్- పోస్ట్ ఫ్యాక్టో ఆమోదం తెలిపింది.

ఇండియన్ కమ్యూనిటీ వెల్ ఫేర్ ఫండ్ మార్గదర్శకాల సవరణకు ఆమోదం తెలిపిన మంత్రివర్గం

భారత సామాజిక సంక్షేమ నిధి (ఐసిడబ్ల్యుఎఫ్) మార్గదర్శకాల సవరణ కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

26 జులై 2017
 
రాజ్యాంగ ఆదేశాలు (జమ్ము &  కశ్మీరు కు వర్తింపు)-1954 సవరణకు ఆమోదం తెలిపిన మంత్రివర్గం

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన మంత్రివర్గం రాజ్యాంగ ఆదేశాలు (జమ్ము  & కశ్మీర్ కు వర్తింపు)-1954 సవరణకు సంబంధించిన రాజ్యాంగ సవరణ (జమ్ము  & కశ్మీర్ కు వర్తింపు) ఆదేశాలు-2017కు జారీ అనంతర ఆమోదం తెలిపింది.
 
యువజన-క్రీడా వ్యవహారాలలో సహకారానికి భారత్-పాలస్తీనా మధ్య ఎంఒయు ను గురించి మంత్రివర్గం దృష్టికి తీసుకురావడమైంది


యువజన- క్రీడా వ్యవహారాలలో సహకారంపై భారతదేశం, పాలస్తీనా ల మధ్య అవగాహన ఒప్పందాన్ని గురించి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం దృష్టికి తీసుకువచ్చారు.  
 
ఇండో జర్మన్- సెంటర్ ఫర్ సస్టెయినబిలిటీ పై భారతదేశం, జర్మనీ ల మధ్య జాయింట్ డిక్లరేశన్ ఆఫ్ ఇంటెంట్ ను గురించి మంత్రివర్గం దృష్టికి తీసుకురావడమైంది
  
భారతదేశం, జర్మనీ ల సుస్థిరత కేంద్రంపై భారత శాస్త్ర- సాంకేతిక వ్యవహారాల మంత్రిత్వశాఖ, జర్మనీ కేంద్ర విద్యా-పరిశోధన మంత్రిత్వశాఖల మధ్య సంయుక్త ఆసక్తి వ్యక్తీకరణ ప్రకటన (JDI) గురించి సంబంధిత శాఖ  ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన మంత్రివర్గం దృష్టికి తీసుకువచ్చారు.  బెర్లిన్ నగరంలో భారత ప్రధాన మంత్రి, జర్మనీ సమాఖ్య చాన్స్ లర్ ల మధ్య అంతర ప్రభుత్వ చర్చల సందర్భంగా 2017 మే 30వ తేదీన ఈ సంయుక్త ఆసక్తి వ్యక్తీకరణ ప్రకటన ప్రక్రియ పూర్తయింది.  జేడీఐపై భారత శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్, జర్మనీ విద్యా పరిశోధన శాఖ మంత్రి ప్రొఫెసర్ డాక్టర్ యోహోనా వాంకా లు సంతకాలు చేశారు. 

సావరిన్ గోల్డ్ బాండ్స్ స్కీము మార్గదర్శకాల సవరణ కు ఆమోదం తెలిపిన మంత్రివర్గం 

ప్రభుత్వ స్వర్ణ పత్రాల (SGB) పథకానికి అనుగుణంగా ఆశించిన లక్ష్యాలు సాధించే దృష్టితో వీటి మార్గదర్శకాల సవరణకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన మంత్రివర్గం ఆమోదం తెలిపింది.


20 సెప్టెంబ‌ర్ 2017

పున‌రుద్ధ‌రించిన ‘ఖేలో ఇండియా’ కార్య‌క్ర‌మానికి ఆమోదం తెలిపిన మంత్రివర్గం

పున‌రుద్ధ‌రించిన ‘ఖేలో ఇండియా’ కార్య‌క్ర‌మానికి ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అధ్యక్షతన  స‌మావేశ‌మైన కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.  ఇందుకోసం 2017-18, 2019-20 కాలానికిగాను రూ.1,756 కోట్ల నిధుల‌ను వెచ్చిస్తారు.  ఇది భార‌తదేశ క్రీడా చ‌రిత్ర‌లో కీల‌క‌మైన మార్పు.  ఎందుకంటే, ఈ కార్య‌క్ర‌మం కార‌ణంగా క్రీడ‌ల‌నేవి వ్య‌క్తిగ‌త అభివృద్ధికి, సంఘ అభివృద్ధి, ఆర్ధిక అభివృద్ధికి, జాతీయ అభివృద్ధికి దోహ‌దం చేస్తాయి. 

మంత్రివర్గం ముందుకు జాతీయ ఆరోగ్య కార్య‌క్ర‌మం (ఎన్‌హెచ్ఎమ్) పురోగ‌తి; అలాగే ఎన్‌హెచ్ఎమ్‌ కు చెందిన మిషన్ స్టీరింగ్ గ్రూప్ మరియు ఎంపవర్డ్ ప్రోగ్రాం క‌మిటీ నిర్ణ‌యాలు

జాతీయ ఆరోగ్య కార్య‌క్ర‌మం (ఎన్‌హెచ్ఎమ్‌) లో భాగంగా సాధించిన ప్ర‌గ‌తి వివ‌రాలను ప్ర‌ధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన స‌మావేశ‌మైన కేంద్ర మంత్రివర్గం ముందుంచ‌డం జ‌రిగింది.  అంతే కాదు ఎన్‌హెచ్ఎమ్‌ కు సంబంధించిన‌ సాధికారిక కార్య‌క్ర‌మ సంఘం (ఇపిసి), మిష‌న్ స్టీరింగ్ గ్రూప్ (ఎంఎస్‌జి) ల‌కు సంబంధించిన‌ నిర్ణ‌యాలు కూడా మంత్రివర్గం దృష్టికి తీసుకువ‌చ్చారు.  జాతీయ గ్రామీణ ఆరోగ్య కార్య‌క్ర‌మాన్ని (ఎన్ఆర్‌హెచ్‌ఎమ్‌) ను 2005 ఏప్రిల్ నెల‌లో ప్ర‌వేశ‌పెట్టారు.  దీనిని 2013లో జాతీయ ఆరోగ్య కార్య‌క్ర‌మంగా (ఎన్‌హెచ్ఎమ్)గా రూపాంత‌రం చేశారు.  జాతీయ ప‌ట్ట‌ణ ఆరోగ్య కార్య‌క్ర‌మం (ఎన్ యుహెచ్ఎమ్) ను 2013లో ప్రారంభించ‌డం వ‌ల్ల ఎన్‌హెచ్ఎమ్‌ కింద ఎన్ఆర్‌హెచ్‌ఎమ్‌, ఎన్ యు హెచ్ ఎం అనే రెండు ఉప కార్య‌క్ర‌మాలు త‌యార‌య్యాయి. 

ప్ర‌భుత్వ ముద్ర‌ణాల‌యాల శాస్త్రీయ‌క‌ర‌ణ‌/విలీనానికి, ఆధునీక‌ర‌ణకు ఆమోదం తెలిపిన మంత్రివర్గం

ప్ర‌భుత్వ ముద్ర‌ణాల‌యాల శాస్త్రీయ‌క‌ర‌ణ‌/ విలీనానికి, ఆధునీక‌ర‌ణకు  ప్ర‌ధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన స‌మావేశ‌మైన కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.  ప‌దిహేడు ప్ర‌భుత్వ ముద్ర‌ణాలయాలు/యూనిట్ల‌ను ఐదు ప్ర‌భుత్వ ముద్ర‌ణాల‌యాల్లోకి విలీనం చేస్తారు. ఈ ఐదు ముద్ర‌ణాల‌యాలు న్యూ ఢిల్లీ లోని రాష్ట్ర‌ప‌తి భ‌వ‌న్‌, మింటో రోడ్డు, మాయాపురిలలోను,  మ‌హారాష్ట్ర‌ లోని నాసిక్‌ లోను, ప‌శ్చ‌మ బెంగాల్ లోని కోల్ కతా లోను ఉన్నాయి. 

దంత‌వైద్యుల ( స‌వ‌ర‌ణ‌) బిల్లు, 2017 ప్ర‌వేశానికి ఆమోదం తెలిపిన మంత్రివర్గం

దంతవైద్యుల (స‌వ‌ర‌ణ‌) బిల్లు, 2017 ను పార్ల‌మెంటులో ప్ర‌వేశ‌పెట్టేందుకు ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అధ్య‌క్ష‌త‌న స‌మావేశ‌మైన కేంద్ర మంత్రివ‌ర్గం ఆమోదాన్ని తెలిపింది.  అయితే ఇది దంతవైద్యుల చ‌ట్టం, 1948 (16 ఆఫ్ 1948)లో లెజిస్లేటివ్ డిపార్ట్ మెంటు అవ‌స‌ర‌మ‌ని భావించే ఏదైనా స‌వ‌ర‌ణతో కూడిన లేదా త‌త్పర్య‌వ‌సాన ప్ర‌భావంతో కూడిన ముసాయిదా ర‌చ‌న‌లోని మార్పులకు లోబ‌డి ఉంటుంది. ఈ స‌వ‌ర‌ణ  పున‌రుక్తిని త‌గ్గిస్తుంది. 

రైల్వే ఉద్యోగుల‌కు ఉత్పాద‌క‌త‌తో జోడించిన బోన‌స్ చెల్లించేందుకు ఆమోదం తెలిపిన మంత్రివ‌ర్గం

అర్హులైన నాన్- గెజిటెడ్ రైల్వే ఉద్యోగుల‌కు (ఆర్‌పిఎఫ్/ఆర్‌పిఎస్ఎఫ్ సిబ్బంది మిన‌హా) 2016 -17 ఆర్థిక సంవ‌త్స‌రానికి గాను 78 రోజుల వేత‌నంతో స‌మంగా ఉండే ఉత్పాద‌క‌త‌తో జోడించిన బోన‌స్ ను (పిఎల్ బి ని) చెల్లించేందుకు ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అధ్య‌క్ష‌త‌న స‌మావేశ‌మైన కేంద్ర మంత్రివ‌ర్గం ఆమోదాన్ని తెలియ‌జేసింది.  ఈ నిర్ణ‌యం ఫ‌లితంగా దాదాపు 12.30 ల‌క్ష‌ల నాన్ గెజిటెడ్ రైల్వే ఉద్యోగులు ప్ర‌యోజ‌నం పొందే అవ‌కాశం ఉంది.  ద‌స‌రా/‘పూజ’ పండుగ సెలవు దినాల క‌న్నా ముందే జ‌రిపే ఈ చెల్లింపు ల‌క్ష‌లాది కుటుంబాల మోముల‌లో చిరున‌వ్వును తీసుకురానుంది.

27 సెప్టెంబర్ 2017

కేంద్ర ఆరోగ్య సేవ‌ల (సిహెచ్ ఎస్‌) వైద్యులు కాని ఇత‌ర వైద్యుల ప‌ద‌వీకాల వ‌యోప‌రిమితిని 65 సంవ‌త్స‌రాల‌కు పెంచడానికి ఆమోదం తెలిపిన మంత్రివ‌ర్గం

కేంద్ర ఆరోగ్య సేవ‌ల (సిహెచ్ ఎస్‌) వైద్యులు కాని ఇత‌ర వైద్యుల ప‌ద‌వీకాల వ‌యోప‌రిమితిని 65 సంవ‌త్స‌రాల‌కు పెంచడానికి  ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అధ్య‌క్ష‌త‌న స‌మావేశ‌మైన కేంద్ర మంత్రివ‌ర్గం ఆమోదం తెలిపింది. 

అంత‌ర్ బ్యాంకుల స్థానిక క‌రెన్సీ క్రెడిట్ లైన్ ఒప్పందం మరియు బ్రిక్స్ అంత‌ర్ బ్యాంకుల స‌హ‌కార వ్య‌వ‌స్థ‌లోని ఇడిఐఎమ్ బ్యాంకు ద్వారా క్రెడిట్ రేటింగ్స్ కు సంబంధించిన స‌హ‌కార ఒప్పందానికి ఆమోదం తెలిపిన మంత్రివర్గం

     
అంత‌ర్ బ్యాంకుల స్థానిక క‌రెన్సీ క్రెడిట్ లైన్ ఒప్పందం మరియు బ్రిక్స్ అంత‌ర్ బ్యాంకు స‌హ‌కార వ్య‌వ‌స్థ‌ లోని స‌భ్య‌త్వ దేశాల భాగ‌స్వామ్యం లోని ఎగ్జిమ్ బ్యాంకు క్రెడిట్ రేటింగ్స్ కు సంబంధించిన స‌హ‌కార అవ‌గాహ‌న‌పూర్వక ఒప్పంద పత్రాలపై సంతకాలకు ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అధ్యక్షతన స‌మావేశమైన కేంద్ర మంత్రివర్గం  ఆమోదం తెలిపింది.  ఈ రెండూ (ఒప్పందం, అవ‌గాహ‌న ఒప్పందం ) గొడుగు ఒప్పందాలలో భాగమే కానీ తప్ప‌నిస‌రి ఏమీ కాదు.  ఈ చ‌ట్రం లోని నిబంధ‌న‌లు, వ్యక్తిగ‌త కాంట్రాక్టుల‌ను నిర్ధరించ‌డం చ‌ర్చించేందుకు ఎగ్జిమ్ బ్యాంకు బోర్డు ఆఫ్ డైరెక్ట‌ర్లకు సంపూర్ణ అధికారం ఉంటుంది.

స‌మాచారం, క‌మ్యూనికేష‌న్‌, మీడియా రంగాలలో భార‌త‌దేశం, ఇథియోపియా ల మ‌ధ్య‌స‌హ‌కార ఒప్పందానికి ఆమోదం తెలిపిన మంత్రివర్గం

స‌మాచారం, క‌మ్యూనికేష‌న్‌, మీడియా రంగాలలో భార‌త‌దేశం, ఇథియోపియా ల మ‌ధ్య‌ స‌హ‌కార ఒప్పందంపై సంత‌కాలు చేయ‌డానికి గాను ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అధ్యక్షతన స‌మావేశమైన కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 

ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నుండి ల‌ఖ్ నవూ మెట్రో రైల్ కార్పొరేష‌న్ (ఎల్ఎంఆర్ సి) కి శాశ్వ‌తంగా 1899 చ‌ద‌ర‌పు మీట‌ర్ల స్థ‌లం బ‌దిలీకి ఆమోదం తెలిపిన మంత్రివర్గం

ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఎఐ) నుండి ల‌ఖ్ నవూ మెట్రో రైలు కార్పొరేష‌న్ (ఎల్ఎంఆర్ సి) కి శాశ్వ‌తంగా 1899 చ‌ద‌ర‌పు మీట‌ర్ల స్థ‌లం బ‌దిలీకి ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అధ్యక్షతన స‌మావేశమైన కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.  ఈ స్థ‌లం ల‌ఖ్ నవూ లోని చౌధరి చ‌ర‌ణ్ సింగ్ ఇంట‌ర్ నేశన‌ల్ విమానాశ్ర‌యం ద‌గ్గ‌ర ఉంది. 
 
రాజమండ్రి విమానాశ్రయం వ‌ద్ద ఉన్న 10.25 ఎక‌రాల ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఎఐ) భూమిని ఆంధ్ర ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం ఇవ్వ‌జూపే అంతే విస్తీర్ణం క‌లిగిన‌టువంటి భూమితో మార్చుకోవ‌డానికి ఆమోదం తెలిపిన  కేంద్ర మంత్రివ‌ర్గం; ఈ భూమితో రాజ‌మండ్రి విమానాశ్ర‌యం చుట్టూరా ఉన్న ఇరుగు పొరుగు ప‌ల్లెల‌కు ర‌హ‌దారి అనుసంధానాన్ని క‌ల్పించ‌డం కోసం విమానాశ్ర‌య హ‌ద్దు వెంబ‌డి ఒక రోడ్డును నిర్మిస్తారు. 
     

రాజ‌మండ్రి విమానాశ్ర‌యం వ‌ద్ద ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఎఐ)కి చెందిన 10.25 ఎక‌రాల భూమిని దానితో స‌మాన‌మైన విస్తీర్ణం క‌లిగిన‌టువంటి స్థ‌లాన్ని ఆంధ్ర ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం నుండి స్వీక‌రించి ప‌ర‌స్ప‌రం మార్పిడి చేసుకొనేందుకు ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అధ్య‌క్ష‌త‌న స‌మావేశ‌మైన కేంద్ర మంత్రివ‌ర్గం ఆమోదం తెలిపింది.  ఈ ప్ర‌తిపాద‌న రాజ‌మండ్రి విమానాశ్ర‌యం చుట్టూరా నెల‌కొన్న గ్రామాల‌కు ర‌హ‌దారి మార్గాన్ని స‌మ‌కూర్చాలన్న ఉద్దేశంతో త‌యారు చేశారు.  ఆ ప్రాంతంలోని సాధార‌ణ ప్ర‌జానీకానికి సుల‌భ‌త‌రంగా రోడ్డు అనుసంధానం ఏర్ప‌డాల‌న్న‌దే ఇందులోని ముఖ్యోద్దేశం.  త‌ద్వారా ఈ ప్రాంతంలోని సాధార‌ణ ప్ర‌జ‌ల‌కు, మ‌రీ ముఖ్యంగా వ్య‌వ‌సాయ‌దారుల‌కు వారి పంట భూముల‌కు చేరుకొనే వెసులుబాటు క‌లుగుతుంది. 


పోలీసు ద‌ళాల ఆధునికీక‌ర‌ణ‌ కోసం రూపొందించిన ప‌థ‌కానికి ఆమోదం తెలిపిన మంత్రివ‌ర్గం

పోలీసు ద‌ళాల ఆధునికీకర‌ణ (ఎమ్ పిఎఫ్‌) కు సంబంధించి ఒకే గొడుగు కింద‌కు వ‌చ్చే ప‌థ‌కానికి ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర‌ మోదీ ఆధ్వ‌ర్యంలో స‌మావేశ‌మైన కేంద్ర మంత్రివర్గం  ఆమోదం తెలిపింది.  ఈ ప‌థ‌కం 2017-18 నుండి 2019-20 వ‌ర‌కు కొన‌సాగుతుంది.  ఈ మూడు సంవ‌త్స‌రాల కాలానికిగాను కేటాయించే నిధులు రూ.25, 060 కోట్లు. ఇందులో కేంద్ర ప్ర‌భుత్వ వాటా రూ. 18, 636 కోట్లు కాగా, రాష్ట్రాల వాటా రూ. 6, 424 కోట్లు. 

చమురు, గ్యాస్‌ రంగంలో భార‌త‌దేశం, బెలారూస్ ల మ‌ధ్య‌ అవ‌గాహ‌న ఒప్పంద ప‌త్రానికి ఆమోదం తెలిపిన మంత్రివ‌ర్గం

 
చమురు, గ్యాస్ రంగంలో భార‌త‌దేశం, బెలార‌స్ ల మ‌ధ్య‌న కుదిరిన అవ‌గాహ‌న ఒప్పంద ప్ర‌త్రానికి (ఎంఒయు) ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్య‌క్ష‌త‌న స‌మావేశ‌మైన కేంద్ర మంత్రివర్గం ఎక్స్- పోస్ట్ ఫ్యాక్టో ఆమోదం తెలిపింది  ఈ ఎంఓయు పైన బెలారూస్ అధ్య‌క్షుడు  2017 సెప్టెంబ‌ర్ 12వ తేదీన భార‌తదేశంలో ప‌ర్య‌ట‌ించిన కాలంలో  సంత‌కాలు అయ్యాయి. 

భార‌త‌దేశం, బెలారూస్ ల మ‌ధ్య‌ పెట్టుబ‌డుల విష‌యంలో కుదిరిన ద్వైపాక్షిక ఒప్పందానికి ఆమోదం తెలిపిన మంత్రివ‌ర్గం

పెట్టుబ‌డుల విష‌యంలోభార‌త‌దేశం, బెలారూస్ ల మ‌ధ్య‌ ద్వైపాక్షిక పెట్టుబడుల ఒడంబడిక (బిఐటి) పై సంతకాలకు, అనుమోదానికి ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అధ్య‌క్ష‌త‌న స‌మావేశ‌మైన కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 


పోలీసు శిక్ష‌ణ‌, అభివృద్ధి అంశంలో భార‌తదేశం, అఫ్గానిస్తాన్ ల మ‌ధ్య‌ కుదిరిన ద్వైపాక్షిక ఎంఓయుకు ఆమోదం తెలిపిన మంత్రివ‌ర్గం

పోలీసు శిక్ష‌ణ‌ మరియు అభివృద్ధి అంశంలో భార‌తదేశం, అఫ్గానిస్తాన్ ల మ‌ధ్య‌ అవగాహనపూర్వక ఒప్పందం (ఎంఒయు) పై సంతకాలకు ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అధ్య‌క్ష‌త‌న స‌మావేశ‌మైన కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 

క‌మ్యూనికేశన్ ఆప‌రేట‌ర్ల‌కు రక్ష‌ణ శాఖ భూమిని కేటాయించ‌డానికి వీలుగా విధాన స‌వ‌ర‌ణ‌కు ఆమోదం తెలిపిన మంత్రివ‌ర్గం; ర‌క్ష‌ణ‌శాఖ భూమిలో ప‌ర‌స్ప‌రం ఉప‌యోగించుకునే క‌మ్యూనికేష‌న్ ట‌వ‌ర్ల‌ను, సంబంధిత మౌలిక స‌దుపాయాల‌ను నిర్మిస్తారు.

క‌మ్యూనికేశన్ ఆప‌రేట‌ర్ల‌కు రక్ష‌ణ శాఖ భూమిని కేటాయించ‌డానికి వీలుగా ర‌పొందిన విధాన స‌వ‌ర‌ణ‌కు ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అధ్య‌క్ష‌త‌న స‌మావేశ‌మైన కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.  ర‌క్ష‌ణ‌ శాఖ భూమిలో ప‌ర‌స్ప‌రం ఉప‌యోగించుకునే క‌మ్యూనికేష‌న్ ట‌వ‌ర్ల‌ను, సంబంధిత మౌలిక స‌దుపాయాల‌ను నిర్మిస్తారు.  మొబైల్ ట‌వ‌ర్ల ఏర్పాటుకు ఇచ్చే అనుమ‌తి కోసం టెలిక‌మ్యూనికేశన్ ల విభాగం  విడుద‌ల చేసిన‌ మార్గ‌ద‌ర్శకాల‌ను, అనుస‌రించిన విధానాన్ని అమ‌లు చేయ‌డం ద్వారా చేకూరిన అనుభ‌వాన్ని ఆధారం చేసుకొని ఈ నిర్ణ‌యం తీసుకోవ‌డం జ‌రిగింది. 

అక్టోబ‌ర్‌ 4, 2017

భార‌త‌దేశం, లిథువానియా ల మ‌ధ్య‌ (పరదేశీ) దోషి/ అపరాధి  అప్ప‌గింత ఒప్పందానికి ఆమోదం తెలిపిన మంత్రివ‌ర్గం

భార‌త‌దేశం, లిథువానియా ల మ‌ధ్య‌ (పరదేశీ) దోషి/ అపరాధి  అప్ప‌గింత ఒప్పందానికి ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అధ్య‌క్ష‌త‌న స‌మావేశ‌మైన కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 

రైల్వే రంగంలో సాంకేతిక స‌హ‌కారం కోసం భార‌త‌దేశం,  స్విట్జ‌ర్‌లాండ్ ల మ‌ధ్య కుదిరిన‌ ఎంఒయు మంత్రివ‌ర్గం ప‌రిశీల‌న‌కు నివేదన‌

రైల్వే రంగంలో సాంకేతిక స‌హ‌కారం కోసం భార‌త ప్ర‌భుత్వ రైల్వేల మంత్రిత్వ శాఖకు మ‌రియు స్విస్ ఫెడ‌రేష‌న్ యొక్క ప‌ర్యావ‌ర‌ణం, ర‌వాణా, శ‌క్తి మ‌రియు క‌మ్యూనికేష‌న్ ల ఫెడ‌ర‌ల్ విభాగానికి మ‌ధ్య కుదిరిన‌టువంటి అవ‌గాహ‌న పూర్వ‌క ఒప్పందాన్ని (ఎంఒయు ను) ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అధ్య‌క్ష‌త‌న స‌మావేశ‌మైన కేంద్ర మంత్రివ‌ర్గం దృష్టికి తీసుకువ‌చ్చారు.  ఈ ఎంఒయు పై ఆగ‌స్టు 31వ తేదీన సంత‌కాల‌య్యాయి.

మయన్మార్‌ లోని యమెథిన్ లో మ‌హిళా పోలీసు శిక్షణ కేంద్రం ఆధునీక‌ర‌ణ‌కు రూపొందిన ఎంఒయు కు ఆమోదం తెలిపిన మంత్రివ‌ర్గం

మయన్మార్‌ లోని యమెథిన్ లో  మ‌హిళా పోలీసు శిక్షణ కేంద్రం ఆధునికీక‌ర‌ణ‌పై అవగాహనపూర్వక ఒప్పందానికి (ఎంఒయు) ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అధ్య‌క్ష‌త‌న స‌మావేశ‌మైన కేంద్ర మంత్రివ‌ర్గం ఆమోదం తెలిపింది.  ఈ ఎంఒయు పైన 2017 సెప్టెంబ‌ర్ 6వ తేదీన సంత‌కాల‌య్యాయి. 

కాండ్లా నౌకాశ్ర‌యానికి ‘దీన్ ద‌యాళ్ నౌకాశ్ర‌యం’ పేరును పెట్టేందుకు ఆమోదం తెలిపిన మంత్రివర్గం

కాండ్లా నౌకాశ్ర‌యానికి ‘దీన్ ద‌యాళ్ నౌకాశ్ర‌యం’ పేరును పెట్టేందుకు ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అధ్య‌క్ష‌త‌న స‌మావేశ‌మైన కేంద్ర మంత్రివ‌ర్గం ఎక్స్- పోస్ట్ ఫ్యాక్టో ఆమోదం తెలిపింది.

11 అక్టోబ‌ర్, 2017

‘‘టెక్నిక‌ల్ ఇంట‌ర్న్ ట్రెయినింగ్ ప్రోగ్రామ్ ( టిఐటిపి)’’ అంశంపై భారతదేశం, జ‌పాన్ ల మ‌ధ్య‌ ఎంఒసి కి ఆమోదం తెలిపిన మంత్రివర్గం

భారతదేశం, జ‌పాన్ ల మ‌ధ్య‌ టెక్నిక‌ల్ ఇంట‌ర్న్ ట్రెయినింగ్ ప్రోగ్రామ్ ( టిఐటిపి)పై సహకారానికి ఉద్దేశించినటువంటి ఒక విజ్ఞాపన పత్రం (ఎంఒసి)పై సంతకాలకు ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అధ్య‌క్ష‌త‌న స‌మావేశ‌మైన కేంద్ర మంత్రివ‌ర్గం ఆమోదం తెలిపింది. 

లిక్విడ్‌, ప్లెక్సిబుల్‌, గ్లోబ‌ల్ ఎల్ఎన్ జి మార్కెట్ ను ఏర్పాటు చేయ‌డం కోసం భారతదేశం, జపాన్ ల మ‌ధ్య‌ కుదిరిన స‌హ‌కార ఒప్పందానికి ఆమోదం తెలిపిన మంత్రివర్గం
 
లిక్విడ్‌, ప్లెక్సిబుల్‌, గ్లోబ‌ల్ ఎల్ ఎన్ జి మార్కెట్ ఏర్పాటు చేయ‌డం కోసం భారతదేశం, జపాన్ ల మ‌ధ్య‌ సహకారానికి ఉద్దేశించినటువంటి ఒక విజ్ఞాపన పత్రం (ఎంఒసి)పై సంతకాలకు ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అధ్య‌క్ష‌త‌న స‌మావేశ‌మైన కేంద్ర మంత్రివ‌ర్గం ఆమోదం తెలిపింది.  

సెబి, ఎఫ్ఎస్ సి ల‌మ‌ధ్య‌ కుదిరిన ఎంఒయుకు ఆమోదం తెలిపిన మంత్రివర్గం

సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (ఎస్ఇబిఐ)కు, జిబ్రాల్ట‌ర్‌ లోని ఫైనాన్శియల్ సర్వీసెస్ క‌మిష‌న్ (ఎఫ్ఎస్ సి)కి మ‌ధ్య‌ కుదిరిన పరస్పర అవ‌గాహన మరియు సాంకేతిక సహాయం కోసం ఉద్దేశించినటువంటి ఒక అవగాహనపూర్వక ఒప్పంద ప‌త్రానికి (ఎంఒయు)కు ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అధ్య‌క్ష‌త‌న స‌మావేశ‌మైన కేంద్ర మంత్రివ‌ర్గం ఆమోదం తెలిపింది. 

భార‌త‌దేశం, బెలారూస్ ల మ‌ధ్య‌ వృత్తి విద్యా, శిక్ష‌ణ రంగంలో స‌హ‌కారం కోసం రూపొందిన ఎంవోయు కు ఆమోదం తెలిపిన మంత్రివర్గం

భార‌త‌దేశం, బెలారూస్ ల మ‌ధ్య‌ వృత్తి విద్యా, శిక్ష‌ణ రంగంలో స‌హ‌కారం కోసం రూపొందిన ఎంవోయు కు ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అధ్య‌క్ష‌త‌న స‌మావేశ‌మైన కేంద్ర మంత్రివ‌ర్గం ఆమోదం తెలిపింది.  బెలారూస్ అధ్య‌క్షుల వారు శ్రేష్ఠులు శ్రీ అలెగ్జాండ‌ర్ లుకాశెంకో 2017 సెప్టెంబ‌ర్ 12వ తేదీన  భార‌త‌దేశంలో ప‌ర్య‌ట‌ించిన సంద‌ర్భంగా ఈ అవ‌గాహ‌న ఒప్పంద ప‌త్రంపైన సంత‌కాలు అయ్యాయి. 

సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (ఎస్ ఇబిఐ) కి, కువైత్ కు చెందిన క్యాపిట‌ల్ మార్కెట్స్ అథారిటీ (సిఎమ్ఎ) కు మ‌ధ్య‌ కుదిరిన అవ‌గాహ‌నపూర్వక ఒప్పంద ప‌త్రానికి ఆమోదం తెలిపిన మంత్రివర్గం

సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (ఎస్ ఇబిఐ) కి, కువైత్ కు చెందిన క్యాపిట‌ల్ మార్కెట్స్ అథారిటీ (సిఎమ్ఎ) కు మ‌ధ్య‌ పరస్పర అవ‌గాహన మరియు సాంకేతిక సహాయం కోసం ఉద్దేశించినటువంటి ఒక అవ‌గాహ‌నపూర్వక ఒప్పంద ప‌త్రానికి (ఎంఒయు) ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అధ్య‌క్ష‌త‌న స‌మావేశ‌మైన కేంద్ర మంత్రివ‌ర్గం ఆమోదం తెలిపింది. 

ఐఎఎల్ఎ స్థాయిని ప్రభుత్వేతర సంస్థ నుండి అంతర్ ప్రభుత్వ సంస్థ స్థాయికి మార్పు చేసేందుకు ఆమోదం తెలిపిన మంత్రివర్గం

 ఇంట‌ర్నేష‌న‌ల్ అసోషియేష‌న్‌ ఆప్ మెరైన్ ఎయిడ్స్ టు నావిగేష‌న్ అండ్ లైట్ హౌస్ అథారిటీస్ (ఐఎఎల్ఎ) స్థాయిని మారుస్తూ తీసుకొన్న నిర్ణ‌యానికి ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అధ్య‌క్ష‌త‌న స‌మావేశ‌మైన కేంద్ర మంత్రివ‌ర్గం  ఆమోదం తెలిపింది.  ప్రభుత్వేతర సంస్థ గా ఉన్న ఐఎఎల్ ఎ ను అంత‌ర్ ప్ర‌భుత్వ సంస్థ [ఇంట‌ర్ గ‌వ‌ర్న‌మెంట‌ల్ ఆర్గ‌నైజేష‌న్ (ఐజివో)] గా మారుస్తూ ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. 

జల వ‌న‌రుల రంగంలో స‌హ‌కారం కోసం భార‌త‌దేశం, మొరక్కో ల మ‌ధ్య‌ ఎంఒయు కు ఆమోదం తెలిపిన మంత్రివర్గం

జల వ‌న‌రుల రంగంలో స‌హ‌కారం కోసం భార‌త‌దేశం, మొరక్కో ల మ‌ధ్య‌ అవ‌గాహ‌నపూర్వక ఒప్పంద పత్రం (ఎంఒయు)పై సంతకాలకు ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అధ్య‌క్ష‌త‌న స‌మావేశ‌మైన కేంద్ర మంత్రివ‌ర్గం  ఆమోదం తెలిపింది.

కేంద్రం నిధులందించే సాంకేతిక సంస్థ‌లు 
విశ్వ‌విద్యాల‌యాలు, కేంద్ర ప్ర‌భుత్వం నిధులందించే సాంకేతిక సంస్థ‌లలో ప‌ని చేసే అధ్యాప‌కులు, ఇత‌ర సిబ్బందికి స‌వ‌రించిన జీతాలు- కేంద్ర కేబినెట్ ఆమోదం

విశ్వ‌విద్యాల‌యాలు, కేంద్ర ప్ర‌భుత్వం నిధులందించే సాంకేతిక సంస్థ‌ల్లో ప‌ని చేసే అధ్యాప‌కులు, ఇత‌ర సిబ్బందికి స‌వ‌రించిన జీతాలివ్వాల‌నే నిర్ణ‌యానికి ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అధ్య‌క్ష‌త‌న స‌మావేశ‌మైన కేంద్ర మంత్రివ‌ర్గం  ఆమోదం తెలిపింది.  దీనివ‌ల్ల 8 లక్ష‌ల మంది అధ్యాప‌కులు, ఇత‌ర  సిబ్బంది ల‌బ్ధి పొందుతారు.  కేంద్ర ప్ర‌భుత్వ ఉద్యోగుల కోసం వేసిన 7వ కేంద్ర వేత‌న సంఘం సిఫారసుల మేర‌కు ఈ నిర్ణ‌యం తీసుకోవ‌డం జ‌రిగింది. 

వ్యాపారాన్ని, ఆర్థిక స‌హ‌కారాన్ని ప‌టిష్ఠం చేసుకోవ‌డంతో పాటు,  ప్రోత్స‌హించ‌డం కోసం భార‌త‌దేశానికి, ఇథియోపియా కు మ‌ధ్య వ్యాపార ఒప్పందానికి ఆమోదం తెలిపిన మంత్రివ‌ర్గం

వ్యాపారాన్ని, ఆర్థిక స‌హ‌కారాన్ని ప‌టిష్ఠం చేసుకోవ‌డంతో పాటు ప్రోత్స‌హించ‌డం కోసం భార‌త‌దేశానికి, ఇథియోపియాకు మ‌ధ్య కుదిరినటువంటి ఒక వ్యాపార ఒప్పందానికి  ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర‌ మోదీ అధ్య‌క్ష‌త‌న‌ స‌మావేశ‌మైన కేంద్ర మంత్రి వ‌ర్గం ఎక్స్- పోస్ట్ ఫ్యాక్టో ఆమోదం తెలిపింది.  ఈ వ్యాపార ఒప్పందం పై.. 2017 అక్టోబ‌ర్ 4వ తేదీ నుండి 6వ తేదీ మ‌ధ్య కాలంలో భార‌త‌దేశ రాష్ట్రప‌తి ఇథియోపియా లో ఆధికారిక ప‌ర్య‌ట‌న చేప‌ట్టిన సంద‌ర్భంగా 2017 అక్టోబ‌ర్ 5వ తేదీన.. సంత‌కాల‌య్యాయి.

క‌స్ట‌మ్స్ విషయాల‌లో ప‌ర‌స్ప‌ర స‌హాయం, స‌హ‌కారం పై భార‌త‌దేశానికి, ఆర్మేనియా కు మ‌ధ్య ఒప్పందం కుదుర్చుకోవ‌డానికి వీలుగా ఆమోదం తెలిపిన మంత్రివ‌ర్గం

క‌స్ట‌మ్స్ వ్య‌వ‌హారాల‌లో ప‌ర‌స్ప‌ర స‌హాయంతో పాటు స‌హ‌కారం అంశంపై భార‌త‌దేశానికి, ఆర్మేనియా కు మ‌ధ్య ఒప్పందం కుదుర్చుకోవ‌డానికి, ఆ ఒప్పందానికి అనుమోదానికి ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అధ్య‌క్ష‌త‌న స‌మావేశ‌మైన కేంద్ర మంత్రివ‌ర్గం ఆమోదం తెలిపింది.

నేష‌న‌ల్ కౌన్సిల్ ఫ‌ర్ టీచ‌ర్ ఎడ్యుకేష‌న్ యాక్ట్‌, 1993 లో స‌వ‌ర‌ణ‌కు ఆమోదం తెలిపిన మంత్రివ‌ర్గం

నేష‌న‌ల్ కౌన్సిల్ ఫ‌ర్ టీచ‌ర్ ఎడ్యుకేష‌న్ యాక్ట్‌, 1993 ను స‌వ‌రించ‌డానికి నేష‌న‌ల్ కౌన్సిల్ ఫ‌ర్ టీచ‌ర్ ఎడ్యుకేష‌న్ (అమెండ్‌మెంట్‌) యాక్ట్‌, 2017 పేరిట ఒక బిల్లును పార్ల‌మెంటులో ప్ర‌వేశ‌పెట్టేందుకు ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అధ్య‌క్ష‌త‌న స‌మావేశ‌మైన కేంద్ర మంత్రివ‌ర్గం ఆమోదం తెలిపింది.  ఈ సవ‌ర‌ణ- ఎన్ సిటిఇ అనుమ‌తి లేకుండానే ఉపాధ్యాయ విద్య కోర్సుల‌ను న‌డుపుతున్న కేంద్రీయ/రాష్ట్ర/విశ్వ‌విద్యాల‌యాల‌కు గతానికి వ‌ర్తించే విధంగా గుర్తింపును మంజూరు చేయ‌డానికి- ఉద్దేశించింది.

న‌వంబ‌ర్ 10, 2017

భార‌త‌దేశం, ఫిలిప్పీన్స్ ల మ‌ధ్య‌ వ్య‌వ‌సాయ‌, సంబంధిత రంగాల్లో కుదిరిన ఎంఒయు కు ఆమోదం తెలిపిన మంత్రివ‌ర్గం

భార‌త‌దేశం, ఫిలిప్పీన్స్ ల మ‌ధ్య‌ కుదిరిన వ్య‌వ‌సాయ‌, సంబంధిత రంగాల ఎంఓయుపై సంత‌కాల‌కు ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అధ్య‌క్ష‌త‌న స‌మావేశ‌మైన కేంద్ర మంత్రివ‌ర్గం ఆమోదం తెలిపింది.

రెండు సార్లు ప‌న్ను విధింపు నిరోధానికి, ఆదాయంపైన ప‌న్నుల ఎగ‌వేత నిరోధానికి సంబంధించి భారతదేశం, కిర్గిస్థాన్ ల మ‌ధ్య‌న కుదిరిన ఒప్పందం ప్రోట్ కోల్ స‌వ‌ర‌ణ‌కు ఆమోదం తెలిపిన మంత్రివ‌ర్గం

రెండు సార్లు ప‌న్ను విధింపు నిరోధానికి, ఆదాయంపైన ప‌న్నుల ఎగ‌వేత నిరోధానికి సంబంధించి భారతదేశం, కిర్గిస్థాన్ ల మ‌ధ్య‌న కుదిరిన ఒప్పందం ప్రోట్ కోల్ స‌వ‌ర‌ణ‌కు ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అధ్య‌క్ష‌త‌న స‌మావేశ‌మైన కేంద్ర మంత్రివ‌ర్గం ఆమోదం తెలిపింది.


ఆదాయంపై ప‌న్ను విష‌యంలో ఆర్థిక ఎగ‌వేత‌ల నిరోధం మ‌రియు రెండు సార్లు ప‌న్ను విధింపు నివార‌ణ‌ ల కోసం భార‌త‌దేశానికి, హాంగ్ కాంగ్ స్పెష‌ల్ అడ్మినిస్ట్రేటివ్ రీజియ‌న్ ఆఫ్ చైనా కు మ‌ధ్య ఒప్పందాన్ని ఆమోదించిన మంత్రివ‌ర్గం

ఆదాయంపై ప‌న్ను విష‌యంలో ఆర్థిక ఎగ‌వేత‌ల నిరోధం మ‌రియు రెండు సార్లు ప‌న్ను విధింపు నివార‌ణ‌ ల కోసం హాంగ్ కాంగ్ స్పెష‌ల్ అడ్మినిస్ట్రేటివ్ రీజియ‌న్ (హెచ్‌కెఎస్ఎఆర్‌) ఆఫ్ చైనా తో భార‌త‌దేశం ఒక ఒప్పందాన్ని కుదుర్చుకోవడానికి వీలుగా ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అధ్య‌క్ష‌త‌న స‌మావేశ‌మైన కేంద్ర మంత్రివ‌ర్గం ఆమోదం తెలిపింది.


న్యూ ఢిల్లీ లోని ద్వారక లో ఎగ్జిబిష‌న్‌ మ‌రియు క‌న్వెన్శన్ సెంట‌ర్ ఏర్పాటుకు ఆమోదం తెలిపిన మంత్రివర్గం

పారిశ్రామిక విధానం మరియు ప్రోత్సాహ‌క విభాగం (డిఐపిపి) చేసిన ఈ దిగువ ప్ర‌తిపాద‌న‌లకు ప్ర‌ధాన‌ మంత్రి శ్రీ న‌రేంద్ర‌ మోదీ అధ్య‌క్ష‌త‌న‌ స‌మావేశ‌మైన కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

ఎ)     ద్వార‌క‌ లో ఎగ్జిబిష‌న్ మ‌రియు క‌న్వెన్ష‌న్ సెంట‌ర్ (ఇసిసి), ఇంకా అనుబంధ మౌలిక వ‌స‌తులు (ప్ర‌ద‌ర్శ‌న‌లు, స‌మావేశాలు నిర్వ‌హించుకొనే ప్ర‌దేశం; ఎరీనా; ట్రంక్ మౌలిక‌ వ‌స‌తులు; మెట్రో/ఎన్ హెచ్ఎఐ అనుసంధాన‌ం; హోట‌ళ్లు, కార్యాల‌యాలు, రిటైల్ వ్యాపారాల‌కు ప్ర‌దేశం) పిపిపి, నాన్- పిపిపి విధానంలో ఏర్పాటు చేసేందుకు ఆమోదం తెలిపింది. 2025 కల్లా ఏర్పాటు చేయ‌దలుస్తున్న ఈ ప్రాజెక్టుకు 25,703 కోట్ల రూపాయ‌లు వ్య‌యం అవుతుందని అంచనా.

బి)     ఈ ప్రాజెక్టును చేప‌ట్టి అభివృద్ధి చేయ‌డానికి 100 శాతం ప్ర‌భుత్వ వాటాల‌తో డిఐపిపి సార‌థ్యంలో ఒక ప్ర‌త్యేక సంస్థ (ఎస్‌పివి)ని ఏర్పాటు చేస్తారు. ఎగ్జిబిష‌న్ సెంట‌ర్‌లో భాగంగా ట్రంక్ ఇన్‌ఫ్రాస్ర్ట‌క్చ‌ర్‌, ప్రవేశ శాల, స‌మావేశ మందిరం, మెట్రో అనుసంధాన‌త‌, డిడిఎ కు చెల్లించవలసిన భూసేక‌ర‌ణ ప‌రిహారంతో స‌హా ఎన్‌హెచ్ఎఐ రోడ్డు అనుసంధాన‌త క‌ల్పించేందుకు, మురుగునీటి పారుద‌ల వ‌స‌తులు క‌ల్పించేందుకు, మెట్రో అనుసంధాన‌త‌కు రైల్వే భూములు కొనుగోలు చేసేందుకు, నాన్- పిపిపి వ్య‌యాలు భ‌రించేందుకు ఈ ఎస్‌పివి కి ప్ర‌భుత్వం బ‌డ్జెట్‌లో 2037.29 కోట్ల రూపాయ‌లు ఈక్విటీగా మూడు సంవ‌త్స‌రాల కాల‌ప‌రిమితిలో అంద‌జేస్తుంది.

సి)     మార్కెట్ నుండి 1,381 కోట్ల రూపాయ‌లను ప్ర‌భుత్వ హామీతో కూడిన రుణం రూపంలో సమీకరిస్తారు. ప్ర‌భుత్వ యాజ‌మాన్యం లోని భూముల విక్ర‌యం, ఎస్‌పివి వార్షిక ప్రాజెక్టు ఆదాయాల రూపంలో 4,000 కోట్ల రూపాయ‌లు స‌మ‌కూర్చుకొంటారు. భూవిక్ర‌యం ద్వారా స‌మ‌కూరే నిధులు, ఎస్‌పివి వార్షిక రాబ‌డుల నుండి వ‌చ్చే ఆదాయాన్ని నాన్- పిపిపి వ్య‌యాల కోసం కేటాయిస్తారు.

డి)     డిఎంఐసిడిసి ప్రాజెక్టు విజ్ఞాన భాగ‌స్వామిగా వ్య‌వ‌హ‌రిస్తుంది.  5 కోట్ల రూపాయ‌లు క‌నిష్ఠ‌, 10 కోట్ల రూపాయ‌లు గ‌రిష్ఠ చెల్లింపు ప్రాతిప‌దిక‌న ఎస్‌పివి అంత‌ర్గ‌త వ‌న‌రుల నుండి ఒక శాతం చొప్పున వార్షిక రుసుమును చెల్లించేర నిబంధ‌న‌పై ప్రాథ‌మికంగా 10 సంవ‌త్స‌రాల కాలానికి ఈ భాగ‌స్వామ్యం ఉంటుంది.

ఇ)     స‌వివ‌ర‌మైన వ్య‌య అంచ‌నాల ఆధారంగా అవ‌స‌ర‌మైన మార్పులు చేసుకొనే అధికారంతో పాటు, ప్రాజెక్టు లోని వివిధ ద‌శ‌ల‌ను వేరు చేసుకోవ‌డం, ప్రాజెక్టు ద‌శ‌లు నిర్ణ‌యించ‌డం, ప‌రిధిలో మార్పు వంటి స‌వ‌ర‌ణ‌లు చేసుకునే అధికారం ఎస్‌పివి బోర్డు కు ఉంటుంది. ప్రాజెక్టు అమ‌లు లోని వివిధ ద‌శ‌ల అవ‌స‌రాల‌కు అనుగుణంగా నిర్ణ‌యించిన ఆర్థిక వ‌న‌రుల ప‌రిమితి లోనే ఈ మార్పులను చేసుకోవ‌చ్చు. మార్కెట్ ప‌రిస్థితుల ఆధారంగా భూముల‌ను విక్ర‌యించి సొమ్ము చేసుకోవ‌డం ద్వారా లేదా రుణ స‌మీక‌ర‌ణ ద్వారా వ‌న‌రులు సేక‌రించుకొనే స్వేచ్ఛను ఎస్‌పివి కి ద‌ఖ‌లు ప‌రుస్తారు.

పెట్టుబ‌డులకు ప్రోత్సాహం మ‌రియు వాటికి ర‌క్ష‌ణ అనే అంశాల‌పై భార‌త‌దేశానికి, కొలంబియాకు మ‌ధ్య 2009 న‌వంబ‌ర్ 10వ తేదీన సంత‌కాలైన ఒక ఒప్పందానికి సంబంధించి జాయింట్ ఇంట‌ర్‌ప్రిటేటివ్ డిక్ల‌రేశన్‌ ను ఆమోదించిన మంత్రివ‌ర్గం

పెట్టుబ‌డుల ప్రోత్సాహం మ‌రియు ర‌క్ష‌ణ అంశాల‌పై భార‌త‌దేశానికి, కొలంబియాకు మ‌ధ్య 2009 న‌వంబ‌ర్ 10వ తేదీన సంత‌కాలు జ‌రిగి ప్ర‌స్తుతం అమ‌లులో ఉన్న ఒప్పందానికి సంబంధించిన జాయింట్ ఇంట‌ర్‌ప్రిటేటివ్ డిక్ల‌రేశన్ (జెఐడి) పై సంత‌కాలు చేయ‌డానికి ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అధ్య‌క్ష‌త‌న స‌మావేశమైన కేంద్ర మంత్రివ‌ర్గం ఆమోదం తెలిపింది.

దేశంలో స‌హాయ‌క న్యాయమూర్తుల వ‌ర్గం కోసం రెండో నేష‌న‌ల్ జ్యుడీషియ‌ల్ పే క‌మిష‌న్ నియామ‌కానికి ఆమోదం తెలిపిన మంత్రివ‌ర్గం

దేశంలో స‌హాయ‌క న్యాయమూర్తుల వ‌ర్గం కోసం రెండో నేష‌న‌ల్ జ్యుడీషియ‌ల్ పే క‌మిష‌న్ (ఎస్ఎన్‌జెపిసి) నియామ‌కాన్ని ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అధ్య‌క్ష‌త‌న స‌మావేశ‌మైన కేంద్ర మంత్రివ‌ర్గం ఆమోదం తెలిపింది. 

జాతీయ గ్రామీణ తాగునీటి కార్యక్రమం కొనసాగింపునకు మరియు పునర్ వ్యవస్థీకరణకు ఆమోదం తెలిపిన మంత్రివర్గం

గ్రామీణ ప్రజలకు మంచి నాణ్యమైన సేవలు అందేటట్టు జాతీయ గ్రామీణ తాగునీటి కార్యక్రమం (ఎన్‌ఆర్‌డిడబ్ల్యుపి) పున: వ్యవస్థీకరణ ను మరియు ఈ కార్యక్రమాన్ని ఫలితాల ప్రాతిపదికన, స్పర్ధాత్మకంగా, పనితీరు రీత్యా పథకాల అమలుపై మరింత శ్రద్ధతో, పక్కా పర్యవేక్షణతో కొనసాగించేందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

ఉన్న‌త విద్యా సంస్థ‌లలో ప్ర‌వేశ ప‌రీక్షలను నిర్వ‌హించ‌డానికిగాను జాతీయ ప‌రీక్షా సంస్థ ఏర్పాటుకు ఆమోదం తెలిపిన మంత్రివర్గం


ఉన్న‌త విద్యా సంస్థ‌లలో ప్ర‌వేశ ప‌రీక్షలు నిర్వ‌హించ‌డానికిగాను జాతీయ ప‌రీక్షా సంస్థ ఏర్పాటు చేయాల‌నే నిర్ణ‌యానికి ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అధ్యక్షతన స‌మావేశ‌మైన కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.  దీనిని భార‌తీయ సొసైటీల రిజిస్ట్రేశన్ చ‌ట్టం, 1860 ప్ర‌కారం రిజిస్ట‌ర్ చేయిస్తారు.  ఇది స్వ‌యంప్ర‌తిప‌త్తిని క‌లిగివుండి, సొంత ఆదాయ వ‌న‌రుల‌తో కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించే ప్ర‌ధాన‌మైన ప‌రీక్షా సంస్థ‌గా రూపొందుతుంది.  ఉన్న‌త విద్యాసంస్థ‌ల‌ కోసం ప్ర‌వేశ‌ ప‌రీక్ష‌ల‌ను నిర్వ‌హిస్తుంది. 
 

16 న‌వంబ‌ర్ 2017

టెలిక‌మ్యూనికేశన్స్‌, ఇన్ఫ‌ర్మేశన్ టెక్నాల‌జీ నేప‌థ్యం ఉన్న డిపార్ట్ మెంట్ ఆఫ్  టెలిక‌మ్యూనికేశన్స్ (డిఒటి), ఇత‌ర మంత్రిత్వ‌ శాఖ‌ల‌కు చెందిన గ్రూప్ ‘ఎ’ ఆఫీస‌ర్ల‌ను టెలిక‌మ్యూనికేశన్స్ క‌న్స‌ల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ (టిసిఐఎల్‌)కు డెప్యుటేష‌న్‌పై 
పంప‌డానికి ఆమోదం తెలిపిన మంత్రివర్గం 

టెలిక‌మ్యూనికేష‌న్‌, ఇన్ఫ‌ర్మేశన్ టెక్నాల‌జీ నేప‌థ్యం క‌లిగిన‌ డిపార్ట్ మెంట్ ఆఫ్ టెలిక‌మ్యూనికేశన్స్‌(డిఒటి), ఇంత‌ర మంత్రిత్వ శాఖ‌ల‌కు చెందిన గ్రూప్ ఎ అధికారుల‌ను డెప్యుటేష‌న్‌పై టెలిక‌మ్యూనికేశన్స్ క‌న్స‌ల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ కింది నిబంధ‌న‌ల‌కు అనుగుణంగా తీసుకోవ‌డానికి ప్ర‌ధాన‌ మంత్రి శ్రీ‌ న‌రేంద్ర‌ మోదీ అధ్య‌క్ష‌త‌న జ‌రిగిన కేంద్ర మంత్రివర్గం స‌మావేశం ఆమోదం తెలిపింది.

ప్ర‌ధాన‌ మంత్రి ఆవాస్ యోజ‌న లో భాగంగా, మ‌ధ్యాదాయ వ‌ర్గాల వారికి రుణ అనుసంధానిత స‌బ్సిడీ ప‌థ‌కం కింద వ‌డ్డీ స‌బ్సిడీకి అర్హులైన వారికి ఇళ్ల  కార్పెట్ ఏరియా పెంపుదలకు ఆమోదం తెలిపిన మంత్రివర్గం‌

ప్ర‌ధాన‌ మంత్రి ఆవాస్ యోజ‌న (ప‌ట్ట‌ణ‌) లో భాగంగా, మ‌ధ్యాదాయ వ‌ర్గాల వారికి  రుణ అనుసంధానిత స‌బ్సిడీ ప‌థ‌కం ప్ర‌కారం వ‌డ్డీ స‌బ్సిడీకి అర్హ‌త క‌లిగిన ఇళ్ల‌కు కార్పెట్ ఏరియా పెంపుదలకు ప్ర‌ధాన‌ మంత్రి  శ్రీ న‌రేంద్ర మోదీ అధ్య‌క్ష‌త‌న జ‌రిగిన కేంద్ర మంత్రివర్గ స‌మావేశం ఆమోదం తెలిపింది.

శాస్త్ర‌ విజ్ఞ‌ానం, సాంకేతిక‌ విజ్ఞ‌ానం, వ్య‌వ‌సాయ రంగాల‌లో ప‌ర‌స్ప‌ర ప్ర‌యోజ‌నం కోసం శాస్త్ర‌, సాంకేతిక రంగాల‌లో స‌హ‌కారానికి భారతదేశం, బెలారూస్‌ ల‌ మ‌ధ్య ఒప్పందం గురించి కేంద్ర మంత్రివర్గం దృష్టికి తీసుకురావ‌డమైంది

శాస్త్ర విజ్ఞ‌ానం, సాంకేతిక‌ విజ్ఞ‌ానం, వ్య‌వ‌సాయం రంగాల‌లో ప‌ర‌స్ప‌ర ప్ర‌యోజ‌నం కోసం శాస్త్ర సాంకేతిక స‌హ‌కారానికి ఇండియ‌న్ నేష‌న‌ల్ సైన్స్ అకాడ‌మీ (ఐఎన్ఎస్ఎ) మరియు నేష‌న‌ల్ అకాడ‌మీ ఆఫ్ సైన్సెస్ బెలారూస్‌ (ఎన్ఎఎస్ బి)ల మ‌ధ్య కుదిరిన ఒప్పందం గురించి ప్ర‌ధాన‌ మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అధ్య‌క్ష‌త‌న జ‌రిగిన మంత్రివర్గం స‌మావేశం దృష్టికి తీసుకురావ‌డం జ‌రిగింది.

న్యాయ‌ వ్య‌వ‌స్థ మౌలిక స‌దుపాయాల‌కు ఊతం

న్యాయ‌ వ్య‌వ‌స్థ‌కు సంబంధించి నేష‌న‌ల్ మిష‌న్ ఫ‌ర్ జ‌స్టిస్ డెలివ‌రీ, లీగ‌ల్ రిఫార్మ్స్ కింద 3,320 కోట్ల రూపాయ‌ల అంచ‌నా వ్య‌యంతో 12 వ ప్ర‌ణాళిక కాలం అనంత‌రం కూడా- అంటే 1.4.2017 నుండి 30.03.2020 త‌రువాత కూడా- న్యాయ వ్య‌వ‌స్థ‌లో మౌలిక స‌దుపాయాల అభివృద్ధికి వీలు క‌ల్పించే కేంద్ర ప్రాయోజిత ప‌థ‌కాన్ని (సిఎస్ఎస్) కొన‌సాగించేందుకు కేంద్ర ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది.  ఇందుకు  ప్ర‌ధాన‌ మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అధ్యక్ష‌త‌న జ‌రిగిన కేంద్ర మంత్రివర్గ స‌మావేశం ఆమోదం తెలిపింది.

జిఎస్‌టి లో భాగంగా జాతీయ స్థాయిలో అక్ర‌మ లాభార్జ‌న వ్య‌తిరేక అథారిటీ ఏర్పాటుకు ఆమోదం తెలిపిన మంత్రివర్గం 

జిఎస్‌టి కింద అక్ర‌మ లాభార్జ‌న వ్య‌తిరేక‌ అథారిటీ (ఎన్ ఎ ఎ) కి ఛైర్మ‌న్‌, సాంకేతిక స‌భ్యుల నియామ‌కానికి ప్ర‌ధాన‌ మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అధ్య‌క్ష‌త‌న జ‌రిగిన కేంద్ర మంత్రివర్గ స‌మావేశం ఆమోదం తెలిపింది.  చాలా వ‌స్తువుల‌పై జిఎస్‌టి రేటును త‌గ్గించిన 
నేప‌థ్యంలో ఈ నిర్ణ‌యం తీసుకున్నారు.  దీనివ‌ల్ల అక్ర‌మ లాభార్జ‌న వ్య‌తిరేక వ్య‌వ‌స్థ త‌క్ష‌ణ ఏర్పాటుకు వీలు క‌లుగుతుంది.  జిఎస్‌టి కి సంబంధించి ప్ర‌భుత్వం ప‌లు వ‌స్తువుల‌పై త‌గ్గించిన ప‌న్ను ప్ర‌యోజ‌నాల‌ను- ధ‌ర‌ల త‌గ్గింపు ద్వారా- వినియోగ‌దారుల‌కు  
అందించ‌డానికి అవ‌కాశం క‌లుగుతుంది.

పౌర‌ విమాన‌యాన రంగంలో స‌హ‌కారాన్ని ప్రోత్స‌హించేందుకు భారతదేశం, పోలండ్ ల మ‌ధ్య ఎంఒయు పై సంత‌కానికి ఆమోదం తెలిపిన మంత్రివర్గం‌

పౌర విమాన‌యాన రంగంలో స‌హ‌కారాన్ని ప్రోత్స‌హించేందుకు భారతదేశం, పోలండ్ ల మ‌ధ్య అవ‌గాహ‌నపూర్వక ఒప్పందం (ఎంఒయు) పై సంత‌కానికి ప్ర‌ధాన‌ మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అధ్య‌క్ష‌త‌న స‌మావేశ‌మైన కేంద్ర మంత్రివర్గం‌ ఆమోదం తెలిపింది.  ఉభ‌య ప్ర‌భుత్వాల నుండి 
ఆమోదం ల‌భించిన త‌రువాత రెండు ప్ర‌భుత్వాల త‌ర‌ఫున ఒప్పందం కుదుర్చుకొంటారు.  ఈ ఒప్పందం ఐదు సంవ‌త్స‌రాలు అమ‌లులో ఉంటుంది.

రైల్వేలు జ‌న‌ర‌ల్ రెవెన్యూ ప‌ద్దు కింద చెల్లించాల్సిన‌ రేట్ ఆఫ్ డివిడెండ్‌ కు సంబంధించి రైల్వే క‌న్వెన్ష‌న్ క‌మిటీ (2014) త‌న ఆరో నివేదిక‌లో  చేసిన సిఫారసుల‌ను ఆమోదించేందుకు ఉద్దేశించిన‌ తీర్మానానికి  ఆమోదం తెలిపిన మంత్రివర్గం

రైల్వే క‌న్వెన్శన్ క‌మిటీ సిఫారసు చేసిన విధంగా 2016-2017 సంవ‌త్స‌రానికి ఒక‌సారి వెసులుబాటు కింద జ‌న‌ర‌ల్ రెవిన్యూ ప‌ద్దుకు రైల్వే శాఖ చెల్లించాల్సిన రేట్ ఆఫ్ డివిడెండ్‌ను మిన‌హాయించాల‌ని, ఇందుకు సంబంధించిన తీర్మానాన్ని పార్ల‌మెంటు ఉభ‌య‌ స‌భ‌ల‌లో చేయాల‌ని  రైల్వే శాఖ చేసిన  ప్ర‌తిపాద‌న‌ను ప్ర‌ధాన‌ మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అధ్య‌క్ష‌త‌న జ‌రిగిన కేంద్ర మంత్రివర్గం స‌మావేశం ఆమోదించింది.

22 న‌వంబ‌ర్ 2017

కేంద్ర ప్ర‌భుత్వ రంగ సంస్థ‌ ల‌ లోని సిబ్బందికి 8 వ విడ‌త  వేత‌న సంప్ర‌దింపుల‌కు సంబంధించి వేత‌న విధానానికి ఆమోదం తెలిపిన మంత్రివర్గం
 
కేంద్ర  ప్ర‌భుత్వ‌ రంగ సంస్థ‌ (సిపిఎస్ ఇ)ల‌ లోని సిబ్బందికి 8 వ విడ‌త వేత‌న సంప్ర‌దింపుల‌కు సంబంధించిన వేత‌న విధానానికి ప్ర‌ధాన‌ మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అధ్య‌క్ష‌త‌న జ‌రిగిన కేంద్ర మంత్రివర్గం సమావేశం ఆమోదం తెలిపింది.

15వ ఆర్థిక సంఘం ఏర్పాటుకు ఆమోదం తెలిపిన మంత్రివర్గం‌

 15 వ ఆర్ధిక సంఘం ఏర్పాటుకు ప్ర‌ధాన‌ మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అధ్య‌క్ష‌త‌న జ‌రిగిన కేంద్ర మంత్రివర్గం స‌మావేశం ఆమోదం తెలిపింది.  రాజ్యాంగంలోని ఆర్టిక‌ల్ 280(1) లో భాగంగా దీనిని ఏర్పాటు చేయ‌డం త‌ప్ప‌నిస‌రి. 15 వ ఆర్ధిక సంఘానికి నివేదించే 
అంశాల‌ను త‌గిన స‌మ‌యంలో నోటిఫై చేస్తారు.

సర్వోన్నత న్యాయస్థానం, ఉన్నత న్యాయస్థానాల లోని న్యాయ‌మూర్తులకు స‌వ‌రించిన వేత‌నాలు, గ్రాట్యుటి, అల‌వెన్సులు, పెన్ష‌న్ లకు ఆమోదం తెలిపిన మంత్రివర్గం‌

సుప్రీంకోర్టు, హైకోర్టుల న్యాయ‌మూర్తులు, ప‌ద‌వీ విర‌మ‌ణ పొందిన సుప్రీం కోర్టు, హై కోర్టు న్యాయ‌మూర్తుల వేత‌నాలు, గ్రాట్యుటి, అల‌వెన్సులు, పెన్ష‌న్ త‌దిత‌రాల‌ను స‌వ‌రించే ప్ర‌తిపాద‌న‌ల‌కు ప్ర‌ధాన‌ మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అధ్య‌క్ష‌త‌న జ‌రిగిన కేంద్ర మంత్రివర్గం స‌మావేశం ఆమోదం తెలిపింది.  సివిల్ స‌ర్వెంట్ల విష‌యంలో ఏడో వేత‌న సంఘం సిఫారసుల అమ‌లును ఇది ప‌రిగ‌ణ‌న‌ లోకి తీసుకుంది.

ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్‌ (ఐఐసిఎ)కు సంబంధించిన ప‌థ‌కాన్ని 12వ ప్ర‌ణాళికా స‌మ‌యం త‌రువాత కూడా కొన‌సాగించేందుకు ఆమోదం తెలిపిన మంత్రివర్గం 

ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్‌ (ఐఐసిఎ) కు సంబంధించిన ప‌థ‌కాన్ని మ‌రో మూడు సంవ‌త్స‌రాల‌పాటు అంటే 2017-18 నుండి 2019-20 వ‌ర‌కు పొడిగిస్తూ ప్ర‌ధాన‌ మంత్రి శ్రీ న‌రేంద్ర‌ మోదీ అధ్య‌క్ష‌త‌న జ‌రిగిన కేంద్ర మంత్రివర్గం స‌మావేశం ఆమోదం తెలిపింది.  అలాగే ఈ సంస్థ‌కు గ్రాంట్స్ -ఇన్- ఎయిడ్ కింద 18 కోట్ల రూపాయ‌లు అందించేందుకు కూడా మంత్రివర్గం నిర్ణయించింది. ఇది ఈ ఇన్‌స్టిట్యూట్‌ ను 2019-20 నాటికి స్వ‌యం స‌మృద్ధి సాధించేలా చేయ‌నుంది.

యూరోపియ‌న్‌బ్యాంక్ ఫ‌ర్ రిక‌న్ స్ట్ర‌క్ష‌న్‌ & డివెల‌ప్‌మెంట్ (ఇబిఆర్‌డి)లో భార‌తదేశం స‌భ్య‌త్వానికి ఆమోదం తెలిపిన మంత్రివర్గం 
 
యూరోపియ‌న్ బ్యాంక్ ఫ‌ర్ రిక‌న్‌ స్ట్ర‌క్ష‌న్‌ &డివెల‌ప్‌మెంట్‌ (ఇబిఆర్‌డి)లో భార‌తదేశం స‌భ్య‌త్వానికి ప్ర‌ధాన‌ మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అధ్య‌క్ష‌త‌న స‌మావేశ‌మైన కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

క‌స్ట‌మ్స్ అంశాల విష‌యంలో భారతదేశం, ఫిలిప్పీన్స్‌ ల మ‌ధ్య స‌హ‌కారం, ప‌ర‌స్ప‌ర స‌హాయానికి సంబంధించిన ఒప్పందాన్ని ఆమోదించిన మంత్రివర్గం 

క‌స్ట‌మ్స్ వ్య‌వ‌హారాల విష‌యంలో భారతదేశం, ఫిలిప్పీన్స్ ల మ‌ధ్య ప‌ర‌స్ప‌ర స‌హ‌కారం, స‌హాయానికి సంబంధించిన ఒప్పందంపై సంత‌కాలకు, స‌మ్మ‌తికి ప్ర‌ధాన‌ మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అధ్య‌క్ష‌త‌న జ‌రిగిన కేంద్ర మంత్రివర్గం స‌మావేశం ఆమోదం తెలిపింది.

30 న‌వంబ‌ర్ 2017

హిందుస్తాన్ వెజిట‌బుల్ ఆయిల్స్ కార్ప‌ొరేష‌న్ లిమిటెడ్‌ కు చెందిన భూమిని గృహ‌నిర్మాణ‌ం, ప‌ట్ట‌ణ వ్య‌వ‌హారాల మంత్రిత్వ‌ శాఖ‌కు బ‌ద‌లాయించే ప్ర‌తిపాద‌న‌లకు ఆమోదం తెలిపిన మంత్రివర్గం

హిందుస్తాన్ వెజిట‌బుల్ ఆయిల్స్‌కు చెందిన అన్నిర‌కాల భూ సంబంధ ఆస్తుల‌ను గృహ‌నిర్మాణ‌ం, ప‌ట్ట‌ణాభివృద్ధి మంత్రిత్వ‌ శాఖ‌కు లేదా దాని అనుమ‌తి పొందిన సంస్థ‌కు సముచిత వినియోగం/ అమ్మ‌కం కోసం బ‌దిలీ చేసే ప్ర‌తిపాద‌న‌కు ప్ర‌ధాన‌ మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అధ్య‌క్ష‌త‌న జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం ఆమోదం తెలిపింది.

భార‌తదేశం, బ్రెజిల్‌ ల మ‌ధ్య పెట్టుబ‌డుల స‌హ‌కారం, ఫెసిలిటేష‌న్ ఒప్పందానికి ఆమోదం తెలిపిన మంత్రివర్గం

భారతదేశం,  బ్రెజిల్ ల మ‌ధ్య పెట్టుబ‌డుల స‌హ‌కారం, ఫెసిలిటేష‌న్ ఒప్పంద‌పై సంత‌కం, రాటిఫికేష‌న్‌ లకు ప్ర‌ధాన‌ మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అధ్య‌క్ష‌త‌న స‌మావేశ‌మైన కేంద్ర మంత్రివర్గం‌ ఆమోదం తెలిపింది.

వ్య‌వ‌సాయం, ఫైటోశానిట‌రీకి సంబంధించిన అంశాల విష‌యంలో  ప‌ర‌స్ప‌ర స‌హ‌కారానికి భార‌త్‌, ఇట‌లీల మ‌ధ్య ఎంఒయు కు ఆమోదం తెలిపిన మంత్రివర్గం

వ్య‌వ‌సాయం, ఫైటోశానిట‌రీ (మొక్క‌ల ఆరోగ్యానికి) సంబంధించిన అంశాలపై ప‌ర‌స్ప‌ర స‌హ‌కారానికి సంబంధించి భార‌తదేశం, ఇటలీ ల మ‌ధ్య అవ‌గాహ‌నాపూర్వక ఒప్పందం (ఎంఒయు)పై సంత‌కానికి ప్ర‌ధాన‌ మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అధ్య‌క్ష‌త‌న జ‌రిగిన కేంద్ర మంత్రివర్గ స‌మావేశం ఆమోదం తెలిపింది.  2008 జ‌న‌వ‌రిలో కుదిరిన ఒప్పందం స్థానంలో ఈ కొత్త ఒప్పందం కుదుర్చుకోనున్నారు.  2018 జ‌న‌వ‌రిలో పాత ఒప్పందం గ‌డువు ముగుస్తుంది.

01 డిసెంబ‌ర్ 2017

జాతీయ పౌష్టికాహార మిష‌న్ ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం

జాతీయ పౌష్టికాహార మిష‌న్ (ఎన్ఎన్ఎమ్) ఏర్పాటు కు ప్ర‌ధాన‌ మంత్రి శ్రీ‌ న‌రేంద్ర మోదీ అధ్య‌క్ష‌త‌న జ‌రిగిన కేంద్ర మంత్రివర్గం స‌మావేశం ఆమోదం తెలిపింది.  2017-18 నుండి మూడు సంవ‌త్స‌రాల కాలానికి 9046.17 కోట్ల రూపాయ‌ల బ‌డ్జెట్‌తో ఇది ఏర్పాట‌వుతుంది.

15 డిసెంబ‌ర్ 2017


2020 మార్చి వ‌ర‌కు ఈశాన్య రాష్ట్రాల‌కు ఎన్‌ఎల్‌సిపిఆర్ ప‌థ‌కాన్ని కొన‌సాగించేందుకు ఆమోదం తెలిపిన మంత్రివర్గం 

గ‌డువు ముగిసినా నిధులు మురిగిపోని కేంద్ర నిధుల (NLCPR) ప‌థ‌కాన్ని 90:10 శాతం నిష్ప‌త్తిలో 2020 వ‌ర‌కు పొడిగిస్తూ ప్ర‌ధాన‌ మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అధ్య‌క్ష‌త‌న జ‌రిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం ఆమోదం తెలిపింది.  దీని పెట్టుబ‌డి మొత్తం విలువ 5,300 కోట్ల రూపాయ‌లు.  దీనివ‌ల్ల ప్ర‌స్తుతం కొన‌సాగుతున్న ప్రాజెక్టులు పూర్తికావ‌డానికి అవ‌కాశం ఉంటుంది.

కేంద్ర ప్ర‌భుత్వ ప్రాయోజిత జాతీయ ఆయుష్ మిష‌న్ (ఎన్ఎఎం) ను 2017 ఏప్రిల్‌1 నుండి 2020 మార్చి 31 వ‌ర‌కు కొన‌సాగించేందుకు ఆమోదం తెలిపిన మంత్రివర్గం 

కేంద్ర ప్రాయోజిత కార్య‌క్ర‌మం నేశన‌ల్ ఆయుష్ మిష‌న్  ను 2017 ఏప్రిల్ 1  వ తేదీ నుండి 2020 మార్చి 31 వ‌ర‌కు  మూడు సంవ‌త్స‌రాల పాటు 2400 కోట్ల రూపాయ‌ల పెట్టుబ‌డితో కొన‌సాగించ‌డానికి ప్ర‌ధాన‌ మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అధ్య‌క్ష‌త‌న జ‌రిగిన కేంద్ర మంత్రివర్గం స‌మావేశం ఆమోదం తెలిపింది.  ఈ కార్య‌క్ర‌మాన్ని 2014 సెప్టెంబ‌ర్‌లో ప్రారంభించారు.

డెబిట్ కార్డు/ బిహెచ్ఐఎమ్ యుపిఐ/ ఎఇపిఎస్ లావాదేవీల‌కు సంబంధించి రూ.2000 క‌న్న త‌క్కువ  లావాదేవీల‌పై ఎమ్ డిఆర్ చార్జీల‌కు  స‌బ్సిడీ ఇచ్చేందుకు ఆమోదం తెలిపిన మంత్రివర్గం

డెబిట్ కార్డులు, BHIM UPI/ఆధార్ అనుసంధానిత పేమెంట్ వ్య‌వ‌స్థ‌ (AePS) లకు సంబంధించి రూ.2000 విలువ వ‌ర‌కు మ‌ర్చంట్ డిస్కౌంట్ రేట్‌ (ఎమ్ డిఆర్‌) ను 2018 జ‌న‌వ‌రి 1 వ తేదీ నుండి రెండు సంవ‌త్స‌రాల పాటు ప్ర‌భుత్వ‌మే భ‌రించేందుకు సంబంధించిన ప్ర‌తిపాద‌న‌కు ప్ర‌ధాన‌ మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అధ్య‌క్ష‌త‌న జ‌రిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం ఆమోదం తెలిపింది.  ఇందుకు సంబంధించిన మొత్తాన్ని ప్ర‌భుత్వం బ్యాంకుల‌కు తిరిగి చెల్లిస్తుంది.

పౌర‌ విమాన‌యాన మంత్రిత్వ‌శాఖ కింద‌ మెట్రో రైల్వే భ‌ద్ర‌తా క‌మిష‌న్ విధుల‌ను నిర్వ‌ర్తించేందుకు ఒక క‌మిష‌న‌ర్ ఆఫ్ మెట్రో రైల్వే సేఫ్టీని ఏర్పాటు చేసేందుకు ఆమోదం తెలిపిన మంత్రివర్గం

 మెట్రోరైల్వే సేఫ్టీకి సంబంధించి మెట్రో రైల్వే సేఫ్టీ క‌మిష‌న్ నిర్వ‌ర్తించే విధులు నిర్వ‌ర్తించేందుకు ఒక మెట్రో రైల్వే సేఫ్టీ క‌మిష‌న్‌ (సిఎమ్ ఆర్ఎస్) ఏర్పాటుకు ప్ర‌ధాన‌ మంత్రి శ్రీ న‌రేంద్ర‌ మోదీ అధ్య‌క్ష‌త‌న జ‌రిగిన కేంద్ర మంత్రివర్గం స‌మావేశం ఆమోదం తెలిపింది.  ఇందుకు సంబంధించి అవ‌స‌ర‌మైన అధికారులను, సిబ్బందిని ఏర్పాటు చేస్తారు.  ‘‘మెట్రో రైల్వేస్ (ఆప‌రేష‌న్స్‌, మెయింటినెన్స్) యాక్ట్, 2002’’ ప్ర‌కారం క‌మిష‌న్ ఆఫ్ రైల్వే సేఫ్టీలో సూచించిన‌ విధంగా  పౌర‌విమాన‌యాన శాఖ కింద దీనిని ఏర్పాటు చేసేందుకు ఆమోదం తెలిపారు.

వ్య‌వ‌సాయం, మ‌త్స్య సంప‌ద‌కు సంబంధించి భార‌తదేశం, కొలంబియా ల‌ మ‌ధ్య ఎంఒయు పై సంత‌కాలకు ఆమోదం తెలిపిన మంత్రివర్గం 

స‌మావేశం,వ్య‌వ‌సాయం, మ‌త్స్య సంపద రంగాల‌కు సంబంధించి భార‌తదేశం, కొలంబియా ల మ‌ధ్య అవ‌గాహ‌నపూర్వక ఒప్పందంపై సంత‌కాలకు ప్ర‌ధాన‌ మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అధ్య‌క్ష‌త‌న జ‌రిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం ఆమోదం తెలిపింది.

హైద‌రాబాద్‌లో ఆప‌రేష‌న‌ల్ ఓష‌నోగ్ర‌ఫీ శిక్ష‌ణ‌కేంద్రం ఏర్పాటుకు యునెస్కోతో ఒప్పందం పై సంత‌కాలు చేసేందుకు ఆమోదం తెలిపిన మంత్రివర్గం 

హైద‌రాబాద్‌లో ఆప‌రేష‌న‌ల్ ఓష‌నోగ్ర‌ఫీ శిక్ష‌ణ కేంద్రాన్ని యునెస్కో కేట‌గిరి-2 సెంట‌ర్‌గా ఏర్పాటు చేసేందుకు  ప్ర‌ధాన‌ మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అధ్య‌క్ష‌త‌న జ‌రిగిన కేంద్ర మంత్రివర్గం స‌మావేశం ఆమోదం తెలిపింది.

తోలు, పాద‌ర‌క్ష‌ల త‌యారీ రంగంలో ఉపాధిక‌ల్ప‌న‌కు ప్ర‌త్యేక పేకేజ్‌కి ఆమోదం తెలిపిన మంత్రివర్గం 

లెద‌ర్‌, పాద‌ర‌క్ష‌ల త‌యారీ రంగంలో ఉపాధి క‌ల్ప‌న‌కు ప్ర‌త్యేక పాకేజ్‌ని ప్ర‌ధాన‌ మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అధ్య‌క్ష‌త‌న జ‌రిగిన కేంద్ర మంత్రివర్గం స‌మావేశం ఆమోదించింది.  ఈ పాకేజ్ కింద కేంద్ర‌ప్ర‌భుత్వ ప‌థ‌కమైన ఇండియ‌న్ ఫుట్‌వేర్‌, లెద‌ర్‌, యాక్స‌ెస‌రీస్ 
డివెల‌ప్‌మెంట్ ప్రోగ్రాంను అమ‌లు చేయ‌డం ఇమిడి ఉంది.  ఇందుకోసం 2017-18 నుండి 2019-20 వ‌ర‌కు మూడు సంవత్సరాల పాటు 2600 కోట్ల రూపాయ‌లు వ్య‌యం చేయ‌నున్నారు.

20 డిసెంబ‌ర్ 2017

స‌శస్త్ర సీమా బ‌ల్‌ (ఎస్ఎస్‌బి) గ్రూప్ ‘ఎ’ ఇగ్జెక్యూటివ్ అధికారుల కేడ‌ర్ స‌మీక్ష‌, కేంద్ర గ్రూప్ ‘ఎ’ స‌ర్వీస్ కేటాయింపున‌కు ఆమోదం తెలిపిన మంత్రివర్గం 

స‌శస్త్ర సీమా బ‌ల్ (ఎస్ఎస్‌బి) కి సెంట్ర‌ల్ గ్రూప్ ఎ స‌ర్వీస్ కేటాయింపు,  గ్రూప్- ఎ ఇగ్జెక్యూటివ్  అధికారుల కేడ‌ర్ స‌మీక్ష‌కు ప్ర‌ధాన‌ మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అధ్య‌క్ష‌త‌న జ‌రిగిన కేంద్ర మంత్రివర్గం స‌మావేశం ఆమోదం తెలిపింది.  అలాగే అసిస్టెంట్ క‌మాండెంట్ కేడ‌ర్ నుండి ఇన్ స్పెక్ట‌ర్ జ‌న‌ర‌ల్ స్థాయి వ‌ర‌కు వివిధ ర్యాంకుల‌లో 19 పోస్టుల‌ను ఏర్పాటు చేసింది. స‌శస్త్ర సీమా బ‌ల్ (SSB) పాల‌న వ్య‌వ‌హారాలు, కార్య‌క‌లాపాల‌ను మెరుగుప‌రచేందుకు ఈ నిర్ణ‌యం తీసుకున్నారు.

వైద్యం, ఆరోగ్యం రంగాల‌లో ఇండియా, ఇట‌లీ ల మ‌ధ్య ప‌ర‌స్ప‌ర స‌హ‌కారానికి సంబంధించి ఎంఒయు కు ఆమోదం తెలిపిన మంత్రివర్గం 

వైద్యం, ఆరోగ్యం రంగాల‌లో ప‌ర‌స్ప‌ర స‌హ‌కారానికి సంబంధించి భారతదేశం, ఇటలీ ల‌ మ‌ధ్య గ‌తంలో కుదిరిన అవ‌గాహ‌నా ఒప్పందానికి (ఎంఒయు) ప్ర‌ధాన‌ మంత్రి శ్రీ న‌రేంద్ర‌ మోదీ అధ్య‌క్ష‌త‌న జ‌రిగిన కేంద్ర మంత్రివర్గం స‌మావేశం ఆమోదం తెలిపింది.  ఈ ఎంఒయు పై 29 నవంబర్ 2017 న సంతకాలు అయ్యాయి.

వైద్యం, ఆరోగ్యం రంగాల‌లో ప‌ర‌స్ప‌ర స‌హ‌కారానికి భారతదేశం, క్యూబా ల మ‌ధ్య ఎంఒయు కు ఆమోదం తెలిపిన మంత్రివర్గం

వైద్యం, ఆరోగ్యం రంగాల‌లో భారతదేశం, క్యూబా ల మ‌ధ్య ప‌ర‌స్ప‌ర స‌హ‌కారానికి ఇంత‌కు ముందే కుదిరిన అవ‌గాహ‌నపూర్వక ఒప్పందానికి (ఎంఒయు) ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అధ్య‌క్ష‌త‌న జ‌రిగిన కేంద్ర మంత్రివర్గం స‌మావేశం ఆమోదం తెలిపింది.  ఈ ఎంఒయు పై 2017 డిసెంబ‌ర్ 6 వ తేదీన న్యూ ఢిల్లీలో సంతకాలు అయ్యాయి.

ఇత‌ర వెనుక‌బ‌డిన త‌ర‌గ‌తుల ఉప‌వ‌ర్గీక‌ర‌ణ అంశాన్నిప‌రిశీలించేందుకు క‌మిష‌న్ కాల‌ప‌రిమితిని పొడిగింపునకు ఆమోదం తెలిపిన మంత్రివర్గం 

ఇతర వెనుక‌బ‌డిన త‌ర‌గ‌తుల (ఒబిసి ల) ఉవ వ‌ర్గీక‌ర‌ణ అంశాన్ని ప‌రిశీలించేందుకు క‌మిష‌న్ కాల‌ ప‌రిమితి ని 12 వారాల వ‌ర‌కు అంటే,  2018 ఏప్రిల్ 2 వ‌ర‌కు పొడిగించేందుకు ప్ర‌ధాన‌ మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అధ్య‌క్ష‌త‌న జ‌రిగిన కేంద్ర మంత్రివర్గం స‌మావేశం ఆమోదం 
తెలిపింది.  ఒబిసిల ఉప వ‌ర్గీక‌ర‌ణ అంశంపై స‌మ‌గ్ర నివేదికను స‌మ‌ర్పించేందుకు వివిధ ప‌క్షాల‌తో చ‌ర్చించేందుకు ఈ కాల‌ ప‌రిమితి పొడిగింపు అవ‌కాశాన్ని క‌ల్పిస్తుంది. 

•                     వ‌డోద‌రా లో భార‌తదేశ‌ తొలి నేష‌న‌ల్ రైల్ అడ్ ట్రాన్స్‌పోర్టేశన్ యూనివ‌ర్సిటీ ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

•                     పెద్ద ఎత్తున సాంకేతిక‌, మౌలిక స‌దుపాయాల ఆధునికక‌ర‌ణ ద్వారా భార‌తీయ రైల్వేలు ఆధునికత దిశ‌గా ప‌య‌నిస్తోంది.

•                     పెద్ద ఎత్తున ఉపాధి అవ‌కాశాలు క‌ల్పించేందుకు స‌హాయ‌ప‌డేలా స్కిల్ ఇండియా, మేక్ ఇన్ ఇండియాకు స‌హ‌కారం;

•                     వైవిధ్యంతో కూడిన ఆంత్రప్రన్యోర్ షిప్‌, స్టార్ట్- అప్ ఇండియా కు మ‌ద్ద‌తిచ్చేందుకు చొర‌వ‌ చూప‌డం;

•                     అత్యున్న‌త నాణ్య‌తాప‌ర‌మైన విద్య‌, శిక్ష‌ణను అందించేందుకు అధునాత‌న బోధ‌న ప‌ద్ధ‌తులను, సాంకేతిక ప‌రిజ్ఞానాన్ని వినియోగించడం;
   
•                     అధునాత‌న సాంకేతిక ప‌రిజ్ఞానం, నైపుణ్యం క‌లిగిన మాన‌వ వ‌న‌రుల‌తో ర‌వాణా రంగంలో ఇండియా గ్లోబ‌ల్ లీడ‌ర్‌గా ఎద‌గ‌నుంది.

రైల్వే మంత్రిత్వ‌శాఖ  ప్ర‌తిపాదన మేరకు భార‌తదేశ తొలి నేశన‌ల్ రైల్ ట్రాన్స్‌పోర్టేశన్ యూనివ‌ర్సిటీ (ఎన్ఆర్ టియు) ఏర్పాట‌ుకు ప్ర‌ధాన‌ మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అధ్య‌క్ష‌త‌న జరిగిన కేంద్ర‌ మంత్రివర్గ స‌మావేశం ఆమోదం తెలిపింది.  రైల్వేలకు చెందిన  సిబ్బందికి శిక్ష‌ణ‌నివ్వ‌డం, సామ‌ర్ధ్యాల అభివృద్ధికి ఇది దోహ‌ద‌ప‌డుతుంది.  ప్ర‌ధాన‌ మంత్రి ప్రేర‌ణ‌తో రూపుదిద్దుకున్న ఈ నూత‌న ఆలోచ‌న‌, ‘న్యూ ఇండియా’ నిర్మాణానికి రైల్వేలు, ర‌వాణా రంగం చోద‌క శ‌క్తి కానుంది.

ఎఫ్ఎం మూడో ద‌శ‌ ఇ- ఆక్షన్ లలో బ్యాచ్-III కు ఆమోదం తెలిపిన మంత్రివర్గం 
 
236 న‌గ‌రాల‌లో 683 చాన‌ళ్ల  వేలానికి మార్గం సుగ‌మం చేసే ప్ర‌తిపాద‌న‌కు ప్ర‌ధాన‌ మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అధ్య‌క్ష‌త‌న జ‌రిగిన కేంద్ర మంత్రివర్గ స‌మావేశం ఆమోదం తెలిపింది.  ఇది మ‌రిన్ని న‌గ‌రాల‌లో ఎఫ్ఎం రేడియో సౌక‌ర్యం క‌ల్ప‌న‌కు అవ‌కాశం క‌ల్పిస్తుంది.  2011లో మంత్రివర్గం ఆమోదించిన నిబంధ‌న‌ల ప్ర‌కారం, మూడో ద‌శ‌ ఎఫ్‌ఎం పాలిసీ మార్గ‌ద‌ర్శ‌కాల కింద  బ్యాచ్-I, బ్యాచ్-II ఎఫ్‌ఎం ప్రైవేటు రేడియో స్టేష‌న్ ల వేలాన్ని 2015,2016 ల‌లో నిర్వ‌హించ‌డం జ‌రిగింది.  బ్యాచ్-I కింద 56 న‌గ‌రాల‌లో 97 చాన‌ళ్లను, బ్యాచ్-II లో 48 న‌గ‌రాల‌లో 66 చాన‌ళ్లను వేలం వేయ‌డం జ‌రిగింది.

2017-18 నుండి 2019-20 సంవ‌త్స‌రాల‌ మధ్య కాలానికిగాను జౌళి రంగంలో కెపాసిటీ బిల్డింగ్ ప‌థ‌కానికి (ఎస్ సిబిటిఎస్) మంత్రివర్గం ఆమోద ముద్ర

2017-18 నుండి 2019-20 వ‌ర‌కు 1300 కోట్ల రూపాయ‌ల వ్య‌యంతో జౌళి రంగంలో కెపాసిటీ బిల్డింగ్‌కు సంబంధించిన ఒక కొత్త ప‌థ‌కానికి (SCBTS) ప్ర‌ధాన‌ మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అధ్యక్ష‌త‌న సమావేశమైన ఆర్థిక వ్య‌వ‌హారాలపై ఏర్పాటైన మంత్రివర్గ సంఘం (CCEA) ఆమోదం తెలిపింది.  ఇది జౌళి రంగంలో నూలు వడకటం, అల్లకం మిన‌హా సంఘ‌టిత రంగంలో  అన్ని ద‌శ‌ల‌లో నైపుణ్యాభివృద్ధికి సంబంధించింది.  ఈ ప‌థ‌కం జాతీయ స్కిల్ క్వాలిఫికేష‌న్ ఫ్రేమ్‌వ‌ర్క్ (ఎన్ఎస్ క్యుఎఫ్) నిబంధ‌న‌ల‌కు అనుగుణ‌మైన కోర్సుల‌ను అందిస్తుంది.  ఈ కోర్సులు నైపుణ్యాభివృద్ది మంత్రిత్వ‌ శాఖ (ఎమ్ఎస్ డిఇ) వెలువ‌రించిన సాధార‌ణ ఫండింగ్ నియమాల‌కు అనుగుణంగా  ఉంటాయి.

***



(Release ID: 1515919) Visitor Counter : 323


Read this release in: English , Urdu , Kannada